2021గాను ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్స్ చేసిన ఫుడ్ డిషెస్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్‌తో బిర్యానీ టాప్ పొజిషన్‌లో నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఆరో వార్షిక నివేదిక StatEATstics రిపోర్ట్‌లో పలు విషయాలను కంపెనీ పేర్కొంది.
అగ్రస్థానం బిర్యానీదే..!
భోజన ప్రియులు 2021లో స్విగ్గీ ప్లాట్‌ఫాంను భారీగానే తలుపుతట్టారు. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్‌గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్‌గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం.
గత ఏడాది 2020లో, నిమిషానికి 90పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫుడ్ లవర్స్ ఒక సెకనులో సుమారు రెండు బిర్యానీలను ఆర్డర్స్ చేసినట్లు పేర్కొంది. చికెన్ బిర్యానీ, సమోసాల తరువాత చికెన్ వింగ్స్, పావ్ భాజీ నిలిచాయి. 21 లక్షల ఆర్డర్స్‌తో ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ పావ్‌బాజీ నిలిచింది. స్విట్స్‌లో 21 లక్షల ఆర్డర్స్‌తో గులాబ్ జామూన్ నిలవగా, తరువాతి స్థానంలో రస్‌మలై సుమారు 12 లక్షల ఆర్డర్స్‌ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది.
హెల్త్‌పై ఎక్కువ..
కరోనా రాకతో చాలా మంది హెల్తీ డైట్‌పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గీలో హెల్తీ డైట్‌ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పెడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి.
గ్రాసరీ బిజినెస్ విషయానికి వస్తే..!
స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలతోపాటుగా ఇన్‌స్టామార్ట్ పేరుతో గ్రాసరీ డెలివరీ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో 28 మిలియన్ ప్యాక్‌ల పండ్లు , కూరగాయలను డెలివరీ చేసింది. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసిన మొత్తం అరటిపండ్ల పరిమాణం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2.6 రెట్లు అధికం.
చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి?
Comments
Please login to add a commentAdd a comment