సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని శ్రీవారి దర్శనానికి 8 గంటలు, టైంస్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనానికి 3 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 62,971 మంది దర్శించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు లెక్కగా తేలింది.
ఇక తిరుమలలో మే నెలకు సంబంధించి వసతి గదుల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ కోటా విడుదలవుతుంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://online.tirupatibalaji.ap.gov.in/home/dashboard ద్వారా వసతి గదులను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు భక్తుల కోసం అందుబాటులో ఉంటోన్నాయి. సుదర్శన్-386, గోవర్థన్-186, కళ్యాణి- 260 గదులు ఉన్నాయి. వీటన్నింటినీ సామాన్య భక్తులకే కేటాయిస్తున్నారు.
మరోవైపు మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంగళవారమే విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment