వేటకు విరామం! | fishing is stopped two months | Sakshi
Sakshi News home page

వేటకు విరామం!

Published Fri, Apr 7 2017 4:10 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

వేటకు విరామం!

వేటకు విరామం!

► 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం
► మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం
► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం
► గత ఏడాది పరిహారం అందరికీ అందని వైనం
► తీరప్రాంత గ్రామాల్లో అమలు కాని ఉపాధి హామీ పథకం


చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు  సముద్రంలో మర పడవలతో వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి సీజన్‌ కావడంతో 60 రోజుల పాటు వేటను నిషేధించిన సర్కార్‌.. సముద్రాన్ని నమ్ముకొని బతుకుబండిని నడుపుతున్న మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం చేయలేదు. నిషేధ సమయంలో రూ. నాలుగు వేలు చొప్పున అర్హులైన వారికి అందజేయాల్సి ఉన్నా గతంలో చాలామందికి ఇవ్వలేదు. ఈసారైనా తమను ఆదుకోవాలని గంగSపుత్రులు వేడుకుంటున్నారు.

ఎచ్చెర్ల క్యాంపస్‌: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్‌ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్‌ మర బోట్లు ఉన్నట్టు లెక్కలుఎచ్చెర్ల క్యాంపస్‌: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్‌ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్‌ మర బోట్లు ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నారు. ఏటా చేపల వేట నిషేధ సమయంలో వీరిలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మిగిలిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వేట నిషేధ సమయంలో మతస్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. లూజ్‌ సోయిల్‌ నెపంతో తీర ప్రాంతాల్లో పనులు చేపట్టక పోవడంతో 60 రోజుల పాటు స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది ఈ సమయంలో ఉపాధి కోసం పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, వీరావల్,  రత్నగిరి, కాండ్లా, సూరత్, మంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ బోట్‌ డ్రైవర్లుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తుండగా, కొందరు వంట మనుషులుగా పని చేస్తున్నారు.

గుర్తింపు కార్డులు నిల్‌: మరో పక్క చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ గుర్తింపు కార్డులు కూడా ఉండడం లేదు. దీంతో వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే పరిహారం  చాలామంది అందని పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకొని బతుకు నావను నడుపుతున్న అందరికీ పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అరకొరగా ఇస్తున్న పరిహారం చెల్లించే సమయంలో రాజకీయాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరో పక్క నిషేధ సమయంలో కొన్నేళ్లగా అందిస్తున్న నాలుగు వేల రూపాయల పరిహారాన్ని పెంచాలని మత్స్యకారులు కోరుతున్నా ప్రయోజనం లేదు.ఇతర రాయతీలు సైతం వీరికి వర్తించటం లేదు. గతంలో ఇచ్చే 30 కిలోల బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు.

ఉపాధి చూపాలి: నిషేధ కాలంలో మత్స్యకారులు రెండు నెలల పాటు ఉపాధి కోత్పోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో అమలు చేయాలి. మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించాలి. అర్హులందరికీ పరిహారం చెల్లించటం, పరిహారం పెంచటం, బియ్యం, కిరోసిన్‌ అందజేసేలా చర్యలు తీసుకోవాలి. –ఎం.రామారావు, మత్స్యకార యూనియన్‌ నాయకుడు

అన్ని మత్స్యకార కుటుంబాలకు పరిహారమివ్వాలి: జిల్లాలోని అన్ని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో పరిహారం అందజేయాలి. నిషేధ కాలంలో అందరు జీవనోపాధి కోల్పోతున్నారు. నష్టపోతున్న కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవాలి. పారదర్వకంగా నష్ట పరిహారం పంపిణీ చేయాలి. – ఎం.పట్టాభి, బడివానిపేట, ఎచ్చెర్ల మండలం

అర్హులందరికీ అందజేస్తాం: చేపల వేట నిషేధ కాలంలో అర్హులం దరికీ పరిహారం అందజేస్తాం. జిల్లాలో సుమారు 2,000 వరకూ మరబోట్లు ఉన్నవారు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వీరికి పరిహారం అందజేస్తాం. సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకు రావచ్చు.
– కృష్ణమూర్తి, డీడీ, మత్స్యశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement