ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఇప్పటికే బోట్ టెయిల్ అనే ఖరీదైన కారుని విడుదల చేసిన ఈ సంస్థ తాజాగా మరో ఖరీదైన కారు ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన ఈ కారు పేరు 'డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్' (Droptail Roadster). దీనిని 'లా రోజ్ నోయిర్' అని కూడా పిలుస్తారు. ఈ కారు ధర 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఆంటే భారతీయ కరెన్సీ ప్రకారం 200 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ఆకర్షయంగా ఉంటుంది. ఇది రిమూవబుల్ హార్డ్‌టాప్ కూడా పొందుతుంది. కావున ఇది ఓపెన్ టాప్ కారు మాదిరిగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు!
రోల్స్ రాయిస్ డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్ 6.75-లీటర్ V12 ఇంజిన్ కలిగి 563 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు చేతితో రూపొందించిన అల్యూమినియంతో తయారై ఉంటుంది. హ్యాండ్ పెయింటెడ్ కోచ్‌లైన్ అండ్ లాంబ్‌వుల్-లైన్డ్ ఇంటీరియర్‌తో సహా అనేక బెస్పోక్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో గమనించవచ్చు.
లిమిటెడ్ ఎడిషన్‌లో లభిస్తున్న రోల్స్ రాయిస్ కార్ల జాబితాలో ఈ డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్ కూడా ఒకటి కానుంది. ఇది 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ డార్క్ మిస్టరీ పెయింట్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉంది. దూరం నుంచి ఇది నలుపు రంగులోనూ.. దగ్గర నుంచి ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా.. వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment