
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
భారతదేశంలోని బీఎండబ్ల్యూ చెన్నై సదుపాయంతో 10 మోడళ్లను అసెంబుల్ చేసింది. ఇందులో ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ, 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ మొదలైనవి ఉన్నాయి. ఇక సీబీయూ మార్గం ద్వారా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అవుతాయి.
ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బెంజ్ ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత, బీఎండబ్ల్యూ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. కాబట్టి బీఎండబ్ల్యూ కార్ల ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పెరగనున్నాయి.