fishing
-
గంగపుత్రులకు తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది. పథకం అమలు కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ మేరకు స్పష్టం చేయడంతో ఇదెక్కడి న్యాయమంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి తమ హక్కు అని, దీన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలకు కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లూ.. ఆంక్షలు లేకుండా అమలు మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తోంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం పరిహారం ఇవ్వడం పరిపాటి. గతంలో రూ.4 వేలు ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐదేళ్ల పాటు 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల లబ్ధి చేకూర్చింది. వేట నిషేధ భృతి పొందిన వారికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేశారు. భృతి పొందితే సంక్షేమ పథకాలకు అనర్హులే తాము అధికారంలోకి వస్తే ఈ భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం తొలి ఏడాది అటకెక్కించేసింది. ఇటీవలే వేట నిషేధం అమలులోకి రాగా.. ఈ ఏడాదైనా ఇస్తారో లేదో అనే సందేహం మత్స్యకారుల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నెల 26న వేట నిషేధ భృతి జమ చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రెండ్రోజులు తిరక్కుండానే దాన్ని వాయిదా వేసి మే నెలలోనే అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ పథకం అమలు కోసం విధించిన నిబంధనలు మత్స్యకార కుటుంబాల పాలిట ఆశనిపాతంగా మారాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని, అంతేకాకుండా వేట నిషేధ భృతి పొందేవారు ఇతర డీబీటీ స్కీమ్స్ పొందేందుకు అనర్హులని మెమోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన డీబీటీ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ భృతి పొందే వారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్విద్యోన్నతితో పాటు ఎన్టీఆర్భరోసా పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులుగా తేల్చింది. 300 యూనిట్ల విద్యుత్ వాడినా అనర్హులే మరోవైపు వేట నిషేధ భృతి పొందేందుకు 60 ఏళ్ల పైబడిన వారు అనర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు. 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. వేట నిషేధ భృతి పొందే మత్స్యకార కుటుంబంలో ఏ ఒక్కరూ ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో వంటివి కూడా కలిగి ఉండకూడదు. ఏడాదిలో సగటున నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల్లో సొంత ఇంటిని కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగి అయి ఉండకూడదు. పూర్తిస్థాయి వేతనంతో సొసైటీలు, ఫెడరేషన్స్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయి ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ పెన్షన్‌దారుడు కుటుంబంలో ఉండకూడదు. ఇన్‌కం టాక్స్ పన్ను చెల్లింపుదారులు కూడా ఉండకూడదు.సంక్షేమ పథకాలకు అనర్హులనడం దారుణం వేట నిషేధ భృతిని తొలి ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందనుకుంటే మత్స్యకారుల నోట్లో మట్టికొట్టేలా నిబంధనలు విధించింది. గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతికి కోత పెట్టేలా ఆంక్షలు విధించింది. ఈ భృతి పొందేవారు ఇంకా అమలుకు నోచుకోని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చడం విడ్డూరంగా ఉంది. ఆంక్షలు సడలించకపోతే ఉద్యమం చేస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకారుల సంఘాల సమాఖ్య -
వేటకు విరామం
సాక్షి, అమరావతి: సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. రెండు నెలలపాటు ఒడ్డునే ఉండనున్నాయి. సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, తల్లి రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం, సముద్ర జలచరాలు, మత్స్య సంపద సుస్థిరతను సాధించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు 61రోజులపాటు వేట నిషేధం అమలు చేస్తున్నారు.ఈ సమయంలో మత్స్యకార కుటుంబాల జీవనానికి ప్రభుత్వాలు వేట నిషేధిత భృతిని అందిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లు సమయానికి భృతిని అందించడంతోపాటు పలు విధాలుగా ఆదుకుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గతేడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్లలో రూ.538 కోట్ల లబ్ధి రాష్ట్రంలో తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 1,027.58 కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 65 మండలాల పరిధిలోని 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో సముద్ర వేటపై ఆధారపడి 1.63 లక్షల మంది జీవిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీజిల్æ సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.రాష్ట్రవ్యాప్తంగా 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 29,156కు చేరింది. వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు విరామ సమయంలో రూ.4వేలు చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఐదేళ్లలో 5.38 లక్షల మందికి రూ.538.01కోట్ల భృతిని అందించింది. గత ఏడాది బకాయి కలిపి రూ.40వేలు ఇవ్వాలి తాము అధికారంలోకి రాగానే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు చొప్పున వేట నిషేధ భృతిని ఇస్తామంటూ ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఆ హామీని అటకెక్కించారు. 2024–25 సీజన్‌కు సంబంధించి గతేడాది మే నెలలోనే ఆర్బీకేల ద్వారా సర్వే నిర్వహించి వేటకు వెళ్లే 1.30 లక్షల మందిని అర్హులను గుర్తించారు. అయినా కూటమి ప్రభుత్వం భృతి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వేట నిషేధ భృతిని అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఎప్పుడిస్తారో తెలియదు. గతేడాది బకాయిలతో కలిపి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.40వేలు చొప్పున ఇవ్వాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గతేడాది వేట నిషేధభృతి ఇవ్వకపోవడం వల్ల మత్స్యకారులు వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వచ్చింది. గతేడాది చెల్లించాల్సిన బకాయిలతోపాటు ఈసారి వేట నిషేధ భృతిని కలిపి ప్రతి కుటుంబానికి రూ.40వేలు చొప్పున చెల్లించాల్సిందే. లేకుంటే ఉద్యమిస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకార సంఘాల సమాఖ్య -
ఊరంతా చేపల కూరే...!
వేసవి వచ్చిందంటే గ్రామాల్లోని చెరువుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. దీంతో స్థానికులు చేపల వేటకు ఉపక్రమిస్తారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు మంగళవారం ఉదయమే చేరిన జనం జలపుష్పాలు వేటాడటంలో నిమగ్నమయ్యారు.ఊతలు, వలల సాయంతో చేపలు పట్టగా అందరికీ సరిపడా చేపలు (Fishes) దొరకడంతో ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు. దీంతో కుర్నవల్లి గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు అందరి ఇళ్ల నుంచి మంగళవారం సాయంత్రానికి చేపల కూర (Fish Curry) వాసన ఘుమఘుమలాడింది. – కరకగూడెం అడుగంటిన మత్తడివాగుమార్చి మొదటివారం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలమట్టం గతంలో ఎన్నడూలేని విధంగా పది మీటర్ల లోతుకు పడిపోయింది. తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని అందించే తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది.ప్రాజెక్టు నీటిమట్టం (Water Level) 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.111లకు పడిపోయింది. నీరంతా అడుగంటడంతో ప్రాజెక్టు పూర్తిగా నెర్రెలు వారింది. ఏటా ఏప్రిల్ నెలాఖరు, మే మొదటివారంలో అడుగంటాల్సిన ఈ ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారానికే ఎండిపోవడం జిల్లాలోని భూగర్భజలాలు పడిపోతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్చదవండి: సైకిల్ చక్రం.. బతుకు చిత్రం -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
అక్కడ చేపలు పట్టాలంటే చంపాల్సిందే
‘అక్కడ చేపలు పట్టడమంటే చెరువుల్లో బాంబులు వేయడమో.. కరెంటు షాక్ ఇచ్చి లేదా నీటిలో రసాయనాలు కలిపి చేపలు చచ్చేలా చేసి పట్టుకోవడమో మాత్రమే తెలుసు. అంతేగానీ.. ప్రత్యేకంగా చేపలు పట్టేందుకు స్థానికులకు శిక్షణలేదు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో దీనిని గమనించాను. తద్వారా విషపూరితమైన చేపలను తినడమో.. చేపలతో పాటు ఇతర ప్రాణులు చనిపోవడమో జరుగుతోంది. అందుకే ప్రత్యేకంగా ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర) 20 మంది అధికారులకు శిక్షణ ఇస్తున్నాం’.. అని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నీనన్ తెలిపారు. అక్కడ మత్స్య సంపదను పెంచడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై కూడా ఈ ఐదురోజుల శిక్షణలో భాగం చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు అక్కడకెళ్లి స్థానికంగా ఉండే మత్స్యకారులతో పాటు స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) శిక్షణ ఇస్తే వారి ఆదాయ మార్గాలను పెంచేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంలో వీరికి ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్ష్రి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంమత్స్యసంపదకు తీవ్ర నష్టం!ఈశాన్య రాష్ట్రాల్లో చేపలు పట్టేందుకు ప్రధానంగా మెకానికల్ స్టుపెఫైయింగ్ పద్ధతిలో రాళ్లు విసరడం, డైనమైట్ వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించడం చేస్తుంటారు. దీనిని సాధారణంగా బ్లాస్ట్ లేదా డైనమైట్ ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతి చాలా హానికరం. ఈ పద్ధతిలో కేవలం మనం ఆహారంగా తీసుకునేందుకు అవసరమయ్యే చేపలతో పాటు వాటి గుడ్లు, ఇతర జలచరాలు కూడా చనిపోతాయి. ఇక మరో పద్ధతి.. ఫిష్ పాయిజనింగ్. ఈ పద్ధతిలో రాగి, సున్నం వంటి రసాయనాలను వినియోగిస్తారు. గిరిజన సంఘాలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ పద్ధతిలో కూడా చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకూ చనిపోతాయి. అంతేకాక.. చేపలలో విష రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఈ పారే నీటిని కిందనున్న ప్రాంతాల వారు తాగేందుకు వినియోగించే అవకాశం ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. ఇక మూడో పద్ధతి.. ఎలక్ట్రికల్ ఫిషింగ్. ఈ పద్ధతిలో కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా చేపలు కదలకుండా పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తద్వారా వాటిని వలలతో పట్టుకోవడం సులభమవుతుంది. ఈ అన్ని పద్ధతుల్లో మత్స్యసంపద దెబ్బతినడంతో పాటు పర్యావరణ వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తుంది. అందుకే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ప్రతీచోట ఏపీ ఫిష్ మార్కెట్..ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతీ ప్రాంతంలో రెండు చేపల మార్కెట్లు ఉన్నాయి. ఒకటి స్థానిక చేపల మార్కెట్ కాగా.. మరొకటి ఆంధ్రప్రదేశ్ ఫిష్ మార్కెట్. అక్కడ ఏపీ చేపలకు అంత డిమాండ్ ఉంది. మేం చూసిన ప్రతీ ప్రాంతంలో చేపల మార్కెట్ ఎక్కడా అని ఆరాతీస్తే.. ఏ మార్కెట్ కావాలి? లోకల్ ఫిష్ మార్కెటా? ఏపీ ఫిష్ మార్కెట్ కావాలా అని అడిగే వారు. ఇక విమానాశ్రయాల్లో కూడా చేపల ఉత్పత్తుల విక్రయం జరుగుతుంది.ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసిన చేపలను అక్కడ విక్రయిస్తున్నారు. వాటికి స్థానికుల నుంచి మంచి డిమాండ్ ఉంటోంది. అయితే, మన విమానాశ్రయాల్లో అటువంటి పరిస్థితిలేదు. మరింతగా చేపల వినియోగాన్ని, మార్కెట్‌ను పెంచేందుకు ఇటువంటి పద్ధతులను మనం కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది.తాబేళ్ల రక్షణకు ప్రత్యేక వలలు..సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు వినియోగిస్తున్న వలల్లో తాబేళ్లు కూడా చిక్కుకుంటున్నాయి. తద్వారా తాబేళ్లు మృతువాత పడుతున్నాయి. దీనిని నివారించేందుకు తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైజ్ (టెడ్)లను అభివృద్ధి చేశాం. తాబేళ్ల రక్షణ కోసం ఈ వలలను ప్రత్యేకంగ ఉపయోగించే దిశగా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. మొదటి దశలో 60 వేల వరకూ తయారుచేస్తున్నాం. అయితే, వీటి ధర అధికంగా ఉంది. వీటిని సబ్సిడీపై అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. -
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో దారుణం
-
చేపల వేటకు వెళ్లి ముగ్గురు సోదరుల మృతి
ఆదిలాబాద్ రూరల్: వాగులో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్‌రూరల్ మండలం పొచ్చర గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన నాగుల్వార్ విజయ్(28), నాగుల్వార్ ఆకాశ్(26), నాగుల్వార్ అక్షయ్(22) ముగ్గురు అన్నదమ్ములు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ముగ్గురూ పొచ్చర గ్రామ సమీపంలోని వాగు వద్దకు చేపల వేటకు ఉదయం వెళ్లారు. చేపలు పడుతున్న క్రమంలో అక్షయ్ ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడిపోగా...అతడిని రక్షించేందుకు ఇద్దరన్నదమ్ములూ వాగులోకి దూకేశారు. అయితే వీరికి కూడా ఈత రాకపోవడంతో ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. వీరితో పాటే అక్కడికి వెళ్లిన వీరి సమీప బంధువు కాంబ్లే శ్రీనివాస్ గ్రామస్తులకు, పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ముగ్గురూ వాగులో కొట్టుకుపోయారు. దీంతో గజ ఈతగాళ్లను రప్పించి వీరి కోసం గాలించగా...ముందుగా విజయ్ తర్వాత ఆకాశ్, అక్షయ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
South Atlantic: మత్స్యకారుల పడవ మునక.. ఆరుగురు మృతి
దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదం సంభవించింది. మత్స్యకారుల పడవ మునిగిపోవడంతో ఆరుగురు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఫాక్లాండ్ దీవుల తీరానికి 200 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 27 మంది ఉన్నారని, వారంతా చేపలు పట్టేందుకు వెళ్తున్నారని బ్రిటిష్, స్పానిష్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ పేరు అర్గోస్ జార్జియా అని, ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని స్పెయిన్ అధికారులు తెలిపారు. ప్రమాదం బారినుంచి 14 మందిని రక్షించి, లైఫ్బోట్లో ఎక్కించారని తెలిపారు. చేపల వేటకు వెళ్లినవారిలో స్పెయిన్ దేశానికి చెందినవారితో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. -
చేపలు పట్టేందుకు రూ.581 కోట్లు.. సౌదీ ప్రిన్స్ విలాసం
సౌదీ యువరాజు తుర్కీ బిన్ ముక్రిన్ అల్ సౌద్ ఇటీవల తన సరికొత్త టాయ్ టెస్లా సైబర్ ట్రక్‌తో కలిసి దిగిన ఫోటో వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. అయితే ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన స్పోర్ట్ ఫిషింగ్ యాచ్ (క్రూయిజ్) కొనుగోలు చేశారు.సముద్ర పరీక్షలను పరిచయం చేసేటప్పుడు, దానిని తయారు చేసిన సంస్థ రాయల్ హుయిస్మాన్ ఈ పడవను "ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన వ్యక్తిగత స్పోర్ట్ ఫిష్ పడవ"గా వర్ణించింది. 52 మీటర్ల పొడవు, ఆరు డెక్‌ల ఎత్తుతో దీన్ని రూపొందించారు. ఇది ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ కంటే రెండు మీటర్లు అధికంగా పొడవు ఉంటుంది.ఈ విలాసవంతమైన నౌకలో పొడవైన విల్లు, ఎత్తైన రక్షణ కవచాలు, వెనుక భాగంలో లో ఫిషింగ్ కాక్‌పిట్ ఉన్నాయి. డచ్ సంస్థ రాయల్ హుయిస్మాన్ ప్రకారం.. ఈ పడవ యూఎస్ నేవీకి చెందిన జుమ్వాల్ట్-క్లాస్ డిస్ట్రాయర్‌ను అధిగమించి, 35 నాట్ల అద్భుతమైన వేగాన్ని చేరుకుంటుంది. పరిమాణం, వేగం అద్భుతమైన కలయికతో, ప్రస్తుతం సముద్ర ప్రయోగాలలో ఉన్న ‘స్పెషల్ వన్’ గణనీయమైన దృష్టిని, డిమాండ్‌ను పొందింది. లైసెన్స్డ్ హెలికాప్టర్, ఫిక్స్డ్-వింగ్ పైలట్ అయిన ప్రిన్స్ తుర్కీ ఈ ప్రత్యేక పడవను 70 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. -
ఎన్నో విశేషాల ‘బోర మెత్తళ్లు’
సింగరాయకొండ: బోర మెత్తళ్లు చేప..తైల వర్ణంలో ఉంటుంది. ఇది వేసవిలోనే లభిస్తుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. వేటాడాలంటే సన్న కన్నుల వలను వినియోగించాలి. దాని ఖరీదు రూ.లక్ష పైమాటే. ఈ చేప ప్రకాశం జిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా చిన్నగంజాం, నిజాంపట్నం తదితర తీర ప్రాంతాల్లో లభ్యమవుతుంది. ఇది తీరానికి అర కిలోమీటర్ దూరంలో దొరుకుతుంది. దీనిని వేటాడే సమయం కూడా భిన్నంగా ఉంటుంది.అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్లి ఎక్కడ ఉందో గుర్తిస్తారు. దాని గమనాన్ని బట్టి ఆ ప్రాంత మత్స్యకారులు వేటాడుతారు. వేకువజామున 4 గంటల నుంచి వేట మొదలుపెడతారు. ఉదయం 8 గంటలకు తీరానికి తీసుకువస్తారు. మామూలు చేపలైతే పడవల్లోనే వల నుంచి వేరు చేస్తారు. దీనిని అలా వేరుచేసేందుకు కుదరదు. తీరానికి తీసుకువచ్చి ఒడ్డుకు చేరిన తర్వాతే వల నుంచి వేరు చేస్తారు. ఒక్కసారి వేటకు వెళితే టన్ను వరకూ లభ్యమవుతుంది. వేసవి, వేట నిషేధ సమయంలో దొరికే ఈ చేపను కర్రతెప్పల్లో మాత్రమే వేటాడుతారు. ఇక్కడ దీని ధర కేజీ రూ.100. కేరళలో ఇది కేజీ రూ.300–500 మధ్యలో ధర పలుకుతుంది. మే, జూన్‌ల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చేపలను ప్రత్యేక వాహనాల్లో కేరళకు పంపుతారు. -
ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
ఐదేళ్ల జగన్ పాలనలో 4 పోర్టులకు పునాది... ⇒ ప్రారంభానికి సిద్ధంగా రామాయపట్నం పోర్టు... ⇒మిగిలినవీ శరవేగంగా నిర్మాణం... ⇒10 ఫిషింగ్ హార్బర్లు... 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ⇒ వీటన్నిటికీ రూ.25,000 కోట్ల వ్యయం... ⇒పోర్టుల పక్కనే పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్ పార్కులు ⇒ 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది జాలరులకు లబ్ధి ⇒రూ.9000 కోట్ల మేర పెరగనున్న జీడీపీ -
ఏపీ చేపల వేట నిషేధం
-
చేపలెందుకు ఒడ్డుకు వచ్చేశాయి?
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి కొత్త అంశాలు
-
బాధితులకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారు: మంత్రి సీదిరి
-
పురుగుల మందుతాగిన యువకుడు.. చికిత్స పొందుతూ
నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు. సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొరమేను సాగు..కొరమేను తెలంగాణ రాష్ట్ర చేపగా పిలుస్తారు
-
మత్స్యకారులకు కష్టాలుండవిక
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.3,500 కోట్లతో మినీ ఓడరేవులను తలపించేలా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మత్స్యకారులు వారి బోట్లను సురక్షితంగా నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మత్స్య శాఖ ఏపీ మారిటైమ్ బోర్డుకు బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు తమ పడవలను బీచ్‌ల్లోనే నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాన్లువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పడవలు, వలలు కొట్టుకుపోయి పేద మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పడవలను నిలుపుకొనేందుకు ఒక జెట్టీ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి చేపలను సురక్షితంగా మార్కెట్‌కు తరలించుకునేలా వీటిలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్లలో భారీ మెకనైజ్డ్ బోట్ల కోసం బ్రేక్ వాటర్ వంటివి ఉండాలని, కానీ ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లలో స్థానిక మత్స్యకారులు చిన్న నాటు పడవలు, మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఏపీ కోస్టల్‌జోన్ మేనేజ్మెంట్ అథారిటీల నుంచి అనుమతులు పొందడానికి కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఆరు ప్రాంతాల్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు, సముద్రపు ఒడ్డున ఎన్ని పడవలు నిలుపుతున్నారన్న అంశాలపై అధ్యయనం చేశామని, దీనికి అనుగుణంగా ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఆరు చోట్ల 1,732 బోట్లు నిలుపుతున్నారని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో బోట్లను నిలిపేలా వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరంతా అనధికారికంగా చేపల వేట చేపడుతుండటంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటయితే ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. -
11 దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి గుంటూరులో..
గుంటూరు డెస్క్: దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండువేలలోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కృష్ణా, బాపట్ల అభయారణ్యం ప్రాంతంలో వీటిజాడ గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 11 దేశాల్లో మాత్రమే.. చేపలను వేటాడి జీవించే ఈ అరుదైన జాతి పిల్లిని ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలుస్తారు. దీని శాసీ్త్రయ నామం రౖపైనెలూరుస్ వైవెర్రినస్ (prionailurus viverrinnus). మడ అడవులు, చిత్తడి నేలలలో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే వీటి జాడను కనుగొన్నారు. 2013లో మడ అడవులపై రీసెర్చ్ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,500 నుంచి 2,000 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ జాతులు ప్రత్యుత్పత్తి చెందకపోతే త్వరలోనే అంతరించిపోతాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి హెచ్చరించింది. రాత్రివేళల్లోనే వేట.. 78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరిగే ఈ బావురు పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులికంటే చిన్నదిగానూ ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేస్తుంది. ఈ వాసన గమనించిన ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు. పర్యావరణ పరిరక్షణకు దోహదం.. సముద్రంలో ఉండే పలు రకాల చేపలు పెట్టే గుడ్లు, కొన్ని రకాల చేపలను తినే పలు రకాల చేపలను ఈ బావురు పిల్లి తింటుంది. దీనివల్ల ఇది సంచరించే ప్రాంతంలో మత్స్య సంపద పెరగడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహద పడుతుంది. తీర ప్రాంత ప్రజలకు అవగాహన అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ మధ్య బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్‌లో లెక్కింపునకు చర్యలు.. అటవీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వీటి జాడను కనుగొన్నామని అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవరావు తెలిపారు. అక్టోబర్ నుంచి వీటి సంఖ్యను లెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
మత్స్యకారులకు తప్పిన పెను ముప్పు
రణస్థలం: చేపల వేట కోసం గుజరాత్‌లోని వీరావల్ తీర ప్రాంతానికి వెళ్లిన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు పెను ముప్పు తప్పింది. వేట కోసం తీరం నుంచి సముద్రంలోకి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లిన వారి పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. తోటి మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి పడవలో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించారు. రణస్థలం మత్స్యశాఖ అధికారి గంగాధర్, జీరుపాలెం సర్పంచ్ ఎం.రాముడు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ ప్రాంతానికి వేట కోసం రాష్ట్రం నుంచి మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి వెళుతుంటారు. సుమారు మూడు నెలలు అక్కడ వేట సాగించి తర్వాత స్వగ్రామాలకు వస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం వీరావల్ తీర ప్రాంతంలో ఉంటున్న రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం కొర్లయ్య (పడవ డ్రైవర్), కేశం పండువాడు, సూరాడ చిన్న, అంబటి రాముడు, పుక్కల్ల అసిరయ్య, ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన బడి తోటయ్య, కాకినాడకు చెందిన టి.వీరబాబు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస బర్రి అప్పన్న వేట కోసం పడవలో గురువారం తెల్లవారుజామున సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక బోటు సైడ్లు విరిగిపోయాయి. అనంతరం ఇంజిన్ పాడైపోయింది. క్రమంగా పడవ మునిగిపోతోంది. దీంతో ప్రమాదం గురించి పడవ డ్రైవర్ కేశం కొర్లయ్య తమతోపాటు మరో రెండు పడవల్లో సముద్రంలో వేట సాగిస్తున్న జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం అప్పన్న, అమ్మోరు, మైలపల్లి పెద్దయ్యతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. జీరుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎనిమిది మందిని కాపాడారు. మునిగిపోతున్న పడవలో ఉన్నవారిని తాడు సాయంతో తమ పడవల్లోకి తీసుకువచ్చి రక్షించారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు అందరూ గురువారం సాయంత్రానికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారి స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. -
హార్బర్లకు సమాంతరంగా ఆహ్లాదం
సాక్షి, అమరావతి : ఫిషింగ్ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వాటి పక్కనే రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే ఫిషింగ్ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది. జువ్వలదిన్నెలో 90 శాతం పనులు పూర్తి సుమారు రూ.1523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో ఈ సెప్టెంబర్ నాటికి సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా 5,900 బోట్లు నిలుపుకొనే అవకాశం రావడంతో పాటు ఏటా 2,37,350 టన్నుల చేపలను పడతారని అంచనా. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 555 మత్స్యకార గ్రామాల్లోని 6.3 లక్షల మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ హెచ్చరిక!
రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. మొబైల్ యాప్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఐఆర్సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు ఐఆర్సీటీసీ పేరుతో ఫేక్ యాప్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిల్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అనే యాప్ ఉంది. ఆ యాప్‌ను వినియోగించవద్దని కోరింది. సైబర్ కేటుగాళ్లు ఫిషింగ్స్ లింక్స్ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్ టికెటింగ్, ఇతర రైల్వే సంబంధిత సేవల్ని అందించే ఐఆర్సీటీసీ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లో, ఐఓఎస్ వినియోగదారులు యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సలహా ఇచ్చింది. Alert: It has been reported that a malicious and fake mobile app campaign is in circulation where some fraudsters are sending phishing links at a mass level and insisting users download fake ‘IRCTC Rail Connect’ mobile app to trick common citizens into fraudulent activities.… — IRCTC (@IRCTCofficial) August 4, 2023 అంతేకాకుండా, ఒరిజినల్ ఐఆర్సీటీసీ, ఫేక్ ఐఆర్సీటీసీ యాప్స్‌లను గుర్తించాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్ఫేస్, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలను దొంగిలించే అవకాశం ఉందని సూచించింది. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ.. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్ వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నట్లు తేలింది. యూజర్లను మోసం చేసేలా నకిలీ 'ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారంలో ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. -
చేపల వేటలో నాగచైతన్య .. ఎందుకో తెలుసా?
మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకునే పని మీద నాగచైతన్య శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసమే టీమ్ కసరత్తులు చేస్తోంది. గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి, వారి సంస్కృతి, జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు చైతన్య, చందు, ‘బన్నీ’ వాసు. శుక్రవారం వైజాగ్ పోర్టును సందర్శించారు. మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. -
1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే..
కొన్న వస్తువులు ఏవేవో కారణాల రీత్యా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎంతగా ప్రయంత్నించినా దొరికే అవకాశం గానీ వాటి ఆచూకీ గానీ కానరాదు. అలాంటి వస్తువు సడెన్‌గా దొరికినా లేదా చాలా ఏళ్లక్రితం మిస్ అయ్యిన వస్తువు అనుకోకుండా మనకు లభించిన లేదా బయటపడ్డ మన ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి విచిత్ర ఘటనే యూఎస్ఏలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ స్టేట్స్‌లోని కాన్వాస్‌కు చెందిన 45 ఏళ్ల జాన్ మౌన్స్ ఫాక్స్ అనే వ్యక్తి మంచి చేపలను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మే 29(మెమోరియల్ డే)న చెనీ సరస్సు వద్దకు వెళ్లాడు. సరస్సు వద్ద అనువైన చోటును వెదుకుతుండగా..ఓ విచిత్రమైన వస్తువు కంట పడింది. మొదట అర్థం కాలేదు. తన వద్ద ఉన్న సోనార్ పరికరాల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుని నిశితంగా చూశాడు. ఏవో టైర్లు, రోల్‌బార్, స్టీరింగ్ వీల్ వంటి వాటితో కూడిన ఓ జీప్ లాంటి వస్తువును చూశాడు. ఎలాగైనా సరస్సు నుంచి తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్రేన్ల సాయంతో తీసేందుకు అధికారుల అనుమతి తీసుకుని మరీ ఆ వస్తువుని బయటకు తీశాడు. అతను ఊహించినట్లుగానే అది జీప్. 1990ల నాటి ఓల్డ్ జీప్ అని తేలింది. నిజానికి అతను ఏదో పెద్ద చేప ఏమో అనుకున్నాడు. బయటకు తీయాలనే ఆత్రుతలో అదే ఏంటో చూడగా అసలు విషయం బయపడింది. ప్రస్తుతం ఆ జీప్ని చూసేందుకు అధికారులు, ప్రజలు అతని ఇంటికి ఎగబడుతున్నారు. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
చేపల వేటపై 2 నెలలు నిషేధం.. మత్స్యకారులకు అండగా ఏపీ ప్రభుత్వం
చీరాల టౌన్: రెండున్నర నెలల పాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా.. హైలెస్సా అనే మాటలు వినపడవు. తీరం ఒడ్డున మత్స్యకారుల సందడి కనిపించదు. సముద్రంలో మత్య్సకారుల బోట్లు కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కానీ వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారుల పరిస్థితి ఈ సంధికాలంలో సుడిగండంలో ఉన్న మత్య్సకారులకు అండగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలవనున్నారు. మే 15 కల్లా గంగపుత్రులకు మత్య్సకార భరోసా కింద ఒక్కో మత్య్సకార కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేలా రూ.10 వేలు ఇవ్వను న్నారు. ఈనెల 15 నుంచి జూన్ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతిఏటా ఈ సమయంలో చేపలు పునరుత్పత్తి సమ యం సందర్భంగా సముద్రంలో మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలకు నిషేధ సమయంలో పూర్తిగా వేటను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు. నిషేధ సమయంలో మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ సర్కారు ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించనుంది. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు ఉండగా రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 50 వేల మత్య్సకారులు ఉండగా 25000 మంది మత్య్సకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో బోటుకు ఆరుగురు మత్య్సకారులు ఉంటారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలో మీటర్లు ఉన్న సముద్రతీర ప్రాంతంలో 50,000 మంది మత్య్సకార జనాభా, 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో మోటారు, మెకనైజ్డ్ బోట్లు 2924 పైచిలుకు బోట్లు ఉన్నాయి. జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో సముద్ర తీరప్రాంతం ఉంది. సముద్రతీర ప్రాంతం జిల్లాలోని రేపల్లెలోని లంకెనవాలిపల్లి దిబ్బ నుంచి చినగంజాం మండలం ఏటిమొగ వరకు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని మత్య్సకారులు సముద్రంలో వేట చేసి మత్స సంపదను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం విధించడంతో మత్య్సకారుల వేట సామగ్రిని, బోట్లను ఒడ్డుకు తీసుకువచ్చి నిలుపుదల చేశారు. కుటుంబ పోషణకు అండగా మత్య్సకార భరోసా.. సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. నిషేధ కాలం రెండున్నర నెలలు ఉండటంతో మత్య్సకారులు ఇబ్బందులు ఇబ్బందులకు తొలగించేందుకు ప్రభుత్వం మత్య్సకార భరోసా అందిస్తూ అండగా నిలుస్తోంది. బోట్లతో వేట సాగిస్తే చర్యలు సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరిగే కారణంగా శనివారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేఽ దం అమలు చేస్తున్నాం. సంప్రదాయ తెప్పలు వేట సాగించుకోవచ్చనని, మెకనైజ్డ్ ఇంజిన్ బోట్లతో సముద్రంలో వేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. మత్య్సకారులు కేంద్రం ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. మత్య్సకార భరో సా కింద బోట్లు పరిశీలన చేసి దరఖా స్తులను ఆన్లైన్ నిక్షిప్తం చేస్తాం. విచారణ చేసి మే 1న భరోసా తుది జాబితా ప్రకటిస్తాం. మేలో సీఎం జగన్ మత్య్సకారులకు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. – ఎ.సురేష్, మత్య్సశాఖ జిల్లా అధికారి, బాపట్ల -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్‌లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్‌కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఫిషింగ్ హార్బర్లు నిర్మించి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్న సీఎం జగన్
-
సాగర తీరంలో కయాకింగ్ క్వీన్
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్‌లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది. నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రజత పతకం 18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్‌లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది. చేపల వేటలో సాయపడుతూ.. తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట. ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్‌లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్‌లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్‌లో, కుమారుడు శ్యాం కయాకింగ్‌లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను. – నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి -
క్యాబ్ బుకింగ్ ఫెయిలైందా? ఫార్మింగ్ ఎటాక్‌తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టెక్నికల్ లోపం కారణంగా బుకింగ్ ఫెయిల్ అయింది.అయితే అతను ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు. కొద్దిసేపటి తర్వాత ట్రావెల్ కంపెనీ ఏజెంట్ రజత్ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. బుకింగ్ కోసం మరోసారి వెబ్సైట్లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. వెబ్సైట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్ చేశాడు. కానీ భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్ అయిపోయాయి. క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని పోకుండా అడ్డుకోగలిగాడు. కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్ చేయించాడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్ సైబర్ దాడి అని పేర్కొన్నారు. వెబ్సైట్, కంప్యూటర్ డీఎన్ఎస్ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లించి, ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, నకిలీ వైబ్సైట్ల ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. ఫార్మింగ్ సైబర్ ఎటాక్ అంటే? ఫార్మింగ్ సైబర్‌దాడులు ఫిషింగ్ ఎటాక్స్ కంటే ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, రియల్ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. అంటే వెబ్సైట్ లేదా కంప్యూటర్ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్ సైబర్ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్సైట్లలో లింక్‌లను క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
యానాదుల బతుకుల్లో మార్పుకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన యానాదులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నెల్లూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో ప్రత్యేకంగా యానాదులకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీతో వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, వైద్యం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెల్సిందే. తాజాగా విజయవాడ ఐటీడీఏ(మైదాన ప్రాంతం) పరిధిలోని ఎన్టీఆర్ జిల్లాలో యానాదుల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కేర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కోబో కలెక్ట్ యాప్(మొబైల్ అప్లికేషన్) సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో సేకరించిన అంశాల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలతో పాటు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుండటంతో మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేసే విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. కోబో యాప్‌తో సమగ్ర సమాచారం గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో కేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఏకుల రవి, వెలుగు చంద్రరావు తమ సిబ్బందితో కలిసి కోబో కలెక్ట్ యాప్‌తో ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి యానాదులను గుర్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి స్థితిగతులు, సమస్యలను యాప్ ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని యానాదుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో బడి ఈడు పిల్లలను బడిలో, చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేరుస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల యంత్రాంగంతో మాట్లాడి వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. 412 మంది యానాదులకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ.50 వేల చొప్పున అందించారు. 2,500 మందికి ఆధార్ కార్డులు, 550 మందికి రేషన్‌కార్డులు, మూడు వేల మందికి కుల ధ్రువీకరణ పత్రాలిప్పించేలా చర్యలు చేపట్టారు. చేపల వేటకు లైసెన్స్లిస్తున్నాం.. మైదాన ప్రాంత ఐటీడీఏ పరిధిలోని ఎస్టీల్లో లంబాడీ, ఎరుకల, యానాది, చెంచు, నక్కల తెగల వారున్నారు. వారిలో యానాదులకు సరైన చిరునామా, నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వారి స్థితిగతులపై చేపట్టిన సర్వే మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిస్తున్నాం. ప్రధానంగా చేపల వేటపై ఆధారపడి జీవించే యానాదుల ఉపాధిని మరింత మెరుగుపరిచేలా దృష్టి సారించాం. కాలువలు, నదుల్లో చేపలను వేటాడుకునేలా జి కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన 18 మందికి కొత్తగా లైసెన్స్లిచ్చాం. మత్స్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సబ్సిడీపై వలలు అందించేలా కార్యాచరణ చేపట్టాం. – ఎం.రుక్మంగదయ్య, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మైదాన ప్రాంత ఐటీడీఏ(విజయవాడ) -
24 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన లంక
కొలంబో: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి చేపలవేటకు సిద్ధమయ్యారంటూ 24 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అరెస్ట్‌చేసింది. ఉత్తర జాఫ్నా పరిధిలోని కరాయ్‌నగర్ తీరం సమీపంలో వీరిని మంగళవారం అరెస్ట్‌చేసి వారి ఐదు చేపల వేట పడవలను శ్రీలంక నావికా, గస్తీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో తమిళనాడు జాలర్లను విడుదల కోసం శ్రీలంక ప్రభుత్వంతో భారత సర్కార్ సంప్రదింపులు జరపాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇలా 252 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్ట్‌చేశారు. భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సత్సంబంధాలకు జాలర్ల అంశం సమస్యాత్మకంగా ఉన్న విషయం తెల్సిందే. -
మెరైన్ మత్స్య ఉత్పత్తుల్లో ఏపీకి ఐదు అవార్డులు
కైకలూరు(ఏలూరు జిల్లా): నేషనల్ ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే అవార్డుల్లో ఏపీకి 5 విభాగాల్లో చోటు దక్కింది. ఏ, బీ కేటగిరీలుగా ఎంపిక చేసిన జాబితాను ఎన్ఎఫ్డీబీ శుక్రవారం ప్రకటించింది. ఏపీలో ఉత్తమ మెరైన్ జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉత్తమ మెరైన్ చేపల రైతుగా ఏలూరు జిల్లా మట్టగుంటకి చెందిన తిరుమాని నాగరాజు, ఉత్తమ హేచరీగా కాకినాడ జిల్లాకు చెందిన సప్తగిరి హేచరీస్, ఉత్తమ ల్యాబ్‌గా తూర్పు గోదావరి జిల్లా రెడ్డి డ్రగ్స్.. ల్యాబ్‌కు చెందిన నరేష్కుమార్, ఉత్తమ ఆర్టెమియా టెక్నాలజీ ఇన్ఫ్యూషన్‌గా కవితారెడ్డికి అవార్డులు దక్కాయి. -
పైపుల ద్వారా లోపలికి ప్రవేశించి.. సింగోజి చెరువులో..
సాక్షి, హైదరాబాద్: అది వన్యమృగాలు సంచరించే ప్రాంతం. పులులు, సింహాల సఫారీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రదేశంలో జన సంచారం నిషేధం. కానీ.. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మాత్రం ఇక్కడ సంచరించేందుకు ఎలాంటి ఆంక్షల్లేవు. గతేడాది కురిసిన వర్షాలకు కూలిన జూ గోడను మళ్లీ కట్టకపోవడంతో జంతువులకే కాదు.. స్థానికులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. రక్షణ గోడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు జంతు ప్రదర్శనశాలలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉన్న సింగోజి చెరువులో చేపలు వేట కోసం గోడ కూలిన ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. కాగా.. సింగోజి చెరువులో భారీగా మొసళ్లు ఉన్నట్లు తేలింది. ఇటీవల ఓ మొసలి ఏకంగా గోడ కూలిన ప్రాంతం నుంచి నీటి ప్రవాహంలో బయటకు వచ్చి మూసీ నదిలో ప్రత్యక్షం కావడం గమనార్హం. జూ వెనుక భాగంలో.. ► గతేడాది భారీ వర్షాలకు జూ వెనుక భాగంలోని ప్రహరీ గోడ కూలిపోయింది. గోడను పునర్ నిర్మించకుండా కేవలం వరద నీరు బయటకు వెళ్లేలా కొన్ని పైపులు వేసి.. కల్వర్టు నిర్మించారు. దీంతో జూలోకి సులువుగా వెళ్లడానికి స్థానికులకు అవకాశమేర్పడింది. వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జూలోని సింగోజి చెరువు నిండుకుండలా మారింది. ఇందులోకి చేపలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే జూ వెనుక కిషన్‌బాగ్, బహుదూర్‌పురా ప్రాంతాలకు చెందిన యువకులు ఈ చెరువులో చేపలు పట్టడానికి.. గోడ కూలిన వేసిన వేసిన పైపుల నుంచి జూలోకి ప్రవేశిస్తున్నారు. ► సింగోజి చెరువులో మొసళ్లు ఉన్న విషయాన్ని జూ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ ప్రాంతం నుంచే లోపలికి ప్రవేశించిన ఒకరు పులిని చంపిన ఘటన నేర్పిన పాఠాలను కూడా జూ అధికారులు మరిచిపోవడం దారుణమని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇదే జూలో ఎలుగుబంటి కూడా బయటకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. బయటి వ్యక్తులను అడ్డుకుంటాం.. గోడ నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌కు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశాడు. గోడ కూలిన ప్రాంతం నుంచి వ్యక్తులను లోపలి రాకుండా నిఘా పెడతాం. – రాజశేఖర్, జూ క్యూరేటర్ -
వైరల్ వీడియో: అడుగు ముందుకు పడ్డా చావే! అంతలో..
Viral Video: మనిషికి ఏదో ఒక భయం ఉండడం సహజం. అలాంటిది చావు ఎదురుగా దూసుకొస్తుంటే.. బెదరకుండా ఉండగలడా?. ఇక్కడో పెద్దాయన అడుగు దూరంలో ఉన్నా బెదరలేదు మరి!. ఓ వ్యక్తి తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలానికి పడ్డ చేపను ఆ కొడుకు ఒడ్డుకు లాగుతుంటే.. దానిని అనుసరిస్తూనే నాలుగు మీటర్ల పొడవున్న ఓ భారీ మొసలి ఒడ్డు వైపు వస్తోంది. అది చూసి కంగారులో ఆ కొడుకు టోపీ కింద పడేసుకున్నాడు. మొసలి దాదాపుగా ఒడ్డు మీదకు వచ్చేసింది. ఆ క్షణం.. అక్కడొక భయానక వాతావరణం కనిపించింది. అయితేనేం తన కొడుకు టోపీ కోసం ఓ అడుగు ముందుకేశాడు ఆ పెద్దాయన. అడుగు దూరంలోని మొసలి-ఆ వ్యక్తి ఎదురుపడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో కర్రతో వెంటనే వెనక్కి రావడం, ఆ మొసలి ముందకు వచ్చే ప్రయత్నం చేయకపోవడంతో పెద్దాయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్ట్రేలియాలోని కాకాడులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడ్డున్న నిల్చుని అదంతా చూస్తున్న కొందరు.. చేపను వదిలేయాలని అరుస్తున్నా ఆ వ్యక్తి రోస్కేర్ల్ చేపను వదలకపోవడం, అతని తండ్రి ఆ టోపీ తీసుకోవడం పెద్ద సాహసంగా నిలిచింది ఆ ప్రాంతంలో. ఈ అనుభవంతో.. కొన్నాళ్లపాటు ఆ తండ్రీకొడుకులిద్దరూ చేపల వేటకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారట. View this post on Instagram A post shared by Scott Roscarel (@nuffblokescotty) -
కులాసా.. మత్స్యకార భరోసా
ఆటుపోటుల జీవితం.. సముద్రంలో వేటకు వెళితేగాని పూట గడవని బతుకు సమరం.. వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి.. పథకాలు ముంగిటకు వచ్చి చేరుతున్నాయి.. వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా వారికి కొండంత అండగా నిలుస్తోంది. గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. వచ్చే నెలలో అర్హుల ఖాతాల్లోకి సొమ్ములను జమచేయనుంది. నరసాపురం : చేపల పునరుత్పత్తి సీజన్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు 61 రోజులపాటు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటారు. పడవలు, వలలు మరమ్మతులు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరో సా పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో ఉన్న అర్హుల సంఖ్యను పెంచుతూ మరింత మందికి చేయూతగా నిలుస్తోంది. జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీరం ఉండగా నరసాపురం ప్రాంతంలో దాదాపు 2 వేల మంది వేటపై ఆధారపడి బతుకుతున్నారు. పాదయాత్ర హామీ మేరకు.. పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురం వేదికగా వేట నిషేధ సా యా న్ని రూ.10 వేలకు పెంచుతానని ప్రకటించారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో మ త్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. అప్పటికి 173 మంది మాత్రమే అర్హులు ఉండగా ఆ సంఖ్యను 1,072కు పెంచి సాయం అందించారు. అలాగే 2020, 2021లో పథకాన్ని సమర్థవంతంగా అమలుచేశారు. ఈ ఏడాది కూడా పథకానికి అర్హులను గుర్తించారు. గతంలో సాయం నామమాత్రంగా ఉండగా ఈ ప్రభుత్వంలో వేలాది మందికి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరుతోంది. గతంలో ముప్పుతిప్పలు గతంలో వేట నిషేధ సాయం కోసం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నిషేధం ము గిసి వేట ప్రారంభమైన ఐదారు నెలల తర్వాత కొద్దిమందికి మాత్రమే అరకొరగా సాయం అందించేవారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ, బడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. 2014కు ముందు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.600, కేంద్ర ప్రభు త్వం రూ.600 కలిపి రూ.1,200 అందించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. 2015లో 52 మందికి రూ.1.04 లక్షలు, 2016లో 46 మందికి 0.92 లక్షలు, 2017లో 104 మందికి రూ.4.16 లక్షలు, 2018లో 173 మందికి రూ.6.92 లక్షలు మా త్రమే నామమాత్రంగా అందించారు. జగన్ వచ్చాకే డబ్బులు వస్తున్నాయి మాకు ఏ పథకాలు ఉన్నాయో తెలిసేది కాదు. వేట విరామ సమయంలో రూపాయి వచ్చేది కాదు. జగన్ ముఖ్య మంత్రి అయిన తర్వాత మూడేళ్ల నుంచి వేట విరామ సమయంలో రూ.10 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ ఏడాది కూడా నాపేరు ఎంపిక చేశారు. వేట లేని సమయంలో ఇదే మాకు ఆధారం. – పెమ్మాడి గంటయ్య, మత్స్యకారుడు, నరసాపురం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి వేట తప్ప మరేమీ తెలియదు. ఏటా వేసవిలో రెండు నెలలు వేట ఉండదు. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు అలాకాదు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నారు. అదీ నా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఆనందంగా ఉంది. – మైలా రాముడు, పీఎం లంక, మత్స్యకారుడు సర్వే పూర్తయ్యింది నరసాపురం తీరంలో మాత్రమే మత్స్యకార భరోసా లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో 141 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. వీటిపై పనిచేసే మత్స్యకార్మికులు 1,454 మందిని గుర్తించాం. వీరందరికీ మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశాం. ఈ మేరకు సర్వే పూర్తయ్యింది. వచ్చేనెలలో వీరందరికీ సొమ్ములు పడతాయి. – వి.ఏడుకొండలు, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం
భోగాపురం: సాగరంలో జలసంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం లాగానే చేపలు గుడ్లు పెట్టే సమయం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేట నిషేధాజ్ఞలు జారీచేసింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా అదుకుంటుంది. గత ప్రభ్వుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సంవత్సరం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యభరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తుండడంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15,138 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లాలోని తీరప్రాంత మండలాలు పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్స్యకారులు ఉన్నారు. వారిలో 10 వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు నిరంతరం సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. రెండు మండలాల్లో 706 మోటార్ బోట్లు, 424 సంప్రదాయ బోట్లకు రిజిస్ట్రేషన్ అయింది. మత్స్యశాఖ అధికారులు మోటార్ బోట్లు, సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తున్న 2,335 మంది మత్స్యకారులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించారు. పారదర్శకంగా అమలు మత్స్యకారులకు మంజూరైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకే ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - నిర్మలాకుమారి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయనగరం మత్స్యకారులకు భరోసా వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అదుకునేందుకు మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు సాయం అందజేస్తోంది. జిల్లాలో 2,335 మందికి మత్స్యకార భరోసా అందనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - వాసుపల్లి రేయుడు, సర్పంచ్ ముక్కాం గ్రామం -
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’
ప్రమాదాలనేవి చెప్పిరావు. ఒక్కొసారి అనూహ్యంగా మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సమయంలోనే సమయస్పూర్తితో వ్యవహరించి ఆ ఆపద నుంచి సురక్షితంగా బయటపడాలి. అచ్చం అలానే చేశాడు ఇక్కడొక ఆస్ట్రేలియన్ వ్యక్తి. బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలోని 60 ఏళ్ల వ్యక్తి కైర్న్స్కి సమీపంలోని హోప్ వేల్ నగరంలోని ఒక నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అతను పని ముగించుకుని తిరిగి నదిఒడ్డుకి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న ఎద్దుని అదిలించాడు. దీంతో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఒక మొసలి క్షణాల్లో అతని పై దాడిచేసింది. పైగా ష్యూస్ వేసుకుని ఉన్న అతని రెండు కాళ్లను బలంగా లాగడానికి ప్రయత్నించింది. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) అతను అక్కడ ఉన్న చెట్టు కొమ్మలను సైతం పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే అతను ఆ ప్రయత్నంలో విఫలం అవ్వడంతో చేసేదేమి లేక చివరికి అతని పాకెట్లో ఉన కత్తితో అదే పనిగా దాడిచేశాడు. దీంతో అతను కొద్దిమొత్తంలో గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రికి వెళ్లినట్లు క్వీన్స్లాండ్ పర్యావరణ విభాగం పేర్కొంది. (కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
Photo Feature: కాషాయం మెరిసే.. నింగి మురిసే...
ఆకాశంలో ఏదో ప్రళయం వచ్చినట్లు మేఘాలు ఇలా కాషాయ వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఆ వర్ణాన్ని ఇలా నీటిలో చూసుకుని నింగి మురిసిపోయింది. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువుపై ఆకాశంలో శనివారం సాయంత్రం ఈ అద్భుతమైన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి. పాలకు వరుస జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రం వద్ద పాలకోసం శనివారం ఉదయం ప్రజలు ఇలా చెంబులు, గ్లాసులు, టిఫిన్‌బాక్సులు, ప్లాస్టిక్ బాటిళ్లతో వరుస కట్టిన దృశ్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, దేవరుప్పల తెప్పలపై చేపల వేట.. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ప్రాజెక్టు దిగువన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తెప్పలపై ఉత్సాహంగా చేపల వేట కొనసాగిస్తున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల. పొలాల వద్దే వ్యాక్సినేషన్ తిరుమలగిరి (సాగర్)/పెద్దవూర: ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంకల్పించడంతో వైద్యాధికారులు కూడా నడుం బిగించారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో, గిరిజన గూడాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ ముమ్మరంగా కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రజలెవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులే పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. శనివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేశారు. -
తెప్పల పోటీ కాదు.. చేపల వేట
ఉరకలెత్తుతున్న గోదారి.. ఉత్సాహంగా తెప్పలపై సాగిపోతూ వీరు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టి పేట మండలం గుళ్లకోట గ్రామ శివారులోని గోదావరిలో మత్స్యకారులు శుక్రవారం ఇలా చేపల వేట సాగించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల దాతృత్వానికి గుర్తింపు సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో పూర్వ విద్యార్థి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి రూ.3.50 కోట్లతో భవనం నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. దీనికి గుర్తింపుగా సుభాష్‌రెడ్డి తల్లిదండ్రుల పేరు ‘తిమ్మయ్యగారి సుశీల–నారాయణరెడ్డి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్, బీబీపేట పాఠశాల’గా ఖరారు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరలో తేజం ఖమ్మం వ్యవసాయం: ‘తేజ’రకం మిర్చి ధర పుంజుకుంటోంది. విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతుండడంతో ధర పెరుగుతున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం పలువురు రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చిని శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా క్వింటా ధర రూ.16,100గా నమోదైంది. గురువారం రూ.15,800 పలికిన ధర ఒకేరోజు వ్యవధిలో రూ.300కి పెరగడం విశేషం. -
మత్స్యకారులకు 'కొత్త ఉపాధి'
సాక్షి, అమరావతి: చేపల వేటపైనే ఆధారపడి జీవనోపాధి సాగించే మత్స్యకార కుటుంబాలకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే సముద్ర నాచు (సీవీడ్స్)సాగులో మత్స్యకార మహిళలను ప్రోత్సహించాలని సంకల్పించింది. సముద్రగర్భంలో సహజసిద్ధంగా పెరిగే నాచుమొక్కల ద్వారా వచ్చే కెర్రాజీనన్, అల్జిన్, అల్జినేట్స్, ఆగర్ వంటి ఉప ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కొన్ని రకాల పరిశ్రమలతో పాటు మందులు, మద్యం, కాస్మోటిక్స్, బేకరీ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్ టన్నుల సముద్ర నాచు ఉత్పత్తి జరుగుతుండగా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మూడు వైపులా సముద్రతీరంతో పాటు అపారమైన మంచినీటి వనరులున్న భారతదేశంలో 10 లక్షల టన్నుల (మిలియన్) ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. కానీ సాగుపట్ల అవగాహన లోపం, కొరవడిన ప్రభుత్వ సహకారం వల్ల కేవలం 25వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లో నాల్గోవంతు తమిళనాడులోనే సాగవుతోంది. ఈ నాచుకున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీర ప్రాంత రాష్ట్రాలతో కలిసి సీవీడ్ సాగును ప్రోత్సహించాలని సంకల్పించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్‌వై) కింద 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనివ్వనున్నాయి. తద్వారా రానున్న ఐదేళ్లలో దేశంలో 17లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశిస్తే మన రాష్ట్రంలో కనీసం 1.50లక్షల టన్నులు ఉత్పత్తి చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ రెండు రకాలకే డిమాండ్ 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతమున్న మన రాష్ట్రంలోని సీ వెడ్ సాగుకు అపారమైన అవకాశాలున్నాయని 1979–82లో నిర్వహించిన పరిశోధనల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 19 ప్రాంతాలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. తీర ప్రాంతంలో 78 రకాల సీవీడ్స్ ఉన్నప్పటికీ వాటిలో ‘కప్పాఫైకస్, గ్రాసిలేరియా’కు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. మూడురకాలుగా సాగు .. రాప్ట్, ట్యూబ్, మోనోలైన్ పద్ధతిలో వైర్లకు ద్రాక్ష తీగల మాదిరిగా మొక్కలను కడతారు.ఒక్కోదానికి 45–60 కేజీల వరకు సీవీడ్స్‌ను కట్టి అలల తాకిడి, పూడిక, చిక్కదనం లేని తీరప్రాంతంలో 6–8 మీటర్ల లోతులో వీటిని అమర్చి సాగు చేస్తారు. రూ.1.50లక్షల పెట్టుబడి.. రూ.6లక్షల ఆదాయం మార్కెట్లో కిలో నాచు రూ.60 పలుకుతోంది. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో 1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే 6లక్షల వరకు ఆదాయం వస్తుంది. పైగా పెట్టుబడిలో 60 శాతం సబ్సిడీ ఇస్తారు. రూ.1.86 కోట్లతో 7,200 యూనిట్లు రాష్ట్రానికి ఈ ఏడాది 7,200యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.1.12కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా, 74.40లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ఇప్పటికే జిల్లాలకు 55.80 లక్షలు విడుదల చేశారు. మార్కెటింగ్ కోసం పలు కంపెనీలు–సాగు దారుల మధ్య ఒప్పందం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సముద్ర నాచు సాగు లాభాలెన్నో తీర ప్రాంత మండలాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుçపర్చే లక్ష్యంతో సముద్ర నాచుసాగును ప్రోత్సహిస్తున్నాం. రానున్న 5 ఏళ్లలో 1.50లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం.రిస్క్ చాలా తక్కువ. పైగా కచ్చితమైన ఆదాయం. మత్స్యకార మహిళలు ముందుకు రావాలి. –కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
చేపల కోసం వస్తే కొండచిలువ చిక్కింది; ఫోటోలు వైరల్
భువనేశ్వర్: పామును దూరం నుంచి చూస్తేనే హడలెత్తిపోతాం. అలాంటిది చేపలకు బదులు కొండచిలువ చిక్కితే ఆ జాలరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొండి. కొంతమందికి ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఒడిశాలోని కలహండి జిల్లాలోని గొలముందా ఏరియాలో ఉన్న గంగా సాగర్ చెరువులో జాలరి రాజ్మల్ దీప్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చేపల కోసం వలవేస్తే ఏకంగా ఏడు అడుగుల పొడవున్న కొండచిలువ చిక్కింది. అదృష్టం బాగుండి ఆ కొండచిలువ అతనిపై దాడి చేయలేదు. దీంతో ఒక్కసారిగా షాకైన అతను ఆ తర్వాత తేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు కొండచిలువను వల నుంచి విడిపించి తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం కొండచిలువకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Odisha: A 7-feet long python was rescued from a fishing net near Ganga Sagar pond, Golamunda in Kalahandi district by the forest department on Saturday. The reptile was later released into the forest. pic.twitter.com/JU4sgw8r6L — ANI (@ANI) July 4, 2021 -
Photo Feature: వ్యాక్సిన్ వేసుకోండి.. లాటరీ గెలవండి!
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా వేసుకునేందుకు ప్రజలను పోత్సహించేందుకు అమెరికాలోని లూసియానా రాష్ట్ర రాజధాని బాటన్ రో సిటీలో లాటరీ ద్వారా నగదు, స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో రెండు నెలల విరామం అనంతరం మత్స్యకారులు వేటకు రెడీ అయ్యారు. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
వామ్మో.. పెద్ద చేప చిక్కిందిలా!
సాక్షి, కూసుమంచి: సాధారణంగా ‘వాలుగ’ చేప చిన్నగానే ఉంటుంది. కానీ, మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో ఏకంగా 15 కిలోల వాలుగ మత్స్యకారుల వలకు చిక్కింది. ఇక్కడ సోమవారం నుంచి చేపల వేట నిర్వహిస్తుండగా.. మంగళవారం బత్తుల పెద్దఉప్పయ్య అనే మత్స్యకారుడి వలకు ఈ భారీ చేప చిక్కింది. ఆ మత్స్యకారుడు ఈ చేపను కిలో రూ. 120 చొప్పున ఓ స్థానిక వ్యాపారికి విక్రయించాడు. ఈ రిజర్వాయర్‌లో మరికొన్ని చేపలు సుమారు 20 కిలోల వరకు కూడా బరువు ఉంటాయని ఇక్కడి మత్స్యకారులు తెలిపారు. ఇక్కడ చదవండి: అరుదైన ‘ఎర్ర చందనం’ చేప పోలీసుల్ని చూసి.. పరుగో.. పరుగు! -
పరిహారం ఎంచక్కా.. నిషేధం పక్కా..
పిఠాపురం: ఆకలితో ఉన్నవారికి గంజి నీళ్లు పోసినా పరమాన్నంలా స్వీకరిస్తారు. అలాంటిది పరమాన్నమే పెడితే.. ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అదే చేసింది. అవసరానికి ఆదుకుంది. సముద్రంలో చేపల వేట నిషేధం అమలవుతున్న సమయంలోనే.. మత్స్యకారులను కష్టాల సంద్రం నుంచి ఒడ్డుకు చేర్చేందుకు సకాలంలో భృతి పంపిణీ చేసింది. దీంతో, గతంలో పస్తులుండలేక నిషేధాన్ని ఉల్లఘించిన మత్స్యకారులే.. ఇప్పుడు స్వచ్ఛందంగా చేపల వేట నిషేధం పక్కాగా పాటిస్తున్నారు. పస్తుల వేళ పట్టించుకోని గత ప్రభుత్వం మత్స్యసంపద వృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధం అమలు చేస్తున్నాయి. వేట నిలిచిన సమయంలో మత్స్యకార కుటుంబాలు పూట గడవక ఆకలితో అలమటించేవి. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేట నిషేధ సమయంలో కొంత పరిహారం ప్రకటించేవారు. కానీ పస్తులుంటున్న సమయంలో ఇచ్చేవారు కాదు. గత ప్రభుత్వ హయాంలో నిషేధం పూర్తయిన తరువాత ఎప్పటికో పరిహారం.. అది కూడా కేవలం రూ.4 వేలు ఇచ్చేవారు. పరిహారం సకాలంలో అందక, ఇచ్చినది చాలక.. పూట గడిచే దారి లేక మత్స్యకారులు అధికారుల కళ్లుగప్పి చేపల వేట సాగించేవారు. దీంతో నిషేధం నీరుగారేది. ప్రస్తుతం ఇలా.. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో నాటి విపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచి, సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనిని గత ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. వేట నిషేధం అమలు ప్రారంభమైన వారం రోజుల్లోనే ఎటువంటి అవినీతికీ తావు లేకుండా, పార్టీలకు అతీతంగా ఈ వేట నిషేధ భృతి అందిస్తున్నారు. ఈ ఏడాది పరిహారం ఇప్పటికే మత్స్యకారుల ఖాతాలకు జమ చేశారు. దీంతో తమ కష్టాలు గట్టెక్కాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణకు ఆర్థిక సహాయం సకాలంలో అందడంతో మత్స్యకారులు స్వచ్ఛందంగా వేట నిషేధం అమలు చేస్తున్నారు. పక్కాగా నిషేధం అమలు మత్స్యకారులు చేపల వేట నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. దీంతో నిషేధం పక్కాగా అమలవుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది చేపల అక్రమ వేట లేదు. గతంలో మత్స్యశాఖతో పాటు పోలీసు, మెరైన్ అధికారులు దాడులు చేయాల్సి వచ్చేది. ఎక్కువ మంది నిషేధాన్ని ఉల్లంఘించి చేపల వేట సాగించే వారు. వారిపై కేసులు నమోదు చేసే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ వేటకు వెళ్లడం లేదు. దీంతో అధికారులు దాడులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పరిహారం సక్రమంగా, సకాలంలో అందడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. – పి.వెంకట సత్యనారాయణ, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ, కాకినాడ పరిహారం అంటే ఇలా ఇవ్వాలి వేట నిలిపివేయండనేవారు. మా జీవనోపాధి ఆగిపోయేది. తిండి లేక అలమటించే వాళ్లం. అది కూడా రూ.4 వేల పరిహారం ఇస్తామనే వారు. అది కూడా నెలలు గడిచినా ఇచ్చేవారు కాదు. నిషేధ కాలం పూర్తయినా పరిహారం అందేది కాదు. దీంతో అప్పుల పాలయ్యేవాళ్లం. ఇప్పుడలా కాదు. వేట నిషేధం మొదలయిన వెంటనే పరిహారం ఇచ్చేశారు. నేతల సిఫారసులు లేవు. అవినీతి అసలే లేదు. పార్టీలని ఎక్కడా చూడలేదు. అందరికీ సక్రమంగా అందింది. ఇలా సకాలంలో పరిహారం ఇస్తే ఇక మేం ఎందుకు తప్పు చేస్తాం? ఎంతో ఆనందంగా మా బతుకులు బతుకుతున్నాం. పరిహారం అంటే ఇలా ఇవ్వాలి. అంతే కానీ ఎప్పుడో ఇచ్చేది పరిహారం ఎలా అవుతుంది? – బెనుగు శ్రీను, మత్స్యకారుడు, కోనపాపపేట అవసరానికి ఆదుకుంటున్నారు ఇస్తానన్న పరిహారం సరైన సమయానికి ఇచ్చేస్తున్నారు. అవసరానికి ఆదుకుంటే పక్కదారులు పట్టాల్సిన అవసరం ఏముంటుంది. అందుకే ఎవరూ చేపల వేట నిషేధాన్ని కాదని వేటకు వెళ్లడం లేదు. గతంలో తక్కువ వచ్చేది. ఇప్పుడు సరిపడినంత పరిహారం ఇస్తున్నారు. దీంతో ఇబ్బందులు లేకుండా రెండు నెలలూ గడుస్తున్నాయి. మా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, ఆదుకోవడంతో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉంటున్నాం. గతంలో పరిహారం సక్రమంగా అందక దొంగచాటుగా చేపల వేటకు వెళ్లే వారు. – కుప్పిరి స్వామి, మత్స్యకారుడు, కోనపాపపేట -
కరోనా ‘వల’కు చిక్కొద్దు..!
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను ఎంతలా తలకిందులు చేస్తున్నా, ఇప్పటికీ కొందరు వైరస్ పట్ల అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చెరువులోని చేపలను దక్కించుకునే క్రమంలో కరోనా నిబంధనలను సైతం పక్కనపెట్టేశారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ మునీర్ ఖాన్ రూ.1.75 లక్షలకు గ్రామ పంచాయతీ వేలంపాటలో పెద్ద చెరువును కైవసం చేసుకున్నాడు. జూన్ 8 వరకు చెరువులో చేపలు పట్టుకునేందుకు ఆయనకు అవకాశం ఉంది. గురువారం చేపలు పట్టుకునేందుకు మునీర్ ఖాన్ చెరువు వద్దకు రాగా, అప్పటికే చుట్టుపక్కల గ్రామాలైన వాల్యతండా, వట్టిఖమ్మంపహాడ్, జగనా తండా, మంగళితండా, అక్కలదేవి గూడెం నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వచ్చి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పక్కనబెట్టి మరీ చేపలను లూఠీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రజలను చెదరగొట్టారు. – చివ్వెంల (సూర్యాపేట) చదవండి: హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..! Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి -
చేపలకు వల వేస్తే 100 కేజీల మొసలి పడింది!
సాక్షి, గూడూరు(వరంగల్): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొమ్మాయికుంట ఊర చెరువులో చేపల కోసం వేసిన వలలో ఓ భారీ మొసలి చిక్కింది. మత్స్యకారులు పెసరి శివ, స్వామి, రాములు ఎప్పటిలాగానే మంగళవా రం రాత్రి చేపలు పట్టడం కోసం వలలు వేసి వెళ్లారు. బుధవారం వలలో పడిన చేపలను బయటికి తీసేందుకు రాగా భారీ మొసలి కనిపించింది. సుమారు 100 కిలోలకు పైగా ఉన్న మొసలిని బంధించేందుకు రెండు గంటల పాటు శ్రమించారు. అనంతరం అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని పాకాల సరస్సులో వదిలేందుకు జీపులో తీసుకెళ్లారు. -
ఈ మహిళలు మీనముత్యాలు!
వనపర్తి: పురుషుల కంటే తామేమీ తీసిపోబోమని కృష్ణా నదీ తీర ప్రాంతానికి చెందిన మహిళలు నిరూపిస్తున్నారు. కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లిలో 309 కుటుంబాలు ఉండగా అందులో 45 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారి జనాభా 200 వరకు ఉంటుంది. గ్రామంలో కొందరు మహిళలు భర్తలతోపాటు 25 ఏళ్ల నుంచి చేపల వేటను సంప్రదాయ వృత్తిగా కొనసాగిస్తున్నారు. కృష్ణా నదిలో ఎక్కువగా నీరు నిలిచినప్పుడు (శ్రీశైలం బ్యాక్‌వాటర్) పుట్టీల్లో కూర్చొని సాలు వలల సాయంతో చేపల వేట సాగిస్తున్నారు. చెరువుల్లో చేపల వేట కోసం ఉపయోగించే వలలకు ఈ సాలు వలలు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కటీ 200 నుంచి 400 అడుగుల పొడవు.. 10 అడుగుల వెడల్పు ఉంటాయి. ప్రస్తుతం కొందరు మహిళలు నదిలోకి ఒంటరిగానే వెళ్లి చేపలు పడుతున్నారు. మత్స్యకారుల కుటుంబాల్లోని మహిళలతోపాటు బోయ, కుమ్మర, ముస్లిం మతానికి చెందిన వారు కూడా చేపలు వేటాడుతుంటారు. అయితే వారి కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. వారు తెచ్చే చేపలను గంపగుత్తగా అన్ని రకాల చేపలను కిలో రూ. 30 చొప్పునే కొనుగోలు చేస్తూ వారానికోసారి డబ్బులిస్తున్నారు. ఆరు నెలలు చేపల వేట.. కృష్ణా తీర ప్రాంతంలోని తిప్పాయిపల్లిలో చాలా కుటుంబాలు ఏడాదిలో ఆరు నెలలు చేపలవేటపై ఆధారపడి జీవిస్తుంటాయి. మిగతా సమయంలో పొలాలు ఉన్నవారు వ్యవసాయం, ఉపాధి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకుని తీర ప్రాంతానికి చెందిన పెంచికలపాడు, గుమ్మడం, యాపర్ల, బస్వాపురం గ్రామాల్లోని మహిళలు సైతం చేపలవేట కోసం ఏటి(నదిలోకి)కి వెళ్తుంటారు. ఏటా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు చేపలవేట కొనసాగిస్తుంటారు. మార్చి మొదటివారం నుంచి నీరు తగ్గడంతో.. ప్రస్తుతం ఐదారు కుటుంబాల కంటే ఎక్కువమంది మహిళలు చేపల వేటకు వెళ్లడం లేదు. పట్టించుకోని మత్స్యశాఖ.. తిప్పాయిపల్లితోపాటు కృష్ణా నది తీర ప్రాంతంలోని ఏ గ్రామంలోని మత్స్యకార కుటుంబాలకు లైసెన్స్‌లపై అవగాహన కల్పించడంలో మత్స్యశాఖ విఫలమైంది. ఆయా గ్రామాలకు చెందిన చేపలు పట్టే మహిళలకు లైసెన్స్‌లు లేకపోవడంతో (వరుసగా మూడేళ్లు లైసెన్స్ రెన్యూవల్ ఉండాలి) మత్స్యశాఖ నుంచి బీమా, ఇతర ప్రయోజనాలు పొందడానికి అర్హత ఉంటుంది. మరోవైపు ఒక్కో సాలు వల రూ. 3 వేలు, పుట్టి రూ. 15 వేలు ఉంటుంది. రాళ్లు, ముళ్ల కంపలు వరదతో కొట్టుకొస్తే వలలు చిరిగిపోయి కొత్తవి కొనాల్సి వస్తోందని మత్స్యకార మహిళలు చెబుతున్నారు. -
విషాదం: నాన్నా.. మునిగిపోతున్నా!
చినగంజాం(ప్రకాశం జిల్లా): చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులను కాలువ బలి తీసుకుంది. ఉపాధినిచ్చే వలే వారిని చుట్టేసి ప్రాణాలు తీసింది. నాన్నా.. మునిగిపోతున్నా కాపాడమంటూ కేకలు వేస్తున్న బిడ్డను చూసి నీటిలో దూకిన తండ్రి కూడా జలదిలోనే కలిసిపోయాడు. భర్త, బిడ్డను పోగొట్టుకుని గుండెలు బాదుకుంటున్న ఆ ఇల్లాలిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈ విషాదకర ఘటన చినగంజాం మండలంలోని మత్స్యకార గ్రామంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెపాలెం పంచాయతీ పరిధిలో బాపయ్యనగర్‌కు చెందిన ఐలా జోగియ్య(40), విజయ దంపతులకు ఇద్దరు బిడ్డలు. కుమారుడు రామ్‌చరణ్ (13) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె హారిక 3వ తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జోగియ్య తన కుమారుడిని వెంటబెట్టుకొని సముద్రం తీరంలోని కాలువలో చేపల వేటకు వెళ్లాడు. వలను సమీపంలోని కాలువలో బోటుకు అమర్చి, ఆదివారం ఉదయం అందులో పడిన మత్స్య సంపదను ఇంటికి తీసుకెళ్లాలని భావించారు. కర్ర తెప్పపై వెళ్తూ వలను కాలువలో అమరుస్తుండగా రామచరణ్ బోటు నుంచి ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈదలేక నాన్నా.. నాన్నా.. అంటూ పెద్దగా కేకలు వేశాడు. వల సరిచేస్తున్న జోగియ్య మునిగిపోతున్న బిడ్డను కాపాడుకోవాలనే ప్రయత్నంలో చేతిలో ఉన్న వలతో సహా నీటిలో దూకేశాడు. అతడి చేతిలో ఉన్న వల ఇద్దరినీ కమ్మేయడంతో నీటి నుంచి బయటకు రాలేకపోయారు. సమీపంలో వేట చేసుకునే మత్స్యకారులు వచ్చి రక్షించేలోగా ప్రాణాలు వారు కోల్పోయారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చేందుకు సుమారు 2 కి.మీ దూరం తెప్పలోనే ప్రయాణించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల వైద్యశాలకు తరలించారు. తండ్రీ కుమారుడి మృతితో బాపయ్యనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. -
వినూత్న పడవను తయారు చేసిన సిద్దిపేట వాసి!
సాక్షి, సిద్దిపేట: ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. చేయాలనే తపన ఉండాలే కానీ ఏది అసాధ్యం కాదు. కొంత ఆవిష్కరణలు ఎన్నో సృష్టించవచ్చు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శంకర్ సాదాసీదా మెకానిక్. మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన ఇతనికి తమ కులవృత్తుల వారికి ఏదో చేయాలనే ఆలోచన తట్టింది. తనకున్న అనుభవంతో ప్రతిభకు పదును పెట్టి చేపలు పట్టేందుకు వినూత్నంగా పడవ తయారు చేశాడు. పాత బైక్ హ్యాండిల్, ఇంజిన్, ఫ్యాన్ రెక్కలతో నీళ్లలో తిరుగుతూ చేపలు పట్టేందుకు వీలుగా బోట్‌ను తయారు చేశాడు. చదవండి: అతడికి ఏమైంది..? -
చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
చేపల వేటలో సరదాగా ఎమ్మెల్యే
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నీటి కాలువలో చేపలు పట్టి సరదా తీర్చుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగుపయమైన ఎమ్మెల్యే బండర్ వల్లి బ్రిడ్జి దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు ప్రవహిస్తుండటాన్ని చూసిన అక్కడ కాసేపు ఆగారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇంతలో అక్కడ కొంత మంది గాలాలతో చేపలు పడుతుండటాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. వారి వద్దనున్న చేపల గాలలను తీసుకుని తాను కూడా కాసేపు చేపలకు గాలం వేశారు. తాను చిన్నతనంలో సరదాకు గాలాలతో చేపలు పట్టే వాడినని, మళ్లీ ఇన్నేళ్లకు చేపలు పట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా, తన గాలానికి చేప పడటంతో ఎమ్మెల్యే మరింత ఆనందపడ్డారు. ఎమ్మెల్యే స్వయంగా చేపలు పట్టి సరదా తీర్చుకోవడంతో స్థానికులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సెల్ఫీ ప్రమాదం: కళ్లముందే కూతురు జలసమాధి) -
మూసీలో చిక్కుకున్న యువకులు
సూర్యాపేటరూరల్ : చేపల వేటకు వెళ్లి సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామ సమీపంలో గల మూసీ నదిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన షబ్బీర్, సోహెల్, కైఫ్‌లు వరదనీటిలో చిక్కుకొని కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇతర అధికారులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకొని మూసీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతి తగ్గింపులో భాగంగా గే ట్లను కొంత మేర కిందకు దించారు. దీంతో స్థానికులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు యువకులను తాళ్ల సహాయంతో కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వద్దన్నా చేపల వేటకు.. ఆదివారం ఉదయాన్నే ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు షబ్బీర్, సోహెల్, కైఫ్‌లు మూ సీ నదిలోకి చేపల వేటకు వెళ్తుండగా కేటీ అన్నారం గ్రామస్తులు మూసీ గేట్లు ఎత్తారని, చేపల వేటకు వెళ్తే ప్రమాదంలో పడుతారని చెప్పినప్పటికీ వారు వినలేదు. ఉదయం 9 గంటల ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ము గ్గురు సాయంత్రం సమయంలో వరదనీటిలో గల్లంతై కేకలు వేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి సూర్యాపేటరూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్పీ భాస్కరన్, సూర్యాపేట ఆర్డీఓ కాసుల రాజేంద్రకుమార్, సూ ర్యాపేటరూరల్ సీఐ విఠల్‌రెడ్డి, తహసీల్దార్ వెంకన్న, జెడ్పీటీసీ జీడి భిక్షం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మూసీ నదిలో చిక్కుకున్న యువకులను స్థానిక ప్రజలు, పోలీసు, అధికారుల భాగస్వామ్యంతో రెస్క్యూ చేసి కాపాడినట్లు జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ అ«ధికారులకు స్థానిక ప్రజలు సహకారం అందించడం అభినందనీయమన్నారు. వర్షాలు బాగా కురుస్తుండడంతో నదులు, వాగులు, నీటితో నిండి ప్రవహిస్తున్నాయని, ఈ సమయంలో నీటిలోకి వెళ్లడం ప్రమాదకరమన్నారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సంఘటనకు సంబంధించి సమాచారం అందగానే వేగంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలు అభినందనలు తెలిపారు. ముగ్గురు యువకులు క్షే మంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘పేట’ పోలీసులకు డీజీపీ అభినందన సూర్యాపేటరూరల్ : సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మూసీనదిలో చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు, అధికారుల సహాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందగానే స్థానిక ప్రజలు ముగ్గురు యువకులను కాపాడేందుకు అందించిన సహకారం అభినందనీయమని ఎస్పీ భాస్కరన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి రెస్క్యూ టీంలో పాల్గొన్న స్థానిక ప్రజలను, పోలీసులను, అధికారులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
మొసళ్లతో మోసం..!
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పాల్వంచ కిన్నెరసాని డ్యామ్ గేట్లను ఎత్తడంతో నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కొందరు యువకులు రాజాపురం– ఉల్వనూరు మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన వద్ద నీటి ప్రవాహంలో దోమల తెరల ద్వారా చేపల వేట సాగిస్తున్నారు. గతంలో గేట్లు తెరిచిన కొన్ని సందర్భాలలో కిన్నెరసాని డ్యామ్‌లో ఉన్న మొసళ్లు నీటి ప్రవాహానికి బయటకు కొట్టుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్రాంతం అయినప్పటికీ ఎటువంటి హెచ్చరికలు బోర్డులు లేకపోవడంతో ఇలా కొందరు యువకులు గురువారం చేపల వేట సాగిస్తు్తండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది.– సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
మత్స్యకార కుటుంబాల సాంఘిక బహిష్కరణ
సాక్షి, నిజామాబాద్: మత్స్యకార కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో చోటుచేసుకుంది. బహిష్కరించిన 38 కుటుంబాలకు ఎవరైనా సాయం చేస్తే వారికి కూడా అదే గతి పడుతుందని గ్రామాభివృద్ధి కమిటీ హుకూం జారీ చేసిందని బాధితులు తెలిపారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ లకు మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. తమకు కనీసం పాలు వంటి నిత్యావసరాలు కూడా అందివ్వడం లేదని, వ్యవసాయ పనులకు కూడా పిలవొద్దంటూ కమిటీ సభ్యులు ఆదేశాలు జారీ చేశారని మత్స్యకారులు వాపోయారు. (గణేష్ ఉత్సవం నిరాడంబరంగా జరుపుకోవాలి) ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు ఇస్తుంది కాబట్టి గ్రామానికి ప్రతి ఏటా లక్ష రూపాయాలు చెల్లించి గ్రామంలో తాము నిర్ణయించిన ధరకే చేపలు అమ్మాలని హుకుం జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి తాము ఒప్పుకోకపోవడంతో కక్ష కట్టి సాంఘిక బహిష్కరణకు ఆదేశాలు జారీ చేశారని మత్స్యకారులు వాపోయారు. కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు, మానసిక క్షోభకు గురవుతున్నామని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధులైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. (గర్భిణి సింధూరెడ్డి మృతదేహం లభ్యం) -
చేపల వ్యాపారి నుంచి 119 మందికి కరోనా
తిరువనంతపురం: కేరళలోని పుంథూరా గ్రామంలో మొట్టమొదటి కరోనా క్లస్టర్ ఏర్పాటైంది. అత్యధిక సూపర్ స్ప్రెడర్లను గుర్తించిన అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 కమాండోల బృందాన్ని ప్రస్తుతం అక్కడ మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవనవసరంగా ఎవరైనా బయట కనబడితే క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించారు. సాధారణంగా ఒక వ్యక్తి ద్వారా కరోనా వైరస్ ఆరుగురికి సోకితే అతన్ని సూపర్ స్ప్రెడర్ అంటాం. అయితే పుంథూరా గ్రామంలో మాత్రం అత్యధిక సూపర్ స్ప్రెడర్లు ఉన్నారు. వీరి ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆరు ప్రత్యేక వైద్య బృందాలు అక్కడికి చేరుకొని యుద్దప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. (ఫిబ్రవరి నాటికి రోజుకు 2.87 లక్షల కేసులు) పుంథూరా గ్రామంలో మొదటిసారిగా చేపల వ్యాపారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా 600 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం ఐదు రోజుల్లోనే 119 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. వ్యాపారి తమిళనాడులోని ఓ స్థానిక మార్కెట్లో చేపలు విక్రయిస్తుంటాడని తేలింది. అయితే ఒక వ్యక్తి నుంచి ఇప్పటికే 119 మందికి వైరస్ సోకడంతో అధికారులు సైతం విస్తుపోయారు. పుంథూరా తీర ప్రాంతం కావడంతో చాలా కుటుంబాలు చేపల వేట పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మత్యకారులు ఎవరూ దీంతో చేపల విక్రయాలకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా ఆదేశించారు. గ్రామం మొత్తాన్ని శానిటైజేషన్ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని ప్రతీ కుటుంబానికి 5 కిలోల బియ్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 301 కొత్త కరోనా కేసులు నమోదు కాగా వీటిలో త్యధికంగా పుంథూరా, తిరువనంతపురం నుంచి నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (ఒక్కరోజులో రికార్డు కేసులు ) -
ఆశల వేటకు గంగపుత్రులు సిద్ధం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఆశల వేటకు అంతా సిద్ధమైంది. సుమారు 61 రోజుల తర్వాత సముద్రాన్ని మదించేందుకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బోట్లను తీర్చిదిద్దుతూ, వలలను అల్లుకుంటూ, ఇంధనాన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట నిషేధ కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకారులు ఇక ఆ కష్టాలను మరిచిపోయి తమ బతుకు వేటవైపు సాగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నెల 1న వేటకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 2న అర్ధరాత్రి నుంచి వేటకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందడిగా ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలో ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోయిన చేపల వేట తిరిగి ఈ నెల 2న మొదలు కానుంది. చేపల వేట నిషేధం నేపథ్యంలో జిల్లాలో సుమారు ఆరు వేల బోట్లు తీరంలో నిలిచిపోయాయి. వేటకు బయలుదేరే సమయం ఆసన్నం కావడంతో ఫిషింగ్ హార్బర్లోని బోట్ల యజమానులు తమ బోట్లకు దాదాపు మరమ్మతులు పూర్తి చేసుకుని, ఇంధనం, ఇతర సామగ్రి సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. చేపల రేవు కేంద్రంగా నిత్యం 678 పడవలు, 2,996 మరపడవలు, సంప్రదాయ పడవలు 742, (జిల్లా వ్యాప్తంగా మొత్తం మరపడవలు 4,416) 1100 తెప్పలు నిత్యం చేపలు, రొయ్యల వేట సాగిస్తుంటాయి. తొలి రోజు 150 వరకూ బోట్లు వేటకు వెళ్లే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. బోట్లలో పనిచేసే కుర్రాళ్లు సైతం ఎప్పుడెప్పుడు వేటకు వెళ్తామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చేపల వేట విరామ సమయంలో కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకార కార్మికులు తిరిగి నగరానికి చేరుకున్నారు. వేట కొనసాగుతుందన్న ఉత్సాహం వారి కళ్లలో కనిపిస్తుంది. ఒక బోటు వేటకు వెళ్లేందుకు చేసే ఖర్చు... ►20 రోజులపాటు వేట సాగించే బోటుకు 4 వేల లీటర్లు ఇంధనం అవసరమవుతుంది. సుమారు రూ.3 లక్షలు. ►వలలు సుమారు రూ.30 వేలు. ►బీమా చెల్లింపులు సుమారు రూ.60వేలు. ►ఆహార సామగ్రి రూ.10 నుంచి రూ.15వేలు. ►సుమారు 15 టన్నుల ఐస్ రూ.22 వేలు. ►ఇతర సామగ్రి ఖర్చులు సుమారు 30 వేలు. ►మొత్తంగా యజమానులు ఒక్కో బోటుపై సుమారు రూ.4.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజు వేటకే మొగ్గు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లవారుజామున వేటకు వెళ్లి అదేరోజు సాయంత్రం జెట్టీకి చేరేందుకు అత్యధికులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ బోట్లు జెట్టీలకు చేరుకున్నా చేపలు అమ్మే విషయంలో విధివిధానాలు విధించడంతో లాంగ్ రన్ వేట కన్నా రోజువారీ వేటకే బోటు యజమానులు సిద్ధపడుతున్నారు. బోట్లు 2వ తేదీ అర్ధరాత్రి వెళ్లి 3వ తేదీ జెట్టీలకు చేరడం వల్ల చేపల మార్కెట్ కూడా 3న తెరుచుకోనుంది. టన్ను ఐస్ రూ.1400 ఫిషింగ్ హార్బర్లో ఉన్న 11 ఐస్ ఫ్యాక్టరీల్లో నాలుగు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కారి్మకులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారంతా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. కొన్ని రోజులపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఐస్ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఐస్ ధర టన్ను రూ.1400లు వరకూ ఉన్నా అన్ని బోట్లు ఒకేసారి వెళ్లకపోవడం, లాంగ్‌రన్‌కు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఐస్‌కు డిమాండ్ లేదేని యజమానులు చెబుతున్నారు. నిబంధనలు తప్పక పాటించాలి మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పక పాటించాలని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కె.ఫణిప్రకాష్ పేర్కొన్నారు. మరబోట్ల సంఘాల అధ్యక్షులు, బోటు యజమానులు, ఎగుమతిదారులు, చేపల వర్తక సంఘాల ప్రతినిధులతో ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జేడీ మాట్లాడుతూ బోట్లమీద పనిచేసే కలాసీలు, జెట్టీల మీద ఉండేవారు, చేపల వ్యాపారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హార్బర్ జెట్టీల మీద ఐదుగురికి మించి ఉండరాదన్నారు. జూన్ 1 నుంచి వేటకు అనుమతిచ్చినా బోటు యజమానులు 2వ తేదీ అర్ధరాత్రి బయలుదేరనున్నారని, వీరు వేట ముగించి ఏ జెట్టీకి తమ బోటును చేరుస్తారో అక్కడే సరకు దించాలని సూచించారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిన అన్ని బోట్లను ఒకే జెట్టీమీదకు చేర్చకూడదని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆటోలు, వ్యాన్లకు హార్బర్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. హార్బర్లోని షెడ్లలో వేలం నిర్వహణ కొనసాగుతుందని, వేలంలో పాల్గొనే మత్స్యకారులు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణరావు, మరబోట్ల సంఘాల ప్రతినిధులు పి.సి.అప్పారావు, బర్రి కొండబాబు, సీహెచ్.సత్యనారాయణమూర్తి, పోర్టు సిబ్బంది, వివిధ మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బుడ్డోడి వలకు చిక్కిన ఖజానా; కానీ
కొలంబియా: ఏళ్ల తరబడి సమాధానం దొరకని కేసును ఓ బుడతడు చిటికెలో పరిష్కరించాడు. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోలినాలో కొన్నేళ్ల క్రితం దొంగతనం కేసు నమోదైంది. ఆ కేసులో చోరీ అయిన విలువైన వస్తువులు, ఆభరణాలు వేటినీ పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో అది ఎటూ తేలకుండా మిగిలిపోయింది. ఇదిలా వుండగా లాక్డౌన్ టైంలో బోర్ కొడుతోందని జాన్స్ ఐలాండ్‌కు చెందిన నాక్స్ బ్రేవర్ అనే కుర్రాడు తన కుటుంబ సభ్యులతో కలిసి మాగ్నెట్ ఫిషింగ్‌కు వెళ్లాడు. అంటే అయస్కాంత గాలంతో నీళ్లలో ఉన్న మెటల్ వస్తువులు వెలుగు తీయడం అన్నమాట. విట్నీ సరస్సులో గాలం వేయగా నీళ్ల అడుగు భాగాన ఓ వస్తువు గాలానికి తగిలింది. (‘ఇవి బంగారం కాదు.. నిజంగా ప్రకృతి అద్భుతం’) అది బరువుగా ఉండటంతో దాన్ని పైకి తీసేందుకు పిల్లవాడు ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో ఇతరుల సహాయం తీసుకుని ఎలాగోలా శక్తినంతా కూడదీసుకుని లాగడంతో ఓ పెట్టె బయట పడింది. అందులోని వస్తువులను చూసి అక్కడున్న వాళ్ల కళ్లు జిగేల్మన్నాయి. ఆ పెట్టె నిండా ధగధగ మెరిసే నగలు, ఖరీదైన వస్తువులు క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ ఉన్నాయి. దీంతో బుడ్డోడి తండ్రి దీని వెనక ఏదో పెద్ద కథే ఉంటుందని భావించి అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఖజానా పోగొట్టుకున్న మహిళను పిలిపించి ఆమెకు అందజేశారు. ఆమె పోగొట్టుకున్నవి ఇన్నేళ్ల తర్వాత తిరిగి దక్కడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. దీనికి కారణమైన పిల్లోడి ముందు మోకాలిపై మోకరిల్లి అతడిని మనసారా హత్తుకుని కృతజ్ఞతలు తెలిపింది. (‘బుద్ధుందా.. లాక్డౌన్లో ఇలాంటి పిచ్చి వేషాలా?’) -
బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..
న్యూయార్క్ : టేనస్సీకి చెందిన కోయ్ ప్రైజ్ కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి చేపలు పట్టడానికి స్పెన్సర్ క్రీక్‌కు వెళ్లాడు. అక్కడి ఓల్డ్ హైకోరీ సరస్సులో కుటుంబసభ్యులందరూ చాకచక్యంగా చేపలు పడుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కోయ్ సహోదరిలు కూడా అతడి కంటే పెద్దపెద్ద చేపలు పడుతున్నారు. దీంతో అతడి మనసు కొద్దిగా చివుక్కుమంది. ఎలాగైనా వారికంటే పెద్ద చేపను పట్టాలని, దేవుడ్ని మొక్కి మరీ గాలాన్ని సరస్సులో వేశాడు. కొద్దిసేపటి తర్వాత ఏదో చేప గాలానికి చిక్కుకున్నట్లు తెలిసింది. పైకి ఎంత లాగుతున్నా కానీ, అది రావటం లేదు. కుటుంబసభ్యుల సహాయంతో గట్టిగా లాగగా పెద్ద చేప బయటపడింది. 35 కేజీలు, దాదాపు కోయ్ అంత పొడవు ఉందా చేప. పిల్లాడి ఆనందం, ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. ( సూర్యుడు కూడా ‘లాక్డౌన్’! ) చేపను నీళ్లలో వదిలేసిన దృశ్యం తను కల్లో కూడా ఊహించని ఘటన జరిగేసరికి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దానితో ఫొటోలు దిగి, మళ్లీ నీళ్లలోనే వదిలేశాడు. టేనస్సీ వైల్డ్ లైఫ్ రీసోర్స్ ఏజెన్సీ ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తమ ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో కోయ్ సోషల్ మీడియా ఫేమస్ అయిపోయాడు. నెటిజన్లందరూ అతడ్ని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ( అడవి కుక్క వింత శబ్దం.. భయపడిన పులి ) -
సరైన సమయంలో కరోనా దెబ్బ..
సాక్షి, మచిలీపట్నం: సముద్రంలో మత్స్యసంపదను పెంపొందించే ప్రక్రియలో భాగంగా మరపడవలు, ఫైబర్ బోట్లతో చేపల వేటను మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధించనున్నారు. ఈ నిషేధం జూన్ 14 అర్ధరాత్రి వరకు రెండు నెలల పాటు అమల్లో ఉండనుంది. జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం నాలుగు మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 64 తీరగ్రామాల్లో 1,63,877 మంది మత్స్యకారులుండగా, వారిలో 38,914 మంది పూర్తిగా వేట ఆధారంగానే జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 117 మెకనైజ్డ్, 1,530 మోటరైజ్డ్, 139 సంప్రదాయ బోటులు ఉన్నాయి. మెకనైజ్డ్ బోటుపై 8 మంది, మోటరైజ్డ్ బోటుపై ఆరుగురు, సంప్రదాయ బోటు లపై ముగ్గురు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సరైన సమయంలో కరోనా దెబ్బ.. సాధారణంగా వేట నిషేదానికి ముందు సాధ్యమైనంత ఎక్కువ వేట చేయాలన్న ఆలోచనతో బోట్లన్నీ సముద్రం మీదకు వెళ్తుంటాయి. ప్రతిరోజు కనీసం 50 శాతం బోట్లు వేటకెళ్తుంటాయి. గతేడాది నవంబర్ 21 నుంచి ఆయిల్ సబ్సిడీని పెంపు అమలులోకి రావడంతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వేటకు వెళ్లే ప్రతి బోటుకు 2 నుంచి 3 టన్నులకు పైగా టూనా, రొయ్యలు పడుతుంటాయి. ఇటువంటి సమయంలో కరోనా మరమ్మారి విరుచుకుపడడంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ఎక్కడ బోట్లు అక్కడే నిలిచిపోయాయి. వేటకు వెళ్లిన బోట్లు సైతం తీరానికి వచ్చేశాయి. జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు ఒక్క బోటు కూడా వేటకు వెళ్లిన దాఖలాలు లేవు. జూన్ 14వ తేదీ వరకు మళ్లీ వేటకు వెళ్లే చాన్స్ లేదు. ఈ నేపథ్యంలో నిషేధ కాలంలో ఇచ్చే భృతిని లాక్డౌన్ సమయానికి కూడా వర్తింప చేయాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లాక్డౌన్ కాలానికీ భృతినివ్వాలి.. వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా.. ఆయిల్ సబ్సిడీని రూ.9లకు పెంచడంతో ఎంతో సంబరపడ్డాం. గతంలో ఎన్నడూ లేని విధంగా బోట్లన్నీ వేటకు వెళ్తున్న వేళ కరోనా మహమ్మారి మా ఉపాధికి గండి కొట్టింది. ఈ నేపథ్యంలో వేట నిషేధ సమయంతో పాటు లాక్డౌన్ అమలులోకి వచ్చిన 21 రోజులు కూడా నిషేధ భృతినివ్వాలని కోరుతున్నాం. అలాగే కాలువలపై వేట సాగించే వారితో పాటు ఎండుచేపలు, మార్కెట్లపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులను కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. – లంకే వెంకటేశ్వరరావు, బోట్ల యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
అదిగదిగో చేప..!
కాకినాడ జగన్నాధపురానికి చెందిన 47 ఏళ్ల ఎన్.బాబులు చేపల వేటకు వెళ్లి రెండు రోజులైంది. 170 లీటర్ల డీజిల్ ఖర్చయిపోయింది. ఎక్కడా చేపలు దొరకలేదు. ఎక్కడో దారి తప్పామని భావించాడు. శ్రీలంక సరిహద్దు రేఖ దగ్గరకు వచ్చినట్లు భావించి తన మిత్రుడికి ఎస్ఎంఎస్ పంపాడు. సముద్రంలోని ఏ ప్రాంతంలో చేపలు దొరుకుతున్నాయో ఎఫ్‌ఎఫ్‌ఎంఏ యాప్‌లో చూసి కబురు పంపాడు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆవైపు వెళ్లి వేట సాగించి చేపలు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. వేటకు బయలుదేరబోయే ముందు ఏవైపు వెళ్లాలో నిర్ణయించుకుని సమయాన్ని, ఆయిల్‌ను ఆదా చేసుకుంటున్నాడు. సాక్షి, అమరావతి : ఒకప్పుడు అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతున్న రోజులివి. చేపల వేటేమిటీ? యాప్ అప్రమత్తం చేయడమేమిటని విస్తుపోకండి. ఎఫ్‌ఎఫ్‌ఎంఏ యాప్ ఉంటే సముద్ర సమాచారం మూడొంతులు అరచేతిలో ఉన్నట్టే. 2004 డిసెంబర్ 26న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చిన సునామీతో జాలర్లు సహా ఎంతో మంది చనిపోయారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా వచ్చిన ఆ ఉపద్రవం వందలాది మందిని మింగేసింది. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేత పట్టుకుని సముద్ర గర్భంలో చేపల వేటకు వెళ్లే వారి ఉపయోగార్ధం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్), క్వాల్కామ్, టీసీఎస్, ఇన్కాయిస్ సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. ఇది ఇంగ్లిషుతో పాటు తెలుగు, తమిళం, మళయాళం, ఒడియా, బంగ్లా, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ఉంది. చేపల వేటతో పాటు సముద్ర ఆటుపోట్ల సమాచారాన్ని అందిస్తుంది. ప్రమాదకరమైన ప్రాంతాలు, పడవలు మునిగే ప్రమాదం ఉన్న ప్రదేశాలు, గతంలో ప్రమాదం జరిగిన స్థలాల సమా చారాన్ని అందిస్తుంది. ఏవైపు వెళితే చేపలు దొరుకుతాయో రేఖాంశాలు, అక్షాంశాలతో సహా చూపిస్తుంది. ఎన్నెన్నో ఉపయోగాలు వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం, అలల ఎత్తు, గాలి వేగం, అలల దిశ, సముద్ర ఉపరితల వాతావరణం రాబోయే 48 గంటల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అందిస్తుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), దిక్సూచి (కంపాస్), హార్బర్‌ను గుర్తించే విధానం (హార్బర్ నావిగేషన్), మై ట్రాకర్ (తనను గుర్తించే విధానం), సంప్రదాయ చేపలు, ట్యూనా చేపలు దొరికే ప్రాంతాలు, వేట సాగించాల్సిన మార్గం ఉంటాయి. మొబైల్ ఫోన్‌కు ఇంటర్నెట్ లేకున్నా జీపీఎస్, నావి గేషన్లోని సౌకర్యాలను పొందవచ్చు. ప్రధాన హార్బర్లలో చేపల ధరల వివరాలు, సముద్రంలో అత్యవసర సాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, ఎస్ఓఎస్ (మమ్మల్ని కాపాడండి) పంపే సౌలభ్యం, ప్రభుత్వం తెలిపే నిర్ధిష్ట సమాచారం, ఉద్యోగ అవకాశాలు, శిక్షణ, మత్స్యకారులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, రాయితీలు వంటి సమాచారం పొందవచ్చు. ఎఫ్‌ఎఫ్‌ఎంఏ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగులో ఇతరత్రా సమాచారం కోసం డాక్టర్ ఎన్. వీరభద్రరావు (9866049073)ను ఫోన్లో సంప్రదించవచ్చు. ఇన్కాయిస్ పాత్ర కీలకం సముద్ర సమాచార సేవలకు సంబంధించి భారత జాతీయ కేంద్రం (ఇన్కాయిస్) ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు సముద్రానికి సంబంధించిన ఆ సమాచారాన్ని అందిస్తుంది. స్వామినాథన్ ఫౌండేషన్ వారు ఈ సమాచారాన్ని అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ సమాచారం 148 కిలోమీటర్ల వరకు చేరుతోంది. దీన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు స్వామినాథన్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ ఎన్.వీరభద్రరావు చెప్పారు. ఈ యాప్‌పై తీర ప్రాంతాలలో శిక్షణ ఇస్తున్నట్టు ఈ కార్యక్రమ ముఖ్య సమన్వయాధికారి డాక్టర్ ఆర్.రామసుబ్రమణ్యం చెప్పారు. పొరపాటున ఎవరైనా అంతర్జాతీయ సముద్ర జలాల రేఖకు చేరువవుతున్నప్పుడు నాలుగు కిలోమీటర్ల ముందే అప్రమత్తం చేస్తుందన్నారు. తుపాను, సునామీ.. ఇతరత్రా ఏదైనా ముప్పు ఉన్నట్టు తెలిస్తే తక్షణమే తిరిగి రావడానికి వీలవుతుంది. -
వామ్మో ఇదేం చేప.. డైనోసర్‌లా ఉంది!
సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడి ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఎదురైంది. ఓ జాతి చేప కోసం వెళ్లిన ఇతగాడికి మరో అరుదైన రకం చేప చిక్కింది. వివరాలు.. ఆస్కార్ లుండాల్ అనే వ్యక్తి నార్వేలోని ఓ ఫిషింగ్ కంపెనీలో అడ్వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను నీలిరంగు హాలిబట్ అనే జాతి చేప కోసం నార్వే కోస్టల్ తీరానికి వేటకు వెళ్లాడు. అయితే ఈ రకం చేపలు తీరానికి 5 మైళ్ళ దూరంలో ఉంటాయని, దాని కోసం గాలం వేయగా 300 వందల మీటర్ల లోతులో ఓ పెద్ద చేప చిక్కందని, తీరా బయటకు తీసి చూడగా డైనోసర్‌లా కనిపించిన అరుదైన రకం చేప చిక్కినట్లు ఆస్కార్ తెలిపాడు. దీంతో ఈ చేప ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. చేపను చూసిన నెటిజన్లంతా ‘బాబోయ్ ఇది చూడటానికి భయంకరంగా ఉంది. దాని కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఎంత దూరం వరకు చూడగలదు. ఇలాంటి వింత రకం చేపలన్నీ నీటికి అడుగు భాగంలోనే జీవిస్తాయి’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇలాంటి చేపను తానేప్పుడూ చూడలేదని, ఇది చుడటానికి డైనోసర్‌లా ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానంటూ ఆస్కార్ టుండాల్ చెప్పుకొచ్చాడు. మనుషులకు ఎలాంటి హాని కలిగించదని తెలిపాడు. అయితే ఈ అరుదైన రకం చేపను ర్యాట్ఫీష్గా అక్కడి వారు గుర్తించారు. సింహం, డ్రాగన్ లాంటి తోకను కలిగిన ఈ చేప గ్రీకు పౌరాణిక రాక్షసుడి నుంచి ఉద్భవించిందని అక్కడి వారి నమ్మకం. -
ఈ గుర్రమెందుకు‘రొయ్యో’..
చేపలు పట్టాలంటే ఏం కావాలి? ముందుగా ఓ వల.. ఆ తర్వాత పడవ.. కదా.. ఇదే ప్రశ్న.. బెల్జియంలోని ఓస్ట్‌డూన్‌కెర్క్‌కు వెళ్లి అడగండి.. ముందుగా ఓ వల.. ఆ తర్వాత గుర్రం అని సమాధానమిస్తారు.. గుర్రానికి చేపల వేటకు ఏం సంబంధం? ఉంది.. ఎందుకంటే.. ఇక్కడ గుర్రమెక్కే ష్రింప్స్(రొయ్యల్లాంటివి), చేపలను వేటాడతారు. గుర్రాలు దాదాపుగా నడుంలోతు మునిగేస్థాయి వరకూ సముద్రంలోకి వెళ్లి.. తిరిగి తీరం వైపు వస్తారు. వెనుక వైపు వల కట్టి ఉంటుంది. తీరానికి వచ్చాక.. అందులో చిక్కే ష్రింప్స్, ఇతర చేపలను అమ్ముకుంటారు. ష్రింప్స్‌తో చేసిన వంటకాలకు అక్కడ తెగ డిమాండ్ ఉంది.. 500 ఏళ్ల క్రితమైతే బెల్జియంతోపాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, దక్షిణ ఇంగ్లండులలో ఇలా గుర్రమెక్కే ష్రింప్స్‌ని వేటాడేవారు. అప్పట్లో అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. గుర్రమెక్కి చేపలు వేటాడుతున్న మత్స్యకారుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత తర్వాత ఆధునిక పద్ధతుల రాకతో ఈ తరహా విధానం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఓస్ట్‌డూన్‌కెర్క్‌లో మాత్రమే గుర్రమెక్కి చేపలను పట్టే మత్స్యకారులు ఉన్నారు. అదీ ఓ డజను కుటుంబాలు మాత్రమే. వారు కూడా పర్యాటకుల కోసం.. తమ సంప్రదాయాన్ని బతికించుకోవడం కోసం దీన్ని కొనసాగిస్తున్నారు. -
విమానం నుంచి చేపల వర్షం.. విమర్శలు
-
విమానం నుంచి చేపల వర్షం.. విమర్శలు
వాషింగ్టన్ : ఊతా సరస్సులో చేపల జనాభాను పునరుద్ధరించేందుకు వినూత్న ఆలోచన చేసిన ‘ఊతా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్’ (డీడబ్ల్యూఆర్) విమర్శల పాలైంది. సోషల్ మీడియాలో తాము పోస్ట్ చేసిన వీడియోపై వివరణ ఇచ్చుకుంది. అసలేం జరిగిందంటే... అమెరికాలోని ఊతా రాష్ట్రంలో ఉన్న ఊతా సరస్సును సందర్శించేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తూంటారు. అక్కడ ఫిషింగ్ చేసే వెసలుబాటు కూడా ఉంటుంది. దీంతో చేపల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండటంతో.. డీడబ్ల్యూఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేప పిల్లలను నీళ్లలోకి వదిలేందుకు.. మొదట్లో గుర్రాలను ఉపయోగించేవారు. గుర్రాలపై చేపలను రవాణా చేసేవారు. అయితే ఊతా సరస్సు ఎత్తైన కొండల మధ్య ఉండటంతో ఈ ప్రక్రియ చాలా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమానం ద్వారా చేప పిల్లలను నీళ్లలోకి వదలాలని నిర్ణయించిన డీడబ్ల్యూఆర్ తమ ఆలోచనను అమలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు డీడబ్ల్యూఆర్ను తప్పుపట్టారు. చేప పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించారంటూ విమర్శించారు. వాటికేం కాదు.. తమ చర్యను సమర్థించుకున్న డీడబ్ల్యూఆర్.. మేము ఎన్నోసార్లు గాల్లోంచి సరస్సులోకి చేప పిల్లలను వదిలాం.. చాలా చిన్నవైన పిల్లలు 1 నుంచి 3 ఇంచుల పొడవు గలవి. వాటిని విమానం నుంచి విసరటం వల్ల ఎటువంటి అపాయం జరగదంటూ వివరణ ఇచ్చింది. నయాగరా జలపాతంతో పాటుగా జాలువారే చేపలు బతికే ఉంటున్నాయి కదా అంటూ తమ చర్యను సమర్థించుకుంది. -
నిషేధం ఉన్నా..
పూసపాటిరేగ : సముద్రంలో వేట చేపట్టకూడదన్న నిషేధం ఉన్నా యథావిథిగా చేపల వేట కొనసాగుతూనే ఉంది. చింతపల్లి సముద్రతీరంలో 25 వరకు బోట్లు వేట కొనసాగించి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒడ్డుకు చేరాయి. ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో మత్స్యకారులు విధిలేని పరిస్థితిలో వేటకొనసాగిస్తున్నారు. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ప్రభుత్వం వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేట చేపట్టిన మత్స్యకారులపై జరిమాన కూడా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే నిషేధ సమయంలో ఇవ్వాల్సిన జీవనభృతి సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే వేట చేపట్టాల్సివస్తోందని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. జిల్లాలో సముద్రం చేపల వేటపై ప్రత్యక్షంగా నాలుగు వేల మంది.. పరోక్షంగా 16 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది నిషేధ సమయంలో చెల్లించాల్సిన జీవనభృతి నేటికీ చెల్లించలేదని పలువురు మత్స్యకారులు వాపోయారు. నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుని కుటుంబానికి రూ. 4 వేలు చొప్పున భృతి ఇవ్వాల్సి ఉంది. కాని ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో మత్స్యకారులకు జీవనభృతి చెల్లించడం లేదు. అధికారపార్టీ అనుచరులకు మాత్రమే పరిహారం ఇచ్చి ప్రతి పక్షానికి చెందిన వ్యక్తులుగా కొంతమంది మత్స్యకారులపై ముద్రవేసి జీవనభృతి ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే చేపల వేట యథావిథిగా కొనసాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సైదానాయక్ వద్ద ప్రస్తావించగా, సముద్రంలో చేపలవేటపై నిషేధం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. -
వలకు చిక్కని చేప
సముద్రంలో తగ్గిన వేట సగం బోట్లకు లంగరు సీజన్లో తగ్గిన ఫిషింగ్ ఖాళీగా మత్స్యకారులు నరసాపురం: సముద్రంలో చేపలు ఎక్కువగా దొరికే సీజన్ ఇది. చేపలు ఆశించిన స్థాయిలో వలలకు చిక్కడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లభించడంతో మత్స్యకారులు ఏ ఇబ్బందీ ఉండదు. తుఫాన్లు ఏర్పడితే కాస్త ఇబ్బంది, లేదంటే వేట ముమ్మరంగా సాగుతుంది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. గత రెండు నెలలుగా సముద్రంలో ముమ్మరంగా వేట సాగించిన మత్స్యకారులు ప్రస్తుతం మత్స్యసంపద నామమాత్రంగా ఉండడంతో ఒక్కసారిగా ఖాళీ అయ్యారు. వేటబోట్లకు లంగరు పడింది. వేట కాలం ఏటా ఏప్రియల్ 15 నుంచి జూన్ 15 వరకూ చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధం ఎత్తేసిన తర్వాత జూన్ నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటను ముమ్మరంగా నిర్వహిస్తారు. జూలై నుంచి డిసెంబర్ వరకూ సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు ఏ ఇబ్బందీ లేకుండా ఉల్లాసంగా గడుపుతారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చేసరికి వేటబోట్లకు సరుకు దొరకడం గగనమవుతుంది. అయితే ప్రస్తుతం చేపలు దొరకడం కష్టంగా ఉందని మత్స్యకారులు చెప్తున్నారు. నిరాశ ప్రస్తుతం వేట అంతంత మాత్రంగా సాగడంతో లాకులు వద్దనున్న వశిష్టా గోదావరి పాయవద్ద చాలా బోట్లను నిలిపేశారు. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకూ బోట్లు నరసాపురం తీరంలో నిత్యం వేట సాగిస్తాయి. ప్రస్తుతం 30 వరకూ బోట్లు మాత్రమే వేటసాగిస్తున్నట్టు మత్స్యకారులు చెప్తున్నారు. పూర్తిస్థాయిలో వేట సాగకపోవడంతో మత్స్యకారులు నరసాపురం గోదావరి ఏటిగట్టు పొడవునా పలుచోట్ల వలలు బాగు చేసుకుంటూ కనిపిస్తున్నారు. దీంతో మత్స్యకారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నిషేధ సమయంలో కూడా సముద్రంలో చాటుమాటుగా కొందరు వేట కొనసాగించడంతో చేపల గుడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల ఉత్పత్తి తగ్గిపోయి దాని ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోందని పలువురు మత్స్యకారులు చెపుతున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో కొన్ని రోజులపాటు ఇటువంటి పరిస్థితులు షరా మామూలేనని, మళ్లీ పరిస్థితి యధాస్థితికి వస్తుందని మత్స్యశాఖ అధికారులు చెపుతున్నారు. ఖాళీగా ఉంటున్నాం మల్లాడి సాయిబాబా, బోటు కార్మికుడు వేట గత కొన్ని రోజులుగా సరిగా జరగడంలేదు. మా బోటు వారం క్రితం బయటకు వచ్చింది. మళ్లీ వేటకు వెళ్లలేదు. వారం రోజులుగా ఖాళీగానే ఉంటున్నాము. వేట లేకపోవడంతో పైసా ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడేలేదు. ఏం చేయాలో తెలియడంలేదు. గడ్డు పరిస్థితి పీతల ప్రసాద్, బోటు యజమాని, నరసాపురం బోట్లను వేటకు పంపినా పెద్దగా చేపలు పడటంలేదు. దీంతో పెద్దగా సొమ్ములు రావడంలేదు. ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఐస్, డీజిల్ రేట్లు పెరిగాయి. సరుకు పెద్దగా పడకపోతే నష్టాలు వస్తున్నాయి. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాము. -
3,700 కి.మీ వేటకెళ్లిన పుతిన్ చొక్కా విప్పేసి..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను మీరు ఎప్పుడైన గమనించారా.. దాదాపు ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన చేష్టలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంటాయి. కాలక్షేపానికి, మనసును తేలిగ్గా ఉంచుకునేందుకు ఆయన చేసే పనులు ఎంత ఆసక్తిగా ఉంటాయో ఓ పట్టాన చెప్పనక్కర్లేదు. మొన్నామధ్య బీజింగ్‌లో చైనా రష్యా దేశాల ద్వైపాక్షిక చర్యలకు వెళ్లిన పుతిన్ చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్ వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా పియానో వాయిస్తూ అందరిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అయిన ఆయన పియానో కూడా వాయించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అందరినీ మరింత ఆశ్చర్యపరిచేలా ఆయన చేపల వేటలో నిమగ్నమయ్యారు. అది కూడా ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లుగా. కొంతమంది స్నేహితులతో కలిసి మంగోలియన్ సరిహద్దులోగల దక్షిణ సైబీరియాలోని రిపబ్లిక్ ఆఫ్ టివా ప్రాంతానికి గాలం తీసుకొని వెళ్లారు. ఇది మాస్కోకు 3,700కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వెళ్లిన పుతిన్ మూడు రోజులపాటు సరదాగా గడుపుతూ చొక్కా విప్పేసి నదిలోకి దిగేశారు. ప్రత్యేక మాస్క్‌లు ధరించి నీటి అడుగుకు వెళ్లి చేపల వేట కొనసాగించారు. వివిధ రకాలుగా స్మిమ్మింగ్ చేస్తూ పెద్ద పెద్ద చేపలను స్వయంగా గాలంతో పట్టేశాడు. ఆ సమయంలో ఆయనతో రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోయిగు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చి తెగ హల్ చల్ చేస్తున్నాయి. 64 వయసులో కూడా ఆయన శరీరదారుఢ్యం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇప్పటికీ ఆయనకు ఆరుపలకల దేహం కనిపిస్తుందంటే పుతిన్ తన ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ అంత శ్రద్ధ తీసుకుంటారా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. -
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
-
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
ఎప్పుడైనా సరదాగా చేపలు పట్టాలంటే ఏం చేస్తాం?. ఓ గాలం దానికి ఏర ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని వేటకు బయల్దేరుతాం. కానీ, అమెరికాలోని అలబామాలో నివసిస్తున్న రాబర్ట్ మాత్రం ఒట్టి చేతులతో చేపల వేటకు బయల్దేరతాడు. చిన్న చేపను ఎరగా చూపి పెద్ద చేపను పట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. చిన్న చేపను ఎరగా చూపిన రాబర్ట్.. పెద్ద చేప దాన్ని తినడానికి నోరు తెరిచింది. అంతే తన వేళ్లతో చేపను గట్టిగా పట్టుకుని బయటకు తెచ్చేశాడు రాబర్ట్. ఆ తర్వాత మళ్లీ దాన్ని తిరిగి నీటిలోకి వదిలేశాడు. మరి చేపలను చేతితో పట్టే టెక్నిక్ మీరు కూడా చూసేయండి. -
అమెరికన్ సూపర్ టాలెంట్.. వైరల్ వీడియో
వాషింగ్టన్: ఓ అమెరికన్ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎలాంటి వల వేయకుండా, గాలెం సాయం లేకుండా చేతులతో చేపను చాకచక్యంగా పట్టడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలివి.. అమెరికాలోని అలబామాకు చెందిన రాబర్ట్ ఎర్ల్ వూడార్డ్ కు చేపలు పట్టడం ఓ సరదా. తీరికవేళల్లో మరికొందరితో కలిసి తీరానికి వెళ్లి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు రాబర్ట్. గత నెల 18న ఇదే విధంగా చేపల వేటకు చిన్న నెట్ తీసుకెళ్లాడు. నెట్ గానీ, గాలెం కానీ వాడకుండా.. ఓ చిన్నచేపను ఎరగా వేసి ఓ పెద్ద చేపను క్షణాల్లో పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. రాబర్ట్ పేరు మార్మోగిపోతోంది. ఎంతో వేగంగా స్పందించి కేవలం ఒంటిచేత్తో పెద్ద చేపను పట్టడాన్ని వీడియోలో చూడవచ్చు. కొన్ని క్షణాల తర్వాత ఆ చేపను మళ్లీ నీళ్లలో వదిలిపెట్టాడు. -
అక్రమంగా చేపల వేట
నిషేధాజ్ఞల ఉల్లంఘన అడ్డుకున్న గ్రామస్తులు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల వేలం అల్లవరం (అమలాపుం) : సముద్రంలో చేపల వేట నిషేధాన్ని ఉల్లంఘించిన మూడు మెకనైజ్డు బోట్లను అల్లవరం గ్రామస్తులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన పొట్టు జగదీష్, యానాం, దరియాలతిప్ప ప్రాం తానికి చెందిన లంకే నాగూరుబాబుకు చెందిన మూడు మెకనైజ్డు బోట్లు నిబంధనలు ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగించాయి. వేటాడిన చేపలను ఓడలరేవు తీరం నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా గురువారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని మత్స్యశాఖాధికారులకు సమాచారం అందించారు. ఎఫ్డీఓ డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో అల్లవరం మండలం ఓడలరేవు మెరైన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మత్స్యసపందను లారీలోకి లోడ్ చేస్తున్న సమయంలో దాడి చేశారు. లారీని, మూడు మెకనైజ్డు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్షల విలువైన మత్స్య సంపదను వేలం వేసేందుకు మత్స్యశాఖాధికారులు నిర్ణయించారు. మత్స్యశాఖ ఆధరైజ్డ్ అధికారి సీహెచ్.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఓడలరేవు జెట్టీ ప్రాంతంలో మూడు టన్నుల తూర చేపలకు వేలం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేపల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. కిలోకు రూ.25 ప్రభుత్వ ధర నిర్ణయించగా, కాకినాడకు చెందిన సీహెచ్.చిన్ని రూ.36 చొప్పున పాటను దక్కించుకున్నారు. కంటైనర్‌లో ఉన్న చేపలను గ్రామస్తుల సమక్షంలో తూకం వేసి పాటదారుడుకి అప్పగిస్తామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో బోటుకు రూ.2500 చొప్పున జరిమానా విధించారు. వేలం పాటలో కాకినాడ ఎఫ్డీఓ ఆర్వీఎస్ ప్రసాద్, కె.వెంకటేశ్వరరావు, అల్లవరం ఎఫ్డీఓ డేవిడ్‌రాజు, సీహెచ్.ఉమామహేశ్వరరావు, సర్పంచి కొల్లు సత్యవతి, కొల్లు త్రిమూర్తులు, కాకినాడ బోటు ఓనర్స్ అధ్యక్షుడు ఓలేటి గిరి, అవనిగడ్డ శేషగిరిరా>వు తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు బ్రేక్
-
వేటకు బ్రేక్
► 14 అర్ధరాత్రి నుంచి చేపల వేటకు విరామం ► ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అంటున్న అధికారులు ► 61 రోజులపాటు జీవనం ఎలా...? పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : తూర్పు తీరంలో శుక్రవారం అర్ధరాత్రి (ఈనెల 14వ తేదీ) నుంచి చేపల వేట నిలిచిపోనుంది. మొత్తం 61 రోజుల పాటు వేటను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపల వేట మొదలు కానుంది. 2014 వరకూ నిషేధం 47 రోజులుగా పరిగణించేవారు. అయితే మత్స్యకార సంఘాలు, బోట్ల ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు గడువును 2015 నుంచి 61 రోజులకు పొడిగించారు. గడువు సమీపించడంతో బోట్లు రేవుకు చేరుకున్నాయి. వేట కాలంలో 683 మెకనైజ్డ్ బోట్లు (మరపడవలు), 2,500 పైచిలుకు ఇంజిను పడవలు, 1100 తెప్పలు చేపలు, రొయ్యలు వేట సాగిస్తాయి. వేట నిషేధకాలంలొ తెప్పలు మాత్రం చేపలు వేటాడొచ్చు. ఎందుకంటే అవి తీరానికి అతి చేరువలోనే ప్రయాణిస్తూ వేటను సాగిస్తాయి. మరపడవలు, డాల్ఫిన్ బోట్లు ఒకసారి వేటకు సముద్రంలోకి వెళ్తే కనీసం పదిహేను రోజుల నుంచి 20 రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోతాయి. నిషేధ సమయంలో సింగిల్ ఇంజన్లతో నడిచే బోట్లను కూడా వేటకు అనుమతించరు. తగ్గిన దిగుబడులు 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను బోటు యజమానులను దెబ్బతీసింది. 66 బోట్లు మునిగిపోగా, మరొ 200 బోట్లకు నష్టం వాటిల్లింది. సుమారు 3 వారాల పాటు వేట నిలిచిపోయింది. 2015–16 సీజన్ కన్నా 2016–17 సీజన్లో చేప, రొయ్యల దిగుబడి కొంతమేరకు తగ్గింది. తీరానికి అతిచేరువలో ఏర్పాటు చేసిన రసాయన కర్మాగారాల వల్ల చేపలు గుడ్లు, పిల్లల దశలోనే నశించిపోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని బోట్ల యజమానులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి దిగుబడులు తగ్గిపోయాయి. నెల రోజుల నుంచి 80 శాతం బోట్లు రేవుకే పరిమితం అయ్యాయి. ఎండలు తీవ్రంగా ఉండడం, వేట ఆశాజనకంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 20 శాతం బోట్లు వేటనిషేధం ప్రకటించిన నేపథ్యంలో ఒడ్డుకు చేరుకుంటున్నాయి. వేట నిషేధాన్ని మత్స్యశాఖ పర్యవేక్షిస్తుంది. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా వేటకు వెళ్లిన ఈ తరహా బోట్లను మత్స్యశాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేసి, భారీ జరిమానాలు విధిస్తారు. మత్స్య క్రమబద్ధీకరణ చట్టం చేపలు పునరుత్పత్తి (గుడ్లు పొదిగి పిల్లలు తయారయ్యే సమయం) జరిపే సమయంలో చేపల వేట సాగిస్తే మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతుందని, ఆ సమయంలో చేపల వేట నిషేధం ద్వారా మత్స్య సంపద పెంపునకు అవకాశం ఉంటుందని నిపుణుల సూచనల ప్రకారం ఈ చట్టం రూపొందించారు. ఈ చట్ట ప్రకారం నిషేధ సమయంలో ఎవరైనా చేపల వేట సాగిస్తే వారికి రూ.2,500 వరకు జరిమానా విధించడంతోపాటు బోట్లను సీజ్ చేస్తారు. వేటాడిన మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటారు. కన్యాకుమారి నుంచి కోల్‌కతా వరకు ఈ నిషేధం అమలులో ఉంటుండగా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి మత్స్యశాఖతోపాటు పోలీస్, మెరైన్, నేవీ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి గస్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ సంగతేంటి...? ఏటా వేట నిషేధం క్రమంతప్ప కుండా అమలు చేస్తున్నారు. 61 రోజులపాటు వేట ఆగిపోవడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిని పస్తులుండాల్సి వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు. పరిహా రంగా బియ్యం పంపిణీ చేస్తున్నా అది సమయానికి అందజేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలు చవిచూశాం గత సీజన్ మాదిరిగానే ప్రస్తుత సీజన్లో కూడా చేపలు, రొయ్యల వేట ఆశాజనకంగా లేకపోవడంతో చాలావరకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. రసాయన కర్మాగారాల వల్ల సముద్ర ఉత్పత్తులు నష్టపోకుండా తగిన చర్యలు చేపట్టాలి. – బర్రి కొండబాబు, విశాఖ కోస్టల్ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు రూ.15 వేలు ఇవ్వాలి చేపల వేట విరామ సయంలో మత్స్యకార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున భృతి చెల్లించాలి. గత సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.4వేలు చాలా మంది మత్స్యకార కార్మికులకు అందలేదు. మత్స్యకారులను ప్రభుత్వం మోసం చేయడం మానుకోవాలి. – చంద్రశేఖర్, ఏపీ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సంఘ సభ్యుడు సకాలంలో పరిహారం చెల్లించాలి మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.4 వేలు చెల్లిస్తున్నారు. గత ఏడాది పరిహారం కొంతమందికి నేటికీ అందలేదు. ఈ ఏడాదైనా పరిహారం మొత్తం సకాలంలో చెల్లించాలి. వేట ముగిసే సమయానికి అందిస్తే వారికి మేలు జరుగుతుంది. మూడు నెలలుగా వేట పెద్దగా సాగలేదు. – పి.సి.అప్పారావు, ఏపీ బోటు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు పరిహారం కోసం ప్రతిపాదనలు చేపల వేట విరామ సమయంలో బోట్లపై ఆధారపడిన మత్స్యకారులను ఆదుకొనేందుకు ప్రభుత్వం గత సీజన్లో 16,800 మంది కార్మికులను గుర్తించి ఒక్కొక్క కార్మికునికి రూ.4వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రస్తుత సీజన్లో కూడా అదే మొత్తం పంపిణీ చేసే అవకాశం ఉంది. బోట్లలో పనిచేసే కార్మికుల జాబితా సిద్ధం చేయమని బోట్ల యజమానులకు, సంఘాలకు చెప్పడం జరిగింది. – వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు -
వేటకు విరామం!
► 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం ► మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం ► గత ఏడాది పరిహారం అందరికీ అందని వైనం ► తీరప్రాంత గ్రామాల్లో అమలు కాని ఉపాధి హామీ పథకం చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో మర పడవలతో వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి సీజన్ కావడంతో 60 రోజుల పాటు వేటను నిషేధించిన సర్కార్.. సముద్రాన్ని నమ్ముకొని బతుకుబండిని నడుపుతున్న మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం చేయలేదు. నిషేధ సమయంలో రూ. నాలుగు వేలు చొప్పున అర్హులైన వారికి అందజేయాల్సి ఉన్నా గతంలో చాలామందికి ఇవ్వలేదు. ఈసారైనా తమను ఆదుకోవాలని గంగSపుత్రులు వేడుకుంటున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్ మర బోట్లు ఉన్నట్టు లెక్కలుఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్ మర బోట్లు ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నారు. ఏటా చేపల వేట నిషేధ సమయంలో వీరిలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మిగిలిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వేట నిషేధ సమయంలో మతస్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. లూజ్ సోయిల్ నెపంతో తీర ప్రాంతాల్లో పనులు చేపట్టక పోవడంతో 60 రోజుల పాటు స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది ఈ సమయంలో ఉపాధి కోసం పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, వీరావల్, రత్నగిరి, కాండ్లా, సూరత్, మంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ బోట్ డ్రైవర్లుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తుండగా, కొందరు వంట మనుషులుగా పని చేస్తున్నారు. గుర్తింపు కార్డులు నిల్: మరో పక్క చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ గుర్తింపు కార్డులు కూడా ఉండడం లేదు. దీంతో వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే పరిహారం చాలామంది అందని పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకొని బతుకు నావను నడుపుతున్న అందరికీ పరిహారం ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అరకొరగా ఇస్తున్న పరిహారం చెల్లించే సమయంలో రాజకీయాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరో పక్క నిషేధ సమయంలో కొన్నేళ్లగా అందిస్తున్న నాలుగు వేల రూపాయల పరిహారాన్ని పెంచాలని మత్స్యకారులు కోరుతున్నా ప్రయోజనం లేదు.ఇతర రాయతీలు సైతం వీరికి వర్తించటం లేదు. గతంలో ఇచ్చే 30 కిలోల బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఉపాధి చూపాలి: నిషేధ కాలంలో మత్స్యకారులు రెండు నెలల పాటు ఉపాధి కోత్పోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో అమలు చేయాలి. మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించాలి. అర్హులందరికీ పరిహారం చెల్లించటం, పరిహారం పెంచటం, బియ్యం, కిరోసిన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలి. –ఎం.రామారావు, మత్స్యకార యూనియన్ నాయకుడు అన్ని మత్స్యకార కుటుంబాలకు పరిహారమివ్వాలి: జిల్లాలోని అన్ని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో పరిహారం అందజేయాలి. నిషేధ కాలంలో అందరు జీవనోపాధి కోల్పోతున్నారు. నష్టపోతున్న కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవాలి. పారదర్వకంగా నష్ట పరిహారం పంపిణీ చేయాలి. – ఎం.పట్టాభి, బడివానిపేట, ఎచ్చెర్ల మండలం అర్హులందరికీ అందజేస్తాం: చేపల వేట నిషేధ కాలంలో అర్హులం దరికీ పరిహారం అందజేస్తాం. జిల్లాలో సుమారు 2,000 వరకూ మరబోట్లు ఉన్నవారు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వీరికి పరిహారం అందజేస్తాం. సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకు రావచ్చు. – కృష్ణమూర్తి, డీడీ, మత్స్యశాఖ -
అరుదైన ఎలక్ట్రిక్ చేప లభ్యం
చెన్నై (తిరువొత్తియూరు): 80 వాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం ఉన్న అరుదైన చేప తమిళనాడులోని రామనాథపురం సముద్రంలో జాలరి వలలో చిక్కింది. రామనాథపురం జిల్లా పాంబన్ నుంచి మన్నార్వలై ప్రాంతంలో చేపలు పట్టేందుకు ఫైబర్ పడవలలో జాలర్లు వెళ్లారు. వారు చేపలు పట్టుకుని మంగళవారం ఒడ్డుకు చేరారు. ఇందులో ఒక జాలరి వలలో అరుదైన ఎలక్ట్రిక్ చేప కనిపించింది. ఇది ఒకటిన్నర అడుగు పొడవు, ఐదు కిలోల బరువు కలిగి బ్రౌన్ రంగులో చుక్కలు కలిగి ఉంది. దీన్ని మార్ఫిల్డ్ ఎలక్ట్రిక్ రేఫిష్ అంటారు. ఈ రకం చేపలు అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణాఫ్రికా సముద్రంలో ఎక్కువగా ఉంటాయి. ఈ రకం చేపల శరీర భాగంలో పొలుసులు 80 వాట్స్ విద్యుత్ విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. -
‘ఫిషింగ్’ వల ఉంది.. జాగ్రత్త!
అత్యధిక రాబడులిచ్చే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కి ఎంపికయ్యారని అభినందిస్తూ మీకు ఈ మధ్య ఏమైనా మెయిల్స్ వచ్చాయా? ఎవరైనా ఫోన్ చేశారా? ఇదేదో మంచి అవకాశం.. అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. ఇలాంటి వాటిని నమ్మి, ముక్కూ మొహం తెలీని వారికి మీ వ్యక్తిగత వివరాలు అందజేశారంటే... మీరు ‘ఫిషింగ్’ వలలో పడే ప్రమాదముంది. మోసపూరితంగా సంపాదించిన ఈ సమాచారంతో హ్యాకర్లు మీ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయొచ్చు. మీకు తెలియకుండా మీ పేరిట ఆర్థిక లావాదేవీలు జరిపేసి ముంచేయొచ్చు. ఇలాంటి నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించేదే ఈ కథనం... వచ్చే ఐదేళ్లలో సైబర్ నేరాలు రెట్టింపు! ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న అత్యంత తీవ్రమైన సైబర్ నేరాల్లో ఫిషింగ్ లేదా విషింగ్ (వారుుస్ ఆధారిత) స్కామ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. గతేడాది అంతర్జాతీయంగా ఈ తరహా సైబర్ ముఠాలు కొల్లగొట్టింది 3 లక్షల కోట్ల డాలర్లు కాగా... 2021 నాటికి ఇది ఏకంగా రెట్టింపై 6 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోనుందని అంచనా. ప్రతి రోజు 294 బిలియన్ల ఈమెయిల్స్ వెడుతుండగా ..వీటిలో 90 శాతం పనికిరాని, మోసపూరితమైన స్పామ్ మెరుుల్సేనని అధ్యయనాలు చెబుతున్నాయి. 3.73 కోట్ల ఫిషింగ్ ఎటాక్స్ ఉదంతాల్లో 88 శాతం కేసులు.. మెయిల్లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం వల్ల జరిగినవే. ఆన్లైన్లో ప్రతి సెకనుకు 12 మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అంటే ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 10 లక్షల పైగా ఉంటోంది. ఆందోళనకరమైన విషయమేమిటంటే అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఫిషింగ్ పరిమాణంలో 5 శాతం వాటాతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2015లో ఇండియా కేవలం ఫిషింగ్ నేరాల వల్ల 9.1 కోట్ల డాలర్లు నష్టపోయింది. ఆర్థిక నేరాల ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ది 3వ స్థానం. దేశీయంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏకి కూడా సైబర్ నేర సమస్య తప్పలేదు. ఈ మధ్యే అచ్చం ఐఆర్డీఏ అధికారిక వెబ్సైట్లా భ్రమింపజేసే నకిలి సైట్‌ను నేరగాళ్లు సృష్టించారు. ఆ త ర్వాత.. ఐఆర్డీఏఐ నుంచి భారీ మొత్తం ఇవ్వనున్నట్లు.. బాధితులకు మోసపూరిత ఈమెయిల్స్ పంపించారు. ఇలాంటి చర్యలతో భద్రత.. ఇలాంటి ఫిషింగ్, విషింగ్ నేరాల ఉదంతాలతో అప్రమత్తమైన బీమా కంపెనీలు .. వీటి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై కస్టమర్లలో అవగాహన పెంచుతున్నాయి. సైబర్ నేరాలు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే కరపత్రాలను తమ శాఖల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే, తమ వెబ్సైట్ హోమ్ పేజీలోను ఇతరత్రా కీలకమైన పేజీల్లోను పాప్ అప్ బ్యానర్స్ వంటివి ఉంచుతున్నాయి. అలాగే కస్టమర్లకు పంపే ఈమెయిల్స్ కింది భాగంలోను, ఎన్వలప్‌లు, ఇన్లాండ్ లెటర్లలోను ఇలాంటి వాటి గురించిన ప్రత్యేక హెచ్చరికలు ముద్రిస్తున్నాయి. అంతే కాకుండా తమకు కాల్స్ చేసే కస్టమర్లను సైతం ఈ తరహా మోసపూరిత మెయిల్స్, కాల్స్ గురించి హెచ్చరించేలా ఆటోమేటెడ్ ఐవీఆర్ సందేశాలు ఉంచుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు నియంత్రణ సంస్థలు, బీమా కంపెనీలు ఈ నేరాలపై పోరు కోసం కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ.. కస్టమర్లు కూడా నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకుంటేనే వీటిని అరికట్టడం సాధ్యమవుతుంది. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి.. ఏ కంపెనీ కూడా.. ఖాతా సమాచా రం, పాస్వర్డ్లు, సెక్యూరిటీ క్వశ్చన్ల వెరిఫికేషన్ వంటి కీలకమైన వ్యక్తిగత సమాచారం గురించి అడగదు. ఒకవేళ ఏదైనా అనుమానాస్పద మెయిల్ వచ్చిన పక్షంలో తక్షణం బీమా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి. కంపెనీ తరఫున వచ్చినట్లుగా కనిపించే లేఖల్లో వెరిఫై, అకౌంట్ ప్రాసెస్, అప్డేట్ వంటి పదాలేమైనా ఉంటే జాగ్రత్తగా అప్రమత్తం కావాలి. బీమా సంస్థను సంప్రతించి తెలుసుకోవాలి. -
వ్యక్తి మృతదేహం లభ్యం
– మృతుడు షఫీ మాజీ మిస్టర్‌నంద్యాల అవార్డు గ్రహీత – విషాదంలో నడిగడ్డ వాసులు నంద్యాల/బండిఆత్మకూరు: చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు నీటిలో కొట్టుకోపోయిన మహమ్మద్‌షఫీ మృతదేహం మంగళవారం సాయంత్రం బండిఆత్మకూరులో లభ్యమైంది. దీంతో నంద్యాల పట్టణంలోని నడిగడ్డలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే. సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద సోమవారం చేపల వేటకు మహమ్మద్ షఫీ, అతని మిత్రులు వెళ్లారు. షఫీ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోగా అతని కాపాడటానికి వెళ్లిన స్నేహితుడు అంజాద్ మృత్యువాత పడ్డాడు. షఫీ ఆచూకీ మాత్ర లభ్యం కాలేదు. మంగళవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసీ కెనాల్, కుందూ వెంట వెతికారు. వెలుగోడు నుంచి తెప్పించిన పుట్టిలతో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, నంద్యాల రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డి, షఫీ స్నేహితులు గాలించారు. సాయంత్రం బండిఆత్మకూరు వద్ద అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆరు అడుగుల పైగా ఉన్న షఫీ పాతికేళ్ల క్రితమే మిస్టర్ నంద్యాలగా అవార్డు పొందారు. చిన్నప్పటి నుంచివ్యాయామంపై ఆసక్తి ఉండటంతో ఎక్కువ సమయం వ్యాయామ శాలలో గడిపేవాడు. తర్వాత వెయిట్ లిఫ్టర్‌గా, బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొని పలు బహుమతులను సాధించారు. మృతుదికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. -
చేపల వేటకు వెళ్లి..
ఒకరు మృతి.. మరొకరు గల్లంతు నంద్యాల/బండిఆత్మకూరు: చేపల వేటకు వెళ్లి ఒకరు మృత్యువాత పడగా మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం బండిఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద చోటు చేసుకుంది. నంద్యాల పట్ణణం నడిగడ్డ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షఫీ రియల్ ఎస్టేట్ వ్యాపారి. సోమవారం దేవనగర్‌లో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నాడు. తర్వాత మధ్యాహ్నం స్నేహితులు కొత్త వాహనాన్ని కొనుగోలు చేశామని, విందుకు ఆహ్వానించడంతో పికప్ ఆనకట్ట వద్దకు వెళ్లారు. విందు ఆరగించాక సరదాగా చేపలు పట్టుకోవడం ప్రారంభించాడు. ప్రమాదవశాత్తూ పికప్ ఆనకట్టలో పడిపోయాడు. స్నేహితుడు షఫీ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుంటే తట్టుకోలేని అంజాద్(30) కాపాడటానికి దూకాడు. అయితే అప్పటికే షఫీ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న ఆంజాద్‌ను అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు కాపాడి ఒడ్డుపైకి తీసుకొచ్చి ప్రాణాలను కాపాడటానికి యత్నించాడు. కాని అంజాద్ కోలుకోలేక మృతి చెందాడు. సమాచారం అందగానే బండిఆత్మకూరు పోలీసులు గల్లంతైన షఫీ కోసం కేసీ కెనాల్ పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలను చేపట్టారు. ఈ ఘటనతో నడిగడ్డ ప్రాంతంలో విషాదం నెలకొంది. మృతి చెందిన అంజాద్ ఫరూక్‌నగర్‌కు చెందిన వారు. డ్రైవర్‌గా జీవనం సాగించే ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన షఫీకి ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. అంజాద్ మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పాకిస్తాన్ పులస
నవంబర్ వచ్చిందంటే పాకిస్తాన్‌లోని కాబుల్ నదిలో సామాన్య బెస్తవాళ్లు ప్రాణాలకు తెగించి చేపల వేటకు బయలుదేరుతారు. ఈ సీజన్లో ఆ నదికి వరద వస్తుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లోని హిందు కుష్ నది నుంచి వచ్చి ఇందులోకి చేరుతుంది. ఈ సందర్భంగా ఆ నది నుంచి ఈ నదికి చేరే ‘షేర్ మాహి’ చేపకు పాకిస్తాన్లో డిమాండ్ ఎక్కువ. వరద కాలంలో గోదావరిలో దొరికే పులస మాదిరిగానే దీనికీ రుచి ఎక్కువ. అందుకే ఈ చేప వేటకు వెళ్లి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. -
పడవ బోల్తా
నరసాపురం రూరల్ : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మర పడవ ప్రమాదవశాత్తు అలల ఉధృతికి బోల్తా కొట్టింది. నరసాపురం మండలం వేములదీవి శివారు చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల లవరాజు, మరో ముగ్గురితో కలిసి మంగళవారం తెల్లవారు జామున సముద్రంలో వేటకు వెళ్లాడు. అలల తాకిడికి పడవ బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పడవ తిరగబడడంతో వేట సామగ్రితోపాటు ఇంజిన్ పాడైంది. పడవ దెబ్బతింది. వలల చిరిగిపోయాయి. ఆస్తి నష్టం రూ.లక్ష ఉంటుంది. దీంతో మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు మత్స్యశాఖ అధికారి రమణకుమార్ తెలిపారు. -
చేప చిక్కిందోచ్!
మెదక్ మున్సిపాలిటీ: కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు చెరువులను ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిట్లం చెరువు వద్ద పలువురు యువకులు చేపలు పడుతుండటంతో.. ఆమె కూడా గాలం వేశారు. ఓ చేప చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. -
మాధన్నపేట మత్తడిలో ఒకరు గల్లంతు
మరో ఇద్దరు మత్య్సకారులు సురక్షితం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు నర్సంపేటరూరల్: మాధన్నపేట చెరువు మత్తడితో పడి ఓ వ్యక్తి గల్లంతయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడికి కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మత్స్యకారులు కూడా కొట్టుకుపోయినప్పటికీ.. కొంతదూరం వెళ్లాక వారు ఓ చెట్టును పట్టుకుని క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్‌కు చెందిన బల్సూకూరి కృష్ణ (35) మాధన్నపేటకు చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఆ గ్రామంలోనే ఉంటూ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు మత్తడిపోస్తుండడంతో మత్స్యాకారులు చేపలు పడుతున్నారు. కాగా, కృష్ణ కూడా చేపలు పట్టేందుకు వచ్చి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడ్డాడు. అతడిని కాపాడేందుకు మత్య్సకారులు గిరగాని ఎల్లస్వామి, పెండ్యాల రాజు ప్రయత్నించి వారు కూడా నీటిలో పడి కొట్టుకుపోయారు. కొంత దూరం వెళ్లాకా ఎల్లస్వామి, రాజు చెట్టును పట్టుకుని ఆగిపోయారు. కృష్ణ మాత్రం కనిపించడంలేదు. స్థానికులు ఎల్లస్వామి, రాజును తాడు సహాయంతో బయటకు తీశారు. నర్సంపేట టౌన్ సీఐ, ఎస్సై హరికృష్ణ, రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్తడి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. -
చివరి చేపకు గాలం వేసి మరీ..!
అమెరికా నేవీలో సుదీర్ఘకాలం సేవలందించి రిటైరయ్యారు కాన్నే విల్ హైట్. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తన చివరి కోరిక అంటూ రెండింటిని కోరాడు. అందులో ఒకటి బాప్తిజం తీసుకోవడం, రెండోది మాత్రం కాస్త కష్టమైన పని. చివరిసారిగా ఫిషింగ్ చేసి చేపలకు గాలం వేయాలనే కోరికను వెలిబుచ్చారు. ఆయన చివరిరోజుల్లో డబ్లిన్ లోని కార్ల్ విన్సన్ వీఏ మెడికల్ సెంటర్లో చికిత్స పొందారు. కాన్నే విల్ హైట్ కోరికలను మెడికల్ సెంటర్ తీర్చడానికి అంగీకరించింది. చాప్లెన్ స్కాగ్స్ అనే వ్యక్తి ఆయనకు బాప్తిజం ఇప్పించారు. బాప్తిజం తీసుకుంటే తనకు పుణ్యాలోకాలు ప్రాప్తిస్తాయని ఆయన భావించారు. రెండో కోరిక ప్రకారం.. ఆస్పత్రి బెడ్ మీద నుంచి కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉన్న మాజీ అధికారి కాన్నేని జార్జియాలోని మెడికల్ సెంటర్ సమీపంలోని లీజర్ లేక్ వద్దకు తీసుకెళ్లారు. నర్సులతో పాటు కొందరు స్టాఫ్ ఈ కార్యంలో భాగస్వాములు అవ్వాలని భావించారు. కదలలేని స్థితిలో ఉన్నాడు కనీసం ఒక్క చేపను పడతాడా లేదా అని అందరూ అనుమానం వ్యక్తం చేయగా ఓవరాల్ గా ఆ రోజు ఏకంగా నాలుగు చేపలను పట్టేశారు. ఒక ఇంకేం ఆయన జీవిత చివరి కోరికలు తీరిపోయాయి. ఆ తర్వాత సరిగ్గా మూడోరోజున(గత ఆగస్టు 29న) కాన్నీ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన ఏ ఒక్కరినీ ఇబ్బందిపెట్టేవారు కాదని ఆయన కజిన్ లీసా కిట్రిల్ అన్నారు. -
రిజర్వాయర్‌లో ఇద్దరి గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం మరొకరి ఆచూకీ కోసం గాలింపు చేపల వేట సరదాతో ప్రమాదం ధర్మసాగర్ : సరదా కోసం చేసిన చేపల వేట.. ఆ ఇద్దరు యువకులు రిజర్వాయర్‌లో గల్లంతు కావడానికి కారణంగా మారింది. ఈ ఘటన ధర్మసాగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ధర్మసాగర్‌కు చెందిన పొలుమారి థామస్ చిన్న కుమారుడు పొలుమారి సృజన్(25), మాచర్ల మల్లయ్య చిన్న కుమారుడు మాచర్ల సునీల్(25), డీజిల్ కాలనీకి చెందిన సందె మోహన్‌లు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. కాగా, సృజన్ నర్సంపేటలో, సందె మోహన్ మిల్స్ కాలనీలో కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సునీల్ «దర్మసాగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరు ముగ్గురు వారాంతంలో కలుసుకునేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వీరి ముగ్గురితో పాటు పొలిమారి సృజన్ అన్న పొలిమారి సుమంత్ కలిసి స్థానిక రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహ వేగానికి.. ఈతకొట్టిన అనంతరం పొలిమారి సృజన్, మాచర్ల సునీల్, సందె మోహన్‌లు దోమతెరతో చేపలు పట్టడానికి దేవాదుల పైపులు నీరుపోస్తున్న ప్రదేశంలో నీటిలోకి దిగారు. చేపలు పట్టాలనే తాపత్రయంలో ఒక్కో అడుగు వేస్తూ లోపలికి దిగారు. ఒక్కసారిగా లోతు రావడంతో నీటి ప్రవాహ వేగానికి మాచర్ల సునీల్ కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు సృజన్, మోహన్‌లు యత్నించారు. ఈక్రమంలో సునీల్, సృజన్ గల్లంతయ్యారు. సందె మోహన్ మాత్రం సమీపంలోని ముళ్ల చెట్టును పట్టుకొని జల ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అక్కడే ఉన్న సృజన్ అన్న సుమంత్, స్థానికులు సునీల్, సృజన్‌లను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కాజీపేట ఏసీపీ జనార్దన్, మడికొండ సీఐ డేవిడ్ రాజ్, ధర్మసాగర్ పీఎస్సై సతీష్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని దేవాదుల అధికారులతో ఫోన్లో మాట్లాడి మోటార్ల పంపింగ్‌ను ఆపివేయించారు. అనంతరం స్థానిక జాలర్లతో మృతదేహాల కోసం రిజర్వాయర్‌లోSగాలించగా మాచర్ల సునీల్ మృతదేహం లభ్యమైంది. పొలిమారి సృజన్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించారు. యువకుడి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరపాక జయాకర్, సర్పంచ్ కొలిపాక రజిత ఉన్నారు. కాగా, పొలుమారి సృజన్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే ఇటీవల ఎస్సై మెయిన్ పరీక్షకు అర్హత సాధించడం గమనార్హం. -
సముద్రంలో పాము కరిచి మత్స్యకారుడి మృతి
సంతబొమ్మాళి (శ్రీకాకుళం) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సముద్రంలో పాము కాటు వేయడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో గురువారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు తెప్పల కామయ్య(60) ఉదయం ఆరు గంటలకు భావనపాడు జట్టీ నుంచి బోటులో బై.రామ్మూర్తి, దున్న అప్పన్న, సత్యంతో పాటు మరో నలుగురుతో కలిసి బోటుపై సముద్రంలో చేపలు వేటకు వెళ్లారు. వలలో భారీగా చేపలు పడడంతో ఆనందపడిన మత్స్యకారులు వాటిని బోటులోకి లాగే ప్రయత్నం చేశారు. అయితే వలలోని చేపలు తీస్తుండగా... అందులో చిక్కుకున్న సముద్ర పాము కామయ్యను కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆయన వెంట ఉన్నవారు ఒడ్డుకు తీసుకొచ్చేలోగానే చనిపోయాడు. నౌపడ ఏఎస్సై రామారావు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. కామయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వేటకు వేళాయే..!
నేటితో ముగియునున్న నిషేధం పూసపాటిరేగ : రెండు నెలల విరామం తర్వాత మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సన్నద్ధమవుతున్నారు. చేపల వేటపై నిషేధం మంగళవారంతో ముగియనుంది. దీంతో వేటకు కావాల్సిన వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకోవడంతోపాటు అసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న పూసపాటిరేగ, బోగాపురం మండలాల్లో సుమారు 19వేల మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రత్యక్ష్యంగా నాలుగు వేల మంది, పరోక్షంగా 15వేల మంది మత్స్యకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండు మండలాల్లో 700 పడవలు ఉండగా, వాటిలో సంప్రదాయ బోట్లు 500 కాగా, ఫైబర్‌బోట్లు 200 వరకు ఉన్నాయి. అత్యధికంగా చింతపల్లి, పతివాడబర్రిపేట, తిప్పలవలస, కోనాడ, చేపలు కంచేరు, ముక్కాం గ్రామాల నుంచి పడవలు వేటకు వెళ్తాయి. అందని జీవన భృతి ప్రతి ఏడాది 45 రోజులు వేట నిషేధం కాగా, ఈ సంవత్సరం 60 రోజులకు పెంచారు. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 30 కిలోల బియ్యం, రూ.2వేల నగదు ఇచ్చారు. దీనిపై మత్స్యకారులు ఆందోళనలు చేశారు. దీంతో తమిళనాడు తరహాలో రూ.5వేలు నగదు, బియ్యం ఇస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే రూ.4వేల నగదు, 30 కిలోల బియ్యం ఇస్తున్నట్లు జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం కూడా జీవన భృతి చెల్లించలేదు. వేట నిషేధ సమయం ముగుస్తున్నా జీవన భృతి అందలేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే తమకు జీవన భృతి అందించాలని కోరుతున్నారు. -
మృగశిర.. రెట్టింపైన చేపల ధర
♦ ఎక్కడ చూసినా జోరుగా విక్రయాలు ♦ ఎగబడి కొన్న ప్రజలు ఘనంగా మృగశిర పండగ మృగశిర కార్తె ప్రారంభంలో చేపలు తినాలన్నది కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం. ఈసారి ఈకార్తె బుధవారం నుంచి ప్రారంభం కావడంతో చేపల ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ రోజులతో పోలిస్తే వీటి ధర రెట్టి రెట్టింపు ధరలతో విక్రయించినా ప్రజలు ఎగబడి మరీ కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు ఎండిపోవడంతో పట్టణాల నుంచి జలపుష్పాలను తెచ్చి మరీ విక్రయించారు. దీంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. పరిగి : మృగశిర పండగను బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మృగశిర పండగకు ప్రత్యేతగా చెప్పుకునే చేపలకు గిరాకీ విపరీతంగా పెరిగి పోవడంతో ధరలు సైతం ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే వీటి ధర కిలో రూ.80 నుంచి రూ. 120 మధ్య పలికేది. అయితే బుధవారం మాత్రం వీటి ధరకు రెక్కలు వచ్చాయి. ఏకంగా రూ. 180 నుంచి రూ. 200లకు విక్రయించినా.. జనం కొనుగోలు చేయడం గమనార్హం. గతంలో ఎగుమతి.. ఇప్పుడు దిగుమతి.. మృగశిర పండగకు రెండు మూడు రోజుల ముందే పరిగి ప్రాంతంలోని చెరువుల నుంచి చేపలు పట్టి పట్టణాలకు ఎగుమతి చేసే వారు. కానీ.. ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలోని పెద్ద పెద్ద చెరువులు సైతం అడుగంటాయి. దీంతో మృగశిర రోజున పట్టణాల నుంచి చేపలను తెచ్చి విక్రయించారు. దీంతో వీటి ధర రెండింతలు అయ్యింది. -
తమిళనాడులో ముగిసిన వేట నిషేధం!
చెన్నయ్‌ః సముద్ర జలాల్లో చేపల వేటపై తమిళనాడులో 45 రోజుల పాటు విధించిన నిషేధం ముగిసింది. జాలర్లు ఇకపై వేటకు వెళ్ళొచ్చని అధికారులు తెలిపారు. అయితే శ్రీలంక, భారత జాలర్ల సమస్య పరిష్కారానికి నాలుగో విడత సమావేశాలు త్వరలో ప్రారంభించాలని ఈ సందర్భంలో జాలర్లు కోరారు. తమిళనాడు తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి మే 29 తేదీవరకూ మొత్తం 45 రోజులపాటు చేపల వేటను నిషేధించిన విషయం తెలిసిందే. మెకనైజ్డ్ బోట్లలో సముద్రంలో చేపలు పట్టే జాలర్లకు ప్రతియేటా చేపల సంతానోత్సత్తి కోసం ఈ నిషేధాన్నిఅధికారులు అమల్లోకి తెస్తారు. నాగపట్నం, రామనాథపురం, తూథుకుడి, పుదుక్కొట్టై, కన్యాకుమారిల్లో ఆదివారం అర్థరాత్రినుంచి నిషేధాన్ని తొలగించడంతో జాలర్లు తిరిగి వేటకు వెళ్ళేందుకు తమ పడవలను చేపలు నిల్వ చేసేందుకు కావలసిన ఐస్ తోనూ, డీజిల్ తోనూ నింపి సిద్ధం చేసుకుంటున్నారు. -
చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు
వైరా (ఖమ్మం) : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో శనివారం చోటుచేసుకుంది. వైరా రిజర్వాయర్‌లో శుక్రవారం సాయంత్రం కొందరు మత్స్యకారులు చేపలు పడుతుండగా.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కూడిన గాలి వాన వచ్చింది. ఈ గాలి ధాటికి తెప్పలపై చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు నీట మునిగి గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో కొనిజర్ల మండలానికి చెందిన షేక్ అక్బర్, సైదులుతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
హమ్మయ్యా... చంద్రయ్య వచ్చాడు
డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్): చేపల వేటకు చెన్నై వెళ్లి గత నెల రోజుల నుంచి ఆచూకీ లేని చీకటి చంద్రయ్య ఎట్టకేలకు ఇంటికి చేరాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన మూగవాడు చీకటి చంద్రయ్య ఆరు నెలల కిందట పొట్ట కూటికోసం గ్రామస్తులతో కలిసి చేపల వేటకు చెన్నై వెళ్లాడు. కొంత కాలం పనిచేశాడు. నెల రోజుల కిందట చేపల వేట నిషేధం కావడంతో తోటిపనివారు స్వగ్రామాలకు చేరినా చంద్రయ్య మాత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి బంధువులు, తెలిసిన వారివద్ద వాకాబు చేసినా చంద్రయ్య జాడలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ లేకపోవడంతో మరణించాడని అందరూ అనుకున్న సమయంలో ఒక్కసారి ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందపడ్డారు. వేట నిషేధం సమయంలో రోజు కూలీగా ఇతర పనిలో చేరడం వల్ల ఇంటికి రాలేకపోయినట్టు యంద్రయ్య సైగల ద్వారా తెలిపాడు. -
వలలకు విరామం
అమలులోకి వచ్చిన వేట నిషేధం జిల్లా వ్యాప్తంగా నిలిచిన 600 మెకనైజ్డ్, 3 వేల మోటరైజ్డ్ బోట్లు జూన్ 14 అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి లక్ష మంది ఉపాధికి ఆటంకం కాకినాడ సిటీ : వలలు కడలికి దూరమయ్యాయి. వేట బోట్లు లంగరేసుకున్నాయి. నిత్యం కెరటాల దారుల్లో సాగుతూ, ఆ జలనిధి నుంచే జీవనోపాధిని పొందే ‘వేటగాళ్లు’ తీరానికే పరిమితమయ్యారు. సముద్ర జలాల్లో చేపలవేట నిషేధం గురువారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిషేధం జూన్ 14 అర్ధరాత్రి వరకూ.. 61 రోజులు అమలులో ఉంటుంది. నిషేధంతో తూర్పుగోదావరి జిల్లాలో తీర ప్రాంతాల్లోని బోట్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వేసవి కాలంలో చేపలు, రొయ్యలతో పాటు ఇతర సముద్ర జీవులు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపలు వేటాడడం వల్ల ఆ గుడ్లు పగిలి మత్స్యసంపద అభివృద్ధికి విఘాతం వాటిల్లే ప్రమాదముంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. గతంలో 45 రోజుల పాటు ఉండే నిషేధాన్ని గత ఏడాది నుంచి 61 రోజులకు పెంచింది. సంప్రదాయ బోట్లతో వేట సాగిస్తే పెద్దగా నష్టం లేకపోవడంతో వాటికి మినహాయింపు ఉంది. అయితే మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిషేధకాలంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదు. ఆ సమయంలో మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి రూ.4 వేల వంతున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారైనా పటిష్టంగా అమలయ్యేనా..? జిల్లాలోని సుమారు 144 కిలోమీటర్ల సముద్ర తీరంలో సుమారు 600 మెకనైజ్డ్, మూడువేల వరకు మోటరైజ్డ్ బోట్లు సముద్రంలో చేపలవేట సాగిస్తున్నాయి. వీటిపై దాదాపు లక్ష మంది మత్స్యకారులు, ఇతర వర్గాలవారు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేట నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల మత్స్యకారుల నుంచి మత్స్యశాఖాధికారులు సొమ్ములు దండుకుని వేట నిషేధాన్ని నీరుగారుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేలా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మత్స్యకార నాయకులు కోరుతున్నారు. -
15 నుంచి ఏపీలో చేపల వేటపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: సముద్రంలో మత్స్య సంపద పెంపు, సమర్థ నిర్వహణ, సంరక్షణతో పాటు సముద్ర భద్రతా కారణాల రీత్యా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే 61 రోజుల పాటు అన్ని రకాల చేపల వేటను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కేంద్రప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సోమవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలంలో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది. ఈప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలుగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిషేధాన్ని విధించడం ఆనవాయితీ. తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్, జూన్ నెలల మధ్య, పశ్చిమ తీరంలో జూన్ ఒకటి నుంచి జూలై 31 వరకు కేంద్రప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ సముద్ర తీర చేపల వేట (నియంత్రణ) చట్టం కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధ కాలంలో రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో మరపడవులే కాకుండా చిన్నతరహా సంప్రదాయ పడవుల్ని సైతం అనుమతించరు. చేపల వేట నిషేధ కాలానికి జాలర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తుంది. -
ముస్తాబవుతున్న విశాఖ ఫిషింగ్ హార్బర్
-
15మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో బుధవారం పర్లోవపేటకు చెందిన 15 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతైంది. 15 రోజుల కిందట రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా తిరిగిరాలేదు. దాంతో నాలుగు రోజుల కిందట బాధిత కుటుంబాలు తమ వాళ్లు చేపల వేటకని వెళ్లి ఇంతవరకూ తిరిగిరాలేదంటూ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. ఆయన అధికారులు స్పందించకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఉప్పుటేరులో వ్యక్తి గల్లంతు
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఉప్పుటేరులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి పంచాయతి పరిధిలోని చింతరేవులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బంగార్రాజు(45) శనివారం ఉదయం చేపల వేట కోసం వెళ్లాడు. అయితే.. వేటాడే సమయంలో ప్రమాద వశాత్తు ఉప్పుటేరులో పడిపోయాడు. ఇది గమనించిన తోటి జాలర్లు స్థానికులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
రేపల్లె (గుంటూరు) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(40) సోమవారం ఉదయం కృష్ణానదిలో వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో నదిలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యం అయింది. -
మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ భరోసా
- బాధితులను - ఓదార్చిన నేతలు - ఆర్ధిక సాయం అందజేత - పిఠాపురం, తుని నియోజకవర్గాలలో పర్యటన - ధైర్యం చెప్పిన జ్యోతుల, ఎమ్మెల్యే రాజా తుని : చేపల వేటకు వెళ్లిన మత్సకారులు బతికి ఉన్నారో లేదో తెలియక దుఃఖసాగరంలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా మేమున్నామంటూ వైఎస్సార్ సీపీ నేతలు భరోసా కల్పించారు. తుని, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన మత్సకారుల కుటుంబాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్ చంద్ర బోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గురువారం పరామర్శించారు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, ఉప్పాడలకు చెందిన తంతాడ నాగబాబు, చెక్కా సూర్యారావు, తొండంగి మండలం హుకుంపేటకు చెందిన తిత్తి అప్పలరాజు, కోడా లోవరాజు, ఆర్జిల్లి రాంబాబు, పాత పెరుమాళ్లపురానికి చెందిన చొక్కా సింహాచలం, మెరుగు బాబూరావు, చొక్కా పెంటయ్య, చొక్కా రాజు కుటుంబ సభ్యులకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. శోకంలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. వేటకు వెళ్లి జాడ లేని మత్సకారులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అధైర్య పడవద్దని, గల్లంతైన వారిని వెతికించేందుకు తాము ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు మీ బాధలను అర్థం చేసుకున్నారని, సాయం చేయాలని తమను పంపారని వెల్లడించారు. తాము 20 రోజులకుపైగా కంటిమీద కునుకు లేకుండా తమ వాళ్ల ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నామని మత్సకారుల కుటుంబ సభ్యులు నాయకుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎటువంటి సాయం అందించ లేదని వివరించారు. వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచిందన్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం ఇంత వరకు అందలేదని ఎమ్మెల్యే రాజా విమర్శించారు. పది రోజులలో సాయం అందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కనీస ధర్మమన్న విషయాన్ని మంత్రులు గుర్తించ లేదని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, జిల్లా కార్యదర్శులు అత్తులూరి నాగబాబు, పెదపాటి అమ్మాజీ, బోపాలపట్నం ప్రసాద్, కురుమళ్ల రాం బాబు, సీజెసీ మాజీ సభ్యుడు గంపల వెంకటరమణ, రావు చిన్నారావు, కోడా వెంకటరమణ, కొయ్యా శ్రీనుబాబు, మోతుకూరి వేంకటేష్ పాల్గొన్నారు. -
ఇంటికి చేరిన ఏడుగురు మత్య్సకారులు
శ్రీకాకుళం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారల్లో ఏడుగురు ఆచూకీ లభ్యమైంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలీ మండలంలో వీరంతా ఒడ్డుకు చేరుకున్నారు. మత్య్సకారుల్లో ఇద్దరికి అస్వస్థతగా ఉండటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా ఐదుగురు స్వస్థలానికి బయలుదేరినట్లు సమాచారం. కాగా వారం క్రితం చేపలవేటకు 48 బోట్లలో వెళ్లిన 250 మంది మత్య్సకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో మత్యకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. -
మత్స్యకారుల ఆచూకి గల్లంతు?
- యలమంచిలి సీఐకు బంధువుల ఫిర్యాదు యలమంచిలి : చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆది వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి సముద్రమార్గంలో బోటు పై ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంకు చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్య ఈ నెల 19న బయలుదేరారు. శనివారం ఉదయానికే స్వగ్రామానికి చేరుకోవాలి. మచిలీపట్నం తీరానికి వచ్చే వరకు వారు ఫోన్లో మాట్లాడారని, అప్పటి నుంచి సమాచారం లేకుండా పోయిం దని కుటుంబ సభ్యులు ఆదివారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని పెంటకోట, కాకినాడ మెరైన్ పోలీస్టేషన్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన కాశీరావు, కోటయ్య నెల రోజుల క్రితం చేపల వేటకు ప్రకాశం జిల్లా చీరాల వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం 7 గంటలకు బోటుపై బంగారమ్మపాలెం బయలుదేరారు. ఆదివారం వరకు రాకపోవడంతో కుటుంబీకు ల్లో ఆందోళన ఎక్కువైంది. ఆదివారం రాత్రి వరకు మత్స్యకారుల ఆచూకి తెలియకపోవడంతో సంబంధిత కుటుంబీకు లు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
ఆరంభంలోనే ‘అల’జడి!
- వాయుగుండంతో బోట్లు వెనక్కి - విశాఖ ఫిషింగ్ హార్బర్లో లంగరు - నష్టాల్లో మత్స్యకారులు సాక్షి, విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత చేపల వేటకెళ్లిన మత్స్యకారుల ఆశలపై వాయుగుండం నీళ్లు చల్లింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి (61 రోజులు) వరకు ప్రభుత్వం చేపలవేటపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 15వ తేదీ నుంచి వీరు వేటకు బయల్దేరారు. వెళ్లిన రెండు రోజులకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్ర మేపీ వాయుగుండంగా బలపడింది. ఫలితంగా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణభయంతో అప్పటికే సముద్రంలో వేట సాగిస్తున్న బోట్లలో సగానికిపైగా ఆగమేఘాలపై విశాఖ హార్బర్‌కు తీసుకొచ్చేశారు. మరికొన్ని మరపడవలు సమీపంలో ఉన్న ఒడిశాలోని గోపాల్పూర్, పారదీప్, శ్రీకాకుళం జిల్లా భావనపాడు తదితర రేవులకు చేర్చారు. విశాఖ నుంచి సుమారు 650 బోట్లు వేట సాగిస్తుంటాయి. నిషేధం పూర్తయ్యాక ఇందులో దాదాపు 400 బోట్లు వేటకెళ్లాయి. మిగిలినవి వెళ్లే లోగానే అల్పపీడన భయంతో హార్బర్‌లోనే నిలిచిపోయాయి. వాస్తవానికి నిషేధానికి రెండు నెలల ముందు నుంచి చేపలవేట ఆశాజనకంగా లేదు. దీంతో అప్పటికే మత్స్యకారులు బాగా నష్టపోయారు. వేట విరామం తర్వాత చేపల లభ్యత బాగుంటుందన్న ఆశతో వేటకెళ్లారు. ఒకసారి వేటకు వెళ్తే 10 నుంచి 15 రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. ఇందుకు అవసరమైన డీజిల్, ఐస్, నిత్యావసర సరకులు వెరసి రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టారు. సముద్రంలో వేట మొదలయ్యే సరికే వాయుగుండం హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో అర్ధంతరంగా వెనక్కి రావడం వల్ల ఒక్కో బోటుకు 300 నుంచి 400 లీటర్ల డీజిల్ వృథాగా ఖర్చయింది. నాలుగైదు టన్నుల ఐస్ కూడా కరిగిపోయింది. చేపలు లభ్యత లేకపోవడంతో రూ.40 నుంచి 50 వేల వరకు నష్టపోయామని బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయుగుండం హెచ్చరికలతో వెనక్కి వచ్చేసిన బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్లో 300కు పైగా ఉన్నాయి. ఇవన్నీ మళ్లీ వేటకు బయల్దేరాలంటే మరో రెండు రోజులైనా పడుతుంది. అప్పుడు కొత్తగా ఐస్, రేషన్ వంటివి అవసరమని, మళ్లీ వాటిని సమకూర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని వైశాఖి బోటు ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్.సత్యనారాయణమూర్తి తెలిపారు. -
61 రోజుల పాటు వేట నిషేధం
కాకినాడ: సముద్రంలో వేట నిషేధం నేటి( గురువారం) నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిషేధం జూన్ 14 వరకు కొనసాగనుంది. ఏకంగా ఈసారి 61 రోజుల పాటు వేట నిలిపివేయడం ఇదే మొదటిసారి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న మత్స్య కారుల కన్జర్వేషన్ పీరియడ్‌గా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ పీరియడ్‌లో చేపలు గుడ్లు పెట్టే కాలంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయాల్లో వేట చేయడం వల్ల ఆశించిన మేరకు మత్స్యవేట సాగకపోగా, చేపల సంతతి అంతరిం చుపోతుందనే ఉద్ధేశ్యంతో ప్రతి సంవత్సరం సముద్రంలో వేట చేయకూడదనే నిబంధనను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నిబంధనలకు విర్ధుంగా మత్స్యకారులు వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
సారీ.. జోక్యం చేసుకోలేం!
సాక్షి, చెన్నై:శ్రీలంకకు దారాదత్తం చేసిన కచ్చదీవులను మళ్లీ స్వాధీనం చేసుకోవాల్సిందే నని కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అసెంబ్లీలో తీర్మానాలు చేసినా, పదేపదే లేఖాస్త్రాలు సంధించినా ఫలితం మాత్రం శూన్యం. తమిళ భూభాగాన్ని గుప్పెట్లో పెట్టుకోవడమే కాకుండా, తమ మీద శ్రీలంక దాడులు చేస్తూ రావడం జాలర్లను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. కొత్త ప్రభుత్వంతోనైనా తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని, కచ్చదీవుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావించిన జాలర్లకు మిగిలింది కన్నీళ్లే. పారంపర్యంగా తమకు కల్పించిన చేపల వేట హక్కును కాలరాసే రీతిలో కేంద్రంలోని పాలకులు ఓ వైపు, శ్రీలంక నావికాదళం మరో వైపు వ్యవహరించడంతో జాలర్లలో ఆందోళన బయలుదేరింది. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు. పిటిషన్ : భౌగోళికంగానూ, సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత మేరకు కచ్చదీవులు భారత్ పరిధిలోనే ఉండాల్సిన అవసరం ఉందన్న డిమాండ్‌తో ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తన గళాన్ని విప్పుతుంటే, మరో వైపు తమ హక్కులను పరిరక్షించాలంటూ మద్రాసు హైకోర్టును జాలర్లు ఆశ్రయించారు. వరుస దాడులను వివరిస్తూ, కడలిలో భద్రత కల్పించాలని, తమ హక్కులను రక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఏడాది కాలంగా హైకోర్టులో సాగుతోంది. విచారణ సందర్భంగా కచ్చదీవుల వ్యవహారం ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం రిట్ పిటిషన్ దాఖలు చేయడం జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. అయితే, తమకు కోర్టు ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్న జాలర్లకు మాత్రం చివరకు మిగిలింది నిరాశే. జోక్యం చేసుకోం : మంగళవారం విచారణను మద్రాసు హైకోర్టు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది. కచ్చదీవుల వ్యవహారం రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల సమస్యగా పేర్కొన్నారు. ఇందులో కోర్టు జోక్యం చేసుకునేందుకు వీలు లేదన్నారు. రెండు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా రెండు దేశాల దౌత్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడుల అడ్డుకట్ట విషయంలోను చర్చించి నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం ఈ విషయంగా చర్యలు తీసుకోబోతున్న దృష్ట్యా, విచారణను ముగిస్తున్నామని ప్రకటించారు. బంతిని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టడం నెట్టడంతో జాలర్లకు నిరాశ మిగిల్చింది. ఇక తమ పారంపర్య వృత్తిని వదులుకోవడమా లేదా, బతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడమా? అన్న సందిగ్ధంలో రామేశ్వరం జాలర్లు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ, అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా...ఫలితం దక్కేనా..! అన్నది వేచి చూడాల్సిందే! -
సముద్రంలో పడవ బోల్తా
సొర్లగొంది సమీపంలో ప్రమాదం ఐదుగురు జాలర్లు సురక్షితం కొట్టుకుపోయిన వలలు, దెబ్బతిన్న పడవ ఇంజిన్ సొర్లగొంది (నాగాయలంక) : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సొర్లగొంది గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఐదుగురు జాలర్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. గ్రామం నుంచి గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో మేడా వేంకటేశ్వరరావుకు చెందిన చేపల పడవలో అతనితోపాటు, మేడా నాగబాబు, కొల్లాటి ఆంజనేయులు, విశ్వనాథపల్లి వీరబాబు, పెదసింగు వెంకటేశ్వరరావు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు. భారీ వలను చేపలకోసం జారవిడిచారు. అయితే వాతావరణంలో కనిపించిన మార్పులను గుర్తించిన ఈ జాలర్లు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో జారవిడిచిన వలను చేదుకుని పడవలో వేసుకుని తిరుగుముఖం పట్టారు. నదీ ముఖద్వారం సమీపంలోకి చేరుకునే సమయంలో ఒక్క ఉదుటున అలలు విరుచుకుపడటంతో పడవ తిరగబడింది. ఒడ్డునకు దగ్గరలో ఈ ఘటన జరగడంతో ఐదుగురు జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో రూ.60 వేల విలువైన వలలు కొట్టుకుపోయాయని, పడవ ఇంజిన్ దెబ్బతిందని మేడా వేంకటేశ్వరరావు తెలిపారు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి వేరే బోటు సాయంతో దెబ్బతిన్న పడవ, ప్రమాదంలో చిక్కుకుని బయటపడ్డ జాలర్లను సాయంత్రానికి సొర్లగొంది పడవల రేవుకు చేర్చారు. పడవ బోల్తాపడిన విషయాన్ని అవనిగడ్డ మత్యశాఖ అభివృద్ధి అధికారి చెన్ను నాగబాబు ధృవీకరిం చారు. జలర్లు సురక్షితమని జరిగిన సంఘటన, నష్టం వివరాలను మత్యశాఖ ఉన్నతాధికారులకు తెలియపర్చానని ఆయన తెలిపారు. -
ఆక్వా రైతు కుదేలు
భారీస్థాయిలో చేపల మృత్యువాత వాతావరణ మార్పుతో రైతుల బెంబేలు హడావుడిగా పట్టుబడులు కలిదిండి : వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చిరు జల్లులు కురవటంతో చెరువులలో ఆక్సిజన్ తగ్గి చేపలు మృత్యువాత పడుతున్నాయి. కలిదిండి మండలంలో పెద్ద ఎత్తున చేపలు చనిపోవడంతో సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతంలో 29వేల ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు ఉండగా, ఈ నెల 10వ తేదీన వాతావరణ మార్పుల వల్ల 300 టన్నులు చేపలు చనిపోగా రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరలా శుక్రవారం వాతావరణం చల్లబడి శనివారం ఉదయం వర్షపు జల్లులు కురవటంతో ఆక్సిజన్ లోపం వల్ల పెదలంక, పెద్దపుట్లపూడి, కొండంగి, లోడిదలంక, పోతుమర్రు, తాడినాడ, చినతాడినాడ, కోరుకొల్లు, సానారుద్రవరం, సంతోషపురం, అమరావతి, గుర్వాయిపాలెం, మూలలంక గ్రామాల్లోని చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలాయి. అప్పారావుపేట గ్రామంలో ఒక రైతుకు చెందిన చెరువులో 3టన్నుల చేపలు చనిపోయాయి. దీంతో రైతులు అయినకాడికి అమ్ముకుందామన్న ఉద్దేశంతో హడావుడిగా పట్టుబడులు కానిచ్చేస్తున్నారు. 25 నుంచి 30 ఎకరాల్లో సుమారు 30 టన్నులు చేపలు మృత్యువాత పడ్డాయని రైతులు తెలిపారు. రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లింది. అదే విధంగా వాతావరణ మార్పుల వల్ల వనామి రొయ్యలు మృత్యువాత పడటంతో రైతులు వర్షంలోనే పట్టుబడులు సాగించారు. వ్యవ ప్రయాశలకోర్చి సాగు చేస్తుంటే.. ఏటా వాతావరణ మార్పుల వల్ల తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆక్వా రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మండవల్లి మండలంలో.. ఈ ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాలలో చేపల సాగు జరుగుతోంది. ఒక్కసారిగా చేపలు మృత్యువాత పడి గట్ల వెంబడి తేలుతుతుండటంతో చేపల చెరువుల రైతులకు దిక్కుతోచడం లేదు. వివిధ మందులు చెరువులో పిచికారి చేస్తున్నప్పటికీ ఏవిధమైన ఉపయోగం లేదంటున్నారు. అమ్ముదామన్నా తగిన ధర లేదని ఆవేదన చెందుతున్నారు. -
కొత్త ప్రభుత్వంపైనే కోటి ఆశలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: దశాబ్దాల కాలంగా నలుగుతున్న శ్రీలంక సమస్యకు కొత్త ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని తమిళనాడు మత్స్యకారుల బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు -శ్రీలంక మధ్య శ్రీలంకలో సాగిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం చెన్నైకి చేరుకుంది. తమిళ జాలర్లు బంగాళాఖాతంలో చేపల వేట సాగిస్తే శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు రాష్ట్ర జాలర్లపై విరుచుకుపడటం వివాదాస్పదమైంది. సాయుధ బలగాలతో లంకసేన చుట్టుముట్టగా నిరాయుధులైన తమిళ జాలర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. పదుల సంఖ్యలో శ్రీలంక చెరలో మగ్గుతున్నారు. ఈ పరిణామాలు తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. భారత ప్రధాని చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు ఉత్తరాలు రాశారు. ఎట్టకేలకూ ఈ ఏడాది జనవరిలో తొలి దశ చర్చలు చెన్నైలో, రెండో దశ చర్చలు శ్రీలంకలో ఈనెల 12వ తేదీన ప్రారంభించారు. తమిళనాడు మత్స్యశాఖ కార్యదర్శి విజయకుమార్, సంచాలకులు మునినాధన్, సహాయ సంచాలకులు రంగరాజన్, భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి సుచిత్రాదురై, సహాయ కార్యదర్శి జోషి తదితర 9 మంది అధికారులు, మత్స్యకారుల సంఘానికి చెందిన 17 మంది ప్రతినిధులు హాజరయ్యూరు. ఈచర్చలకు శ్రీలంక మత్స్యశాఖ డెరైక్టర్ జనరల్ విమల్ హెడ్డియరాచ్చి నేతృత్వం వహించారు. అయితే చర్చలు సుముఖంగా సాగకపోవడంతో 13వ తేదీనాటి చర్చలను తమిళ జాలర్లు బహిష్కరించి బుధవారం మధ్యాహ్నం శ్రీలంక నుంచి చెన్నైకి చేరుకున్నారు. జాలర్ల ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడుతూ, తమ డిమాండ్లకు శ్రీలంక జాలర్లు ఓ మోస్తరు అంగీకరించినా అక్కడి ప్రభుత్వాధికారులు అడ్డుతగిలారని ఆరోపించారు. రెండు మడతల వలలు, పడవకు వలలను కట్టి లాక్కుంటూ వెళ్లే విధానం, ఉచ్చు వలలు వినియోగించరాదని తొలిరోజు చర్చల్లో శ్రీలంక జాలర్లు కోరగా తాము రెండింటికి అంగీకరించామని తెలిపారు. రెండు మడతల వలలు, ఉచ్చువలల వినియోగాన్ని వెంటనే ఆపివేస్తామని, అయితే వలలను లాక్కుంటూ వెళ్లే విధానాన్ని నిలిపివేసేందుకు మూడేళ్లు గడువు కావాలని తాము కోరినట్లు తెలిపారు. ఏడాదికి 120 రోజులు చేపల వేట సాగించే తాము 90 రోజులు మాత్రం సరిహద్దుకు ఆవల వేట సాగించేందుకు అనుమతించాలని కూడా కోరినట్లు వారు తెలిపారు. ఇందుకు సైతం జాలర్లు సరేనంటే అక్కడి అధికారులు ససేమిరా అన్నారని వారు చెప్పారు. నెల లేదా మూడునెలల్లో మళ్లీ చర్చలకు అనుమతిస్తామని శ్రీలంక గడువునిచ్చినట్లు తెలిపారు. దీంతో ఇక చర్చలు అనవసరమని భావించి చెన్నైకి చేరుకున్నామని తెలిపారు. యూపీఏ -1, 2 ప్రభుత్వాలు తమ గోడును సీరియస్‌గా తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల లేదా మూడు నెలల్లో చర్చలను జరిపేందుకు శ్రీలంక సిద్దమైంది, అలాగే అప్పటికి అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం సైతం తమ సమస్య పరిష్కారం పట్ల సామరస్యంగా ముందుకొస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. -
చేపల వేటకు వెళ్లి ముగ్గురు మహిళల మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తనపర్తిలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో మహిళ గల్లంతు అయ్యింది. గల్లంతు అయిన మహిళ కోసం జాలర్లు గాలిస్తున్నారు. ఈ ఘటనతో మహిళల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తూర్పుగోదావరి నుంచి 11 మంది మత్స్యకారుల గల్లంతు
సముద్రంలో వేటకు వెళ్లి, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. దాదాపు వారం రోజుల నుంచి వీరి ఆచూకీ లభ్యం కావట్లేదని స్థానికులు మెరైన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. యు.కొత్తపల్లి మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు ఎం.రమణకు చెందిన పడవలో ఆగస్టు మూడో తేదీన సముద్రంలో చేపల వేటకు బయల్దేరారు. తమ పడవలో డీజిల్ అయిపోయిందని, అందువల్ల నడి సముద్రంలో తాము ఇరుక్కుపోయామని వాళ్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. ఈ ఐదుగురిని కాపాడేందుకు మరో ఆరుగురు మత్స్యకారులు ఆగస్టు ఐదో తేదీన బయల్దేరారు. కానీ, వాళ్ల ఫోన్లు కూడా ప్రస్తుతం పలకట్లేదు. దీంతో మొత్తం 11 మంది మత్స్యకారుల సమాచారం తెలియట్లేదు. మెరైన్ పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు వీరి ఆచూకీ తెలుసుకోడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు.