
ఉరకలెత్తుతున్న గోదారి.. ఉత్సాహంగా తెప్పలపై సాగిపోతూ వీరు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టి పేట మండలం గుళ్లకోట గ్రామ శివారులోని గోదావరిలో మత్స్యకారులు శుక్రవారం ఇలా చేపల వేట సాగించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల
దాతృత్వానికి గుర్తింపు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో పూర్వ విద్యార్థి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి రూ.3.50 కోట్లతో భవనం నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. దీనికి గుర్తింపుగా సుభాష్‌రెడ్డి తల్లిదండ్రుల పేరు ‘తిమ్మయ్యగారి సుశీల–నారాయణరెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్, బీబీపేట పాఠశాల’గా ఖరారు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ధరలో తేజం
ఖమ్మం వ్యవసాయం: ‘తేజ’రకం మిర్చి ధర పుంజుకుంటోంది. విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతుండడంతో ధర పెరుగుతున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం పలువురు రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చిని శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా క్వింటా ధర రూ.16,100గా నమోదైంది. గురువారం రూ.15,800 పలికిన ధర ఒకేరోజు వ్యవధిలో రూ.300కి పెరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment