'ఇకపై ఆన్‌లైన్లో మాత్రమే విక్రయం' | Online tickets to curtail wait for Tirumala Tirupati Devasthanams darshan | Sakshi
Sakshi News home page

'ఇకపై ఆన్‌లైన్లో మాత్రమే విక్రయం'

Published Tue, Jul 29 2014 10:57 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM

'ఇకపై ఆన్‌లైన్లో మాత్రమే విక్రయం' - Sakshi

'ఇకపై ఆన్‌లైన్లో మాత్రమే విక్రయం'

తిరుపతి  : వెంకన్నసామాన్య భక్తులకు కష్టాలు తీరనున్నాయి. తిరుపతి దర్శనం టిక్కట్ల కోసం ఇక రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు.  తిరుమలకు చేరుకున్న భక్తులకు శీఘ్ర దర్శనం టికెట్ల కోసం టీటీడీ  ప్రత్యేక ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. శీఘ్రదర్శనం టికెట్లు కూడా ఇకపై ఆన్‌లైన్లో మాత్రమే విక్రయించనున్నారు.

ఆన్లైన్లో ప్రత్యేక దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పిస్తామని తిరుమల జేఈవో శ్రీనివాస రాజు మంగళవారం  తెలిపారు. అలాగే తిరుమలలో వీఐపీ దర్శనాలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా వీఐపీ సిఫార్సు లేఖలను తగ్గిస్తూ చివరకు పూర్తిగా రద్దు చేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు కూడా వెల్లడించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement