రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత | Snapdeal asks managers to 'right-size' teams; to lay off nearly 30% staff in two months: report | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత

Published Sat, Feb 11 2017 12:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత

రెండు నెలల్లో 30శాతం ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ: దేశీయ ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌  భారీగా ఉద్యోగుల్లో కోత పెట్టనుంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో  ఈ నిర్ణయం తీసుకున‍్నట్టు తెలుస్తోంది.   రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు  ఇంటికి పంపించేందకు రంగం  సిద్ధం చేస్తున్నట్టు  రిపోర్టులు  వెల్లడిస్తున్నాయి.   ఇటీవల భారీ ఇబ్బందుల్లో  పడ్డ స్నాప్‌ డీల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  దీంతో వేలమంది  ఉద్యోగులు పత్యక్షంగా,  పరోక్షంగా ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికే  ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది.

తాజా నివేదికల ప్రకారం  వాల్యూయేషన్స్‌ భారీగా  కుంగిపోవడం, పెట్టుబడులు క్షీణిచడంతో ఇబ్బందుల్లో పడ్డ స్నాప్‌ డీల్‌   ఉద్యోగులను  కుదించుకునేందుకు  రడీ అవుతోంది. ఈ మేరకు  టీం మేనేజర్లకు పంపిన అంతర్గత ఈ మెయిల్‌ సమాచారంలో  ఆదేశాలు  జారీచేసింది.  తమ టీంలోని సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాల్సింది కోరింది.  ఈ నేపథ్యంలో దాదాపు 40-50 మందిని ఇప్పటికే  ఇంటికి పంపించేసింది.  దీంతో పాటు స్నాప్‌డీల్‌ డైరెక్ట్‌ ఉ‍ద్యోగులు మరో వెయ్యిమంది దాకా,  అలాగే దాదాపు 5వేలకు  పైగా క ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభావితంకానున్నారు.  వీరిలో 30శాతం మంది రోడ్డున పడనున్నారు.   గత ఏడాది ఫిబ్రవరిలో  కూడా సుమారు 200 మంది ఉద్యోగులను  స్నాప్‌ డీల్‌ తొలగించింది.

కాగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు కార్ప్‌  స్నాప్‌డీల్‌లో 6.5 బిలియన్‌  డాలర్ల పెట్టుబడులపై 35 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్నాప్‌డీల్‌ లో పెట్టిన పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో ఫలితాలు అందని నేపథ్యంలో డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను 35 కోట్ల డాలర్లు రైటాఫ్‌ చేసిన సంగతి తెలిసిందే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement