Expensive Electric Car Pininfarina B95 Roadster Price and Details - Sakshi
Sakshi News home page

Expensive EV: ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కారు - కేవలం 10 మందికి మాత్రమే..

Aug 18 2023 2:55 PM | Updated on Aug 18 2023 3:20 PM

Expensive electric car pininfarina b95 roadster price and details - Sakshi

Pininfarina B95 Roadster: ఇప్పటి వరకు ఖరీదైన బైక్ గురించి తెలుసుకున్నాం, ఖరీదైన ఫ్యూయెల్ కారు గురించి తెలుసుకున్నాం.. అయితే ఈ కథనంలో ప్రపంచంలోనే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుని పినిన్‌ఫరినా (Pininfarina) అనే కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర 4.4 మిలియన్ యూరోలు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 39.8 కోట్లు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఇది ప్రసిద్ధి చెందింది.

10 యూనిట్లు మాత్రమే..
పినిన్‌ఫరినా కంపెనీ ఈ 'బి95 రోడ్​స్టర్' హైపర్‌ కారుని కేవలం 10 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నట్లు సమాచారం. కంపెనీ 95వ యానివెర్సరీ సందర్భంగా 2025లో డెలివరీలు చేయనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ కారు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్‌ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు!

గరిష్ట వేగం గంటకు 300 కిమీ..
పినిన్‌ఫరినా బి95 దాని బాటిస్టా మాదిరిగానే అదే పవర్‌ట్రెయిన్‌ పొందుతుంది. కావున 120 ఇందులోని కిలోవాట్ బ్యాటరీ మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 2 సెకన్లలోపు గంటకు 0 నుంచి 96 కిమీ/గం వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిమీ కావడం గమనార్హం. ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ఫ్యూరియోసా అండ్ కరాటెరే అనే ఐదు డ్రైవింగ్ మోడ్‌లు లభిస్తాయి.

బి95 రోడ్​స్టర్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 450 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని మోటార్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 270 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement