బయ్యారం (ఖమ్మం) : కుమారుడి దశ దిన కర్మ సందర్భంగా పిండ ప్రదానం చేసేందుకు వెళ్లిన తండ్రి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని హరిజనవాడలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ భిక్షపతి(35) ఈ నెల 3న అనారోగ్యంతో మృతి చెందాడు. దశ దిన కర్మ సందర్భంగా శుక్రవారం పిండప్రదానం చేసేందుకు బిక్షపతి తండ్రి వెంకన్న(60) గ్రామ సమీపంలోని దామర చెరువు వద్దకు మరో వ్యక్తిని తోడు తీసుకుని వెళ్లాడు.
ఆ వ్యక్తి ఒడ్డున నిలబడి ఉండగా వెంకన్న నీళ్లలోకి దిగారు. పిండ ప్రదానం చేస్తూనే ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయారు. ఒడ్డున ఉన్న వ్యక్తి స్పందించి వెంటనే నీళ్లలోకి దిగి ఆయన్ను రక్షించేసరికే వెంకన్న తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
కుమారుడికి పిండప్రదానం చేస్తూ..
Published Fri, Sep 11 2015 3:14 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement