t-shirts
-
'పుష్ప 2' ప్రమోషన్లలో బన్నీ టీ-షర్ట్లు గమనించారా? (ఫొటోలు)
-
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
Lok Sabha Election 2024: ఈ కామర్స్ వేదికలకు ఎన్నికళ
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వేదికలు ఎన్నికల సీజన్‌ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. పార్టీల ప్రచార సామగ్రి, వాటి అభిమానించే ఓటర్లు ధరించే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాయి. దాంతో ఎన్ని‘కళ’ ఈ వేదికలనూ చేరింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో పారీ్టల రంగులతో కూడిన టీ షర్టులు, క్యాప్‌లను విక్రయిస్తున్నాయి. ‘నమో హ్యాట్రిక్’, ‘రాహుల్ ఈజ్ హోప్’ (రాహులే ఆశాకిరణం) వంటి సందేశాలతో కూడిన టీ షర్ట్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘సుమారు 12 మంది విక్రేతలు ఈ కామర్స్ వేదికలపై ఎన్నికల సామగ్రి అమ్మకాలకు నమోదు చేసుకున్నారు. ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ మరింతమంది ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి వెల్లడించారు. స్వతంత్ర రిటైలర్లు, బ్రాండ్ లైసెన్స్ తీసుకున్న కంపెనీలు వినూత్న ఉత్పత్తులతో యువ ఓటర్లను ఆకర్షించేలా అమ్మకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఖరీదైన వ్రస్తాలు, కీ చైన్లు, కార్లు, ఇళ్లలో పెట్టుకోగలిగిన జెండాలు, ల్యాంపులు, క్లాక్‌ల వంటివి వీటిలో ఉన్నాయి. బ్లాక్ వైట్ ఆరెంజ్ కంపెనీ ‘హౌ టు బి యాన్ ఇన్ఫ్లుయెన్సర్’, ‘ఐ వాంట్ టు వోట్ ఫర్ ఇండియా’ వంటి సందేశాలతో ‘ఏ47’ బ్రాండ్‌పై ఖరీదైన వ్రస్తాలను విక్రయిస్తోంది. అమెరికాలో ఎన్నికల సామగ్రి మార్కెట్ చాలా పెద్దది. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని బ్లాక్‌వైట్ వ్యవస్థాపకుడు భవిక్ వోరా తెలిపారు. బీజేపీ ఇప్పటికే నమో యాప్‌పై టీ షర్ట్లు, మగ్లు, స్టేషనరీని విక్రయిస్తుండడం తెలిసిందే. -
రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ స్నేహితుడు ఓర్హాన్ అవతరమణి (ఒర్రీ) తెగ సందడి చేశాడు. దుబాయ్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన అనంత్ అంబానీ బర్త్‌డే బాష్‌లో ఖరీదైన దుస్తులు, ఎటైర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. స్టార్ కిడ్స్ బర్త్‌డే బాష్ ఆ సందడి లెవలే వేరుంటది. ఈ ఎ ంజాయ్మెంట్ కతే వేరుంటంది. ఎవరికి వాళ్లు స్పెషల్‌గా ఉండాల్సిందే. ముఖ్యంగా దుబాయ్‌లో అనంత్ 28 పేరుతో నిర్వహించిన బర్త్‌డే ఈవెంట్లో రాధికా మర్చంట్, ఒర్రీ తదితరులు ధరించిన టీ షర్ట్స్ ధర 40వేలు, షార్ట్‌లు రూ. 45వేలు. అలాగే ఒర్రీ ధరించిన రూ. 10,000 ఖరీదు చేసే నైక్ స్నీకర్లు స్పెషల్ ఎట్రాక్షన్ అలాగే ఇటీవల నిర్వహించిన ఎన్ఎంఏసీసీఏ ఈవెంట్లోరూ. 3 లక్షల విలువైన డిజైనర్ సూట్‌ను ధరించాడట.ఈ నవ్భూమి సెట్ చాలా తేలికగా ఉండే ఆర్గాన్జా సిల్క్‌తో తయారు చేసింది.దీంతోపాటు షీర్ ట్యాంక్ టాప్స్ కూడా ధరించాడు. అలాగే రాధిక మర్చంట్ రూ.2 కోట్ల విలువైన క్లచ్‌తో వార్తల్లో నిలిచారు. అనంత్ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లో స్కైడైవింగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కాగా నైసా దేవగన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌తో సహా పలువురు స్టార్ కిడ్స్‌కి మంచి ఫ్రెండ్ ఒర్రీ. జోర్జ్ , షహనాజ్ అవత్రమణిలకు ఆగస్ట్ 1999లో జన్మించాడు. సింగర్, రైటర్, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లతో ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ కూడా. 2017లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేరాడు. ఎప్పుడూ డిజైనర్ దుస్తులనే ధరించే ఒర్రీ ఖుషీ కపూర్‌తో ఇటీవలి ఫోటోలో 55000 విలువైన బుర్బెర్రీస్ కో-ఆర్డ్ సెట్‌ను ధరించాడు. అలాగే వేసుకున్న షూ ధర రూ. 90వేలు. బ్రాస్లెట్ ఖరీదు రూ. 5.73 లక్షలు.అతను ధర రూ. 30000 ధరించిన తెల్లటి చొక్కా ధరించిన మరొక ఫోటోను పంచుకున్నాడు. బ్రాండ్ ఓర్లెబార్ బ్రౌన్ షార్ట్ రూ. 47వేలకు పై మాటే. ఇక అతను ధరించే రోలెక్స్ వాచ్ విలువ రూ. 72 లక్షలు . బాలెన్సియాగా షూస్ ధర రూ. 90వేలు. వీటనికి తోడు Mercedes-Benz G-వ్యాగన్ కారు కూడా అతని సొంతం. -
స్టార్ కమెడియన్‌కు అభిమానుల బిగ్ సర్ప్రైజ్
తమ అభిమాన నటుడు వస్తున్నాడంటే ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా ఉండదు. ఇక ఆ కార్యక్రమం అభిమాన నటుడికి సైతం చిరకాలం గుర్తుండిపోవాలని కొంతమంది అభిమానులు ఓ ఐడియా వేశారు. అది చూసిన బాలీవుడ్ ప్రముఖ కమెడియన్, నటుడు, వ్యాఖ్యాత కపిల్ శర్మకు ఆనందంతో నోట మాట రానంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘ద కపిల్ శర్మ షో’ టీమ్ తొలిసారిగా విదేశాల్లో లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. దీనికోసం కపిల్, తన తల్లిని వెంటబెట్టుకుని టీమ్‌తో సహా దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ లైవ్ ప్రోగ్రాంకు హాజరైన అభిమానులు ఈ కమెడియన్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. కపిల్ ముద్దుల కూతురు అనైరా ఫొటోలు ఉన్న టీషర్టులతో కార్యక్రమానికి హాజరయ్యారు. అది చూసిన ఈ కమెడియన్ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ ఎప్పటికీ నా హృదయంలో ఉంటారంటూ దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో చాలామంది యువతీయువకులు బ్లాక్ టీ షర్ట్‌పై అనైరా చిత్రం ఉన్న దుస్తులను ధరించి ఉన్నారు. కాగా కపిల్ శర్మ- గిన్ని చత్రత్ దంపతులకు అనైరా గతేడాది డిసెంబర్ 10న జన్మించింది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్న ఈ నటుడు తన గారాలపట్టి ఆడుకోడానికి ఓ గిటార్‌ను సైతం కొనుగోలు చేశాడు. చదవండి: అమ్మాయి పుట్టింది: కపిల్ శర్మ కూతురి ఫొటో షేర్ చేసిన స్టార్ కమెడియన్ -
కాలుష్యం బతికి ‘బట్ట’కట్టదు!
రెండు వందల కోట్లు.. ఏటా అమ్ముడయ్యే టీషర్ట్‌ల సంఖ్య ఇది. 440 పార్ట్స్ పర్ మిలియన్.. రికార్డుస్థాయికి చేరిన వాతావరణ కాలుష్యానికి ఓ లెక్క ఇది. టీషర్ట్‌లకు.. కాలుష్యానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా..! ఇప్పటివరకూ లేదు.. ఇకపై మాత్రం బోలెడంత ఉంటుంది. ఎందుకంటారా? టీషర్ట్ వేసుకుంటే కాలుష్యం తగ్గిపోతుంది కాబట్టి..!!! ఆగండాగండి.. మీరు మామూలుగా వేసుకునే టీషర్ట్‌తో ప్రయోజనం ఒక్కటే. ఒళ్లు కప్పుతుందంతే. అదే ఈ ఫొటోలో చూపించిన టీషర్ట్ వాడటం మొదలుపెట్టారనుకోండి. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు గాల్లోని కాలుష్యాన్ని కూడా శుభ్రం చేసేయొవచ్చు. ఇటలీ కంపెనీ క్లాటర్స్ తయారు చేసిన ఈ వినూత్న టీషర్ట్ పేరు ‘రిపేయిర్’. ఛాతీ భాగంలో మూడు పొరలు ఉన్న వస్త్రాన్ని ఉంచుకుంటే చాలు.. మీరు అటు ఇటూ కదిలేటప్పుడు సోకే గాలిలో ఉండే ప్రమాదకరమైన విషవాయువులను పీల్చేసు కుంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే విడుదలయ్యేలా చేస్తుంది. ఫ్యాషన్ ఆసరాగా కాలుష్యంపై అవగాహన పెంచడం రిపేయిర్ అభివృద్ధి వెనుక ఉన్న లక్ష్యమని అంటున్నారు క్లాటర్స్ వ్యవస్థాపకులు ఫెడ్రికో సురియా, మార్కో లోగ్రీకో, సిల్వియో పెరుకాలు. మూడు పొరలు.. ఆరు రకాల కాలుష్యాలు.. రిపేయిర్ టీషర్ట్ ఛాతీ భాగంలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని ‘ద బ్రీత్’అని పిలుస్తున్నారు. అనిమోటెక్ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో మూడు పొరలు ఉంటాయి. ఒక్కోటి అతిసూక్ష్మమైన జల్లెడలాంటిది. ఎంత సూక్ష్మమంటే.. నానోస్థాయిలో ఉండే కాలుష్యాలను కూడా ఒడిసి పట్టగలిగేంత. గాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు, బెంజీన్ వంటి ప్రమాదకరమైన, కేన్సర్ కారకమైన వాయువులు ఒక పొరలోని జల్లెడలో చిక్కుకుపోతాయి. రెండోపొరలో ఉన్న ప్రత్యేకమైన పోగులు బ్యాక్టీరియాను చంపేస్తాయి. మూడో పొరకు దుర్వాసనలను పీల్చేసుకునే లక్షణం ఉంటుంది. ఈ మూడు ఒక్కటిగా పనిచేయడం ద్వారా ఎక్కడికక్కడ గాలి శుభ్రమవుతూంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకు వస్తూంటుంది. అనిమోటెక్ ద బ్రీత్ను ఇప్పటికే యూనివర్సిటీ పాలిటెక్నికా డెల్లే మార్సేలో పరీక్షించింది కూడా. సల్ఫర్ డయాక్సైడ్లను ఈ వస్త్రం 92 శాతం వరకూ ఒడిసి పట్టగలదని.. అదే సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్లను 86 శాతం, ప్రమాదకరమైన సేంద్రీయ కణాలను 97 శాతం వరకూ తనలో నిక్షిప్తం చేసుకోగలదని ఈ పరీక్షల్లో రుజువైంది. టీషర్ట్లోని పొరలో పెట్టుకునే ద బ్రీత్ను ఏడాదికి ఒకసారి మార్చుకుంటే చాలు. ఎలాంటి శక్తిని వాడకుండా గాలిని శుభ్రం చేస్తూ ఉండవచ్చు. ద బ్రీత్ను ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్ల మాదిరిగా, బహిరంగ ప్రదేశాల్లో భారీ హోర్డింగ్‌లపై ప్రకటనల కోసమూ వాడుకోవచ్చని అనిమోటెక్ అంటోంది. ఒక టీషర్ట్.. రెండు కార్ల కాలుష్యం.. ద బ్రీత్‌తో కూడిన రిపేయిర్ టీషర్ట్‌ను ఏడాదిపాటు వాడితే దాదాపు రెండు కార్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చని క్లాటర్స్ అంటోంది. భూమ్మీద మొత్తం వంద కోట్ల కార్లు ఉన్నాయనుకుంటే.. రెండు వందల కోట్ల టీషర్ట్‌లలో ద బ్రీత్ ఏర్పాటైతే వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని ఫెడ్రికో సురియా అంటున్నారు. క్లాటర్స్ ప్రస్తుతం నిధుల సేకరణ కోసం కిక్‌స్టార్టర్‌లో ప్రత్యేకమైన ప్రచారాన్ని చేపట్టింది. ఒక్కో రిపేయిర్ టీషర్ట్‌ను 29 యూరోల (రూ.2,400)కు అమ్ముతోంది. వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తే దీని ధర రూ.3,600 అవుతుందని సురియా అంటున్నారు. ఇంకొన్ని నెలల్లో టీషర్ట్‌లతోపాటు ట్రాక్ సూట్లు, జాకెట్లను విడుదల చేస్తామని చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!
-
ఈవీఎం ప్రొడక్షన్స్
-
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!
-
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!
లక్నో: ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల పాన్ మసాలా, గుట్కాలను నమలడం, పొగతాగడాన్ని యోగి నిషేధించడం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఇతర సిబ్బంది.. జీన్స్, టీ–షర్ట్లు వేసుకుని విధులకు హాజరవ్వరాదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వస్త్రధారణ పద్ధతిగా, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులకు ఎలాగూ యూనిఫాం ఉంటుందనీ, ఉపాధ్యాయుల వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉంటే, విద్యార్థులు వారిని అనుసరిస్తారని ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
జీన్స్, టీషర్ట్స్‌తో రావొద్దు.. మొబైల్ వాడొద్దు
⇔ టీచర్లకు లక్నో డీఈవో ఆదేశాలు లక్నో: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఆహార్యంలో మరింత హుందాగా ఉండాలని ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా విద్యాధికారి టీచర్లకు సూచించారు. టీచర్లెవరూ ఇకపై టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు ధరించి పాఠశాలకు రావొద్దని ఆదేశించారు. ‘వృత్తి గౌరవం పెంచేలా ఉపాధ్యాయుల వస్త్రధారణ ఉండాలి.. అందుకే అటువంటి దుస్తులను ధరించి పాఠశాలలకు రావొద్దు' అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని చెప్పారు. అంతేకాకుండా పనివేళల్లో మొబైల్ ఫోన్స్ వినియోగించడం మంచిది కాదని, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అన్ని పాఠశాలలో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థన జరిగేలా చూడాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సమీపంలో పాన్‌మసాలా, సిగరెట్లు విక్రయించే దుకాణాలు కనిపిస్తే వెంటనే వాటిని మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్సు ధరించి రావొద్దంటూ గతేడాది హరియాణా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. -
షర్ట్ మార్చేద్దాం..
న్యూలుక్ షర్ట్, టీ షర్ట్స్ అమ్మాయిల జాబితాలో ఎప్పుడో చేరిపోయాయి. ఎప్పుడూ వాటిని ఒకే మోడల్లో ధరిస్తే బోర్. వాటికే కొత్త హంగులు అద్దితే... చిన్న మార్పుతో ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉండచ్చు. ఇందుకు చేయవలసిందల్లా... నచ్చిన టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. మెడ భాగం, సైడ్స్ భాగం ఫొటోలో చూపిన విధంగా కట్ చేయాలి. కాంట్రాస్ట్ రిబ్బన్ని జత చేయాలి. ఒక కొత్త టాప్ రెడీ. షర్ట్ రూపం కొత్తగా మార్చేయాలంటే.. కాలర్ కింది భాగం అంటే ఛాతీ భాగం కత్తిరించి దీనికి లేస్ ఫ్యాబ్రిక్‌ని జత చేయాలి. షర్ట్‌తో చేసిన టాప్ ట్రెండీగా కనిపిస్తుంది. వైట్ కలర్ కాలర్ ఉన్న చొక్కాను తీసుకోవాలి. కాలర్ భాగాన్ని ఉంచి, కేవలం ఛాతీ పై భాగాన్ని మాత్రమే కట్ చేయాలి. లేస్ ఫ్యాబ్రిక్‌ని జత చేయాలి. అలాగే చేతులను షార్ట్ స్లీవ్స్ వచ్చేలా కట్ చేసి సన్నగా కుట్టాలి. ఇలా డిజైన్ చేసుకున్న న్యూ షర్ట్ టాప్... జీన్స్ మీదకు స్టైలిష్‌గా కనిపిస్తుంది. పొడవాటి చేతుల చొక్కా లేదా టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. చొక్కాకున్న కాలర్ పార్ట్, హ్యాండ్స్, బాటమ్ పార్ట్స్‌ని కత్తిరించాలి. దీనికి అదే రంగు జార్జెట్ మెటీరియల్ లేదా లేస్‌ను జత చేసి కుట్టాలి. ఓ కొత్త రకం టాప్ క్యాజువల్ వేర్‌గా రెడీ అయిపోతుంది. -
పిల్లల క్యాజువల్ వేర్...
చంటిపిల్లలకు ఎన్ని డ్రెస్సులున్నా సరిపోవు. క్యాజువల్ వేర్‌గా ఇంట్లో వేసే పైజామాలు, నైట్ డ్రెస్సులైతే ఎప్పుడూ వెతుక్కోవాల్సిందే! పెద్దవాళ్ల లాంగ్ స్లీవ్స్ షర్ట్లు, టీ షర్ట్లు, పైజామాలను ఇలా పిల్లలకు ⇔ ఉపయోగపడేలా తయారుచేసుకోవచ్చు. కొత్తగానూ వెరైటీగానూ అనిపించే ఈ డిజైనింగ్ ఈ వారం... ⇔ రెండు మూడేళ్ల పిల్లలకు ఇంట్లో వేయదగిన డ్రెస్సుల సిద్ధం చేయాలంటే ఎంతో ఖర్చుపెట్టాల్సిన ⇔ అవసరం లేదు. పెద్దవాళ్ల షర్టులు, టీషర్టులు ఉంటే చాలు వాటిలో.... ⇔ కొత్తగా ఉండి ఉపయోగించని పొడవాటి చేతులున్న టీ షర్ట్ లేదా స్వెటర్ తీసుకోవాలి. చేతుల భాగాన్ని భుజాల దగ్గర కట్ చేయాలి. పిల్లల నడుము నుంచి పాదాల వరకు కొలత తీసుకొని అంతమేరకు చాప్‌స్టిక్‌తో మార్క్ చేసుకోవాలి. తర్వాత రెండు చేతుల భాగాన్ని ఫొటోలో చూపిన విధంగా జత చేయాలి. ⇔ షర్ట్స్ చేతుల భాగాన్ని కూడా ఇలాగే తయారుచేసుకోవచ్చు. ⇔ పెద్దవాళ్ల షర్ట్స్, ప్యాంట్స్ పాకెట్స్‌ని కత్తిరించి పిల్లల పైజామాలకు జత చేస్తే అవి కొత్తవాటిలా కనిపిస్తాయి. ⇔ పెద్దవాళ్ళ పైజామా ఉపయోగంలో లేకుండా ఉంటే ఇలా చిన్నపిల్లలకు క్యాజువల్ వేర్‌గా సిద్ధం చేయవచ్చు. ⇔ షర్ట్ కింది సగభాగాన్ని స్కర్ట్గానూ, చేతుల భాగాన్ని పైజామాగానూ ఉపయోగించవచ్చు. -
రెండు షర్ట్లు ఒక డిజైన్
న్యూలుక్ షార్ట్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్, కాలర్ నెక్, రౌండ్ నెక్.. ఇలా టీ షర్ట్స్ అన్నీ ఇంచుమించు ఈ రెండు డిజైన్లలోనే కనిపిస్తాయి. వాటినే తరచూ ధరించాలంటే విసుగ్గా అనిపిస్తుంటుంది. ఒక ఆలోచన చేస్తే.. ఒక టీషర్ట్, మరో షర్ట్‌ని కలిపితే ఆకర్షణీయమైన డిజైనరీ డ్రెస్ మీ ముందుంటుంది.ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ ఒకటి తీసుకోవాలి. చిన్న చిన్న ప్రింట్లు, చెక్స్ ఉన్నవి కూడా బాగుంటాయి. మరో ప్లెయిన్ లేదా చెక్స్ షర్ట్ తీసుకోవాలి. షర్ట్ కాలర్ బాగం 5 ఇంచుల వెడల్పు ఉండేలా బటన్స్ భాగమంతా కట్ చేయాలి. అలాగే హ్యాండ్ కఫ్స్ కూడా! టీ షర్ట్ మధ్య భాగం నెక్ నుంచి కిందవరకు కట్ చేయాలి. కట్ చేసిన షర్ట్ భాగాన్ని టీ షర్ట్‌కు జత చేసి కుట్టాలి.షోల్డర్ కఫ్స్, హ్యాండ్ కఫ్స్ కూడా జత చేయాలి.దీంతో టీ షర్ట్ ఒక కొత్త మోడల్లో కనువిందు చేస్తుంటుంది. ఇన్నర్‌గా ట్యునిక్ ధరించి, ఆ పైన టీ షర్ట్‌తో ఇలా డిజైన్ చేసిన ఓపెన్ షర్ట్‌ని ధరించవచ్చు. స్టైల్‌గా మెరిసిపోవచ్చు.మిగిలిన షర్ట్ క్లాత్‌తో ఏం చేయవచ్చో మీ మెదడుకు పని చెప్పండి. -
ఈ టీషర్టుతో.. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
ఆఫీసులో ఉన్నప్పుడు మంచి బుద్ధిమంతుడైన బాలుడిలా ఉండాలి. అదే బయటకు వెళ్తే ‘యో.. యో’ అనుకుంటూ చురుకైన బడ్డీలా కనిపించాలి. కానీ అందుకోసం రెండు మూడు రకాల దుస్తులు తీసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. సరిగ్గా ఇలా ఆలోంచిచేవాళ్ల కోసమే గిర్గిట్ అనే కంపెనీ ఓ కొత్త రకం టీషర్టును విడుదల చేస్తోంది. ఇవి వేసుకెళ్తే.. సూర్యరశ్మి తగిలినప్పుడు ఒక రంగులో ఒక డిజైన్‌లో ఉండి.. అది తగలకుండా కేవలం ట్యూబులైట్ల కాంతిలో ఉంటే మరో రంగు, డిజైన్లోకి మారిపోవడం వీటి స్పెషాలిటీ. అంటే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు రాముడిలా, బయటకు వెళ్లినపుడు కొంటె కృష్ణుడిలా కనిపించాలని అనుకునేవాళ్లు ఈ రకం టీషర్టులు వేసుకుని వెళ్లొచ్చన్నమాట. కేవలం పురుషుల కోసం మాత్రమే తయారుచేసిన ఈ టీషర్టులను ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో రూపొందించారు. అన్ని ప్రధాన ఈ కామర్స్ పోర్టల్స్‌లోను ఇవి అందుబాటులో ఉన్నాయట. కొంతమంది యువ ఫ్యాషన్ డిజైనర్లు కలిసి వీటిని రూపొందించారు. ఇవి రూ. 855 నుంచి రూ. 1155 మధ్య ధరల్లో లభ్యమవుతున్నాయి. ఒక టీషర్టు ధరనే చెల్లించి, రెండింటిని కొనుక్కున్న ఆనందం కస్టమర్లకు మిగులుతుందని గిర్గిట్ వ్యవస్థాపకుడు హిమాన్షు ఠాకూర్ చెప్పాడు. -
స్కిన్ కౌన్సెలింగ్
నేను ఇటీవల టీ-షర్ట్స్ అంటే బాగా ఇష్టపడి వాటినే వాడుతున్నాను. అయితే అవి వాడుతున్న దగ్గర్నుంచి నా బాహుమూలాల్లో చర్మం నల్లబడినట్లుగా అనిపిస్తోంది. దీనికి పరిష్కారం చెప్పండి. - వై. శ్రీనివాస్, విశాఖపట్నం సాధారణంగా టీ-షర్ట్స్ ఒంటికి పట్టినట్లుగా ఉండటంతో వారు మంచి సౌష్ఠవంతో కనిపించడం వల్ల డైనమిక్ లుక్ వస్తుంది. అయితే బిగుతైన టీ-షర్ట్స్ కొన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అవి ఒంటికి పట్టేసినట్లుగా ఉండటం వల్ల గాలి ఆడక బాహుమూలాల్లో టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. మిగతా చర్మంతో పోల్చినప్పుడు అక్కడి చర్మం నల్లగా కనిపించడానికి కారణం... బిగుతైన దుస్తుల వల్ల అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడటమే. మీరు ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలిసి, మీ సమస్యకు వాస్తవ కారణాన్ని తెలుసుకుని తగిన చికిత్స తీసుకోండి. - డాక్టర్ మేఘనారెడ్డి కె. డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్, స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్ -
క్రియేటివ్ మార్కెట్
వ్యాపారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఫ్లీ మార్కెట్ ఉటోపియా విభిన్నంగా ఉంది. సహజసిద్ధమైన వాతావరణంలో క్రియేటివ్ ఐటెమ్స్ ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్ ఆశా హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ శనివారం ప్రారంభమైంది. నగరంలోని వ్యాపారస్తులు తమ కళాత్మక ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. అలాగే ఫొటోగ్రాఫర్ల సృజనాత్మక చిత్రాలు సమ్మోహితులను చేస్తున్నాయి. రెండు రోజులు ఈ ఎగ్జిబిషన్లో టెంపుల్ ట్రీ, ఫొటో బూత్, టెర్రాకోట జ్యువెలరీ, టీషర్ట్స్ వంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. సిద్ధాంతి -
‘ప్లస్’ అయ్యే అలంకరణ
వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి... ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం... సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది. మీ శరీరాకృతి లావుగా ఉంటే... బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి... బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి. లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి. అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి. మీ వార్డ్రోబ్ నుంచితొలగించాల్సినవి..! చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్) మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి) రిప్డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్ బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి) ఫిట్‌గా లేని బ్లేజర్స్ బ్యాగీ స్వెట్స్ పొడవు లంగాలు మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు. ‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. సైజ్ చార్ట్! ఛాతీ పరిమాణం 41-45, నడుము పరిమాణం 33-37 హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ... ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90 ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్లస్ సైజ్ వారు ఆన్లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు. అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి. నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి. మీ వార్డ్రోబ్లోఉండాల్సివి..! వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్) శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్. ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్ ఫిటెడ్ బ్లేజర్స్ ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్లైన్ సాయం తీసుకోవచ్చు) శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు. దుస్తులు కుట్టించుకోవాలంటే... కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి. లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి. నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. 42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్లలో అన్ని రకాల బ్రాండ్లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి కర్టెసీ ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్ -
యువ తార షాహిద్ కపూర్
ఫ్యాషన్ ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టింపులు లేవు. మనకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే అత్యుత్తమ ‘ఫ్యాషన్’ అని నేను నమ్ముతాను. స్టైల్ అనేదానికి ప్రత్యేకమైన నిర్వచనం లేదు. ఒకరికి నప్పిన స్టైల్ వేరొకరికి నప్పకపోవచ్చు. స్టైల్ పేరుతో బిగుతైన టీషర్ట్లను ధరించడం నా వల్ల కాదు! మార్పు ఆహ్వానించదగినదేగానీ, మార్పు కోసం మార్పు అనే విధానం కొన్ని సార్లు అంతగా విజయవంతం కాకపోవచ్చు. పర్టిక్యులర్ లుక్‌తో సౌకర్యవంతంగా ఉంటే, దాన్ని కొనసాగించడమే మంచిది. ఫిట్నెస్ - ఫిట్‌నెస్‌కు నా జీవితంలో అధిక ప్రాధాన్యత ఇస్తాను. జిమ్‌లో గడిపిన ప్రతి రోజూ మనసు ఆనందంగా ఉంటుంది. - నేను సినిమాల్లో నటిస్తున్నాను కాబట్టి ఫిట్నెస్తో ఉండాలి లేదా ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి ఫిట్నెస్తో ఉండాలి...అని అంటూ ఉంటారు. నిజానికి ఏ వృత్తిలో ఉన్నా ఫిట్నెస్ అనేది ముఖ్యమే. మొదట్లో నా బాడీ అద్దంలో చూసుకుంటే నాకే జాలిగా అనిపించేది. జిమ్‌కు వెళ్లడం అలవాటైన తరువాత నా బాడీలో మార్పు వచ్చింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది కూడా. జయాపజయాలు... - అపజయాల కంటే జయాలే నన్ను ఎక్కువ భయపెడతాయి. ఒక్క విజయం వచ్చిందటే చాలు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. - పశంసలు పొందే అర్హత ఉండాలంటే విమర్శలు తట్టుకునే సహనం ఉండాలి. - మన పని మీద రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నప్పుడు.. వెంటనే వాటికి సమాధానం చెప్పాలనే తొందరపాటు కంటే ‘మౌనం’ గా ఉండడమే మేలు. ఆ తరువాత అవసరమైతే గొంతు విప్పవచ్చు. -
పిండానికి గండం
=ఆర్ఎంపీల అమానవీయ ప్రవర్తన =ఒక్కో పరీక్షకు రూ. 5,500 వసూలు =తారుమారుతో రచ్చకెక్కిన బాధితులు =మొగుళ్లపల్లి మండలంలో వెలుగులోకి... =సెటిల్మెంట్ చేసిన పెద్ద మనుషులు =రూ.50 వేలతో సద్దుమణిగిన గొడవ? పుట్టకముందే తల్లి కడుపులో పెరుగుతున్న బంగారు తల్లుల ప్రాణం తీస్తున్నారు. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే కాసులకు కక్కుర్తిపడి ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ... నీచానికి పాల్పడుతున్నారు. ఆడపిల్లని తేలితే కనికరం లేకుండా అబార్షన్లు చేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో మొగుళ్లపల్లి మండలంలోని ఆర్ఎంపీలు గుట్టుగా ఈ దందా సాగిస్తున్నారు. ఇటీవల రెండు కేసులు ఫెరుుల్ కావడం... బాధితులు రచ్చకెక్కడంతో వారి బాగోతం వెలుగులోకి వచ్చింది. మొగుళ్లపల్లి, న్యూస్‌లైన్ :జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలు సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. కాసుల కక్కుర్తితో మగ సంతానం కావాలనుకునే దంపతులను గుర్తించి వారితో ముందస్తుగా సంప్రదింపులు జరిపి అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా... ఆర్ఎంపీల సహకారంతో కొంతమంది వైద్యులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. లోకం చూడక ముందే ఆడ శిశువులను బలిగొంటున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు, పోలీసుల పట్టింపులేమితో జిల్లాలో ఈ దందా మూడు పు వ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. భీమారం సమీపంలో... మీకు కలుగబోయే బిడ్డ ఆడనో... మగనో చెబుతాం. ఒకవేళ పుట్టే శిశువు ఆడ అయితే మేమే అబార్షన్ చేయిస్తాం. రహస్యంగా ఉంచితేనే మీ పని జరుగుతుందంటూ ఆర్ఎంపీలు నమ్మబలుకుతున్నారు. లింగనిర్ధారణకు రూ. 5,500 ఖర్చవుతుందని... డాక్టర్‌తో అన్ని విషయాలు తామే మాట్లాడుతామని మీరేమి మాట్లాడొద్దని మాట తీసుకుని బాధితులను హన్మకొండ శివారు భీమారం సమీపంలోని ఓ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. అక్కడ స్కానింగ్ తీయించి రిపోర్టులు వచ్చాక పుట్టబోయేది మగశిశువని తేలితే... అదే విషయం సదరు గర్భిణికి చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఆడ శిశువని తేలితే సదరు కుటుంబ సభ్యులకు చెప్పి.. అబార్షన్‌కు సిద్ధం చేస్తున్నారు. వెలుగు చూసిందిలా... మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులకు ఓ ఆర్ఎంపీ లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో మగ సంతానమేనని తేలినట్లు నమ్మించాడు. తీరా వారికి ఆడపిల్లలు జన్మించా రు. వారికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మరో ఆడ సంతానం ఎట్లా అని బాధితుల కుటుంబ సభ్యులు సదరు ఆర్ఎంపీని నిలదీశారు. విషయం బయటకు పొక్కడంతో పెద్దమనుషుల సమక్షంలో పొరపాటు జరిగిందని ఒప్పుకుని.. రూ.50,000 చెల్లిస్తామని స్టాంప్ పేపర్లపై రాసిచ్చినట్లు సమాచారం. ఆ ఆస్పత్రిలో జరిగిన భ్రూణ హత్యలెన్నో ? లింగనిర్ధారణ పరీక్షల్లో పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి హన్మకొండలోని ఆస్పత్రి వైద్యులు, ఆర్ఎంపీలు ఎన్ని భ్రూణ హత్యలకు పాల్పడి ఉంటారనేది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. లోకం చూడకముందే గర్భస్థ శిశువుల ప్రాణం తీయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
బొద్దుగా ఉన్నారా? బీ కేర్‌ఫుల్...
లావుగా ఉన్నవారు చీర ఎంపిక చేసుకుంటే మరీ ట్రాన్స్పరెంట్గా కాకుండా మీడియం టెక్స్చర్ ఉండే ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. అలాగని మందం బట్టను సెలక్ట్ చేసుకోవద్దు. ఇక డ్రెస్ సెలక్ట్ చేసుకున్నప్పుడు శాటిన్ కాకుండా అన్ని రకాల ఫాలింగ్ ప్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డ్రెస్సులు కుట్టించుకునేటప్పుడు కాటన్ లైనింగ్ వాడకూడదు. కాటన్ మిక్స్ ఉన్న లిజిబిజి క్లాత్, క్రేప్, శాటిన్ మాత్రమే లైనింగ్‌గా వాడాలి. చుడీ కుట్టించుకుంటే నెటెడ్ ఫ్యాబ్రిక్‌తో కాకుండా కొద్దిగా మందం బట్టతో కుట్టించుకోవాలి. సల్వార్ అయితే జార్జెట్, క్రేప్ మెటీరియల్‌కి సన్నని లైనింగ్ మాత్రమే వాడాలి. అనార్కలీలు కుట్టించుకోవాలంటే ఎంపైర్లైన్ నుంచి ఫ్లేర్ లైన్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఛాతి భాగంలో మాత్రం మరీ పలచని, మందం కాని బట్టను ఎంచుకోవాలి. బెనారస్, బ్రొకేడ్ క్లాత్‌లను అనార్కలీకి వాడకూడదు. ట్రౌజర్లు వేసుకోవాలనుకుంటే జ్యూట్ మిక్సింగ్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ వాడాలి. వెల్వెట్స్, సింథటిక్ మెటీరియల్ వాడకూడదు. పల్చగా ఉన్న టీ షర్ట్స్ వీరికి అంతగా నప్పవు. సరైన ఫ్యాబ్రిక్, ప్యాట్రన్, కట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే లావుగా ఉన్నవారూ అన్ని రకాల డ్రెస్సులు ధరించవచ్చు.