భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలకు అనుకూలంగా తమ వాహనాలను అప్డేట్ చేయడానికి చాలా కంపెనీలు ఇప్పుడు తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంది.
మారుతి సుజుకి తన ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్‌ను 'రియల్ డ్రైవింగ్ ఎమిషన్' నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా అందిస్తోంది. ఈ కారణంగా ఇగ్నిస్ పెరిగాయి.
ఆధునిక అప్డేట్స్ పొందిన తరువాత ఇగ్నిస్ ధరలు రూ. 27,000 పెరిగాయి, కావున ఈ హ్యాచ్‌బ్యాక్ ధర, ధరల పెరుగుదల తరువాత రూ. 5.55 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చేరుకుంది. ఇందులో ఇప్పుడు E20 ఫ్యూయల్ కూడా పొందుతుంది. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!)
మారుతి ఇగ్నిస్ మొత్తం తొమ్మిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇక డిజైన్, ఇంటీరియర్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ వంటివి అద్భుతంగా ఉన్నాయి. ఇది K-సిరీస్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ కలిగి 83 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇగ్నిస్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది.
మారుతి ఇగ్నిస్ ప్రస్తుతం సిగ్మా, డెల్టా, ఏఎంటి డెల్టా, జీటా, ఏఎంటి జీటా, ఆల్ఫా, ఏఎంటి ఆల్ఫా అనే మొత్తం 7 వేరియంట్‌లలో విక్రయించబడుతోంది. మారుతి సుజుకి ఇటీవల 'సెడాన్ టూర్ ఎస్' ను కూడా అప్‌డేట్ చేసింది. దీని ధరలు రూ. 6.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment