Gulab Jamun
-
గులాబ్ జామూన్ సమోసా రెసిపీ ట్రై చేసే ధైర్యం ఉందా మీకు?
సాక్షి, హైదరాబాద్: వంటల్లో రకారకాల కాంబినేషన్లు, ప్రయోగాలు చాలామందికి తెలుసు. దాదాపు చాలావరకు ఇలాంటి మిక్స్డ్ రెసిపీస్, వినూత్నమైన వంటకాలు బాగానే క్లిక్అవుతాయి. కానీ ఒక్కోసారి మాత్రం దారుణంగా బెడిసి కొడతాయి. తాజాగా గులాబ్ జామూన్ సమోసా వంటకం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. కమెంట్లు, లైక్‌లతో ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (Salman Khan Birthday: జెనీలియా, సల్మాన్ డ్యాన్సింగ్ వీడియో వైరల్) అభిషేక్ అనే ఫుడ్ బ్లాగర్ వెరైటీగా సమోసా విత్గులాబ్ జామూన్ ట్రైస్ చేశాడు. ఢిల్లీలోని రోడ్డు పక్కన తినుబండారాలు అమ్మే ఒక దుకాణం వద్ద గులాబ్ జామూన్ సమోసాను తయారు చేయించాడు. అయితే గులాబ్ జామూన్ సమోసా టేస్ట్ చేసిన అభిషేక్ ఫీలింగ్స్ చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుతున్నారు.‘‘కనీసం ట్రై కూడా చేయొద్దు.. అతని కోతి మొఖం చూస్తే అర్థం కావడం లేదా. దాని టేస్ట్ ఎలా ఉందో’’ అని ఒకరు, నీ కరేజ్కి హేట్సాఫ్ భయ్యా అని మరొకరు ‘‘చండాలంగా ఉంది’’ అని ఇంకో యూజర్ కమెంట్ చేశారు. గత వారం అప్లోడ్ చేసిన వీడియోకు వ్యూస్ ఇప్పటికే 2 మిలియన్లు దాటేసాయి. View this post on Instagram A post shared by KOMAL || ABHISHEK (@thefoodiehat) -
నిమిషానికి 115 ఆర్డర్స్..! 2021లో భారతీయులు ఎగబడి లాగించేసిన ఫుడ్ ఇదే...!
2021గాను ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్స్ చేసిన ఫుడ్ డిషెస్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్‌తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఆరో వార్షిక నివేదిక StatEATstics రిపోర్ట్‌లో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. అగ్రస్థానం బిర్యానీదే..! భోజన ప్రియులు 2021లో స్విగ్గీ ప్లాట్‌ఫాంను భారీగానే తలుపుతట్టారు. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్‌గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్‌గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం. గత ఏడాది 2020లో, నిమిషానికి 90పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫుడ్ లవర్స్ ఒక సెకనులో సుమారు రెండు బిర్యానీలను ఆర్డర్స్ చేసినట్లు పేర్కొంది. చికెన్ బిర్యానీ, సమోసాల తరువాత చికెన్ వింగ్స్, పావ్ భాజీ నిలిచాయి. 21 లక్షల ఆర్డర్స్‌తో ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ పావ్‌బాజీ నిలిచింది. స్విట్స్లో 21 లక్షల ఆర్డర్స్‌తో గులాబ్ జామూన్ నిలవగా, తరువాతి స్థానంలో రస్మలై సుమారు 12 లక్షల ఆర్డర్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. హెల్త్‌పై ఎక్కువ.. కరోనా రాకతో చాలా మంది హెల్తీ డైట్‌పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పెడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి. గ్రాసరీ బిజినెస్ విషయానికి వస్తే..! స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలతోపాటుగా ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రాసరీ డెలివరీ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో 28 మిలియన్ ప్యాక్‌ల పండ్లు , కూరగాయలను డెలివరీ చేసింది. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసిన మొత్తం అరటిపండ్ల పరిమాణం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2.6 రెట్లు అధికం. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
ఈ రెండూ ఉంటే చాలు.. గులాబ్ జామూన్ రెడీ
లాక్డౌన్లో సెలబ్రిటీలు సహా సామాన్యులు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు షేర్ చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే పదార్ధాలతో వైరైటీ వంటకాలు చేస్తూ నోరూరిస్తున్నారు. తాజాగా కేవలం రెండే రెండు ఇంగ్రీడియెంట్స్‌తో గులాబ్ జామూన్ తయారు చేశారు ఓ టిక్‌టాక్ యూజర్. ఖోయా, కండెన్సెడ్ మిల్క్, మిల్క్ పౌడర్ లేకుండానే మృదువైన గులాబ్ జామూన్లు లాగించేయ వచ్చని నిరూపించారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో వైరలవుతున్న ఈ వీడియో ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఏంటీ.. మీకు కూడా ఆ రెసిపీ గురించి తెలుసుకోవాలని ఉంటే వీడియోపై క్లిక్ చేయండి. (నోరూరిస్తున్న రకుల్ కుకీస్ రెసిపీ..) ‘గులాబ్ జామూన్’ తయారీ ముందుగా నాలుగు లేదా ఐదు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని వాటిని ముక్కలు ముక్కలుగా చేయండి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసి.. మృదువైన బ్యాటర్ వచ్చేంత వరకు కలపండి. బాదం పప్పు తురుమును మధ్యలో వేసి ఆ మిశ్రమాన్ని గుండ్రటి ఉండల్లా చుట్టండి. వాటిని నూనెలో వేయించి పక్కకు పెట్టి.. ఆ తర్వాత చక్కెర పాకంలో వేయండి. అంతే టేస్టీ టేస్టీ గులాబ్ జామూన్లను లొట్టలేసుకుంటూ తినేయండి. -
2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి
స్వీట్ మ్యాగీ, గులాబ్జామున్ పావ్ బాజీ, కుర్కరే మిల్క్‌షేక్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా. అదేంటి ఎప్పుడు వినని కాంబినేషన్ల గురించి అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా ? ఏం లేదండి 2019లో ఇలాంటి ప్రయోగాలను కొంతమంది ప్రయత్నించారు. ఆపై వాటిని సోషల్‌మీడియాలో షేర్ చేశారు. మ్యాగీతో స్వీట్ తయారు చేయడం, గులాబ్జామున్ను పావుబాజీలో ఉపయోగించడం, దాల్ మక్కానీ క్యాపుచినో వంటివి తయారు చేసి వీడియోలో షేర్ చేశారు.కానీ వీటి తయారు విధానం చూసిన తర్వాత మీరు మాత్రం దయచేసి ప్రయత్నించకండి. అసలే 2019 సంవత్సరానికి ముగింపు పలికి 2020 సంవత్సరానికి స్వాగతం చెప్పాం. ఇవి ఎలా తయారు చేశారనేది మాత్రం వీడియోలు చూసి తెలుసుకోండి. 1. స్వీట్ మ్యాగీ Best maggi recipe pic.twitter.com/foOrc0VjoU — Desi Gooner (@Sahil_Adhikaari) September 12, 2019 2. గులాబ్ జామున్ పావ్‌బాజీ 3. కుర్కురే మిల్క్‌షేక్ 4. కోకో చెర్రీ దోష Things like this will make you lose faith in humanity! pic.twitter.com/LO5hWwtyVG — Darshan Pathak (@darshanpathak) September 30, 2019 -
పాక్ జాతీయ స్వీటు గులాబ్ జామూన్!
పాకిస్తాన్లో తాజాగా ఎన్నికలు జరిగా యి. అయితే, మీరెన్నడూ కనీవినీ ఎరుగని ఎన్నికలవి. పాక్ జాతీయ స్వీటు ఎంపిక కోసం జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రం.. గులాబ్ జామూన్, బర్ఫీ, జిలేబీ. జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్‌ను నెటిజన్లు ఎన్నుకున్నారు. పాక్ ప్రభుత్వం ఆ దేశ నేషనల్ స్వీట్ ఎన్నికలో ట్విట్టర్ ద్వారా పాల్గొనా ల్సిందిగా ప్రజలను కోరింది. ఈ ట్విట్టర్ పోల్‌లో ప్రజలు తమ ఓటుహక్కును ఉపయో గించుకొని గులాబ్ జామూన్‌కు పట్టం కట్టారు. 47 శాతం మంది పాక్ ప్రజలు గులాబ్జామ్కే ఓటు వేయడంతో ఆ దేశపు జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్‌ని ప్రకటించారు. 34 శాతం ఓట్లతో జిలేబీ ద్వితీయ స్థానంలో, బర్ఫీ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. రిగ్గింగ్ జరిగింది. నేషనల్ స్వీట్పోల్లో ఓటింగ్ నిజాయితీగా సాగలేదనీ, రిగ్గింగ్ జరిగిందనీ పాక్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం 5 లక్షల కన్నా తక్కు వమంది ఫాలోవర్స్ ఉన్న అధికారిక ట్విట్టర్ నుంచే పోల్ నిర్వహించడం వారి వ్యతిరేకతకు కారణం. ట్విట్టర్ మినహా ఈ ఎన్నికల్లో ఇతర సోషల్ మీడియాకు అవకాశం లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు గులాబ్ జామూన్ పాకిస్తానీ స్వీటు కాదన్నది కొందరి వాదన. దీన్ని మొగలుల కాలంలో షాజహాన్ వంటవారు కనుగొన్నారని కొందరంటోంటే, మధ్య ఆసియా నుంచి దండెత్తిన టర్కీ ఆక్రమణదారుల ద్వారా ఈ పాక్‌లోకి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జామూన్ పాకిస్తానీ స్వీటు కాదనీ, దీనికి విదేశీ రుచులున్నాయన్నది వీరి వాదన. -
స్వీట్ తింటారా?
త్వరలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ కలసి స్వీట్ తినిపిస్తారట. అది కూడా గులాబ్ జామున్. ఏదైనా శుభవార్త చెప్పే ముందు స్వీట్ తినడం ఆనవాయితీ కదా. ఇంతకీ శుభవార్తేంటంటే.. ఈ ఇద్దరూ జంటగా ఓ సినిమాలో నటించనున్నారు. ఆల్రెడీ ఈ జంట ‘బంటీ అవుర్ బబ్లీ, గురు, రావణ్’ వంటి సినిమాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, తల్లయ్యాక ప్రారంభించిన సెకండ్ ఇన్నింగ్స్‌లో భర్తతో కలసి ఐశ్వర్యా రాయ్ నటించనున్న చిత్రం ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సర్వేష్ మేవారా దర్శకత్వంలో అనురాగ్ కశ్యప్ నిర్మించనున్నారట. ఈ సినిమాకు ‘గులాబ్ జామున్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానీ ఖాన్’, అభిషేక్ ‘మన్ మర్జియా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కలసి నటించే సినిమాను ఆరంభిస్తారట. -
బాధేస్తే గులాబ్‌జామ్ తింటా!
ప్రస్తుతం అరడజను చిత్రాలు ఉన్నాయని అంటోంది సమంత. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సి వస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతుంది. అలా బాధ వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది. గులాబ్‌జామ్ తింటే బాధ ఎలా పోతుందని మాత్రం అడగకండి అని అంటోంది చెన్నై చిన్నది. మానవుడు ఆశాజీవి. అభిరుచి జీవి కూడా. ఈ రెండూ జీవితంలో బాధల్ని మరపించేస్తాయి. నటి సమంతపైన చెప్పిన వాటిలో రెండవ దీనితో ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఏమిటీ అర్థం కాలేదా’సమంత చెబితే ఈజీగా అర్థం అవుతుందిలే. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల సరసన చేరిన లక్కీ నటి ఈ చెన్నై చిన్నది. ఏమాయ చే శావే అన్న ఒకే ఒక్క చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని గుల్ల చేసేసిన సమంత ఈ తరువాత కత్తి చిత్రంతో తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని దోచేసుకున్నారు. ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ క్రేజీ హీరోయిన్గా విరాజిల్లుతున్నారు. ప్రస్తుత తన స్థాయి గురించి ఈ చిరునవ్వుల ధరహాసిని ఏమంటున్నారో చూదాదం. ప్రస్తుతం నా చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. వీటిలో రెండు తమిళ చిత్రాలు, రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. దీంతో ఎప్పుడూ షూటింగ్‌లతోనే గడపాల్సివస్తోంది. ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాను. కుటుంబ సభ్యులతో కలిసి గడపలేక పోతున్నాను. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసుకు బాధ కలుగుతోంది. నాకు ఇంటి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గులాబ్‌జామ్ తింటాను. వెంటనే ఆ బాధ తొలగిపోతుంది.అయితే గులాబ్‌జామ్ తింటే ఇంటి జ్ఞాపకం ఎలా మరుగవుతుందన్నది మాత్రం అడగకండి. ఆ ప్రశ్నకు నా వద్ద బదులు లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విజయ్‌కు జంటగా తెరి, సూర్య సరసన నటించిన 24 చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులోనూ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వీటన్నిటిలోనూ తన పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. ఇలా నటనకు అవకాశం ఉన్న విభిన్న పాత్రలు అమరడం నా అదృష్టం. త్వరలో నటుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటించనున్నాను. ఎక్కువ చిత్రాల్లో నటించడం వల్ల ఈ ఏడాది నాకు ప్రత్యేకమైందనే చెప్పాలి. నాకు దైవ కృప చాలా ఉంది. విరామం అన్నది లేకుండా నటిస్తూనే ఉండాలన్నది నా ఆశ.