నేను ఇటీవల టీ-షర్ట్స్ అంటే బాగా ఇష్టపడి వాటినే వాడుతున్నాను. అయితే అవి వాడుతున్న దగ్గర్నుంచి నా బాహుమూలాల్లో చర్మం నల్లబడినట్లుగా అనిపిస్తోంది. దీనికి పరిష్కారం చెప్పండి.
- వై. శ్రీనివాస్, విశాఖపట్నం
సాధారణంగా టీ-షర్ట్స్ ఒంటికి పట్టినట్లుగా ఉండటంతో వారు మంచి సౌష్ఠవంతో కనిపించడం వల్ల డైనమిక్ లుక్ వస్తుంది. అయితే బిగుతైన టీ-షర్ట్స్ కొన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అవి ఒంటికి పట్టేసినట్లుగా ఉండటం వల్ల గాలి ఆడక బాహుమూలాల్లో టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. మిగతా చర్మంతో పోల్చినప్పుడు అక్కడి చర్మం నల్లగా కనిపించడానికి కారణం... బిగుతైన దుస్తుల వల్ల అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడటమే. మీరు ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలిసి, మీ సమస్యకు వాస్తవ కారణాన్ని తెలుసుకుని తగిన చికిత్స తీసుకోండి.
- డాక్టర్ మేఘనారెడ్డి కె.
డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్‌డ్, స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్
స్కిన్ కౌన్సెలింగ్
Published Thu, May 28 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement