Ignis
-
మారుతి ఇగ్నిస్ కొత్త ధరలు.. ఇక్కడ!
భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలకు అనుకూలంగా తమ వాహనాలను అప్డేట్ చేయడానికి చాలా కంపెనీలు ఇప్పుడు తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంది. మారుతి సుజుకి తన ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్‌ను 'రియల్ డ్రైవింగ్ ఎమిషన్' నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా అందిస్తోంది. ఈ కారణంగా ఇగ్నిస్ పెరిగాయి. ఆధునిక అప్డేట్స్ పొందిన తరువాత ఇగ్నిస్ ధరలు రూ. 27,000 పెరిగాయి, కావున ఈ హ్యాచ్‌బ్యాక్ ధర, ధరల పెరుగుదల తరువాత రూ. 5.55 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చేరుకుంది. ఇందులో ఇప్పుడు E20 ఫ్యూయల్ కూడా పొందుతుంది. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: తక్కువ ధరలో ఆటోమాటిక్ కారు కావాలా? ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!) మారుతి ఇగ్నిస్ మొత్తం తొమ్మిది కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇక డిజైన్, ఇంటీరియర్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ వంటివి అద్భుతంగా ఉన్నాయి. ఇది K-సిరీస్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ కలిగి 83 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇగ్నిస్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. మారుతి ఇగ్నిస్ ప్రస్తుతం సిగ్మా, డెల్టా, ఏఎంటి డెల్టా, జీటా, ఏఎంటి జీటా, ఆల్ఫా, ఏఎంటి ఆల్ఫా అనే మొత్తం 7 వేరియంట్లలో విక్రయించబడుతోంది. మారుతి సుజుకి ఇటీవల 'సెడాన్ టూర్ ఎస్' ను కూడా అప్డేట్ చేసింది. దీని ధరలు రూ. 6.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. -
ఫిబ్రవరిసేల్స్: మారుతి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే క్రమంలో పలు మోడళ్ల కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో బాలెనో, సియాజ్ , ఇగ్నిస్ వంటి మోడల్ కార్లపై నేరుగా నగదు తగ్గింపులతో పాటు, కార్పొరేట్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందించింది. (ఇదీ చదవండి: టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు) మారుతీ సుజుకి సియాజ్ హై-ఎండ్ సెడాన్. మారుతి సుజుకి సియాజ్ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ , రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు. 105 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రధాన ఫీచర్లు (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు ) మారుతీ సుజుకి బాలెనో హై-ఎండ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ మోడల్ కొనుగోలుపై రూ. 15,000 వరకు ఆదా చేయవచ్చు. బాలెనోలోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 90 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది మారుతీ సుజుకి ఇగ్నిస్ పలు చిన్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.25వేల వరకు క్యాష్ డిస్కౌంట్. మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 83 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
మారుతీ కార్లపై అదిరిపోయే ఆఫర్స్!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్ జోష్‌ను కొనసాగించి, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్‌లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్, వ్యాగన్-ఆర్ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఆల్టో కే10: పాపులర్ మోడల్ ఆల్టో కే10పై అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. మారుతీ సుజుకి సియాజ్: మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. సెలేరియో: సెలేరియో బేసిక్ మేన్యువల్ వేరియంట్, సీఎన్జీ వేరియంట్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్, జెడ్ ప్లస్ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్సైట్లో గానీ చూడవచ్చు. -
కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన ఆటో ఎక్స్పో 2020లో దీన్ని లాంచ్ చేసింది. బీఎస్-6 పెట్రోల్ ఇంజీన్‌తో ఇగ్నిస్ వాహనాన్ని అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఏడు వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ప్రస్తుతం ఉన్న రంగుల పాలెట్‌తో పాటు లూసెంట్ ఆరెంజ్ , టర్కోయిస్ బ్లూ అనే రెండు కొత్త రంగులలో లభ్యంకానుంది. సమర్థవంతమైన మన్నిక, విశాలమైన ఇంటీరియర్‌తో ఇగ్నిస్ వాహనం 1.1 లక్షలకు పైగా భారత యూజర్లను బాగా ఆకట్టుకుందని కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా తెలిపారు. తాజాగా వినియోగదారుల సరికొత్త అంచనాలకనుగుణంగా కొత్త ఇగ్నిస్ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా మారుతి సుజుకి నెక్సా పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం ఉంది . ప్రపంచవ్యాప్తంగా కూడా సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఇగ్నిస్‌కు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇది మొట్టమొదట ఫిబ్రవరి 2016లో జపాన్ మార్కెట్లో లాంచ్ చేయగా, తరువాత ఇండియా, ఐరోపా, ఇతర ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేసింది. -
మార్కెట్లోకి మారుతీ ఇగ్నిస్ 2019 ఎడిషన్
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా... ఇగ్నిస్ మోడల్లో 2019 ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జూలై 1 నుంచి అమలుకానున్న ప్యాసింజర్ వాహనాల కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూ పొందించినట్లు కంపెనీ పేర్కొంది. అతివేగాన్ని హెచ్చరించే వ్యవస్థ, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్, డ్రైవర్ పక్కన ఉన్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రిమైండ్ చేయడం వంటి భద్రతా ఫీచర్లతో విడుదలైన ఈ హచ్‌బ్యాక్ ధరల శ్రేణి రూ.4.79లక్షలు నుంచి 7.14 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆస్.ఎస్.కల్సి మాట్లాడుతూ.. ‘ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందించాలనే లక్ష్యంతో అత్యధిక సేఫ్టీ ఫీచర్లను ఈ కారులో సమకూర్చాం. ఇతర వేరియంట్లలో కూడా ఇదే తరహా ఫీచర్స్‌ను అందిస్తాం’ అని తెలిపారు. -
మారుతి సుజుకి ఇగ్నిస్ 2019 లాంచ్
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2019 ఇగ్నిస్ కారును లాంచ్ చేసింది. రూఫ్ రెయిల్స్ లాంటి సరికొత్త భద్రతా ఫీచర్లతోపాటు, ఇతర మార్పులతో అపడేటెడ్ వెర్షన్‌ను తాజాగా భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.79 లక్షల నుంచి 7.14 లక్షల మధ్య ఉండనుంది. 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజీన్ సామర్థ్యంతో పెట్రోలు వెర్షన్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఇది సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. కొత్త ఇగ్నిస్ కారులో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుతోపాటు డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి భద్రతా ఫీచర్లను అమర్చింది. ప్రయాణికులకు మెరుగైన భద్రతా అందించాలనే లక్ష్యంతో పలు సేఫ్టీ ప్రత్యేకతలతో కొత్త ఇగ్నిస్ కారును తీసుకువచ్చామని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆస్.ఎస్.కల్సి తెలిపారు. ప్రీమియం అర్బన్ కార్ యూజర్లకు 2019 ఇగ్నిస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారిందని పేర్కొన్నారు. -
మారుతీ ‘ఇగ్నిస్’పై భారీ డిస్కౌంట్లు
మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా విక్రయాలు నమోదు చేస్తున్న మారుతీ, తన మోడల్స్‌లో ఒకటి మార్కెట్లో కస్టమర్లను చేరుకోలేకపోతుందని గుర్తించింది. అది ఇగ్నిస్ డీజిల్ వేరియంట్‌గా తెలిపింది. కస్టమర్ల నుంచి ఈ వాహనానికి తక్కువ డిమాండ్ వస్తుండటంతో, ఇగ్నిస్ డీజిల్ వేరియంట్‌ను ఆపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇగ్నిస్ డీజిల్ ఉత్పత్తిని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్డీటీవీ కారన్అండ్బైక్ రిపోర్టు ప్రకారం, ఇగ్నిస్ డీజిల్‌కు సంబంధించి ఎలాంటి బుకింగ్స్‌ను తాము తీసుకోవడం లేదని ముంబైకి చెందిన ఓ డీలర్ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న డీలర్స్ కూడా ఇగ్నిస్ మోడల్‌ను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ఫీచర్ల పరంగా చూసుకుంటే, ఆ కారు ధర చాలా ఎక్కువని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారు అసలు ధర సుమారు 8 లక్షల రూపాయలుగా ఉంది. ఎవరైతే కస్టమర్లు పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి అన్ని ఫీచర్లు కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. కంపెనీ ఇటీవలే తన కొత్త స్విఫ్ట్‌ను లాంచ్ చేసింది. మారుతీ సుజుకీ చెందిన స్విఫ్ట్, ఇగ్నిస్ రెండు మోడల్స్ కూడా ఒకే విధమైన ధరను కలిగి ఉన్నాయి. మూడో తరానికి చెందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ వేగవంతమైన కారుగా పేరులోకి వచ్చింది. ఇప్పటికే ఇది లక్ష యూనిట్ విక్రయాలను క్రాస్ చేసింది. అయితే ఇగ్నిస్ కేవలం నెలవారీ 4500 యూనిట్ విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. ఇగ్నిస్‌ను ప్రస్తుతం నిలిపివేయడంతో, ఇప్పటికే ఉన్న స్టాక్‌పై డీలర్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించారు. న్యూఢిల్లీలో ఇగ్నిస్‌పై 70 వేల రూపాయల వరకు ప్రయోజనాలను మారుతీ సుజుకీ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్ వెర్షన్ 35 వేల రూపాయల నగదు డిస్కౌంట్లో అందుబాటులో ఉంది. ఏఎంటీపై కూడా 40 వేల రూపాయల డిస్కౌంట్ లభ్యమవుతుంది. 25 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్, రూ.3100 కార్పొరేట్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే డిస్కౌంట్లు, ఆఫర్లు డీలర్‌షిప్‌కు డీలర్‌షిప్‌కు మధ్య తేడా ఉంటాయి. ఇగ్నిస్ డీజిల్ బేస్ వేరియంట్ ధర, కొన్ని ప్రత్యర్థ వాహనాల ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
మారుతీ ఇగ్నిస్ వచ్చేసింది
పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం • ధర రూ.4.59 లక్షల నుంచి రూ.7.8 లక్షల రేంజ్లో ముంబై: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ.. ప్రీమియమ్ కాంపాక్ట్ వెహికల్, ఇగ్నిస్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభించే ఈ కార్ల ధరల్ని రూ.4.59 లక్షల నుంచి రూ.7.8 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని మారుతీ సుజుకీ తెలిపింది. తమ ప్రీమియమ్ రిటైల్ చెయిన్ నెక్సా ద్వారా ఇగ్నిస్ కార్లను విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. సిగ్మా, డెల్టా, డెల్టా ఏఎంటీ, జెటా, జెటా ఏఎంటీ, ఆల్ఫా వేరియంట్లలో, మొత్తం తొమ్మిది విభిన్నమైన రంగుల్లో ఈ కారు లభ్యమవుతుందని వివరించారు. 1.2 పెట్రోల్ ఇంజిన్ ఉన్న ఇగ్నిస్ కారు ధరలు రూ.4.59 లక్షలు–రూ.6.69 లక్షల రేంజ్లో, 1.3 డీజిల్ ఇంజిన్ ఇగ్నిస్ కారు ధరలు రూ.6.39 లక్షలు–రూ.7.8 లక్షల రేంజ్లో ఉన్నాయని పేర్కొన్నారు. యువ వినియోగదారులు లక్ష్యంగా అందిస్తున్న ఈ ఇగ్నిస్ కారులో 98.5% స్థానిక విడిభాగాలనుపయోగించామని, ఈ కారు డిజైనింగ్, తయారీ కోసం రూ.950 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. పెట్రోల్ మోడల్ 20.89 కిమీ, డీజిల్ మోడల్ 26.80 కి.మీ. మైలేజీని ఇస్తాయని తెలిపారు. 2020 కల్లా భారత్‌లో 15 కొత్త మోడళ్లను అందిస్తామని పేర్కొన్నారు. అప్పటికి ఏటా 20 లక్షల కార్లను విక్రయించాలనేది తమ మధ్యకాలిక లక్ష్యమని తెలిపారు. మారుతీ ఇగ్నిస్ ప్రత్యేకతలు.. ప్రయాణికులకు మరింత భద్రత నిచ్చే కొత్త జనరేషన్ రిజిడ్ ప్లాట్ఫార్మ్.. టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ(టెక్ట్) ప్లాట్ఫార్మ్పై ఇగ్నిస్ ను రూపొందించామని కంపెనీ పేర్కొంది. ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీలాక్బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), పిల్లల కోసం ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఫీచర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్లైట్స్, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లున్నాయి. -
మారుతి ఇగ్నిస్ వచ్చేసింది..ధర ఎంత?
ముంబై: వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి తాజా కారు ఇగ్నిస్ శుక్రవారం లాంచ్ అయింది. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఉన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. పెట్రోల్ వెర్షన్ రూ.4.59 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.6.39 లక్షల చొప్పున ప్రారంభ ధరలుగా మారుతి నిర్ణయించింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ 7.46 లక్షలుగా పేర్కొంది. ఇవి ఢిల్లీలోని ఎక్స్ షోరూమ్ ధరలు. మొత్తం ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది. అప్‌టౌన్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూ, అర్బన్ బ్లూ, గ్రే మరియు సిల్కీ సిల్వర్ రంగుల్లో వస్తోంది. డీజిల్ ఇంజన్ లీటరుకు నగరాల్లో అయితే 19, ప్రామాణిక పరిస్థితుల్లో అయితే 26.80 కి.మీ, పెట్రోల్ వేరియంట్ లీటరుకు నగరాల్లో 16, ప్రామాణిక పరిస్థితుల్లో 20.89 కి.మీ చొప్పున మైలేజి వస్తుందిన కంపెనీ పేర్కొంది. పోటీదారులను ఎదుర్కోవడానికి మారుతి బలమైన ఆయుధం మైలేజ్ అన్నది మార్కెట్ వర్గాల భావన. ఆటోమేటెడ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను మారుతి ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ గా మారుతి పిలుస్తోంది. మారుతి సుజుకి తమ డీజల్ ఇగ్నిస్ లోని మధ్య వేరియంట్లయిన డెల్టా మరియు జెటాలలో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పరిచయం చేస్తోంది. అయితే ఇగ్నిస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫాలో మాత్రం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదు. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫాగా మొత్తం నాలుగు వేరియంట్లలో ఇగ్నిస్ లాంచ్ అయింది. సిగ్మా కేవలం పెట్రోల్ ఇంజిన్ కాగా, మిగిలిని రెండు వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటాయి. హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, టచ్ స్క్రీన్ ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ రిమోట్ కీలెస్ ఎంట్రీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కాగా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లోని డీజల్ కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ అందిస్తున్న ఏకైక సంస్థ మారుతి సుజుకి, తమ అప్ కమింగ్ ఇగ్నిస్ కారులోని పెట్రోల్‌తో పాటు డీజల్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందిస్తోంది. గతంలో కూడా మారుతినే మొదటి సారిగా పెట్రోల్ వేరియంట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పరిచయం చేసింది. ఇప్పుడు ఇగ్నిస్ ద్వారా డీజల్ వేరియంట్లో మారుతినే మొదటిసారిగా ఈ ఆప్షన్‌ను పరిచయం చేస్తోంది. అంతేకాదు రూ.10 లక్షలలోపు కార్లలో ఎల్ఈడీ లైట్ల సదుపాయం కల్పిస్తున్న మొదటి సంస్థ కూడా మారుతి సుజుకినే కావడం విశేషం. -
మారుతీ ‘ఇగ్నిస్’ ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఇగ్నిస్’ ఆన్లైన్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ కారు వచ్చే వారం (జనవరి 13న) మార్కెట్లోకి రానుంది. ఈ కారును నెక్సా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని మారుతీ సుజుకీ తెలిపింది. నెక్సా ప్రీమియం ఔట్లెట్స్ ద్వారానే ఈ కార్ల విక్రయం ఉంటుందని పేర్కొం ది. ఔత్సాహికులు రూ.11,000లతో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని వివరించింది. రెండింటిలోనూ ఆటోమేటిక్ గేర్‌షిఫ్ట్ ఆప్షన్ ఉందని పేర్కొంది. కాగా కంపెనీకి దేశవ్యాప్తంగా 115 పట్టణాల్లో 197 నెక్సా ఔట్లెట్స్ ఉన్నాయి. మారుతీ ఈ ఔట్లెట్స్ ద్వారా ఇప్పటికే బాలెనో, ఎస్–క్రాస్ మోడళ్లను విక్రయిస్తోంది. -
మారుతీ కొత్త కారు లాంచింగ్ అప్పుడేనట!
మారుతీ సుజుకీ నుంచి ఎంతోకాలంగా వేచిచూస్తున్న ఇగ్నిస్ మోడల్ కారు మార్కెట్లోకి వచ్చేస్తోంది. 2016 జనవరి 13న ఈ కారును దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. మారుతీ సుజుకీ అధికారిక వెబ్సైట్లో 'ఇగ్నిస్ కమింగ్ సూన్' అనే విషయాన్ని కంపెనీ పొందుపరిచినట్టు తెలిసింది. రిట్జ్‌కు రీప్లేస్‌గా ఈ మోడల్‌ను మారుతీసుజుకీ ప్రవేశపెడుతోంది. మొదటిసారి 2016 ఆటో ఎక్స్‌లో ఈ కారును ప్రదర్శించారు. నెక్సా డీలర్షిప్ ద్వారా ఈ కారును కంపెనీ విక్రయించనుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది. మహింద్రా కేయూవీ100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు... 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్‌ల్యాంప్స్ నావిగేషన్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే యూఎస్బీ ఏయూఎక్స్ భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర