బీఎండబ్ల్యూ కంపెనీ భారతదేశంలో 'ఎం4 సీఎస్' పేరుతో ఓ కొత్త కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్ట మొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్. ఎం4 కాంపిటీషన్ మోడల్ కంటే కూడా దీని ధర రూ. 36 లక్షలు ఎక్కువ.
కొత్త బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్ పొందుతుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్‌కి పెంచడం వల్ల పవర్ కొంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 302 కిమీ/గం.
బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్.. టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్ నిర్మితం. ఈ కారు ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది. ఎం4 సీఎస్ కారులో ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు.
ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా?: తెలుసుకోకపోతే మోసపోతారు..
ఫ్లాట్ బాటమ్ ఆల్కాంటారా ఎం స్టీరింగ్ వీల్ కలిగిన ఎం4 మోడల్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లోని సీఎస్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment