తారక్‌ చేతికున్న వాచ్‌ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | Do You Know Jr NTR Wears Patek Philippe Watch Price At Family Wedding In Hyderabad - Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికున్న వాచ్‌ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

Published Fri, Aug 25 2023 4:07 PM | Last Updated on Fri, Aug 25 2023 4:25 PM

Jr NTR expensive patek Philippe watch price and details - Sakshi

Jr NTR Patek Philippe Watch: తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'జూనియర్ ఎన్టీఆర్' గురించి పరిచయమే అవసరం లేదు. మంచి నటనా నైపుణ్యంతో ప్రేక్షులకు హృదయాలను దోచుకున్న ఈ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు. ఇటీవల ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరైన జూ. ఎన్టీఆర్ సుమారు రూ. 2.45 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది 'పాటక్ ఫిలిప్' అనే స్విజర్‌ల్యాండ్ బ్రాండ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో జూ. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా మరో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీని ధర రూ. 1.56 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంకా ఈయన వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం.

ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్!

ఇక కార్ల విషయానికి వస్తే.. ఈయన వద్ద లంబోర్ఘిని ఉరుస్‌ గ్రాపైట్‌ క్యాప్స్యూల్‌, రేంజ్ రోవర్ రోగ్‌, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే మూవీ చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement