సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ, 30వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జనవరి 1వ తేదీ నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 30, 31 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తిరుమల జేఈవో కె.ఎస్. శ్రీనివాసరాజు చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రద్దీ కారణంగా ఆది, సోమవారాల్లో కూడా ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు.
ఏకాదశి దర్శనంకోసం ప్రముఖుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ నుంచి పద్మావతి అతిథిగృహాల్లోని గదుల కేటాయింపులు నిలిపేస్తామన్నారు. దాతలు, వీఐపీ సిఫారసులకు గదుల జారీ నిలిపివేసి సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామన్నారు. ఏకాదశి, ద్వాదశిల్లో రూ.25 చొప్పున ఆలయం వెలుపల కౌంటర్లలో రోజుకు రెండు లక్షల లడ్డూలు విక్రయిస్తామని, అవసరమైతే మరో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో భక్తుడికి రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పారు.
‘30,31ల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు’
Published Sun, Dec 28 2014 12:53 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM
Advertisement
Advertisement