తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి శుక్రవారం ఉదయం చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు సమయం పడుతున్నట్లు సమాచారం అందింది. శ్రీవారి ఆలయంలో నేడు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు.
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
Published Fri, Apr 1 2016 7:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement
Advertisement