ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ ఎం2 కూపేను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 1.03 కోట్లు (ఎక్స్ షోరూమ్).
చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపించే బీఎండబ్ల్యూ ఎం2 కూపే.. ఇప్పుడు సావో పాలో ఎల్లో, ఫైర్ రెడ్, పోర్టిమావో బ్లూ, స్కైస్క్రాపర్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ఎం వీల్స్ బ్లాక్ ఫినిషింగ్‌తో డబుల్ స్పోక్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఆప్షనల్ ఆల్కాంటారా ఫినిషింగ్ పొందుతుంది. ఇందులో ఐడ్రైవ్ సిస్టమ్‌తో కొత్త డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.
అప్డేటెడ్ బీఎండబ్ల్యూ ఎం2 కారు 3.0 లీటర్ స్ట్రెయిట్ సిక్స్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ద్వారా 480 hp పవర్, 600 Nm టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన స్టాండర్డ్ M2 కూపే ఇప్పుడు 0-100kph వేగాన్ని 4 సెకన్లలో కవర్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 285 కిమీ/గం. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని స్పష్టమవుతోంది.
Introducing the new avatar of unadulterated adrenaline. The new BMW M2 Coupé. #BMWIndia #BMWM #TheM2
—————————————————
The models, equipment, and possible vehicle configurations illustrated in the advertisement may differ from vehicles supplied in the Indian market. pic.twitter.com/dC701ZP66j— BMW India (@bmwindia) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment