CES 2022
-
రేసింగ్ స్పోర్ట్స్ బైక్స్‌లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్ బైక్..!
Hyperfighter Colossus Electric Sports Bike: ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే పనిలో ఆయా ఆటోమొబైల్ కంపెనీలు నిమగ్నమైనాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లలోకి తెచ్చాయి. కాగా వీలైనంతా ఎక్కువ మేర రేంజ్‌ను అందించే వాహనాలపై ఆయా సంస్థలు దృష్టిసారించాయి. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా ఆయా స్టార్టప్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉన్నాయి. పలు స్టార్టప్స్ మరో అడుగు ముందుకేసి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లను కూడా రూపొందిస్తున్నాయి. రేసింగ్ బైక్స్‌లో సంచలనం..! దిగ్గజ రేసింగ్ స్పోర్ట్ బైక్స్ సంస్థలకు సవాలు విసురుతూ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ను కెనడాకు చెందిన స్టార్టప్ సంస్థ డామన్ మోటార్స్ ఆవిష్కరించింది. అమెరికా లాస్వేగాస్లో జరుగుతున్న సీఈఎస్-2022 షోలో హైపర్‌ఫైటర్ కొలోసస్(HyperFighter Colossus) ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రదర్శించింది. రేసింగ్ స్పోర్ట్స్ బైక్స్‌కు గట్టి పోటీగా నిలుస్తోందని కంపెనీ అభిప్రాయపడింది. స్పీడ్‌లో..రేసింగ్ బైక్స్‌కు పోటీగా..! డామన్ మోటార్స్ రూపొందించిన హైపర్‌ఫైటర్ కొలోసస్ గరిష్ట వేగం 273 kmph. అంటే సంప్రాదాయ రేసింగ్ బైక్‌లకు సమానంగా ఈ బైక్ దూసుకెళ్తోంది. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్‌లో 20 kWh బ్యాటరీను అమర్చారు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 235 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తోందని కంపెనీ వెల్లడించింది. ఫీచర్లలో కమాల్..! హైపర్‌ఫైటర్ కొలోసస్ ఎలక్ట్రిక్ బైక్ రైడింగ్ అనుభూతిని అందించేందుకు సరికొత్త డిజైన్‌తో డామన్ మోటార్స్ రూపొందించింది. ప్రమాదాలను నివారించేందుకుగాను 360-డిగ్రీల అధునాతన హెచ్చరిక వ్యవస్థను అమర్చారు. అందుకోసం అనేక రాడార్లు, సెన్సార్లను, కెమెరాలను ఏర్పాటుచేశారు. ఈ బైక్ ధర 35 వేల డాలర్లు(దాదాపు రూ. 25 లక్షలు)గా ఉండనుంది. చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా? -
బీఎండబ్ల్యూ సరికొత్త ఆవిష్కరణ..! క్షణాల్లో కారు కలర్ ఛేంజ్..!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త కారును ఆవిష్కరించింది. బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రంగుల మార్చే కారును బీఎండబ్ల్యూ రూపొందించింది. క్షణాల్లో కలర్స్ ఛేంజ్.! బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో(BMW iX Flow) పేరుతో రూపొందించిన ఈ కారును అమెరికాలో లాస్ వేగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES- 2022)లో ఆవిష్కరించింది. ఈ కారులో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఎలక్ట్రోఫొరెటిక్ టెక్నాలజీ సహయంతో కారు కలర్‌ను క్షణాల్లో మారిపోతుందని కంపెనీ పేర్కొంది. ఈ-ఇంక్ కంపెనీ భాగస్వామ్యంతో కలర్ ఛేజింగ్ కారును బీఎండబ్య్లూ రూపొందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎండబ్ల్యూ ట్విటర్లో షేర్ చేసింది. బ్లాక్ టూ వైట్... బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఫ్లో ఏర్పాటుచేసిన బటన్ సహాయంతో కారును క్షణాల్లో బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్‌కు; వైట్ కలర్ నుంచి బ్లాక్‌కు మారిపోనుంది. ఇక్కడ కారు కలర్ ఛేంజ్ అవ్వడం కోసం ఎలాంటి శక్తి వినియోగం జరగదని కంపెనీ వెల్లడించింది. ఈ కలర్ ఛేంజిగ్ సదుపాయంతో కారులో ఎయిర్ కండిషనింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తోందని కంపెనీ పేర్కొంది. Ready for the next step in innovation ⚡️ Join us as we unveil our future innovations around the CES 2022. #BMWCES #BMW #FromSoultoSoul #BornElectric https://t.co/tsUKqXf92g — BMW (@BMW) January 5, 2022 చదవండి: BMW iX M60: కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు..! ఒకటా...రెండా కారు నిండా సూపర్ ఫీచర్సే..! -
ల్యాప్‌టాప్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్!
ప్రముఖ తైవానీస్ కంప్యూటర్ హార్డ్ వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ 2022 సీఈఎస్ టెక్ షోలో ప్రపంచంలోనే మొట్టమొదటి 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌ని ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ 2022 మధ్యలో కొనుగోలుకు అమ్మకానికి రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌గా పేర్కొన్న జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌లో రెండు సైజుల ఓఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉంది. 1920 ఎక్స్ 1280పీ రిజల్యూషన్ గల ఈ ల్యాప్‌టాప్ డిస్ ప్లేను ఇంటెల్, బోటెక్నాలజీ గ్రూప్ భాగస్వామ్యంతో ఆసుస్ సహ-అభివృద్ధి చేసింది. ఇందులో ఉన్న ఆర్టిఫీషియల్ హెచ్డీఐఆర్ కెమెరా యూజర్ ఉనికిని గుర్తిస్తుంది. వెలుతురు బట్టి స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకునే ఇంటిగ్రేటెడ్ కలర్ సెన్సార్ ఉంది. స్పష్టమైన వీడియో కాల్స్ కోసం ఆసుస్ 3డీ నాయిస్ రిడక్షన్(3డిఎన్ఆర్) టెక్నాలజీ గల 5 మెగా పిక్సల్ వెబ్ క్యామ్ ఇందులో ఉంటుంది. ఇది 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 యు-సిరీస్ ప్రాసెసర్లు, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్స్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్డితో వస్తుంది. దీర్ఘకాలిక బ్యాటరీ కోసం 75 డబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అంతరిక్షంలోకి పంపిన మొదటి ఆసుస్ ల్యాప్ టాప్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుస్ ప్రత్యేక జెన్ బుక్ 14ఎక్స్ ఓఎల్ఈడీ స్పేస్ ఎడిషన్ (UX5401ZAS)ను కూడా ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్ భారీ డీల్..! ఏకంగా...!) -
BMW iX M60: కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు..! ఒకటా...రెండా కారు నిండా సూపర్ ఫీచర్సే..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటార్స్ కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అమెరికా లాస్వేగాస్లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్-2022) బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. సూపర్ పర్ఫార్మెన్స్లో అదుర్స్..! ఎలక్ట్రిక్ వాహనాల్లో భాగంగా బీఎండబ్ల్యూ మూడు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. వీటిలో బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కూడా ఒకటి. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం రూపొందించిన బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 610 bhp సామర్థ్యంతో 1015 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కేవలం 3.8 సెకండ్లలో 100 kmph వేగాన్ని అందుకోనుంది. ఈ కారు అధిక లోడ్స్లో కూడా పవర్ఫుల్ వేగంతో స్థిరంగా పరిగెత్తనుంది. స్పోర్ట్స్ బ్రేక్ సిస్టమ్‌తో రానుంది. గరిష్ట వేగం 250 kmph. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 566 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోందని కంపెనీ సీఈఎస్-2022 షోలో వెల్లడించింది. ఈ కారు గ్లోబల్ మార్కెట్లలోకి జూన్ 2022 నుంచి ప్రారంభం కానుంది. డిజైన్ విషయానికి వస్తే...! బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 బాడీ స్ట్రక్చర్ , డిజైన్, సస్పెన్షన్ సెటప్ రెండూ స్పోర్టీ హ్యాండ్లింగ్ లక్షణాలతో అత్యుత్తమ రైడ్ సౌలభ్యాన్ని అందించనున్నాయి. అల్యూమినియం స్పేస్ఫ్రేమ్ కాన్సెప్ట్, రూఫ్, సైడ్, రియర్ సెక్షన్లతో కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (CFRP)తో కూడిన కార్బన్ కేజ్‌తో కారుకు అత్యంత ధడత్వాన్ని అందించనుంది. కారును శక్తివంతంగా మార్చడానికి, తేలికగా ఉంచడం కోసం కారులోని భాగాలను కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ తయారుచేశారు. కొత్త తరం సెన్సార్లు, కొత్త సాఫ్ట్వేర్ స్టాక్ , శక్తివంతమైన కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ , పార్కింగ్ ఫంక్షన్లను మరింత సులువుచేయనుంది. ఫీచర్లలో కమాల్..! బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కారులోని ఫీచర్లను చూస్తే ఔరా అనాల్సిందే...! ఈ కారులో iDrive డిస్ప్లే, కంట్రోల్ సిస్టమ్ సహయంతో డ్రైవర్ వాయిస్‌తో కంట్రోల్ చేయవచ్చును. ఇది కొత్త బీఎండబ్య్లూ ఆపరేటింగ్ సిస్టమ్ 8పై ఆధారపడి పనిచేయనుంది. బీఎండబ్య్లూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్‌తో కొత్త బీఎండబ్ల్యూ కర్వ్డ్ డిస్ప్లే, వాయిస్ కమ్యూనికేషన్ విత్ టచ్ ఫంక్షన్‌తో రానుంది. క్లౌడ్-ఆధారిత మ్యాప్స్ సిస్టమ్, నావిగేషన్, కంట్రోల్ డిస్ప్లే ఆగ్మెంటెడ్ రియాలిటీ వీడియో సహాయంతో వేగవంతమైన, కచ్చితమైన రూట్ ప్లానింగ్‌ను నిర్ధేశిస్తుంది, దీంతో డ్రైవర్ ముందుగానే ట్రాఫిక్ గురించి తెలుసుకోవచ్చును. ఈ కారులో అమర్చిన ఈ-సిమ్‌తో 5జీ సపోర్ట్‌ను అందిస్తోంది. ఇంటిరీయర్స్ విషయానికి వస్తే..! లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్, నేచురల్ ఇంటరాక్షన్‌ను బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కలిగి ఉంది. బోవర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, బీఎండబ్ల్యూ లేజర్ లైట్, కంఫర్ట్ యాక్సెస్, డ్రైవర్ , ఫ్రంట్ ప్యాసింజర్ కోసం యాక్టివ్ సీట్ వెంటిలేషన్‌తో రానుంది. విశాలమైన, అధిక-నాణ్యత , వినూత్నంగా రూపొందించిన ఇంటీరియర్, డ్రైవర్‌కు చురుగ్గా డ్రైవింగ్‌పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ప్రయాణాన్ని మరింత లగ్జరీగా మార్చనుంది. మల్టీఫంక్షన్ సీట్లు, కర్వ్డ్ డిస్ప్లే, హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్, అంత్రాసైట్-కలర్ రూఫ్ లైనర్‌తో డ్రైవింగ్‌లో అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. అదనపు లెగ్‌రూమ్ కూడా లభించనుంది. చదవండి: BMW Group India: బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..!