పిగ్మెంటేషన్... మధ్య వయసులో కొందరికి వస్తుంటుంది. దీనిని వాడుకలో మంగు అంటుంటారు. ముఖంపై వచ్చే ఈ నల్ల (మంగు)మచ్చలు పోవడానికి ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.కమలాపండురసం లేదా బంగాళదుంప రసం ముఖానికి పట్టించి, రసం చర్మంలో ఇంకిపోయే వరకు వేళ్లతో వలయాకారంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత ఫేస్ ప్యాక్ వేయాలి.
పిగ్మెంటేషన్‌ని తగ్గించే ఫేస్ ప్యాక్... :స్వచ్ఛమైన పసుపు– ఒక స్పూను బొప్పాయి గుజ్జు– ఒక స్పూను పుదీన పొడి లేదా గుజ్జు – ఒక స్పూను తులసి పొడి లేదా గుజ్జు – ఒక స్పూను∙బాదం పొడి – ఒక స్పూను∙పైవన్నీ కలపాలి. అవసరమైతే కొద్దిగా పన్నీరు వేసి జారుడుగా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి వేసి అరగంట తర్వాత టిష్యూతో తుడిచేయాలి లేదా చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు, ఒక నెలపాటు చేస్తే నలుపు తొలగి పోతుంది. ముఖం తిరిగి మునుపటి కాంతిని సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment