ప్రమాదకరమైన ప్రాంతంలో కొనసాగుతున్న చేపల వేట
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పాల్వంచ కిన్నెరసాని డ్యామ్ గేట్లను ఎత్తడంతో నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కొందరు యువకులు రాజాపురం– ఉల్వనూరు మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన వద్ద నీటి ప్రవాహంలో దోమల తెరల ద్వారా చేపల వేట సాగిస్తున్నారు. గతంలో గేట్లు తెరిచిన కొన్ని సందర్భాలలో కిన్నెరసాని డ్యామ్‌లో ఉన్న మొసళ్లు నీటి ప్రవాహానికి బయటకు కొట్టుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్రాంతం అయినప్పటికీ ఎటువంటి హెచ్చరికలు బోర్డులు లేకపోవడంతో ఇలా కొందరు యువకులు గురువారం చేపల వేట సాగిస్తు్తండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది.– సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment