అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్‌ఎస్‌ఎఫ్)నిర్వహిస్తోంది.
ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్‌ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు.
అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్‌ఎస్‌ఎఫ్‌కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment