దేశవ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రజా అవసరాలు, సరుకుల రవాణా కోసం ఇండియన్ రైల్వేస్ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎక్కువగా ఉండటం వల్లనో లేదా టికెట్ కొనే సమయం లేకపోవడం వల్లనో కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు.
ఏది ఏమైనా టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రైళ్లలో ప్రయాణికులు అందరూ టికెట్ తీసుకున్నారా.. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా అన్నది పరీశీలించడానికి టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఉంటారు. వీరిలో కొంతమంది టికెట్ లేని ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వేలాది రూపాయలు వసూలు చేస్తుంటారు.
టికెట్ లేకపోతే ఏం చేయాలి..
రైళ్లలో రోజూ కొన్ని లక్షల మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారు. వీరిలో కొందరు టికెట్ లేకుండా ప్రయాణించే సందర్భం వస్తుంది. ఈ క్రమంలో కొందరు టీటీఈలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఓ రైల్వే అధికారి ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. ఇలా అధికారులు ప్రవర్తించవచ్చా.. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు ఏం చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం...
ఇదీ చదవండి: IRCTC: రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు మొదటగా టీటీఈని సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్య స్థానానికి అయ్యే టికెట్ ధరతో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. అంటే మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి అయ్యే చార్జీతో పాటు అదనంగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒకవేళ ట్రైన్‌లో సీట్లు కాళీ ఉంటే సీటును కూడా కేటాయిస్తారు.
ఇదీ చదవండి: ఓటీపీలకు స్వస్తి.. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన!
Comments
Please login to add a commentAdd a comment