రకరకాల కారణాల వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ వస్తుంటుంది చాలామందికి. చూడటానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఒక బంగాళదుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ మాస్క్‌ని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయవచ్చు.
రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గి ముఖం మిలమిలలాడుతుంది.
పిగ్మంటేషన్‌ని పోగొట్టే డ్రింక్‌లు ..
కీర, దానిమ్మ, కరివేపాకు ఆకులు, నిమ్మరసంతో ఈ ఇంటి డ్రింకు ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింకు లాభాలు ఎన్నో. కీరకాయల్లో యాంటాక్సిడెంట్లు, సిలికా అత్యధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింకులో ఉపయోగించే దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్లతో పాటు చర్మాన్ని మెరిపించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పిగ్మెంటేషన్ మచ్చలను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి.
ఈ డ్రింకులో వేసే కరివేపాకుల్లో కూడా యాంటాక్సిడెంట్లతో పాటు విటమిన్ సి బాగా ఉంది. అలా కరివేపాకులు కూడా పిగ్మెటేషన్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక నిమ్మరసంలో విటమిన్ సి ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మరసం చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు స్కిన్ టోన్ కూడా సమంగా ఉండేలా తోడ్పడుతుంది.
తయారీ విధానం: చిన్న కీరకాయ ఒకటి, అరకప్పు దానిమ్మ గింజలు, పది పన్నెండు కరివేపాకులు, అరచెక్క నిమ్మరసం రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా కొట్టాలి. ఆ డ్రింకును గ్లాసులో పోసుకుని తాగాలి అంతే. ఈ డ్రింకు వల్ల పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఈ డ్రింకు తగ్గిస్తుంది. అంతేకాదు సెల్యులార్ పునరుద్ధరణ కూడా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment