ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటార్స్ కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అమెరికా లాస్‌వేగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్-2022) బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.
సూపర్ పర్ఫార్మెన్స్‌లో అదుర్స్..!
ఎలక్ట్రిక్ వాహనాల్లో భాగంగా బీఎండబ్ల్యూ మూడు ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రపంచవ్యాప‍్తంగా లాంచ్ చేయనుంది. వీటిలో బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కూడా ఒకటి. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం రూపొందించిన బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 610 bhp సామర్థ్యంతో 1015 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కేవలం 3.8 సెకండ్లలో 100 kmph వేగాన్ని అందుకోనుంది. ఈ కారు అధిక లోడ్స్‌లో కూడా పవర్‌ఫుల్ వేగంతో స్థిరంగా పరిగెత్తనుంది. స్పోర్ట్స్ బ్రేక్ సిస్టమ్‌తో రానుంది. గరిష్ట వేగం 250 kmph. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 566 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోందని కంపెనీ సీఈఎస్-2022 షోలో వెల్లడించింది. ఈ కారు గ్లోబల్ మార్కెట్లలోకి జూన్ 2022 నుంచి ప్రారంభం కానుంది.
డిజైన్ విషయానికి వస్తే...!
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 బాడీ స్ట్రక్చర్ , డిజైన్, సస్పెన్షన్ సెటప్ రెండూ స్పోర్టీ హ్యాండ్లింగ్ లక్షణాలతో అత్యుత్తమ రైడ్ సౌలభ్యాన్ని అందించనున్నాయి. అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ కాన్సెప్ట్, రూఫ్, సైడ్, రియర్ సెక్షన్లతో కార్బన్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (CFRP)తో కూడిన కార్బన్ కేజ్‌తో కారుకు అత్యంత ధడత్వాన్ని అందించనుంది. కారును శక్తివంతంగా మార్చడానికి, తేలికగా ఉంచడం కోసం కారులోని భాగాలను కార్బన్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ తయారుచేశారు. కొత్త తరం సెన్సార్‌లు, కొత్త సాఫ్ట్‌వేర్ స్టాక్ , శక్తివంతమైన కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ , పార్కింగ్ ఫంక్షన్లను మరింత సులువుచేయనుంది.
ఫీచర్లలో కమాల్..!
బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కారులోని ఫీచర్లను చూస్తే ఔరా అనాల్సిందే...! ఈ కారులో iDrive డిస్ప్లే, కంట్రోల్ సిస్టమ్ సహయంతో డ్రైవర్ వాయిస్‌తో కంట్రోల్ చేయవచ్చును. ఇది కొత్త బీఎండబ్య్లూ ఆపరేటింగ్ సిస్టమ్ 8పై ఆధారపడి పనిచేయనుంది. బీఎండబ్య్లూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్‌తో కొత్త బీఎండబ్ల్యూ కర్వ్డ్ డిస్ప్లే, వాయిస్ కమ్యూనికేషన్ విత్ టచ్ ఫంక్షన్‌తో రానుంది. క్లౌడ్-ఆధారిత మ్యాప్స్ సిస్టమ్, నావిగేషన్, కంట్రోల్ డిస్‌ప్లే ఆగ్మెంటెడ్ రియాలిటీ వీడియో సహాయంతో వేగవంతమైన, కచ్చితమైన రూట్ ప్లానింగ్‌ను నిర్ధేశిస్తుంది, దీంతో డ్రైవర్ ముందుగానే ట్రాఫిక్ గురించి తెలుసుకోవచ్చును. ఈ కారులో అమర్చిన ఈ-సిమ్‌తో 5జీ సపోర్ట్‌ను అందిస్తోంది.
ఇంటిరీయర్స్ విషయానికి వస్తే..!
లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్, నేచురల్ ఇంటరాక్షన్‌ను బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కలిగి ఉంది. బోవర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, బీఎండబ్ల్యూ లేజర్ లైట్, కంఫర్ట్ యాక్సెస్, డ్రైవర్ , ఫ్రంట్ ప్యాసింజర్ కోసం యాక్టివ్ సీట్ వెంటిలేషన్‌తో రానుంది. విశాలమైన, అధిక-నాణ్యత , వినూత్నంగా రూపొందించిన ఇంటీరియర్, డ్రైవర్‌కు చురుగ్గా డ్రైవింగ్‌పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ప్రయాణాన్ని మరింత లగ్జరీగా మార్చనుంది. మల్టీఫంక్షన్ సీట్లు, కర్వ్‌డ్ డిస్‌ప్లే, హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్, అంత్రాసైట్-కలర్ రూఫ్ లైనర్‌తో డ్రైవింగ్‌లో అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. అదనపు లెగ్‌రూమ్ కూడా లభించనుంది.
చదవండి: BMW Group India: బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్‌లో తొలిసారిగా..!
Comments
Please login to add a commentAdd a comment