online booking
-
పండగ సీజన్లో భారీగా సీట్ల బుకింగ్
పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్ పెరుగనుందని సంస్థ తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పండగకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. దసరా శనివారం వస్తుండడం, తర్వాత ఆదివారం సెలవు ఉండడంతో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెడ్‌బస్ ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్‌లలో 62 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారుఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవారిలో దాదాపు 84 శాతం బుకింగ్‌లు హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-బెంగళూరు, నెల్లూరు-బెంగళూరు రూట్లలో నమోదవతున్నాయని సంస్థ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి బుకింగ్ల్లో 16 శాతం హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ఖమ్మం-హైదరాబాద్, హైదరాబాద్-ఖమ్మం రూట్లు ఉన్నాయని పేర్కొంది. -
25 వేల రూట్లు, 10 లక్షల బస్సులు.. ఈకామర్స్ సంస్థ కొత్త సేవలు
ఆన్లైన్ ఈకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ తన వాటాను పెంచుకున్నప్పటి నుంచి కంపెనీను లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ఈమేరకు రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీలు వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరు, ఛండీగఢ్, దిల్లీ, జైపూర్, ఇందోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు టికెట్ ధరతోపాటు ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన ఫ్లిప్‌కార్ట్ బుకింగ్ పోర్టల్‌లో టికెట్ కొంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పారు. కొత్తసేవలు ప్రారంభించిన సందర్భంగా ఏప్రిల్ 15 వరకు టికెట్ ధరలో 20 శాతం వరకు రాయితీని సైతం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులను అనుసందానిస్తూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. -
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే..
బైక్ట్యాక్సీలపై ఆడా..మగా తేడా లేకుండా అందరికీ అవగాహన పెరుగుతోంది. మహిళలు ఎక్కువగా తమ గమ్యస్థానాలు చేరడానికి ఇటీవల బైక్ట్యాక్సీలను వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళను లైంగికంగా వేధించిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో టిన్ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్‌పై వెళ్తుండగా డ్రైవర్ తనను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని చెప్పి ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్ కావాలని అడిగాడన్నారు. ఆ తర్వాత బైక్‌పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడని, పెట్రోల్ పంపులో అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించారు. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. చాలాకాలంగా ర్యాపిడో యాప్ ఉపయోగిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని మహిళ చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ర్యాపిడో ప్రకటించిందని మహిళ వివరించారు. -
TTD: మే నెల అద్దె గదుల కోటా నేడు ఆన్లైన్లో..
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని శ్రీవారి దర్శనానికి 8 గంటలు, టైంస్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనానికి 3 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 62,971 మంది దర్శించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు లెక్కగా తేలింది. ఇక తిరుమలలో మే నెలకు సంబంధించి వసతి గదుల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ కోటా విడుదలవుతుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ https://online.tirupatibalaji.ap.gov.in/home/dashboard ద్వారా వసతి గదులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు భక్తుల కోసం అందుబాటులో ఉంటోన్నాయి. సుదర్శన్-386, గోవర్థన్-186, కళ్యాణి- 260 గదులు ఉన్నాయి. వీటన్నింటినీ సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారు. మరోవైపు మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంగళవారమే విడుదల చేశారు. -
జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లు ఇక ఆన్లైన్లో.. హాల్ విస్తీర్ణం, అద్దె వివరాలు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఆధ్వర్యంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల బుకింగ్స్‌ను త్వరలో ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల తరహాలో జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారానే ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మా న్యువల్‌గా జరుగుతున్న బుకింగ్‌లతో నెలలో ఎన్ని రోజులు బుక్ అవుతున్నా యో, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియడం లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లకు సైతం ఇతర ఫంక్షన్ హాళ్ల మాదిరిగా భా రీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ద్వా రా అవతవకలకు తావుండదని, పారదర్శకత ఉంటుందని భావించిన అధికారులు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వచ్చేనెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. పోర్టల్‌లో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు, అందుబాటులో ఉన్నదీ, లేనిది తదితర వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.95.70 కోట్లతో 25 ఫంక్షన్ హాళ్లు.. జీహెచ్ఎంసీలో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లకు రూ.95.70 కోట్లు మంజూరై ఏళ్లు గడుస్తుండగా, ఇప్పటి వరకు 9 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో 9 పురోగతిలో ఉన్నాయి. మిగతా ఏడింటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పనులు పురోగతిలో ఉన్నవి.. ► హెచ్‌ఎఫ్‌నగర్, రహ్మత్‌నగర్ ► అయ్యప్ప క్రీడామైదానం దగ్గర, వెంగళ్రావునగర్ ► టీఎస్ఐఐసీ కాలనీ, సూరారం ► వాలీబాల్ కోర్టు దగ్గర, తార్నాక ► పాటిగడ్డ, బేగంపేట ► ఆరంభ టౌన్షిప్, పాపిరెడ్డికాలనీ ► గోపన్‌పల్లి,గచ్చిబౌలి ► జుమ్మేరాత్‌బజార్ అడ్డగుట్ట, సికింద్రాబాద్ అన్ని ఫంక్షన్లకూ.. పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు వివిధ రకాల ఫంక్షన్లకు వీటిని అద్దెకిస్తారు. పెద్ద ఫంక్షన్ హాళ్ల ఖర్చులు భరించలేని వారికి సదుపాయం కలి్పంచాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తెస్తోంది. వీటికి నిషేధం.. రాజకీయ సంబంధమైన, రాజకీయ పార్టీలకు సంబంధించిన, మత సంబంధమైన కార్యక్రమాలను ఈ ఫంక్షన్‌హాళ్లలో అనుమతించరు. హాల్ విస్తీర్ణాన్ని బట్టి.. అద్దె ధరలు రోజుకు ► 2వేల చ.మీ వరకు:రూ.10,000 ► 2001–4000 చదరపు మీటర్ల వరకు: రూ.15,000 ► 4000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ: రూ.20,000 ► ఈ ధరలతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ► పారిశుద్ధ్య చార్జీల కింద 20 శాతం చెల్లించాలి. రోజు మొత్తం కాకుండా షిఫ్టుల వారీగా తీసుకునే సదుపాయం ఉంది. అందుకు సగం ఫీజు చెల్లి స్తే సరిపోతుంది. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రెండో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు. నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లు.. ► బన్సీలాల్‌పేట కమ్యూనిటీ హాల్ ► చైతన్యనగర్, పటాన్చెరు ► భగత్‌సింగ్‌నగర్, చింతల్ ► కేపీహెచ్‌బీ4 ఫేజ్,భగత్‌సింగ్‌నగర్ గాం«దీనగర్, రామంతాపూర్ ► గాంధీ విగ్రహం దగ్గర, చంపాపేట ► నెహ్రూనగర్ పార్క్, మారేడ్‌పల్లి ► వెస్ట్రన్హిల్స్, అడ్డగుట్ట ► సీతాఫల్మండి, సికింద్రాబాద్ -
ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది. బుక్ చేసుకున్నవారు రూ.80 చెల్లించాలి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉంటుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్ చేసుకున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు. -
Tirumala: ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం
-
దేశంలోనే అగ్రగామి.. ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల అనంతరం ప్రారంభమైన ప్రజా రవాణా సదుపాయాలలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా అగ్రగామిగా నిలిచినట్లు ప్రముఖ ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ అగ్రిగేటర్ అభిబస్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్‌లాక్ 0.1 ప్రారంభమైన తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులలో 70 శాతం టికెట్లు బుక్ అయినట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్‌శర్మ వెల్లడించారు. కరోనా మహమ్మారి కంటే ముందు సాధారణ రోజుల్లో ఉన్న టికెట్ బుకింగ్‌ల కంటే ఇది ఎక్కువేనని పేర్కొన్నారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు) వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థలపై జరిపిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైనట్లు చెప్పారు. 6090 బస్సులతో 137 నగరాలకు, పట్టణాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పిస్తోందన్నారు. మరో 1,445 ప్రైవేట్ బస్సులు కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నుంచి 596 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, వైజాగ్ నుంచి 383, నెల్లూరు నుంచి 226 అంతర్రాష్ట్ర రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 1218 బస్సులు 45 నగరాలకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువగా ఢిల్లీ–లక్నోల మధ్య నడుస్తున్నట్లు ఆయన చెప్పారు. -
అక్షయ తృతీయ @ ఆన్లైన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపుల ముందు క్యూ కట్టిన కస్టమర్ల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. హిందువులు పవిత్ర దినంగా భావించే అక్షయ నాడు జువెల్లరీ దుకాణాల్లో హడావుడి అంతా ఇంతా కాదు. సెంటిమెంటుగా భావించి చిన్న మొత్తంలో అయినా సరే బంగారం కొనేందుకు షాపులకు వచ్చే కస్టమర్లుంటారు. అయితే కోవిడ్–19 పుణ్యమాని ఈసారి మాత్రం అక్షయ లాక్డౌన్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటే ఆన్లైన్ మినహా ప్రస్తుతం మరో మార్గం లేదు. పలు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ ద్వారా ఆభరణాలు, ముడి బంగారాన్ని కొనుక్కోవచ్చు. లాక్డౌన్ ముగిశాక ఈ పుత్తడిని కస్టమర్లు అందుకోవచ్చు. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది. సిద్ధమైన కంపెనీలు.. ఆభరణాలను, ముడి బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. వ స్త్రాలతోపాటు బంగారాన్ని అమ్మే సంప్రదాయ రిటైల్ కంపెనీలు ఈసారి పుత్తడి అమ్మకాల నుంచి దూరమైనట్టే. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకే అక్షయ కలిసిరానుంది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు అక్షయకు పోటీపడుతున్నాయి. డిస్కౌంట్లను సైతం ఇవి ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ కంపెనీల వెబ్సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్‌ను ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లాక్డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. కస్టమర్ కోరితే ఇంటికే డెలివరీ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా కూడా బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు. అక్షయ వాటా 30–40 శాతం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో భారత్‌లో 690.4 టన్నుల పుత్తడి అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700–800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ తెలిపారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ వాటా 30–40% ఉంటుందని శారీనికేతన్ జువెల్లరీ విభాగం మేనేజర్ గుల్లపూడి నాగకిరణ్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లలో కోవిడ్–19 తద నంతర పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉంది కాబట్టి కొనుగోళ్లకు మొగ్గు చూపరని అన్నారు. వినియోగదార్లలో 20–30% మంది ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక బంగారం కొనేద్దాం.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం: డబ్ల్యూజీసీ న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ఫిన్‌టెక్ ఊతం, ఆర్థి కాంశాలపై పెరుగుతున్న అవగాహన తదితర అంశాల కారణంగా గతంలో ఎన్నడూ బంగారాన్ని కొనని వారు కూడా ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పుత్తడి పెట్టుబడుల్లో ఆభరణాలు, నాణేలదే అగ్రస్థానంగా ఉంటోంది. దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సుమారు 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు భవిష్యత్‌లో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 52 శాతం ఇన్వెస్టర్ల దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉండగా, 48 శాతం మంది గడిచిన 12 నెలల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టారు. ‘భారత్‌లో రిటైల్ పెట్టుబడుల ధోరణులు మారుతున్నాయి. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ విస్తృతి చెందుతుండటం, ఆర్థిక సాధనాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణం‘ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధోరణులు.. సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంత ఇన్వెస్టర్లలో సుమారు 76 శాతం మంది ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేయగా, 21 శాతం మంది గతంలో ఎన్నడూ కొనుగోలు చేయనప్పటికీ భవిష్యత్‌లో కొనాలని భావిస్తున్నారు. అటు గ్రామీణ ఇన్వెస్టర్లలో కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్య 37 శాతంగా ఉంది. కొనుగోలు చేయడంలో సౌలభ్యం, పెట్టుబడికి భరోసా వంటి అంశాల కారణంగానే పసిడివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. -
ఆన్‌లైన్‌లోనూ.. సైకతం
ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఆన్లైన్లో అనేకం దొరుకుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు తాజాగా ఇసుక వ్యాపారం కూడా సై..అంటూ దూసుకొచ్చింది. మీకూ కావాలా? చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. అందులో ఆర్డరిస్టే.. ఎంచక్కా ట్రాక్టర్ లోడు మీ ఇంటికే వస్తుంది. ఆ తర్వాతే డబ్బులివ్వండి. ఈ వాహనం బయల్దేరినప్పటి నుంచి లోడు దించే వరకు కదలికలను అధికారులు గుర్తిస్తారు. అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తారు. సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ప్రాంతాల్లో మన ఇసుక వాహనంతో ఆన్లైన్లో బుకింగ్ ద్వారా సైకతం (ఇసుక) సరఫరాకు ప్రభుత్వం అనుమతించింది. ప్రసుత్తం 6 ప్రాంతాల నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మన ఇసుక వాహనం పేరిట..జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడంతో..ఈ బండి ఇసుక రీచ్ నుంచి బయల్దేరాక ఎక్కడ ఉంది? ఎటు వెళ్తుంది? అనేది అధికారులకు తెలుస్తుంది. బుక్ చేసుకున్న వినియోగదారుడి ఇంటికి వెళ్లి లోడ్ దించాక..తనకు ఇసుక అందిందని ఆన్లైన్లో సమాచారమిస్తేనే ఆ ట్రాక్టర్‌కు కిరాయి వస్తుంది. ఇసుకను తరలించే ట్రాక్టర్‌కు కిలోమీటరుకు రూ.80 చొప్పున ప్రభుత్వం కిరాయి అందిస్తుంది. స్యాండ్ ర్యాంపు నుంచి 50, 60 కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా చేసుకునే వీలుంది. ప్రతిరోజూ ఒక్కో ట్రాక్టర్‌కు అన్నిఖర్చులు పోనూ రూ.3వేల వరకు ఆదాయం వస్తుంది. ఇసుక రీచ్‌లు ఉన్న గ్రామ పంచాయతీలకు ఒక్కో ట్రిప్పుకు రూ.300 వస్తాయి. మరమ్మతులకు ట్రిప్పుకు రూ.100 కేటాయిస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లలో నింపేందుకు స్థానికంగా ఉన్న కూలీలకు కూడా ఉపాధి లభిస్తోంది. ఆన్లైన్ ప్రక్రియతో అక్రమాలు చోటు చేసుకోకుండా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. 18,091ట్రిప్పులు బుక్ కావడంతో మరికొన్ని పంచాయతీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ‘మన ఇసుక’ వాహనం రావాలంటే హెల్ప్‌డెస్క్ నంబర్లు ఇవే.. -
రైల్వే ఇ-టికెట్లపై ఛార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణీకులకు చేదువార్త. త్వరలోనే ఇ-టికెట్ల చార్జీల మోత మోగనుంది. నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికంటూ రద్దు చేసిన సర్వీసు చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైల్వే శాఖ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తాజా సమాచారం. ముఖ్యంగా ఆన్లైన్ రైల్వే టికెట్లు కొనుగోలుపై సర్వీస్ ఛార్జీలను విధించేందుకు రైల్వే బోర్డు అనుమతినిచ్చింది. ఆగస్టు 3న విడుదల చేసిన భారత రైల్వే బోర్డు లేఖలో దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలనే ఉంచుతుందా లేక పెంచుతుందా అన్న నిర్ణయాన్ని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. ఇటీవలి కాలంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం సేవల ఛార్జీలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 2016లో ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా టికెట్లు కొనుగోలు చేసేవారికి సర్వీస్ ఛార్జీలను నిలిపివేసింది. అప్పటి వరకు ఐఆర్సీటీసీ నాన్ ఏసీ టికెట్‌పై రూ. 20, ఏసీ టికెట్‌పై రూ. 40 సర్వీసు ఛార్జీలను వసూలు చేసేది. సేవా ఛార్జీలు విధించడం, పునరుద్దరించడం వంటి నిర్ణయాలను ఐఆర్సీటీసి తీసుకోవచ్చని పేర్కొంది. కాగా సేవా ఛార్జీలు నిలిపివేసిన అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ టికెటింగ్ ఆదాయంలో 26 శాతం పడిపోయింది. -
స్మార్ట్‌ఫోన్ బుక్ చేస్తే.. దేవతల బొమ్మలు
కరీమాబాద్: ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ బుక్ చేస్తే.. దానికి బదులు సోంపాపిడి ప్యాకెట్, దేవతా మూర్తుల బొమ్మలు పోస్టల్ ద్వారా వచ్చిన సంఘటన నగరంలోని రంగశాయిపేటలో చోటుచేసుకుంది. 5వ డివిజన్ జక్కలోద్ది గ్రామానికి చెందిన మైదం వంశీకి 20 రోజుల క్రితం తన ఫోన్‌కు ‘మీరు స్మార్ట్ ఫోన్ విన్నయ్యారు.. రూ.1800 చెల్లిస్తే మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాం’ అనే మెస్సేజ్ గ్లోబల్ ఇండియా టెలీ మార్కెటింగ్ ఆనందగిరి, బెంగళూర్ నుంచి వచ్చింది. దీంతో ఆయన వెంటనే బుక్ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం పోస్టల్ ప్యాకింగ్ ద్వారా రంగశాయిపేట పోస్టాఫీస్‌కు బాక్స్ వచ్చింది. పోస్టల్ వారు వంశీ ఫోన్‌కు కాల్చేసి బాక్స్ తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి వెళ్లి రూ.1800 చెల్లించి బాక్స్ అక్కడే ఓపెన్ చేయగా అందులో స్మార్ట్ ఫోన్‌కు బదులు సోంపాపిడి ప్యాకెట్, పూజా సామగ్రికి సంబంధించి లక్ష్మి, పాదుకలు, తాబేలు, ఒక లాకెట్ బ్రాస్ ఉన్నాయి. దీంతో అవాక్కయిన వంశీ తాను మోసపోయానని గుర్తించి హెడ్ పోస్టాఫీస్ సూపరింటెండెంట్‌ను కలిశాడు. ఆయన సంబంధిత గ్లోబల్ ఇండియా మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధుల సెల్ నంబర్‌కు(9611693363) ఫోన్ చేశారు. కంపెనీవారు పొరపాటు జరిగినట్లు చెప్పారని సూపరింటెండెంట్ తెలిపారు. అంతే కాకుండా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇండియాపోస్ట్.జీఓవీ.ఇన్‌సీసీసీ కంప్లేంట్స్’లో ఫిర్యాదు చేయాలని బాధిడికి వివరించారు. కాగా పార్శిల్ ద్వారా వచ్చిన వస్తువుల మొత్తం విలువ రూ.100 కూడా ఉండదని తెలిసింది. -
రైల్వే మరో నిర్ణయం : ఆ టిక్కెట్లు రద్దు
చెన్నై : దేశీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐ-టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని దేశీయ రైల్వే నిర్ణయించింది. తన వెబ్సైట్ ఐఆర్సీటీసీ ద్వారా నిర్వహించే ఐ-టిక్కెట్ బుకింగ్‌ను మార్చి 1 నుంచి విత్‌డ్రా చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ) నిర్ణయించిందని రైల్వే వర్గాలు చెప్పాయి. ఈ టిక్కెట్ల విక్రయాన్ని ఐఆర్సీటీసీ 2002లో ప్రారంభించింది. ఐఆర్సీటీసీ వద్ద ఐ-టిక్కెట్ల బుకింగ్, కౌంటర్ల వద్ద పేపర్ టిక్కెట్ల బుకింగ్ ఒకే విధమైనవి. అయితే ఐ-టిక్కెట్ బుకింగ్ సమయంలో ప్యాసెంజర్ తన అడ్రస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్ ఇచ్చిన అడ్రస్‌కు ఈ టిక్కెట్‌ను ఐఆర్సీటీసీ హోమ్ డెలివరీ చేస్తోంది. వీటి బుకింగ్ సమయంలో స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ టిక్కెట్‌కు 80 రూపాయలు, ఏసీ క్లాస్ టిక్కెట్‌కు 120 ఛార్జీ విధిస్తారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, మంగళూరు, మధురై, కోయంబత్తూరు వంటి నగరాలు జర్నీకి రెండు రోజుల ముందు ఈ ఐ-టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర నగరాలు అయితే మూడు రోజులు ముందస్తుగా వీటిని బుక్ చేసుకోవాలి. ఐ-టిక్కెట్ సర్వీసును ముఖ్యంగా ప్రింటవుట్ తీసుకోలేని ప్రయాణికుల ప్రయోజనార్థం ఆఫర్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వీటిని అందించేవారు. అవుట్ స్టేషన్లలో ఉండే ప్రజలు అంగవైకల్యం, వయసు పైబడిని ప్రయాణికుల కోసం టిక్కెట్లను బుక్ చేయడానికి ఈ సర్వీసులనే వినియోగించేవారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ ఎస్ఎంఎస్లను వాలిడ్‌గా పరిగణలోకి తీసుకొంటోంది. అవుట్స్టేషన్లలో ఉన్న వారు, తమ కుటుంబసభ్యుల కోసం టిక్కెట్లను బుక్ చేసి, ఆ టిక్కెట్ వివరాలను మొబైల్ ఫోన్లకు పంపించుకోవచ్చు. ఐఆర్సీటీసీ వర్గాల నుంచే కాకుండా ఇతర మొబైల్ ఫోన్ల నుంచి రిసీవ్ చేసుకున్న ఎస్ఎంఎస్లు కూడా వాలిడ్నని రైల్వే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఛార్ట్‌లో ఐడీ ఫ్రూప్ సరిపోవడంతో పాటు, అదే బెర్త్‌ను ఇతర ప్రయాణికులు తమదే అనకుండా ఉండాల్సి ఉంటుందని సీనియర్ అధికారి చెప్పారు. -
‘పాలమూరు సాండ్’తో రూ.14 కోట్లు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ‘పాలమూరు ఇసుక(పాలమూరు సాండ్)’ పాలసీ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. కలెక్టర్ రెవెన్యూ సమావేశంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలసీ వివరాలను వెల్లడించారు. అవసరాల నిమిత్తం ఎవరికైనా ఇసుక కావాలంటే ఆన్లై లేదా మీసేవా కేంద్రాల్లో బుక్ చేస్తే ద్వారా తక్కువధరకే నాణ్యమైన ఇసుక ఇంటికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు 15న పాలమూర్ స్యాండ్ పాలసీని ప్రారంభించగా.. ఇప్పటివరకు జిల్లాకు రూ.14 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. బుక్ చేసుకున్న 46,846 ట్రిప్పుల్లో 39,590(92 శాతం) ట్రిప్పుల ఇసుక సరఫరా చేశామన్నారు. జిల్లాలో మూడు పట్టా భూముల్లోని రీచ్‌లు, ప్రభుత్వం గుర్తించిన ఆరు ఇసుక రీచ్‌ల నుండి ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావు లేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పాలమూర్ ఇసుక స్యాండ్ పాలసీని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఈ పాలసీ అమలులో అక్రమాలు చోటు చేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రూ.4500 నుండి రూ.6 వేల వరకు ట్రిప్పు ఇసుక ఈ పాలసీ ద్వారా ప్రజలకు దూరాన్ని బట్టి రూ.2,800 నుండి రూ.3,600 వరకు అందుతోందని తెలిపారు. ఈ మేరకు అవసరమున్న వారు ఠీఠీఠీ. p్చl్చఝౌౌటట్చnఛీ.ఛిౌఝ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే ట్రాక్టర్లు, ట్రిప్పర్ల ద్వారా నేరుగా ఇంటికే ఇసుక సరఫరా చేస్తామని వివరించారు. ప్రజల అవసరాల మేరకు అమలు చేస్తున్న స్యాండ్ పాలసీకి ప్రజల నుండి ప్రోత్సాహం అవసరమని.. అక్రమ ఇసుక రవాణా, కృత్రిమ ఇసుకను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలతో పాటు ప్రభుత్వ పనులకు సైతం పాలమూర్ స్యాండ్ పాలసీ ద్వారానే ఇసుక సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. 32 కేసుల నమోదు జిల్లాలో పాలమూర్ స్యాండ్ పాలసీ ప్రారంభించినప్పటి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ మేరకు ఇప్పటివరకు జిల్లాలో 32 కేసులు నమోదు చేసి 52 మందిని అరెస్టు చేశాని, 38 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలో ఇన్చార్జి జేసీ కృష్ణాదిత్య, ఆర్డీఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
కారు స్పీకర్ ఆర్డర్ చేస్తే.. ఇటుక వచ్చింది!
సాక్షి, అన్నానగర్: ఆన్లైన్ ద్వారా కారుస్పీకర్‌ను బుకింగ్ చేయగా కొరియర్ పార్శిల్లో ఇటుక వచ్చింది. ఈ ఘటన తూత్తుక్కుడి సమీపంలోని ముల్‌లైక్కాటులో చోటుచేసుకుంది. న్యాయవాది సెవ్వకుమార్ తన కారు స్పీకర్ కోసం గత 1వ తేదీన(జనవరి01) ఆన్లైన్ బుకింగ్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం సదరు సంస్థ నుంచి వచ్చిన ఆ పార్శిల్ని ప్రైవేట్ కొరియర్ సంస్థ కార్మికుడు సెల్వకుమార్‌కు అందజేశాడు. సెల్వకుమార్ స్పీకర్ ధర రూ. 5వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నాడు. ఆ పార్శిల్ తెరిచి చూడగా అందులో ఇటుక ఉంది. కొరియర్ సంస్థకు ఫోన్ చేయగా వారు సరిగ్గా సమాధానమివ్వలేదు. దీనిపై ఆయన మల్తైయాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొరియర్ సంస్థ యజమానిని విచారణ చేశారు. సదరు కంపెనీ యజామాని సెల్వకుమార్‌కు నగదు తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
29 నుంచి టీటీడీ మొబైల్యాప్
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను భక్తులకు మరింత చేరువ చేసేందుకు మొబైల్యాప్ రూపొందించినట్టు టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావు గురువా రం ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 29న హేమలంబి నామ ఉగాది పర్వదినం సందర్భంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. టీసీఎస్ సహకారంతో టీటీడీ రూపొందించిన ఈ యాప్‌కు సరైన పేరు సూచించాలని భక్తుల ను ఈవో కోరారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు onlineservices @tirumala. org వెబ్‌సైట్‌కు, వాట్సాప్ నంబరు 93993 99399కు తెలియజేయాలని ఈవో కోరారు. ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో ఉగాదిని పురస్క రించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు. -
మారుతీ ‘ఇగ్నిస్’ ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఇగ్నిస్’ ఆన్లైన్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ కారు వచ్చే వారం (జనవరి 13న) మార్కెట్లోకి రానుంది. ఈ కారును నెక్సా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని మారుతీ సుజుకీ తెలిపింది. నెక్సా ప్రీమియం ఔట్లెట్స్ ద్వారానే ఈ కార్ల విక్రయం ఉంటుందని పేర్కొం ది. ఔత్సాహికులు రూ.11,000లతో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని వివరించింది. రెండింటిలోనూ ఆటోమేటిక్ గేర్‌షిఫ్ట్ ఆప్షన్ ఉందని పేర్కొంది. కాగా కంపెనీకి దేశవ్యాప్తంగా 115 పట్టణాల్లో 197 నెక్సా ఔట్లెట్స్ ఉన్నాయి. మారుతీ ఈ ఔట్లెట్స్ ద్వారా ఇప్పటికే బాలెనో, ఎస్–క్రాస్ మోడళ్లను విక్రయిస్తోంది. -
ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే..!
మంగళగిరి: ఆన్లైన్లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే విమ్ సబ్బు వచ్చిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. దీంతో వినియోగదారుడు లబోదిబోమంటూ గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం మేరకు... పట్టణానికి చెందిన జొన్నాదుల హేమ నాగవరప్రసాద్ అనే యువకుడు ఈ నెల ఒకటో తేదీన పానాసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అమేజాన్ కంపెనీకి అన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఫోన్ ఖరీదు రూ. 9800 ఆన్లైన్లోనే కంపెనీకి చెల్లించాడు. బ్లూడాట్ కొరియర్ నుంచి శుక్రవారం డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్‌ను అందజేయగా అందులో విమ్‌బార్ సబ్బు వచ్చింది. ఇది చూసి కంగుతిన్న వినియోగదారుడు కొరియర్ బాయ్‌ని ప్రశ్నించగా తనకెలాంటి సంబంధం లేదని, కంపెనీపై కేసు పెట్టాలని, తాను పార్శిల్లో సబ్బు వచ్చినట్లు సాక్ష్యం చెబుతానని చెప్పడంతో చేసేదేంలేక బాధితుడు ప్రసాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బొప్పన బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించాలని సూచించారు. -
ఆన్లైన్ సెల్ బుకింగ్‌తో మోసం
తొర్రూరు : ఆన్లైన్ సెల్ బుకింగ్‌తో ఓ యువకుడు మోసపోయాడు. తొర్రూరు పట్టణానికి చెందిన ఆబోతు కుమార్ అనే యువకుడు సుమా రు రూ. 18,500 విలువ చేసే సామ్సంగ్ సెల్ కోసం గతవారం రోజుల క్రితం అన్లైన్లో బుకిం గ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సామ్సంగ్ షోరూం హైదరాబాద్ నుంచి శుక్రవారం మ ధ్వాహ్నం తొర్రూరుకు వచ్చిన ఫ్యాకింగ్‌ను తీసుకుని తెరిచి చూడగా, అందులో సామ్సంగ్ సెల్‌కు బదులు ఇనుప ముక్కతోపాటు పాతకాలం నాటి సుమారు రూ.2 వేల విలువ చేసే నోకియా సెల్, బ్యాట్రీ ఉండడంతో యువకుడు కుమార్ ఆందోళనకు గురయ్యాడు. సంబంధిత కంపెనీవారిని సమాచారం అందించినా ఏలాంటి ప్రయోజనం లేకపోవడంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. -
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి శుక్రవారం ఉదయం చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు సమయం పడుతున్నట్లు సమాచారం అందింది. శ్రీవారి ఆలయంలో నేడు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు. -
క్షణాల్లో స్నాక్స్
సరికొత్త అప్లికేషన్ రూపొందించిన జిల్లా విద్యార్థులు ఫోన్ ద్వారానే స్నాక్స్ బుక్ చేసుకునే అవకాశం ఏషియన్, గ్లోబల్ కంపెనీలతో ఒప్పందం హన్మకొండ: కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సినిమా టిక్కెట్టు సాధించడం కష్టం కావడంతో ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వరంగల్ విద్యార్థులు కొత్త ఆప్లికేషన్ (యూప్)ను రూపొందించారు. ఆండ్రాయిడ్, విండోస్ ఫ్లాట్ఫారమ్ల పని చేసే స్మార్ట్ఫోన్ల కోసం డైన్స్నాక్ పేరుతో సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చారు. శ్రమలేకుండా ఆండ్రాయిడ్, విండోస్ స్మార్ట్ఫోన్ల ద్వారా డైన్‌స్మార్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌ను వినియోగించే ముందు జీపీఎస్‌ను అనేబుల్ చేయాలి. ఆ వెంటనే మన నగరంలో డైన్‌స్మార్ట్ సేవలు ఏ సినిమా థియేటర్లలో అందుబాటులో ఉందనేది మొబైల్ ఫోన్‌పై ప్రత్యక్షం అవుతుంది. ఎంపిక చేసిన సినిమా థియేటర్లకు వెళ్లినప్పుడు డైన్‌స్మార్ట్ అప్లికేషన్లో ఉన్న సూచనలకు అనుగుణంగా వినియోగదారుడు తన సీటు నంబరును పేర్కొంటూ కావాల్సిన స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ను ఆర్డర్ చేయాలి. మీరు చేసిన ఆర్డర్ నిర్ధారించుకునేందుకు మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్ జనరేడ్ కోడ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అంతే పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే స్నాక్స్ మీ సీటు దగ్గరికే సర్వ్ చేస్తారు. మీ ఆర్డర్‌కు సంబంధించిన డబ్బులను ఆర్డర్‌ను స్వీకరించిన వెంటనే చెల్లించవచ్చు. మేడ్ బై వరంగల్ యూత్ వరంగల్‌కు చెందిన ఎల్లబోయిన తరుణ్, కొండపల్లి రిషిత, దీప్తిరేఖ, అరవింద్, తరుణ్‌రెడ్డి, వినయ్ కొల్లూరిలు హైదరాబాద్‌కు చెందిన మరికొంత మంది స్నేహితులతో కలిసి ఈ అప్లికేషన్‌ను రూపొందిం చారు. స్మార్ట్ఫోన్ల ద్వారా దినాదినాభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్‌లో తమ వంతు ప్రయత్నం చేయాలనే లక్ష్యంతో లియోజ్యూస్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలిప్రయత్నంలో భాగంగా స్మార్ట్డైన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంతటితో సరిపెట్టకుండా మార్కెటింగ్‌లోనూ తమ ప్రతిభను చూపిస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఏషియన్, గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న సినిమా థియేటర్లలో తమ స్మార్ట్డైన్ ద్వారా సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆగష్టు 10వ తేది నుంచి వరంగల్ నగరంలో ఏషియన్ శ్రీదేవిమాల్‌లో ఉన్న మూడు స్క్రీన్లలో డైన్‌స్మార్ట్ సేవలు లభిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఫస్ట్ సినిమా థియేటర్లో ఉన్న ప్రేక్షకుడికి స్నాక్స్, కూల్‌డ్రింకులను సర్వ్ చేసే అప్లికేషన్‌ను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము అందుబాటులోకి తెచ్చాం. తొలి ప్రయత్నానికే మంచి స్పందన వచ్చింది. ప్రముఖ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో సేవలు మొదలయ్యాయి. త్వరలోనే నిజామాబాద్, ఖమ్మంలో సేవలు ప్రారంభిస్తాం. పీవీఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. - ఎల్లబోయిన తరుణ్ -
ఇసుక రాబడి...అదుర్స్
♦ రొయ్యూరు రీచ్ ద్వారా రూ. 5.50 కోట్ల ఆదాయం ♦ ముగిసిన ఆన్లైన్ బుకింగ్ ♦ రీచ్ రెన్యువల్‌కు అధికారుల పరిశీలన తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు ఇసుక రీచ్ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. కేవలం 53 రోజుల వ్యవధిలో ఇసుక విక్రయాల ద్వారా రూ.5.50 కోట్ల ఆదాయం అందించింది. మహిళా మ్యాక్స్ కమిటీల ద్వారా నడిచిన ఈ రీచ్‌లో ఇసుక విక్రయాలు తొలి నెల మందకొడిగా నడిచినా పెదపులిపాక, శ్రీకాకుళం క్వారీలు మూతపడిన అనంతరం ఊపందుకున్నాయి. తోట్లవల్లూరు : రొయ్యూరు ఇసుక రీచ్ ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. 53 రోజుల్లో ఇసుక విక్రయాల ద్వారా రూ.5.50 కోట్ల ఆదాయం లభించింది. ఇసుక పాలసీలో మార్పులు చేసి వేలం విధానానికి స్వస్తిచెప్పి, మహిళామ్యాక్స్ కమిటీల ద్వారా ప్రభుత్వం క్వారీల నిర్వహణ చేపట్టిన విషయం విదితమే. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కలెక్టర్ బాబు.ఎ ఈ క్వారీని ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 80,947 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వి విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదటి నెల రోజులు మందకొడిగా సాగిన ఇసుక ఎగుమతులు, పెదపులిపాక, శ్రీకాకుళం క్వారీలు మూతపడిన అనంతరం బాగా ఊపందుకున్నాయి. కేవలం 53 రోజుల వ్యవధిలో రూ.5.50 కోట్ల ఆదాయం సమకూరింది. మరో వారంపాటు క్వారీయింగ్ ఇసుక విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం పూర్తి కావడంతో ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోయింది. 80 వేల క్యూబిక్ మీటర్లపైగా ప్రభుత్వం నుంచి అనుమతులురాగా, ఇప్పటికే 70 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఎగుమతులు పూర్తయ్యాయి. మరో పదివేల క్యూబిక్ మీటర్లకు సంబంధించి బుకింగ్ పూర్తవడంతో, ఆన్లైన్ బుకింగ్ శుక్రవారం రాత్రి 11 గంటలతో నిలిచిపోయింది. బుకింగ్ పూర్తయిన పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎగుమతులు జరిగేందుకు మరో వారం రోజులపాటు క్వారీ నడిచే అవకాశం ఉంది. మరో 20 ఎకరాలకు అవకాశం...? ఈ క్వారీలో మరో ఇరవై ఎకరాల్లో ఇసుక తవ్వకాలు జరిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం క్వారీని సందర్శిం చిన జిల్లా శాండ్ కమిటీ మరో 20 ఎకరాల్లో ఇసుక తీసేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తిం చింది. సంబంధిత విస్తీర్ణానికి సర్వే జరిపి, పూర్తి వివరాలతో నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను కోరింది. దీంతో తహశీల్దార్ జి.భద్రు నేతృత్వంలో సర్వే అధికారులు శనివారం ఈ క్వారీకి హద్దులు గుర్తించి, సర్వే పనులను చేపట్టారు. మరో ఇరవై ఎకరాలకు అనుమతులు వస్తే ఇసుక ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు అంటున్నారు. -
శబరిలో స్వామివారి సేవలను బుక్ చేసుకోండిలా..
అయ్యప్ప స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివెళ్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, కొన్ని కిలోమీటర్లు కాలి నడకన సన్నిధానానికి చేరుకుంటారు. విపరీతమైన రద్దీ కారణంగా స్వామి వారిని తనివి తీరా చూడలేక.. తృప్తిగా సేవలు చేసుకోలేని పరిస్థితి. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘ట్రావెన్కోర్ దేవసోమ్ బోర్డు’ వారు వివిధ రకాల సేవలను ముందుగానే ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. తమకు ఇష్టమైన రోజున వివిధ రకాల పూజలను జరిపించవచ్చు. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి.. ఏ తరహా సేవలను ఎలా బుక్ చేసుకోవచ్చు అనే వివరాలు మీ కోసం.. ఆన్లైన్ సేవలను బుక్ చేసుకునే విధానం.. ముందుగా https://www.sabarimalaaccomodation.com/ver1/Poojahome.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. ⇒ఇక్కడ అందుబాటులో ఉన్న పది రకాల సేవలు మీకు కన్పిస్తాయి. ⇒సేవలతోపాటుగా వాటికి చెల్లించాల్సిన మొత్తం అక్కడ కన్పిస్తుంది. ⇒మీకు కావాల్సిన పూజ పక్కనే కనిపిస్తున్న ‘బుక్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ⇒ఇక్కడ మీకు సెలక్ట్ డేట్ కనిపిస్తుంది. ⇒మీకు నచ్చిన తేదీని ఎంచుకోవాలి. ఆ రోజు ఖాళీగా ఉంటేనే పూజ బుకింగ్ ఆప్షన్ వస్తుంది. ⇒ఇక్కడ మీ పేరు, మీ జన్మ నక్షత్రం నమోదు చేయాలి. ⇒యాడ్ టూ కార్ట్ క్లిక్ చేస్తే కార్ట్ వివరాలు కనిపిస్తాయి. ⇒ఇక్కడ కనిపిస్తున్న ప్రొసీడ్‌ను క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాల నమోదు విండో కనిపిస్తుంది. ⇒మీ పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి గో పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ⇒ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. రుసుమును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేయవచ్చు. ⇒కనిపించే ఆప్షన్లలో మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవాలి. ⇒రుసుము చెల్లించిన తరువాత సంబంధిత పూర్తి వివరాలతో మీకు రశీదు వస్తుంది. ⇒దీన్ని ప్రింట్ తీసుకుని శబరిమల వెళ్లినప్పుడు సంబంధిత అధికారికి అందజేసి మీ పూజలు, సేవలు చేసుకోవచ్చు. గమనిక: మరిన్ని వివరాలకు, శబరిమల అప్డేట్స్ కోసం ఫేస్బుక్లో ‘ట్రావెన్కోర్ దేవసోమ్ బోర్డు’, ‘శబరిమల దేవోసమ్’ పేజీలను చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే పూజలు, సేవలు అష్టోత్తరార్చన: రూ.20 భగవతి సేవ: రూ.1,000 గణపతి హోమం: రూ.200 స్వయం వరార్చన: రూ.25 నాగరాజ పూజ: రూ.25 నవగ్రహ పూజ: రూ.100 నీరాజనం: రూ.75 ఉట్టగ్రహ పూజ: రూ.20 పుష్పాభిషేకం: రూ.8,500 సహస్రనామార్చన: రూ.20 -
ఆన్లైన్లోనే ఆర్జిత సేవల బుకింగ్
* డిసెంబరు 1 నుంచి ఇంటెర్నెట్ ద్వారా కేటాయింపు * డీడీల ద్వారా శ్రీవారి సేవల అడ్వాన్స్ బుకింగ్ రద్దు * జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడి సాక్షి, తిరుమల: శ్రీవారి సుప్రభాతం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ వంటి సేవలకు ఇకపై అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసి, డిసెంబరు ఒకటి నుంచి ఇంటెర్నెట్ ద్వారా కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు గురువారం వెల్లడించారు. డిమాండ్ డ్రాఫ్ట్‌లతో లేఖల ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్న విధానంపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల ఇంటర్నెట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలతో పాటు గదులు కూడా కేటాయించాలని నిర్ణయించినట్టు గురువారం విలేకరులకు చెప్పారు. శ్రీవారి దర్శనానికి రూ. 300 టికెట్లను ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని 91 పోస్టాఫీసుల్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. తొలుత తిరుపతి, చిత్తూరు, ఏలూరు, విజయనగరం, వరంగల్ నగరాల్లోని పోస్టాఫీసుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం ఒక్కో టికెట్టుపై పోస్టాఫీసుకు మూడు రూపాయల పదహారు పైసలు టీటీడీ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరిందన్నారు. జనవరి ఒకటో తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 5 వేలు, ద్వాదశికి 15 వేల వరకు రూ. 300 టికెట్లు ఇంటెర్నెట్ ద్వారా కేటాయించేందుకు యోచన చేస్తున్నామన్నారు. అలాగే నెలలోని మొదటి మంగళవారం ఆధార్ కార్డుతో వచ్చే స్థానికుల ఉచిత దర్శనం రద్దు చేసి, అదే కోటా కింద ఒకటో తేదీ వైకుంఠ ఏకాదశిలో నగదుపై రూ. 300 టికెట్ల దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి, ద్వాదశినాడు నిబంధలనమేరకు వీఐపీలకు పరిమిత సంఖ్యలో పాసులు ఇస్తామని, వారి సిఫారసులను అంగీకరించే ప్రసక్తేలేదన్నారు.