KS srinivas raju
-
విశేష సేవలకూ ఇక అడ్వాన్స్ బుకింగ్
లక్కీడిప్ ద్వారా కేటాయింపు జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఎల్లుండి సేవా టికెట్ల కోసం రేపటి నుంచి బుకింగ్ సాక్షి, తిరుమల: అరుదైన ఆర్జిత సేవల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకూ కల్పించనున్నట్టు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇందులో భాగంగా లక్కీడిప్ (లాటరీ) పద్ధతి అమలు చేస్తామని ఆయన గురువారం విలేకరులకు వివరించారు. ఈనెల 17వ తేదీన జరిగే సేవలకోసం 16వ తేదీ నుంచి బుకింగ్ ప్రారంభిస్తామన్నారు. గతంలో టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొందరు బల్క్ బుకింగ్ (అధికమొత్తం)లో పొందిన తోమాల, అర్చన, అభిషేకం, మేల్ఛాట్ వస్త్రం వంటి అరుదైన సేవా టికెట్లలో కొన్నింటిని రద్దు చేశామని, ఆ టికెట్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతి ద్వారా సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామని తెలిపారు. -
‘30,31ల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు’
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ, 30వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జనవరి 1వ తేదీ నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 30, 31 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తిరుమల జేఈవో కె.ఎస్. శ్రీనివాసరాజు చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రద్దీ కారణంగా ఆది, సోమవారాల్లో కూడా ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏకాదశి దర్శనంకోసం ప్రముఖుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ నుంచి పద్మావతి అతిథిగృహాల్లోని గదుల కేటాయింపులు నిలిపేస్తామన్నారు. దాతలు, వీఐపీ సిఫారసులకు గదుల జారీ నిలిపివేసి సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామన్నారు. ఏకాదశి, ద్వాదశిల్లో రూ.25 చొప్పున ఆలయం వెలుపల కౌంటర్లలో రోజుకు రెండు లక్షల లడ్డూలు విక్రయిస్తామని, అవసరమైతే మరో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో భక్తుడికి రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పారు.