బాధేస్తే గులాబ్‌జామ్ తింటా!
ప్రస్తుతం అరడజను చిత్రాలు ఉన్నాయని అంటోంది సమంత. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సి వస్తోంది.
ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతుంది.
అలా బాధ వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది.
గులాబ్‌జామ్ తింటే బాధ ఎలా పోతుందని మాత్రం అడగకండి అని అంటోంది చెన్నై చిన్నది.
మానవుడు ఆశాజీవి. అభిరుచి జీవి కూడా. ఈ రెండూ జీవితంలో బాధల్ని మరపించేస్తాయి. నటి సమంతపైన చెప్పిన వాటిలో రెండవ దీనితో ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఏమిటీ అర్థం కాలేదా’సమంత చెబితే ఈజీగా అర్థం అవుతుందిలే. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల సరసన చేరిన లక్కీ నటి ఈ చెన్నై చిన్నది. ఏమాయ చే శావే అన్న ఒకే ఒక్క చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని గుల్ల చేసేసిన సమంత ఈ తరువాత కత్తి చిత్రంతో తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని దోచేసుకున్నారు.
ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ క్రేజీ హీరోయిన్‌గా విరాజిల్లుతున్నారు. ప్రస్తుత తన స్థాయి గురించి ఈ చిరునవ్వుల ధరహాసిని ఏమంటున్నారో చూదాదం. ప్రస్తుతం నా చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. వీటిలో రెండు తమిళ చిత్రాలు, రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సివస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి గడపలేక పోతున్నాను. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతోంది. నాకు ఇంటి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను.
వెంటనే ఆ బాధ తొలగిపోతుంది.అయితే గులాబ్‌జామ్ తింటే ఇంటి జ్ఞాపకం ఎలా మరుగవుతుందన్నది మాత్రం అడగకండి. ఆ ప్రశ్నకు నా వద్ద బదులు లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విజయ్‌కు జంటగా తెరి, సూర్య సరసన నటించిన 24 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులోనూ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వీటన్నిటిలోనూ తన పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఇలా నటనకు అవకాశం ఉన్న విభిన్న పాత్రలు అమరడం నా అదృష్టం. త్వరలో నటుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటించనున్నాను. ఎక్కువ చిత్రాల్లో నటించడం వల్ల ఈ ఏడాది నాకు ప్రత్యేకమైందనే చెప్పాలి. నాకు దైవ కృప చాలా ఉంది. విరామం అన్నది లేకుండా నటిస్తూనే ఉండాలన్నది నా ఆశ.