two months
-
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్‌ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
వావ్! ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి రెండు నెలల్లో రూ. 500 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఏడాది చివరికల్లా బిలియన్ డాలర్ల(రూ. 7,800 కోట్లు) ఆదాయం అందుకోగల మని కంపెనీ భావి స్తోంది. అయితే తొలి రెండు నెలల్లో ఎన్ని వాహనా లు విక్రయించిందీ వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కస్టమర్ల విశ్వాసం పెరుగుతున్నదని, దీంతో భవిష్యత్‌లో మరింత పురోభివృద్ధిని సాధించగలదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజుకి 1,000 వాహనాలను తయారుచేయగల కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే భారీ ఆర్డర్లను పొందిందని, ఇకపై మరింత వేగాన్ని చూపే వీలున్నదని తెలియజేసింది. కాగా వాహన రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఓలా ఎస్1 ప్రో రిజిస్ట్రేషన్ 12,683 యూనిట్ల నుంచి 9,196 యూనిట్లకు క్షీణించాయి. ఇప్పటివరకూ కంపెనీ 50,000 స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. గతేడాది ఆగస్ట్‌లో కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఏలూరు డీఎఫ్‌వోకు రెండు నెలల జైలుశిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) యశోదాబాయికి కోర్టు ధిక్కార నేరం కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. యశోదాబాయి అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. టెండర్ పిలిచి.. వర్క్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో.. పశ్చిమ గోదావరి జిల్లా కన్నాపురం ఫారెస్ట్ రేంజి పరిధిలో టేకు, కలప రవాణా నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ అటవీ శాఖ ఈ ఏడాది జనవరి 12న నోటిఫికేషన్ జారీ చేసింది. దాఖలైన టెండర్లలో ఏలూరుకు చెందిన గోలి శరత్‌రెడ్డి అనే వ్యక్తి లోయెస్ట్‌గా నిలిచారు. అధికారులు అతనికి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా.. వన సంరక్షణ సమితి ప్రతినిధులతో పనులు మొదలు పెట్టారు. దీనిపై శరత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ టెండర్ ప్రక్రియను పూర్తి చేసేంత వరకు ఎలాంటి పనులు కొనసాగించవద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వాటిని బేఖాతరు చేస్తూ పనులను కొనసాగిస్తున్నారంటూ జిల్లా అటవీ శాఖాధికారులు టి.శ్రీనివాసరావు, యశోదాబాయిలపై శరత్‌రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ టెండర్లను రద్దు చేయకుండానే వన సంరక్షణ సమితి చేత టేకు, కలప రవాణా పనులు చేయించడాన్ని తప్పు పట్టారు. వన సంరక్షణ సమితి చేత పనులు చేయించడం వెనుక సదుద్దేశమే ఉంటే, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే టెండర్లు రద్దు చేసి ఆ తరువాత పనులు కొనసాగించి ఉండేవారని తెలిపారు. కోర్టు ధిక్కారం నుంచి తప్పించుకునేందుకే యశోదాబాయి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన రోజునే టెండర్‌ను రద్దు చేశారని తెలిపారు. యశోదాబాయి చెబుతున్న మాటలు, బేషరతు క్షమాపణ వెనుక సదుద్దేశం లేదని, అందువల్ల ఆ క్షమాపణను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పేర్కొంటూ పై తీర్పునిచ్చారు. -
రెండు నెలల్లో బందరు పోర్టుకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తొలిదశలో రూ.5,834.51 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం చేపట్టనుంది. రైట్స్ సంస్థ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈపీసీ విధానంలో రెండునెలల్లో టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలిదశలో మొత్తం ఆరుబెర్తులు (1 కోల్ బెర్త్, 1 కంటైనర్ బెర్త్, 4 జనరల్ కార్గో బెర్తులు) నిర్మించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం వద్ద సముద్రం లోతు తక్కువగా ఉండటంతో భారీనౌకలు వచ్చేవిధంగా 200 మీటర్ల వెడల్పు, 16.80 మీటర్ల లోతుతో 12.7 కి.మీ. దూరం అప్రోచ్ చానల్ తవ్వనున్నారు. దీంతోపాటు దక్షిణ దిశ వైపు రెండువేల మీటర్లు, ఉత్తరం వైపు 260 మీటర్ల మేర మొత్తం 2.32 కి.మీ. బ్రేక్ వాటర్ పనులు, 44.81 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు, ఇతర ప్రాజెక్టు నిర్మాణపనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు కన్సల్టెంట్‌గా ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్)ను ఎంపిక చేశారు. 2 నెలల్లో టెండరు డాక్యుమెంట్లు తయారు చేసి, జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రామకృష్ణారెడ్డి వివరించారు. 2023–24 నాటికి ఏడాదికి 35.12 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించే విధంగా మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందుకు 800 నుంచి వెయ్యి ఎకరాలు అవసరమవుతుంది. మరో 155 ఎకరాలు పోర్డు బేసిన్, డ్రెడ్జింగ్ కోసం వినియోగిస్తారు. మిగిలిన 2వేల ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు. -
ముహూర్తాలకు నేటితో ‘శుభం’
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ఇప్పటివరకు నిరాడంబరంగా కొనసాగుతూ వస్తున్న శుభకార్యాలకు ఇక తెరపడనుంది. శుక్రవారంతో శుభ ముహూర్తాలు ముగియనున్నాయి. మరో రెండు నెలల వరకు వివాహ, శుభకార్యాల ముహూర్తాలు లేవు. కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా మార్చి 22 నుంచి లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అప్పట్నుంచి రెండున్నర నెలల పాటు అత్యవసర సేవలు, నిత్యావసర సరుకుల విక్రయ దుకాణాలు మినహా మిగతావన్నీ మూతబడ్డాయి. అసలే వివాహాలు, శుభకార్యాలు జోరుగా సాగే సమయంలో లాక్డౌన్ విధించడంతో వీటి నిర్వహణ అయోమయంలో పడింది. ఇంతలో కాస్త వెసులుబాటునిస్తూ అతి తక్కువ మందితో భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. దీంతో శుభకార్యాలను వాయిదా వేసుకుందామనుకున్న వారంతా నిరాడంబరంగా చేసుకునేందుకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండగా, లాక్డౌన్ సీజన్లోనే మంచి ముహూర్తాలు దాదాపు వెళ్లిపోయాయి. ఇక, ఆగస్టు 14.. చివరి శుభ ముహూర్త తేదీ. ఈరోజు తప్పిందంటే శుభకార్యాలు చేసుకునే వారంతా మరో రెండున్నర నెలలు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు. (పాప తుమ్మిందనీ.. 30వేలు సమర్పయామి..) మళ్లీ దసరా తర్వాతే.. శ్రావణ బహుళ దశమితో ప్రస్తుతం శుభకార్యాల ముహూర్తాలు ముగుస్తున్నాయి. భాద్రపద మాసంలో ఎక్కువగా పితృదేవతలకు నిర్వహించే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తుండడంతో శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు ఉండవు. తరువాత వచ్చే ఆశ్వయుజం అధిక మాసం వస్తుండడంతో శుభకార్యాలకు మరో నెల రోజులు బ్రేక్ పడనుంది. అనంతరం దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. దీంతో శుభకార్యాలు చేసుకునే వారంతా దాదాపు రెండున్నర నెలల పాటు ఆగాల్సిందే. మరోపక్క ఈ నెల 31తో అన్‌లాక్ 3.0 ముగియనుంది. వచ్చే నెలలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతివ్వనుంది. మరో రెండు నెలల్లో క్రమంగా అన్ని రంగాలు తెరుచుకుంటాయని, తిరిగి శుభ ముహూర్తాలు దగ్గరపడే నాటికి లాక్డౌన్ పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. (33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్) -
2 నెలల తరువాతే.. 'ఇంటర్ విద్య'!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కొత్త విద్యా సంవత్సరం ఈసారి కనీసం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్ రెండో వారంలోగా కరోనా అదుపులోకి వస్తేనే ఆగస్టు నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. లేదంటే ఇంకొంత ఆలస్యం తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు, ఆ తరువాత చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు నియమించిన అధికారుల కమిటీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నేడో రేపో ఇది నివేదికను బోర్డుకు అందజేయనుంది. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు? రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలన్నీ పూర్తి కాలేదు. మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రథమ భాష పేపరు–1, పేపరు–2, ద్వితీయ భాష మాత్రమే పూర్తయ్యాయి. మార్చి 23 నుంచి జరగాల్సిన ఇంగ్లిష్ పేపరు–1, 2, మ్యాథమెటిక్స్ పేపరు–1, 2, జనరల్ సైన్స్ పేపరు–1, 2, సోషల్స్టడీస్ పేపరు–1, 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. వచ్చే నెల 15లోగా కరోనా అదుపులోకి వస్తే తప్ప ఆ నెలాఖరులోగా ఈ పరీక్షలను నిర్వహించే పరిస్థితి లేదు. పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడితే మొత్తంగా 5.65 లక్షల మంది విద్యార్థులు రోడ్డుపైకి రానున్నారు. చదవండి: జూలైలో ‘నీట్’? కరోనా అదుపులోకి రాకున్నా, పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకున్నా పరీక్షల నిర్వహణ కుదరదు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశాకే పరీక్షల నిర్వహణ సాధ్యం కానుంది. కరోనా జూన్ రెండో వారంలోగా అదుపులోకి వస్తే, అదే నెల చివరిలోగా ఈ 8 సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించడం సాధ్యమవుతుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పరీక్షలు పూర్తయ్యాక జవాబు పత్రాల మూల్యాంకనానికి మరో నెల పట్టనుంది. ఈ లెక్కన వేగంగా చర్యలు చేపడితేనే జులై నెలాఖరులో ఫలితాలు వస్తాయి. కరోనా కనుక అదుపులోకి రాకపోతే ఇంకా ఆలస్యమై ఈసారి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం సెప్టెంబరులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కార్యాచరణపై కమిటీ కసరత్తు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ఖరారుకు ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రానున్న 2 – 3 నెలలతోపాటు ఆ తరువాత మరో 3 –4 నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కరోనా అదుపులోకి వస్తే ఏయే చర్యలు చేపట్టాలి?, అదుపులోకి రాకపోతే ఏం చేయాలనే అంశాలతో నివేదికలు సిద్ధం చేస్తోంది. నేడో రేపో దానిని బోర్డుకు అందజేయనుంది. వచ్చే నెల 15లోగా కరోనా అదుపులోకి వచ్చినా ఆ తరువాత కనీసం ఆరు నెలలపాటు భౌతికదూరం పాటించాల్సి ఉంటుందని కమిటీ భావిస్తోంది. అందుకనుగుణంగానే రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్టళ్లలో అమలు చేయాల్సిన విధానాన్ని ఖరారు చేస్తోంది. మరోవైపు పాఠశాలల్లోనూ భౌతికదూరం పాటించేలా చేపట్టాల్సిన చర్యలపైనా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. భౌతికదూరం, ఆన్లైన్ బోధనపై దృష్టి స్కూళ్లు, కాలేజీల్లో భౌతికదూరం నిబంధనను అమలు చేయడం, ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలపై కమిటీ ప్రధానంగా దృష్టిపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతి గదుల్లో ఒక్కో సెక్షన్లో ఉండే 40 – 60 మంది విద్యార్థులను పక్కనప్కనే కూర్చోబెట్టి బోధించడం సమస్య కానుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొంత మెరుగ్గా ఉన్నా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండనుంది. రాష్ట్రంలోని దాదాపు 27వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో 28 లక్షల మంది విద్యార్థులుంటే 11వేల వరకు ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో 31.32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో షిఫ్ట్‌ల వారీగా విద్యాసంస్థల నిర్వహణ, ఆన్లైన్ విద్యా బోధన వంటి అంశాలపైనా కమిటీ కసరత్తు చేస్తోంది. అలాగే హాస్టళ్లలోనూ భౌతికదూరం పెంపునకు చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో 25 శాతం బోధన ఆన్లైన్, ఈ–లర్నింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉండాలని ఇటీవల యూజీసీ నిఫుణుల కమిటీ చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీ కూడా ఆన్లైన్ విద్యాబోధనపైనే కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉంది. తద్వారా ఎక్కువ మంది పిల్లలు ఒకేచోట గుమికూడకుండా చూడొచ్చని భావిస్తోంది. భౌతికదూరం పాటించేందుకు ఏం చేయాలి?, విద్యా సంవత్సరంలో ఆలస్యమైన కాలాన్ని ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పేర్కొననుంది. -
మరో రెండు నెలలు శశాంక్ కొనసాగింపు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ అదనంగా మరో రెండు నెలల పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశం కరోనా కారణంగా వాయిదా పడటమే అందుకు కారణం. మనోహర్ పదవీ కాలం వాస్తవానికి జూన్‌లో ముగియాల్సి ఉంది. ఆయన తప్పుకుంటే చైర్మన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఇమ్రాన్ ఖాజా ఈ పదవి కోసం తహతహలాడినా... శాశ్వత సభ్య దేశాల మద్దతు ఆయనకు దక్కలేదు. మరో వైపు మనోహర్ తప్పుకోవడంపై చివరి నిమిషం వరకు ఏమీ చెప్పలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. శశాంక్ అనుకుంటే మరోసారి కూడా ఎంపిక కాగలరని ఆయన అన్నారు. చైర్మన్‌గా శశాంక్ వచ్చినప్పటినుంచి ఐసీసీతో భారత బోర్డుకు సత్సంబంధాలు లేవు. -
సమ్మెలో లేని ఉద్యోగులకు వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2 నెలల వేతనాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ వేతనం కొందరికి గత నెలలో మిగతా వారికి గురువారం అందగా, అక్టోబర్ వేతనం శుక్రవారం విడుదలైంది. ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్ 5న ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించారు. దాదాపు 1,200 మంది సమ్మెలో పాల్గొనకుండా సంస్థలోనే పని చేస్తున్నారు. అయినా వీరందరికి కూడా రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో పడిపోయాయి. సమ్మెతో సంస్థకు టికెట్ రూపంలో వచ్చే ఆదాయం పడిపోవటంతో వేతనాల చెల్లింపు నకు డబ్బులు లేకుండా పోయాయి. దీంతో అందుబాటులో ఉన్న సొంత ఆదాయం నుంచే వేతనాలు చెల్లించగలిగారు. అందని వేతనాలు... ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి లోపు సమ్మె విరమించి విధుల్లో చేరిన వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో 495 మంది విధుల్లో చేరుతున్నట్లు లేఖలు సమర్పించారు. వీరిలో 240 మంది మాత్రమే విధుల్లోకి వస్తున్నారు. ఈ 240 మందికి సెప్టెంబర్ వేతనాలు అందాల్సి ఉన్నా.. విడుదల కాలేదు. దీంతో వీరిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వారు వేతనాల కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే తమకు సెప్టెంబర్ నెల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. దీంతో విషయం రవాణా మంత్రి దృష్టికి వెళ్లింది. -
బుల్లెట్ దిగింది..! 67 రోజులు బతికాడు
పాయింట్ బ్లాంక్ మీద గన్పెడితే అవతలి వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాడు. ఎందుకంటే గురి తప్పదు.. క్షణాల్లో తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది. ఒక్కసారి బుల్లెట్ తలలోకి వెళ్లిందంటే ఆ వ్యక్తి బతికి బట్టకడుతాడని ఎవరూ ఊహించరు. కానీ, ఓ వ్యక్తి తలలోకి బుల్లెట్ దూసెకెళ్లినా అతనికి ఏమీ కాలేదు. తలలో బుల్లెట్ దిగిన రెండునెలల తర్వాత కానీ అతను మరణించలేదు. తలలో బుల్లెట్ ఉన్నప్పటికీ ఆయన తనరోజువారీ కార్యకలాపాలలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదు. అన్ని రోజులు ఎలా బతికి ఉన్నాడో వైద్యులకు సైతం అంతుచిక్కలేదు. మరి ఆ విశేషాలేంటో ఈ రోజు తెలుసుకుందామా.....! ఐర్లాండ్‌లో పుట్టిన కాన్ స్టాప్లెటన్ 1872లో న్యూయార్క్‌లో అడుగుపెట్టాడు. 1876లో అక్కడ మార్షల్ ఉద్యోగాన్ని సంపాదించాడు. విధి నిర్వహణలో స్టాప్లెటన్ అంకితభావంతో పనిచేసేవాడు. డేవిడ్ లంట్ స్టాప్లెటన్ ఇద్దరు మంచి స్నేహితులు. లంట్ కూడా చాలా మంచివాడని, నెమ్మదస్తుడని అందరూ అంటుండేవారు. అతిని చుట్టుపక్కలవారు లంట్ను ఎక్కువగా ఇష్టపడుతుండేవారు. ఒకరోజు హత్యకేసులో నిందితుడైన హరీ విలియమ్స్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అతన్ని జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. మార్షల్ స్టాప్లెటన్ ఈ విషయాన్ని కెప్టెన్ హర్దిక్‌కు తెలియజేశాడు. అతని సాయంతో రెండురోజుల తర్వాత ఒక క్యాబిన్లో తలదాచుకుంటున్న విలియమ్స్‌ను స్టాప్లెటన్ అరెస్టు చేసి జైలుకు తరలించాడు. పెనుగులాట... కొన్ని రోజుల తర్వాత అనగా 14 జనవరి 1877న స్టాప్లెటన్, డెవిడ్ లంట్, మరికొద్ది మంది కలిసి ఒక సెలూన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్నేహితులు అందరూ కలిసి సెలూన్లో కూర్చొని కూల్‌డ్రింక్‌లు తాగుతూ సంభాషించుకోవడం వారికి అలవాటే. ఇంతలోనే సెలూన్ డోర్ పగులకొట్టుకుంటూ ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. సెలూన్ లోపలికి వచ్చిన విలియవస్ సహచరుడు టామ్ స్మిత్... ఎవరైనా కదిలితే కాల్చి పడేస్తానని బెదిరించాడు. స్టాప్టెటన్ దగ్గరికి వెళ్లిన స్మిత్ అతని నుదుటిపై రివాల్వర్‌ను పెట్టాడు. ఇది చూసిన డెవిడ్ లంట్ బిగ్గరగా అరుచుకుంటూ స్మిత్ దగ్గరికి వెళ్లి ఆపేందుకు ప్రయత్నించాడు. స్టాప్లెటన్, స్మిత్, డేవిడ్ లంట్ ముగ్గురి పెనుగులాటలో రివాల్వర్ పేలింది. ఆ రివాల్వర్ నుంచి వెళ్లిన బుల్లెట్ నేరుగా డేవిడ్ లంట్ తలలోకి వెళ్లింది. అయితే అక్కడున్నవారంతా డేవిడ్ చనిపోతాడని భావించారు. ఏకంగా తలలోకే బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడు బతకడం అసాధ్యమని అక్కడున్న వారందరూ భావించారు. కానీ, ఆయన ఎలాంటి స్పృహ తప్పకపోవడంతో బుల్లెట్ ఆయనకు తగలలేదని అనుకున్నారు. బహుశా.. అది డేవిడ్ తలను రాసుకుంటూ ఎటోవెళ్లిపోయి ఉంటుందని, అందుకే డేవిడ్ బతికి బట్టగలిగాడని ఎవరికి వారు సమాధాన పరుచుకున్నారు. అందుకే, స్నేహితులంతా కలిసి డేవిడ్‌కు ప్రాథమిక చికిత్స చేయించారు. స్మిత్‌ను... అరెస్టుచేసి కోర్టులో హజరుపరుచారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అతన్ని కోర్టు నిందితుడిని విడుదల చేసింది. 67 రోజుల తర్వాత... నిజానికి సెలూన్లో జరిగిన కాల్పుల్లో డెవిడ్ లంట్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ తగిలినా.. డెవిడ్ కుప్పకూలలేదు. తీవ్ర రక్తస్రావం జరగలేదు. కనీసం స్పృహ కూడా తప్పలేదు. చిన్నగాయం తగిలినంత నొప్పే తప్పా.. ఎలాంటి ఇబ్బంది డేవిడ్‌కు కలగలేదు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులకు కూడా డేవిడ్ తలలో బుల్లెట్ ఉందన్న అనుమానం రాలేదు. పైగా డేవిడ్ తన రోజువారీ కార్యకలాపాలకు వెళుతుండటంతో డేవిడ్‌కు కూడా ఎలాంటి సందేహం కలగలేదు. సెలూన్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత డెవిడ్కు తలనొప్పిరావటం మొదలైంది. చిన్నగా మొదలైన నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు తలలో బుల్లెట్ ఉందన్న విషయాన్ని గమనించారు. ఈ తీవ్రమైన తలపోటుకు బుల్లెట్టే కారణమని డాక్టర్లు ధృవీకరించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 1877 మార్చి 22న అంటే.. దాడి జరిగిన 67 రోజుల తర్వాత డేవిడ్ లంట్ ప్రాణాలు విడిచాడు. అర ఇంచు రంధ్రం చేసిన బుల్లెట్ డెవిడ్ మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. దాడి జరిగిన రోజున ఆయన తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ పుర్రెకు అరఇంచుమేర, మెదడుకు సమీపంలో రంధ్రం చేసిందని డాక్టర్లు గుర్తించారు. దానివల్ల ఇన్ఫెక్షన్ మొదలై.. చీము ఏర్పడి ఆ ప్రాంతమంతా కుళ్లిపోయేలా చేసింది. దాంతో డేవిడ్ మరణించినట్లు డాక్టర్ల పరిశోధనలో తేలింది. బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిన ఇన్నాళ్లు ఎలా బతికున్నాడని డాక్టర్లుకు సైతం అంతు చిక్కలేదు. ఇలా జరగడం వైద్య చరిత్రలో ఎన్నడూ లేదని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ రోజున కోర్టు విడుదల చేసిన డేవిడ్‌ను హత్యకేసులో మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ శిక్ష విధించింది.– సాక్షి స్కూల్ ఎడిషన్ -
వేటకు విరామం!
► 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం ► మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లు శూన్యం ► గత ఏడాది పరిహారం అందరికీ అందని వైనం ► తీరప్రాంత గ్రామాల్లో అమలు కాని ఉపాధి హామీ పథకం చేపల వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో మర పడవలతో వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి సీజన్ కావడంతో 60 రోజుల పాటు వేటను నిషేధించిన సర్కార్.. సముద్రాన్ని నమ్ముకొని బతుకుబండిని నడుపుతున్న మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం చేయలేదు. నిషేధ సమయంలో రూ. నాలుగు వేలు చొప్పున అర్హులైన వారికి అందజేయాల్సి ఉన్నా గతంలో చాలామందికి ఇవ్వలేదు. ఈసారైనా తమను ఆదుకోవాలని గంగSపుత్రులు వేడుకుంటున్నారు. ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్ మర బోట్లు ఉన్నట్టు లెక్కలుఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకూ 193 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో చేపల వేటే జీవనాధారంగా చేసుకొని ప్రత్యేక్షంగా..పరోక్షంగా సుమారు 56 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అలాగే జిల్లాలో 5,400 ఇంజిన్ మరబోట్లు, 3,500 నాటు పడవులు ఉన్నాయి. అయితే మత్స్యశాఖ అధికారులు మాత్రం 2,000 లోపు ఇంజిన్ మర బోట్లు ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నారు. ఏటా చేపల వేట నిషేధ సమయంలో వీరిలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మిగిలిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వేట నిషేధ సమయంలో మతస్యకార గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. లూజ్ సోయిల్ నెపంతో తీర ప్రాంతాల్లో పనులు చేపట్టక పోవడంతో 60 రోజుల పాటు స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది ఈ సమయంలో ఉపాధి కోసం పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, వీరావల్, రత్నగిరి, కాండ్లా, సూరత్, మంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ బోట్ డ్రైవర్లుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తుండగా, కొందరు వంట మనుషులుగా పని చేస్తున్నారు. గుర్తింపు కార్డులు నిల్: మరో పక్క చేపల వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ గుర్తింపు కార్డులు కూడా ఉండడం లేదు. దీంతో వేట నిషేధ సమయంలో ప్రభుత్వ అందించే పరిహారం చాలామంది అందని పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకొని బతుకు నావను నడుపుతున్న అందరికీ పరిహారం ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అరకొరగా ఇస్తున్న పరిహారం చెల్లించే సమయంలో రాజకీయాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరో పక్క నిషేధ సమయంలో కొన్నేళ్లగా అందిస్తున్న నాలుగు వేల రూపాయల పరిహారాన్ని పెంచాలని మత్స్యకారులు కోరుతున్నా ప్రయోజనం లేదు.ఇతర రాయతీలు సైతం వీరికి వర్తించటం లేదు. గతంలో ఇచ్చే 30 కిలోల బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఉపాధి చూపాలి: నిషేధ కాలంలో మత్స్యకారులు రెండు నెలల పాటు ఉపాధి కోత్పోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో అమలు చేయాలి. మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించాలి. అర్హులందరికీ పరిహారం చెల్లించటం, పరిహారం పెంచటం, బియ్యం, కిరోసిన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలి. –ఎం.రామారావు, మత్స్యకార యూనియన్ నాయకుడు అన్ని మత్స్యకార కుటుంబాలకు పరిహారమివ్వాలి: జిల్లాలోని అన్ని మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో పరిహారం అందజేయాలి. నిషేధ కాలంలో అందరు జీవనోపాధి కోల్పోతున్నారు. నష్టపోతున్న కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవాలి. పారదర్వకంగా నష్ట పరిహారం పంపిణీ చేయాలి. – ఎం.పట్టాభి, బడివానిపేట, ఎచ్చెర్ల మండలం అర్హులందరికీ అందజేస్తాం: చేపల వేట నిషేధ కాలంలో అర్హులం దరికీ పరిహారం అందజేస్తాం. జిల్లాలో సుమారు 2,000 వరకూ మరబోట్లు ఉన్నవారు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వీరికి పరిహారం అందజేస్తాం. సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకు రావచ్చు. – కృష్ణమూర్తి, డీడీ, మత్స్యశాఖ -
రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: దేశీయ ఇ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ భారీగా ఉద్యోగుల్లో కోత పెట్టనుంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపించేందకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారీ ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో వేలమంది ఉద్యోగులు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం వాల్యూయేషన్స్ భారీగా కుంగిపోవడం, పెట్టుబడులు క్షీణిచడంతో ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఉద్యోగులను కుదించుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు టీం మేనేజర్లకు పంపిన అంతర్గత ఈ మెయిల్ సమాచారంలో ఆదేశాలు జారీచేసింది. తమ టీంలోని సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాల్సింది కోరింది. ఈ నేపథ్యంలో దాదాపు 40-50 మందిని ఇప్పటికే ఇంటికి పంపించేసింది. దీంతో పాటు స్నాప్‌డీల్ డైరెక్ట్ ఉద్యోగులు మరో వెయ్యిమంది దాకా, అలాగే దాదాపు 5వేలకు పైగా క ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభావితంకానున్నారు. వీరిలో 30శాతం మంది రోడ్డున పడనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా సుమారు 200 మంది ఉద్యోగులను స్నాప్ డీల్ తొలగించింది. కాగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు కార్ప్ స్నాప్‌డీల్‌లో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై 35 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్నాప్‌డీల్ లో పెట్టిన పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో ఫలితాలు అందని నేపథ్యంలో డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను 35 కోట్ల డాలర్లు రైటాఫ్ చేసిన సంగతి తెలిసిందే -
'జవాన్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తాం'
బుద్గాం: కేవలం ఒక లక్ష మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలులో సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం తెలిపారు. పథకం అమలులో సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మొత్తం 20 లక్షల మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగుల్లో లక్ష మంది ఉద్యోగుల పత్రాల్లో సాంకేతికంగా తేడాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. పరీకర్ తో పాటు భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు 1947లో పాక్ రైడర్ల నుంచి శ్రీనగర్ ఎయిర్ పోర్టును రక్షించిన భారత మొదటి పరమ వీర చక్ర అవార్డు గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ, జవానులకు నివాళులు అర్పించారు. గత 43ఏళ్లుగా అమలుకు నోచుకోని ఓఆర్ఓపీ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగివుందని అన్నారు. ప్రస్తుతం 23 నుంచి 24 శాతం పెరిగిన పెన్షన్ ను జవానులు అందుకుంటున్నట్లు చెప్పారు. జవానుల బాధలు విన్న పరీకర్ వాటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను విన్న సమస్యలకు తన తర్వాత పర్యటనలో పరిష్కారం అవుతాయని చెప్పారు. -
రెండు నెలల్లో సందడే సందడి!
ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా బెంగగా ఉంటుంది. ఇప్పుడు సమంత పరిస్థితి అదే. మొత్తం అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీటిలో తెలుగులో మూడు, తమిళంలో మూడు. ఆరు చిత్రాలకు తేదీలివ్వడం అంటే ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్‌కి దూరమైనట్లే. కానీ, పనిని ప్రేమించే సమంత అదేం పట్టించుకోకుండా హ్యాపీగా షూటింగ్‌లు చేస్తున్నారు. కానీ, ఇంటి మీద కాస్తంత బెంగగా ఉందట. ఆ బెంగ కొంచెం తగ్గాలంటే గులాబ్ జామ్ తింటానంటున్నారామె. బెంగకీ, గులాబ్ జామ్కీ లింకేంటి అనుకుంటున్నారా? ఏమో.. అవి తింటే సమంతకు బెంగ పోతుందట. ఆ సంగతలా ఉంచితే... ఏప్రిల్, మేలో సమంత బాగా సందడి చేయనున్నారు. ఎందుకంటే, ఆమె నటించిన నాలుగు సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదలవుతాయి. మహేశ్‌బాబు సరసన నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’, నితిన్ పక్కన చేస్తున్న ‘అ..ఆ’ వేసవికి విడుదలవుతాయి. అలాగే, తమిళంలో సూర్య సరసన నటిస్తున్న ‘24’, విజయ్‌కి జోడీగా యాక్ట్ చేస్తున్న ‘తెరి’ కూడా సమ్మర్‌కే రానున్నాయి. ఇలా రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలు విడుదల కావడం అంటే చిన్న విషయం కాదు. పైగా అన్నీ పెద్ద సినిమాలే. నాలుగు చిత్రాల్లోనూ సమంతవి ఒకదానికి ఒకటి పోలిక లేని విభిన్న తరహా పాత్రలు కావడం విశేషం. ఇవి కాకుండా సమంత చేతిలో ఉన్న ఇతర చిత్రాల విషయానికొస్తే... ఎన్టీఆర్ సరసన ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రుద్రాక్ష’ కమిట్ అయ్యారు. తమిళంలో ధనుష్‌తో ‘వడ చెన్నై’ చేస్తున్నారు. మొత్తానికి సమంత కెరీర్ ఫుల్ జోష్‌గా ఉందని చెప్పొచ్చు. -
డిజిటలైజేషన్‌కు 2 నెలల పొడిగింపు
-
వరుసగా వచ్చేస్తున్న తెలుగు సినిమాలు
-
2 నెలలు... 300 అత్యాచారాలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో నిర్భయ అత్యాచారం జరిగిన తర్వాత మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ న్యూఢిల్లీలో మాత్రం మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్టపడలేదు. సరికదా 2015 సంవత్సరం మొదటి రెండు నెలలో 300 అత్యాచారాల కేసులు నమోదు అయ్యాయి. ఈ గణాంకాలు చెప్పింది ఎవరో కాదు. సాక్షాత్తూ నగర పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆదివారం వెల్లడించారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఈ అత్యాచారాలపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు తెలిపారు. 2013 కంటే కొంత శాతం అధికంగా ఉన్నా... 2014 ఏడాది మొదటి రెండు నెలలో ఇదే సంఖ్యలో అత్యాచారాలు జరిగాయని ఆయన వివరించారు. గతేడాది 2,069 అత్యాచార కేసులు నమోదు కాగా వాటిలో 67.17 శాతం కేసులు ఛేదించినట్లు చెప్పారు. అయితే అత్యాచారం జరిగిన కేసుల్లో దాదాపు 96 శాతం మంది బాధితురాలు బంధువులు లేదా స్నేహితులు నిందితులుగా ఉంటున్నారని... మిగిలిన 4 శాతం మాత్రం ఆగంతకులు ఉంటున్నారని బస్సీ చెప్పారు. మహిళలు చిన్ననాటి నుంచి ఆత్మరక్షణ చేసుకునేందుకు శిక్షణ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో 15 ఏళ్లు వచ్చే నాటికి వారిని వారు రక్షించుకునే స్థితిలో ఉంటారన్నారు. అలాగే ఈ ఏడాది లక్ష మంది బాలికలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు... ఈ ఏడాది మార్చి 8 వరకు 26 వేల మంది బాలికలు అందులో శిక్షణ పొందటం ఆనందంగా ఉందని బుస్సీ తెలిపారు. -
ఇంకెన్నాళ్లు..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తోంది. ఫలితాలు వచ్చి పది రోజులు గడిచింది. గెలిచామన్న సంతోషమే లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు కుర్చీ ఎక్కుదామా? అని తెగ ఉత్సాహపడుతున్న కార్పొరేషన్, మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల కారణంగా వీరంతా వచ్చే నెల 15 వ తేదీ వరకు కుర్చీలెక్కడానికి ఎదురు చూపులు చూడక తప్పడం లేదు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, కావలి మున్సిపాలిటీలకు మార్చి 30వ తేదీ ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్, జెడ్పీటీసీ ప్రాదేశిక స్థానాలకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ముగిసిన వారం, పది రోజుల్లోపే ఆయా సంస్థలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు దాఖలు కావడం, సార్వత్రిక ఎన్నికలు ముగిశాకే వీటి ఓట్ల లెక్కింపు చేపట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా ఎదురు చూపులు చూశారు. ఈ నెల 11న మున్సిపాలిటీలు, 13వ తేదీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభను రద్దు చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీ ప్రమాణ స్వీకారం చేశాకే మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన నిర్వహిస్తామని రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. విభజనతో ఆలస్యం: కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగి ఈ నెల 16వ తేదీ ఫలితాలు వెలువడ్డాయి. అయితే జూన్ 2వ తేదీ కొత్త రాష్ర్టం ఆవిర్భవించనున్నందువల్ల ఎన్నికైన వారు ఆ లోపు పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. వీరు పదవీ ప్రమాణం చేస్తేనే గానీ స్థానిక సంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించే వీలులేదు. ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబునాయుడు జూన్ 9వ తేదీ పదవీ ప్రమాణ స్వీకారం చే స్తారని వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం, వారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆప్షన్ ఇవ్వడం వంటి ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 15వ తేదీ దాకా సమయం పట్టొచ్చు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు గానీ ఈ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. దీంతో గెలిచిన వారు పదవిలో కూర్చోవడానికి మరో మూడు వారాల దాకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మున్సిపాలిటీల్లో ఉత్కంఠ : నెల్లూరు నగర పాలక సంస్థలోని 54 డివిజన్లకు 32 స్థానాలు వైఎస్సార్ సీపీ గెలిచింది. వీరికి తోడు సిటీ, రూరల్ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇదే పార్టీ గెలవడంతో వీరి బలం 34కు చేరింది. ఇక్కడ టీడీపీకి 17 మంది సభ్యులే గెలిచారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కలిసినా మేయర్ పదవి దక్కించుకునే అవకాశం లేదు. దీంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. కావలిలో 40 వార్డులకు గాను వైఎస్సార్ సీపీ 20 గెలిచింది. ఈ పార్టీ మద్దతుతో గెలుపొందిన ఒక స్వతంత్రుడు వైస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. ఇక్కడి నుంచి ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గెలుపొందారు. దీంతో ఇక్కడ ఈ పార్టీ బలం 22కు చేరింది. ఇక్కడ చైర్మన్ పదవి ఎన్నికలో చక్రం తిప్పాలని తెలుగుదేశం వేస్తున్న ఎత్తుగడలు ఫలించే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 స్థానాలకు వైఎస్సార్సీపీ 10 గెలిచింది. కాంగ్రెస్ 8, టీడీపీ 4 స్థానాలు గెలవగా, స్వతంత్రంగా గెలిచిన ఒకరు వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో ఇక్కడ వైఎస్సార్ సీపీ బలం 11కు చేరింది. దీనికి తోడు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఇదే మున్సిపాలిటీలో చేరితే ఈ పార్టీ బలం 13కు చేరుతుంది. ఈ బలంతో ఈ మున్సిపాలిటీని కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంటుంది. గూడూరులో వైఎస్సార్సీపీ, టీడీపీ చెరో 16 వార్డులు గెలిచాయి. వైఎస్సార్సీపీ రెబల్‌గా గెలిచిన ఒక స్వతంత్ర అభ్యర్థి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ బలం 17కు చేరింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ వైఎస్సార్సీపీ గెలుపొందడంతో వీరిద్దరి ఓటు బలం కలిపితే వైఎస్సార్సీపీకి ఒక ఓటు ఎక్కువ వచ్చి ఈ స్థానాన్ని కూడా గెలిచే అవకాశం కలుగుతుంది. ఇక్కడ తమ పాచికలు పారేలా చేయడానికి టీడీపీ చేస్తున్న తెర చాటు రాజకీయాలు, ప్రలోభ పర్వాలు ఫలించే వాతావరణం కనిపించడం లేదు. సూళ్లూరుపేటలో 23 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 10 గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ గెలుపొందడంతో ఈ బలం 11కు చేరింది. టీడీపీ 9, కాంగ్రెస్ 3 గెలవగా, ఒకరు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి మున్సిపాలిటీని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా వ్యూహం రచించాయి. ఇక్కడ ఎమ్మెల్సీ ఓటు కాంగ్రెస్‌కు అదనంగా జత కానుంది. ఈ సమీకరణాల వల్ల క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వెంకటగిరి, నాయుడుపేట మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత దక్కడంతో ఈ రెండు మున్సిపాలిటీలు ఆ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఇక్కడ ఎలాంటి క్యాంపు రాజకీయాలు సాగడం లేదు. జెడ్పీ చైర్మన్ కోసం టీడీపీ ప్రలోభాలు జిల్లా పరిషత్‌లో 46 స్థానాల్లో వైఎస్సార్సీ 31 స్థానాలను గెలవగా, టీడీపీ 15 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఏ రకమైన సమీకరణలు జరిగినా టీడీపీ చైర్మన్ కుర్చీ దక్కించునే అవకాశమే లేదు. అయినా ఆ పార్టీ ప్రలోభాలు ఎర చూపుతూ తెరచాటు రాజకీయం చేస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని మండలాల్లో హంగ్ అవకాశం ఉండటంతో స్వతంత్రుల మద్దతు కోసం ఎంపీపీ అభ్యర్థులు ఎంపీటీసీ సభ్యులను కుటుంబ సమేతంగా వేసవి విడిదికి తీసుకుని వెళ్లారు. ఈ రకమైన విహార యాత్రలు నిర్వహించడం ద్వారా తమ ఎంపీటీసీ సభ్యులను రక్షించునే పనిలో పడిన వారికి మాత్రం వచ్చే నెల 15వ తేదీ దాకా వీరిని పోషించడం తలకు మించిన భారంగా మారుతోంది. -
రెండు నెలల్లో మార్పు తెస్తాం
న్యూఢిల్లీ: రెండేరెండు నెలల కాలంలో పూర్తిగా పాలనా వ్యవస్థనే మరమ్మతు చేస్తామని ఆప్ పార్టీ నేత సోమనాథ్భారతి ప్రకటించారు. ఆప్ పార్టీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఈయన ఒకరు. విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గిస్తాం. ఇది ఆప్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనదని ప్రకటించారు. ‘‘మొత్తం పాలన వ్యవస్థనే మరమ్మతు చేయాల్సి ఉంది. పాలనాధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ప్రజలు ఈ మార్పును స్పష్టంగా చూస్తారు’’ అని ఒకనాటి న్యాయవాది నేటి శాసనసభ్యుడు వక్కానించారు. మాలవ్యానగర్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన సోమనాథ్ భారతి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం మా పార్టీ నాయకుల ఎజెండాలో ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుంది. నగరంలో ఉన్న మూడు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యకలాపాలను మదింపు చేయాలని కాగ్‌కు సిఫార్సు చేయనున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘నగరంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి రోజూ 700 లీటర్ల ఉచిత మంచినీరు పంపిణీ చేస్తాం. ఇది మేము ప్రజలకిచ్చిన మరో ముఖ్యమైన హామీ. నగరానికి రోజుకు 1,100 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. అధికారికంగా 50 మిలియన్ గ్యాలన్ల లోటు ఉంది. 2011 జనభాగణన ప్రకారం నగరంలో 17 నుంచి 18 మిలియన్ల మంది ప్రజలకు శుద్ధి చేసిన నీరు లభించడం లేదు. మరిన్ని జలవనరులను సృష్టిస్తాము. దీని ద్వారా నీటి కొరత తీరుస్తాం’’ అన్నారు. మేము చేసిన 18 వాగ్ధానాల అమలులో సాధకబాధకాలను అధ్యయనం చేస్తున్నాము. వీటిని వీలయినంత త్వరలో అమలు చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ హయంలో చోటు చేసుకున్న లొసుగులు, లోటుపాట్లను పరిశీలిస్తున్నాం. తొలి రెండువారాలు కాంగ్రెస్ పని విధానం ఎలా సాగిందో అర్థం చేసుకోవాడానికి కేటాయిస్తాం. వ్యవస్థలో కలుపు మొక్కల్లా వెళ్లూనుకున్న అవినీతిని ఏరి పారేయాల్సి ఉంది. నియమబద్ధంగా పనిచేసే నీతిమంతులైన అధికారులను ప్రొత్సహిస్తాం’’ అని వివరించిన భారతి ఈ సందర్బంగా హర్యానాకు చెందిన అశోక్ కెమ్కా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాశక్తి నాగ్‌పాల్‌లను గుర్తుచేశారు. ‘‘ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పథకాల రూపశిల్పులు. వాటిని మేము అమలు చేస్తాం, సంరక్షిస్తాం. ప్రతి అధికారిని కనిపెట్టి ఉంటాం. అవినీతికి పాల్పడేవారు ఏస్థాయిలో ఉన్నా వారిని తొలిగించి ప్రక్షాళన చేస్తాం.అవినీతి పరులైన మంత్రుల ఒత్తిడికి నీతినిజాయితీతో పనిచేసే అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేస్తాం’’ అని స్పష్టం చేశారు బీహార్‌లో పుట్టి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకొని 1992 నుంచి ఢిల్లీలో నివాసం ఉంటున్న సోమనాథ్ భారతి. మేము అవినీతిపై పోరు ప్రకటించి ఎన్నికల్లో గెలిచాం. మా నిజాయితిని నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పుడు మేము అవినీతిని నిర్మూలించకపోతే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది’’ అని ముగించాడి ఐఐటీ సైన్స్ గ్రాడ్యుయేట్