ఈ టీషర్టుతో.. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య | Now flaunt T-shirts that change colour in sunlight | Sakshi
Sakshi News home page

ఈ టీషర్టుతో.. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య

Published Mon, Jul 4 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ఈ టీషర్టుతో.. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య

ఈ టీషర్టుతో.. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య

ఆఫీసులో ఉన్నప్పుడు మంచి బుద్ధిమంతుడైన బాలుడిలా ఉండాలి. అదే బయటకు వెళ్తే ‘యో.. యో’ అనుకుంటూ చురుకైన బడ్డీలా కనిపించాలి. కానీ అందుకోసం రెండు మూడు రకాల దుస్తులు తీసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. సరిగ్గా ఇలా ఆలోంచిచేవాళ్ల కోసమే గిర్గిట్ అనే కంపెనీ ఓ కొత్త రకం టీషర్టును విడుదల చేస్తోంది. ఇవి వేసుకెళ్తే.. సూర్యరశ్మి తగిలినప్పుడు ఒక రంగులో ఒక డిజైన్లో ఉండి.. అది తగలకుండా కేవలం ట్యూబులైట్ల కాంతిలో ఉంటే మరో రంగు, డిజైన్లోకి మారిపోవడం వీటి స్పెషాలిటీ.

అంటే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు రాముడిలా, బయటకు వెళ్లినపుడు కొంటె కృష్ణుడిలా కనిపించాలని అనుకునేవాళ్లు ఈ రకం టీషర్టులు వేసుకుని వెళ్లొచ్చన్నమాట. కేవలం పురుషుల కోసం మాత్రమే తయారుచేసిన ఈ టీషర్టులను ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో రూపొందించారు. అన్ని ప్రధాన ఈ కామర్స్ పోర్టల్స్లోను ఇవి అందుబాటులో ఉన్నాయట. కొంతమంది యువ ఫ్యాషన్ డిజైనర్లు కలిసి వీటిని రూపొందించారు. ఇవి రూ. 855 నుంచి రూ. 1155 మధ్య ధరల్లో లభ్యమవుతున్నాయి. ఒక టీషర్టు ధరనే చెల్లించి, రెండింటిని కొనుక్కున్న ఆనందం కస్టమర్లకు మిగులుతుందని గిర్గిట్ వ్యవస్థాపకుడు హిమాన్షు ఠాకూర్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement