ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ మరోసారి డౌన్ అయింది. దీంతో మంగళవారం తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో అంతరాయం ఏర్పడింది. న్యూ ఇయర్ సందర్భంగా ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి చూస్తున్నవారిలో చాలామందికి నిరాశే మిగిలింది.
కొత్త ఏడాదిలో రైల్వే శాఖ కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం ఈ కారణంగానే వెబ్‌సైట్ డౌన్ అయినట్లు సమాచారం. అయితే ఈ నెలలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 9న రెండు గంటలు వెబ్‌సైట్ మొరాయించింది. డిసెంబర్ 26న కూడా ఓ గంట పాటు వెబ్‌సైట్ పనిచేయలేదు. కాగా ఇప్పుడు ఈ సమస్య తలెత్తడం ఈనెలలో ముచ్చటగా మూడోసారి కావడం గమనార్హం.
డౌన్‌ట్రాకర్ ప్రకారం.. 47 శాతం మంది వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. 42 శాతం మందికి యాప్ ఓపెన్ కాలేదు. 10 శాతం మంది టికెట్ బుక్ చేసుకోలేకపోయారని తెలుస్తోంది. ఈ రోజు (డిసెంబర్ 31) ఉదయం 10 గంటల నుంచి యూజర్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పలు సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం.
ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ యాప్స్
ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect): ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్.. అనేది ఇండియన్ రైల్వే అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ వంటివి చేసుకోవచ్చు, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నెంబర్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ యూటీఎస్ (IRCTC UTS): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్ తీసుకువచ్చింది. దీని ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. జనరల్ టికెట్స్, మంత్లీ సీజనల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రైన్‌లలో ప్రయాణించేవారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మేక్‌మైట్రిప్ (Makemytrip): ప్రస్తుతం మేక్‌మైట్రిప్ అనేది చాలా పాపులర్ యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉండటం వల్ల.. కన్ఫర్మ్‌గా టికెట్ బుక్ అవుతుంది. టికెట్ క్యాన్సిల్ అయితే మీ డబ్బుతో పాటు.. ఇతర ఉపయోగకరం కూపన్లు వంటివి కూడా లభిస్తాయి. ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గ యాప్ అనే చెప్పాలి.
ఇక్సిగో (Ixigo): ఈ యాప్ ద్వారా ట్రైన్ టికెట్స్ మాత్రమే కాకుండా.. విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ట్రైన్ ట్రాకింగ్, లైవ్ అప్డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ట్రైన్ రియల్ స్టేటస్ తీసుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.
కన్ఫర్మ్ టికెట్ (Confirmtkt): ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ 'కన్ఫర్మ్ టికెట్' యాప్ ఓ మంచి ఎంపిక. ఈ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రమే కాదు, చెల్లింపులు కూడా చాలా సులభంగా ఉంటాయి. ఇందులో తత్కాల్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment