
Tiger Shroff BMW: బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'టైగర్ ష్రాఫ్' (Tiger Shroff) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆయన ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మూవీజ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. ఇందులో కారుని స్పష్టంగా చూడవచ్చు.
టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్ఐ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 258 పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగి కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
(ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!)
డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, 190 పీఎస్ పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటాకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment