రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. మొబైల్ యాప్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఐఆర్‌సీటీసీ పేరుతో ఫేక్ యాప్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిల్లో ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ అనే యాప్ ఉంది. ఆ యాప్‌ను వినియోగించవద్దని కోరింది. సైబర్ కేటుగాళ్లు ఫిషింగ్స్ లింక్స్ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది.
ఆన్‌లైన్ టికెటింగ్, ఇతర రైల్వే సంబంధిత సేవల్ని అందించే ఐఆర్‌సీటీసీ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లో, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సలహా ఇచ్చింది.
Alert: It has been reported that a malicious and fake mobile app campaign is in circulation where some fraudsters are sending phishing links at a mass level and insisting users download fake ‘IRCTC Rail Connect’ mobile app to trick common citizens into fraudulent activities.…
— IRCTC (@IRCTCofficial) August 4, 2023
అంతేకాకుండా, ఒరిజినల్ ఐఆర్‌సీటీసీ, ఫేక్ ఐఆర్‌సీటీసీ యాప్స్‌లను గుర్తించాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్‌ఫేస్, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలను దొంగిలించే అవకాశం ఉందని సూచించింది.
ఈ సందర్భంగా ఐఆర్‌సీటీసీ.. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నట్లు తేలింది. యూజర్లను మోసం చేసేలా నకిలీ 'ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారంలో ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment