
సల్మాన్ ఖాన్ (Salman Khan) కొత్త సినిమా సికిందర్.. ఈద్ (రంజాన్) సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నార్త్ లో ఓకే కానీ దక్షిణాదిలో పెద్దగా హైప్ లేదు. మరోవైపు సౌత్ ఆడియెన్స్ తమ సినిమాల్ని చూడట్లేదంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)
ఇలా సికిందర్ (Sikandar Movie) చిత్రంపై కాస్తంత నెగిటివిటీ నడుస్తోంది. దీన్ని న్యూట్రలైజ్ చేసేందుకో ఏమో గానీ సల్మాన్.. రామ్ జన్మభూమి వాచ్ (Ram Janmabhoomi Watch) ధరించాడు. జాకబ్ & కో కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాచీలో రాముడు, అయోధ్య రామమందిరం బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాచ్ ధర ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సల్మాన్ చేతికి ధరించిన రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్ ఖరీదు దాదాపు రూ.34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సికిందర్ మూవీలో రష్మిక హీరోయిన్ కాగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై సల్మాన్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏం ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: వెండితెరకు డొక్కా సీతమ్మ జీవితం)
See you in theatres this Eid! pic.twitter.com/XlC2xFkIQ0
— Salman Khan (@BeingSalmanKhan) March 27, 2025