IRCTC Update : రైళ్లలో ఫుడ్ సప్లయికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ప్రసిద్ధ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ఫుడ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది.
వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్ నివేదిక ప్రకారం.. ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా డెలివరీ చేస్తారు. తొలిదశలో భాగంగా బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
“సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 రెగ్యులేషన్ 30 ప్రకారం.. ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసిన భోజనం సరఫరా & డెలివరీ కోసం PoC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్‌సీటీసీ టైఅప్ అయిందని తెలియజేస్తున్నాం. మొదటి దశలో నాలుగు రైల్వే స్టేషన్‌లలో అంటే బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంలో బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ- క్యాటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు” అని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ఐఆర్‌టీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment