ఈ ఏడాది జూన్‌లో 'ఎం5' (M5) కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన తరువాత బీఎండబ్ల్యూ ఎట్టకేలకు భారతీయ విఫణిలో లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎం5 ధర రూ.1.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీ8 పవర్‌ట్రెయిన్ రెండూ ఉపయోగిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.
బీఎండబ్ల్యూ ఎం5 భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ కారులోని 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 577 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 194 Bhp, 280 Nm టార్క్ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ (ఎం డ్రైవర్ ప్యాకేజీతో).
బీఎండబ్ల్యూ ఎం5 కారులోని 22.1 కిలోవాట్ బ్యాటరీ 70 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ ఉపయోగించాలి. బ్యాటరీ 3:15 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ కూడా మంచి రేంజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
2025 ఎం5 బోల్డ్ డిజైన్ కలిగి సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్‌తో రీస్టైల్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారులో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కర్వ్డ్ ట్విన్ స్క్రీన్‌లు, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎం5 నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరీనా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ రెడ్/బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్‌స్టోన్/బ్లాక్ & ఆల్-బ్లాక్ వంటి కాంబినేషన్‌లను పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment