ఆకాశంలో ఏదో ప్రళయం వచ్చినట్లు మేఘాలు ఇలా కాషాయ వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఆ వర్ణాన్ని ఇలా నీటిలో చూసుకుని నింగి మురిసిపోయింది. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువుపై ఆకాశంలో శనివారం సాయంత్రం ఈ అద్భుతమైన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి.
పాలకు వరుస
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రం వద్ద పాలకోసం శనివారం ఉదయం ప్రజలు ఇలా చెంబులు, గ్లాసులు, టిఫిన్‌బాక్సులు, ప్లాస్టిక్ బాటిళ్లతో వరుస కట్టిన దృశ్యం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, దేవరుప్పల
తెప్పలపై చేపల వేట..
ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ప్రాజెక్టు దిగువన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తెప్పలపై ఉత్సాహంగా చేపల వేట కొనసాగిస్తున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.
– గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల.
పొలాల వద్దే వ్యాక్సినేషన్
తిరుమలగిరి (సాగర్)/పెద్దవూర: ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంకల్పించడంతో వైద్యాధికారులు కూడా నడుం బిగించారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో, గిరిజన గూడాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ ముమ్మరంగా కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రజలెవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులే పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. శనివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment