చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో శనివారం చోటుచేసుకుంది.
వైరా (ఖమ్మం) : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో శనివారం చోటుచేసుకుంది. వైరా రిజర్వాయర్‌లో శుక్రవారం సాయంత్రం కొందరు మత్స్యకారులు చేపలు పడుతుండగా.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కూడిన గాలి వాన వచ్చింది. ఈ గాలి ధాటికి తెప్పలపై చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు నీట మునిగి గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో కొనిజర్ల మండలానికి చెందిన షేక్ అక్బర్, సైదులుతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.