రైల్వే ప్రయాణికుల శుభవార్త. ట్రైన్ టికెట్ బుకింగ్‌లో ఈ ఫీచర్ గురించి మీకు తెలుసా? తెలిస్తే ఇకపై మీరు బుకింగ్ చేసుకునే టికెట్ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది. అంతేకాదు..సాధారణంగా మీరు మీ సొంత ఊరు వెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. వెంటనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు బుక్ చేసుకున్న టికెట్ కన్ఫామా, వెయింటింగ్ లిస్ట్ అనే అంశాలతో సంబంధం ఉండదు.
కానీ ఐఆర్‌సీటీసీలో ఇప్పటికే ఉన్న సరికొత్త ఫీచర్‌ను ఉపయోగిస్తే.. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత మాత్రమే డబ్బుల్ని డిడక్ట్ అవుతాయి. ఇందుకోసం మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (irctc) నిర్వహించే చెల్లింపుల గేట్‌వే ‘ఐ-పే’ ని వినియోగించాల్సి ఉంటుంది. దీన్ని 'ఆటోపే' అంటారు. ఈ సదుపాయాన్ని ఐఆర్‌సీటీసీ ఐపే, యూపీఐ, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల ద్వారా ఉపయోగించుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రకారం రైల్వే టిక్కెట్ కోసం సిస్టమ్ పీఎన్‌ఆర్ నెంబర్‌ని రూపొందించిన తర్వాత మాత్రమే వినియోగదారు బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఈ మెకానిజం యూపీఐ ఉపయోగించి ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఐఆర్‌సీటీసీ ఐపే ఆటోపే వల్ల ఎవరికి ప్రయోజనం?
ఐఆర్‌సీటీసీ ఐపే ఆటోపే సదుపాయం పెద్దమొత్తంలో ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో పాటు వెయిటింగ్ లిస్ట్, జనరల్ లేదా తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయాణికులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు.
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. కింద పేర్కొన్న సందర్భాలలో ఐపే ఆటోపే ఉపయోగకరకంగా ఉంటుందని తెలిపింది.
వెయిట్ లిస్ట్: మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ కన్ఫామ్ కాకపోయినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికులు డబ్బులు చెల్లించినా 'బెర్త్ ఛాయిస్ నాట్ మెట్' లేదా 'నో రూమ్' వంటి సందర్భాలలో ఆటోపే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
వెయిట్‌లిస్ట్ తత్కాల్: చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా తత్కాల్ వెయిట్‌లిస్ట్ చేయబడిన ఇ-టిక్కెట్ వెయిట్‌లిస్ట్‌లో ఉంటే, అటువంటి సందర్భాలలో వర్తించే ఛార్జీలు (రద్దు ఛార్జీలు, ఐటీఆర్‌సీటీసీ కన్వీనియన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు) చెల్లించినా ఆటోపే ఫీచర్ సాయంతో తిరిగి వెనక్కి పొందవచ్చు.
ఇన్ స్టంట్ రీఫండ్: ఒక వ్యక్తి వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌ను బుక్ చేస్తుంటే, కన్ఫర్మ్ చేసిన టిక్కెట్ పొందలేకపోతే డిడక్ట్ అయిన మొత్తం మూడు లేదా నాలుగు వర్కింగ్ డేస్‌లో తిరిగి వాపస్ పొందవచ్చు. బుకింగ్ మొత్తం ఎక్కువగా ఉంటే, దాని కోసం తక్షణ రీఫండ్ పొందడం వలన అదనపు ఛార్జీలు లేకుండా వ్యక్తిగత బుక్ ప్రత్యామ్నాయ రవాణా ఎంపికలకు సహాయం చేస్తుంది. అయితే, ఒక వ్యక్తి వెయిట్‌లిస్ట్ టిక్కెట్‌లను బుక్ చేయడానికి ఐఆర్‌సీటీసీ ఆటోపే ఫీచర్‌ని ఉపయోగించినప్పుడు టిక్కెట్ కన్ఫామ్ కాకపోతే వెంటనే ఆ డబ్బులు మీ అకౌంట్‌కు రిటర్న్ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment