Vivo V23 series: featuring a colour changing back panel launched in India, Details Inside- Sakshi
Sakshi News home page

Vivo: ఇండియన్‌ ఫస్ట్‌ ఆటోఫోకస్డ్‌ ఫ్రంట్‌ కెమెరా..ఏరోస్పేస్‌ గ్రేడ్‌తో స్మార్ట్‌ఫోన్‌...!

Published Wed, Jan 5 2022 3:22 PM | Last Updated on Wed, Jan 5 2022 4:44 PM

Vivo V23 series featuring a colour changing back panel launched in India - Sakshi

ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి...? ఆశ్యర్యపోతున్నారా...మీరు చూసింది నిజమే... ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. తొలి కలర్‌ ఛేజింగ్‌ బ్యాక్‌ ప్యానల్‌ స్మార్ట్‌ఫోన్‌ను వివో భారత్‌లో బుధవారం రోజున లాంచ్‌ చేసింది. 

ఏరోస్పేస్‌ గ్రేడ్‌తో స్మార్ట్‌ఫోన్‌...!
చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో భారత్‌లోకి సరికొత్త వివో వీ23 సిరీస్‌ స్మార్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ రంగులు మారడంతో పాటుగా భారతదేశపు మొట్టమొదటి 50ఎంపీ 'ఐ ఏఎఫ్‌(ఆటోఫోకస్‌) డ్యూయల్ సెల్ఫీ' కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా వివో వీ23 సిరీస్ నిలుస్తోంది. వివో వీ23 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ డిజైన్‌తో రానుంది. ఈ ఫోన్‌ కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 63 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతోంది.  ఇండియన్‌ ఫస్ట్ ఆటోఫోకస్‌ ఫ్రంట్‌ కెమెరాగా ఇది నిలుస్తోంది. వీ23 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇది మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌లో అద్భుతంగా సెట్ చేశారు.దీంతో స్మార్ట్‌ఫోన్‌ సన్నగా కేవలం 7.39 mm మందంతో ఉండనుంది. దీని బరువు  కేవలం 179 గ్రాములు మాత్రమే.

ధర ఎంతంటే..?
న్యూ వివో వీ23, వీ23 ప్రొ అనే రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ రానుంది. సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వీ23 ప్రో 8GB ర్యామ్‌+128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 38,990,  వీ23 ప్రో 12GB ర్యామ్‌+256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర  రూ. 43,990 గా ఉంది. వివో వీ23 8GB ర్యామ్‌+128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 29,990 కాగా, 12GB ర్యామ్‌+256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,990గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లను జనవరి 13 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో, జనవరి 19 నుంచి అన్ని వివో ఇండియా రిటైల్‌ స్టోర్స్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. 

వివో వీ23 ప్రో ఫీచర్స్‌

  • 6.56-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ AMOLED డిస్‌ప్లే
  • మీడియాటెక్‌ డిమెన్సీటీ 1200 చిప్‌ సెట్‌
  • ఫన్‌టచ్‌ ఒఎస్‌ 12 బేస్డ్‌ఆన్‌ ఆండ్రాయిడ్‌ 12
  • 50ఎంపీ ఆటోఫోకస్డ్‌ డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 108 ఎంపీ రియర్‌ కెమెరా
  • 12జీబీ ర్యామ్‌+ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 5జీ సపోర్ట్‌
  • 4300mAh బ్యాటరీ
  • 44W ఫాస్ట్‌ చార్జింగ్‌


చదవండి: బ్లాక్‌బెర్రీ.. ఒకప్పుడు ‘స్మార్ట్‌’ కింగ్‌.. మరి పతనానికి కారణాలు తెలుసా? ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement