రెండు నెలల్లో సందడే సందడి! | Brahmotsavam Movie in busy samantha | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో సందడే సందడి!

Published Fri, Mar 11 2016 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

రెండు నెలల్లో సందడే సందడి!

రెండు నెలల్లో సందడే సందడి!

ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా బెంగగా ఉంటుంది. ఇప్పుడు సమంత పరిస్థితి అదే. మొత్తం అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీటిలో తెలుగులో మూడు, తమిళంలో మూడు. ఆరు చిత్రాలకు తేదీలివ్వడం అంటే ఆల్‌మోస్ట్ పర్సనల్ లైఫ్‌కి దూరమైనట్లే. కానీ, పనిని ప్రేమించే సమంత అదేం పట్టించుకోకుండా హ్యాపీగా షూటింగ్‌లు చేస్తున్నారు. కానీ, ఇంటి మీద కాస్తంత బెంగగా ఉందట. ఆ బెంగ కొంచెం తగ్గాలంటే గులాబ్ జామ్ తింటానంటున్నారామె. బెంగకీ, గులాబ్ జామ్‌కీ లింకేంటి అనుకుంటున్నారా? ఏమో.. అవి తింటే సమంతకు బెంగ పోతుందట.

ఆ సంగతలా ఉంచితే... ఏప్రిల్, మేలో సమంత బాగా సందడి చేయనున్నారు. ఎందుకంటే, ఆమె నటించిన నాలుగు సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదలవుతాయి. మహేశ్‌బాబు సరసన నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’, నితిన్ పక్కన చేస్తున్న ‘అ..ఆ’ వేసవికి విడుదలవుతాయి. అలాగే, తమిళంలో సూర్య సరసన నటిస్తున్న ‘24’, విజయ్‌కి జోడీగా యాక్ట్ చేస్తున్న ‘తెరి’ కూడా సమ్మర్‌కే రానున్నాయి.

ఇలా రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలు విడుదల కావడం అంటే చిన్న విషయం కాదు. పైగా అన్నీ పెద్ద సినిమాలే. నాలుగు చిత్రాల్లోనూ సమంతవి ఒకదానికి ఒకటి పోలిక లేని విభిన్న తరహా పాత్రలు కావడం విశేషం. ఇవి కాకుండా సమంత చేతిలో ఉన్న ఇతర చిత్రాల విషయానికొస్తే... ఎన్టీఆర్ సరసన ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రుద్రాక్ష’ కమిట్ అయ్యారు. తమిళంలో ధనుష్‌తో ‘వడ చెన్నై’ చేస్తున్నారు. మొత్తానికి సమంత కెరీర్ ఫుల్ జోష్‌గా ఉందని చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement