భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో వినాయక చవితి. దీన్నె గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) అని కూడా అంటారు. దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకొంటారు.
పండుగలో భాగంగా వినాయకుడి ప్రతిమను కొలువుదీర్చి ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన పిండి వంటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. మహారాష్ట్రలో అయితే ప్రధానంగా లడ్డూ, మోదక్, చక్లిలు, పురాన్ పోలీ వంటి వాటితో సహా ఇంకా మరెన్నో సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలు విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
చాలా మంది ఇంటిపట్టున ఉండి పండుగ జరుపుకొని సంప్రదాయక పిండి వంటకాలను ఇంట్లోనే ఆస్వాదిస్తారు. కానీ కొంతమంది వివిధ కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పండుగ సమయంలో ఈ ప్రత్యేక వంటకాలను వారు ఆస్వాదించలేరు. అటువంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆమోదిత ఫుడ్ అగ్రిగేటర్ ‘జూప్’ (Zoop) వినాయక చవితి ప్రత్యేక సంప్రదాయ వంటకాలను అందిస్తుంది.
160కి పైగా రైల్వే స్టేషన్‌లలో..
దీంతో పండుగ వేళ రైల్లో ప్రయాణిస్తున్నప్పటికీ నోరూరించే పండుగ పిండి వంటలను ఆస్వాదించవచ్చు. ఈ వంటకాలు కావాల్సిన ప్రయాణికులు జూప్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లేదా గూగుల్ చాట్‌బాట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. మహారాష్ట్రలోని 160కి పైగా రైల్వే స్టేషన్‌లలో వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment