లగ్జరీ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'బీఎండబ్ల్యూ' (BMW) దేశీయ మార్కెట్లో ఒక కొత్త కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ విడుదల చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 ఎమ్40ఐ'. ఈ SUV కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా లభిస్తుంది. కావున ఇది ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్లలో లేదా, సమీపంలోని అధీకృత డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు.
ఎక్స్3 ఎమ్40ఐ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్రూక్లిన్ గ్రే అండ్ బ్లాక్ సఫైర్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎమ్ కిడ్నీ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ముందు భాగంలో మ్యాట్రిక్స్ ఫంక్షన్ తో కూడిన అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ రెడ్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు)
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మల్టీఫంక్షన్‌తో లెదర్ స్టీరింగ్ వీల్, కాంట్రాస్ట్ స్టిచింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్‌కమ్ లైట్ కార్పెట్, యాంబియంట్ లైటింగ్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.
కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్40ఐ 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి 360 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కినీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.
(ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)
ఇక చివరగా ప్రధానమైనది సేఫ్టీ ఫీచర్స్, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, డైనమిక్ బ్రేకింగ్ లైట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ మొదలైనవి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment