భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాయి, అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కూడా 'స్పెక్టర్' అనే ఎలక్ట్రిక్ కారు విడుదలతో ఈ జాబితాలో చేరింది.
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన రోల్స్ రాయిస్ కంపెనీ తాజాగా 'స్పెక్టర్' (Spectre) ఎలక్ట్రిక్ కారుని సౌత్ కొరియాలో విడుదల చేసింది. గతంలో వెల్లడించినట్లుగానే కంపెనీ ఎలక్ట్రిక్ కారుని తీసుకువచ్చింది. ఇది గ్లోబల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్. దీని ధర కొరియాలో 620 మిలియన్ వాన్స్.. అంటే భారతీయ కరెన్సీ దీని విలువ సుమారు 3.98 కోట్లు.
(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!)
దక్షిణ కొరియాలో రోల్స్ రాయిస్ తన ఉనికిని మరింత విస్తరించుకోవడంలో భాగంగానే స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినట్లు సమాచారం. ఈ కారు డిజైన్ చూడగానే రోల్స్ రాయిస్ తెలిసిపోతుంది. ఇందులో అత్యంత విశాలవంతమైన గ్రిల్ చూడవచ్చు. పరిమాణం పరంగా ఇది చాలా విషయంగా ఉంటుంది. పొడవు 5,453 మిమీ పొడవు, 2,080 మిమీ వెడల్పు, ఎత్తు 1,559 మిమీ వరకు ఉంది. వీల్‌బేస్ 3210 మిమీ. ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ 2,950 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 576.6 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment