మారుతీ ‘ఇగ్నిస్‌’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం | Maruti Suzuki opens online bookings for Ignis | Sakshi
Sakshi News home page

మారుతీ ‘ఇగ్నిస్‌’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

Published Thu, Jan 5 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

మారుతీ ‘ఇగ్నిస్‌’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

మారుతీ ‘ఇగ్నిస్‌’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ‘ఇగ్నిస్‌’ ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ కారు వచ్చే వారం (జనవరి 13న) మార్కెట్‌లోకి రానుంది. ఈ కారును నెక్సా వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చని మారుతీ సుజుకీ తెలిపింది. నెక్సా ప్రీమియం ఔట్‌లెట్స్‌ ద్వారానే ఈ కార్ల విక్రయం ఉంటుందని పేర్కొం ది. ఔత్సాహికులు రూ.11,000లతో బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

కాగా ఈ కారు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్, 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని వివరించింది. రెండింటిలోనూ ఆటోమేటిక్‌ గేర్‌షిఫ్ట్‌ ఆప్షన్‌ ఉందని పేర్కొంది. కాగా కంపెనీకి దేశవ్యాప్తంగా 115 పట్టణాల్లో  197 నెక్సా ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. మారుతీ ఈ ఔట్‌లెట్స్‌ ద్వారా ఇప్పటికే బాలెనో, ఎస్‌–క్రాస్‌ మోడళ్లను విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement