జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును ఆవిష్కరించింది. బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రంగుల మార్చే కారును బీఎండబ్ల్యూ రూపొందించింది.
క్షణాల్లో కలర్స్ ఛేంజ్.!
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో(BMW iX Flow) పేరుతో రూపొందించిన ఈ కారును అమెరికాలో లాస్ వేగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES- 2022)లో ఆవిష్కరించింది. ఈ కారులో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీ సహయంతో కారు కలర్‌ను క్షణాల్లో మారిపోతుందని కంపెనీ పేర్కొంది. ఈ-ఇంక్ కంపెనీ భాగస్వామ్యంతో కలర్ ఛేజింగ్ కారును బీఎండబ్య్లూ రూపొందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎండబ్ల్యూ ట్విటర్‌లో షేర్ చేసింది.
బ్లాక్ టూ వైట్...
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో ఏర్పాటుచేసిన బటన్ సహాయంతో కారును క్షణాల్లో బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్‌కు; వైట్ కలర్ నుంచి బ్లాక్‌కు మారిపోనుంది. ఇక్కడ కారు కలర్ ఛేంజ్ అవ్వడం కోసం ఎలాంటి శక్తి వినియోగం జరగదని కంపెనీ వెల్లడించింది. ఈ కలర్ ఛేంజిగ్ సదుపాయంతో కారులో ఎయిర్ కండిషనింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తోందని కంపెనీ పేర్కొంది.
Ready for the next step in innovation ⚡️ Join us as we unveil our future innovations around the CES 2022. #BMWCES #BMW #FromSoultoSoul #BornElectric https://t.co/tsUKqXf92g
— BMW (@BMW) January 5, 2022
చదవండి: BMW iX M60: కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు..! ఒకటా...రెండా కారు నిండా సూపర్ ఫీచర్సే..!
Comments
Please login to add a commentAdd a comment