
డిప్యూటీ స్పీకర్ గాలానికి చిక్కిన చేప
కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు చెరువులను ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు.
మెదక్ మున్సిపాలిటీ: కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు చెరువులను ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిట్లం చెరువు వద్ద పలువురు యువకులు చేపలు పడుతుండటంతో.. ఆమె కూడా గాలం వేశారు. ఓ చేప చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు.